4, జూన్ 2009, గురువారం

తంగేడుపూలు


రుధిర ,కాషాయ వర్ణంల్లో ఆకులు లేకుండా విరగాబూసే పూల చెట్టును మేము "తంగేడుచెట్టు" అంటాము .నేను బాగా ఇష్టపడే చెట్లలో ఇదొకటి . నిన్న సాక్షిలో ఇదే చెట్టు మీద రచయిత తన జ్ఞాపకాలూ పంచుకున్నారు , తంగేడు ని వారు తురాయి చెట్టని అంటారట ,కాని మా అమ్మమ్మ ,నాన్నమ్మ వాళ్ల పల్లెటూరిలో మాత్రం తంగేడు అనే పిలుస్తారు ,నాకు అదే తెలుసు .ఈ చెట్టుతో అనుభంధం చాల గాడమైనది .
వేసవికి ఊరు వెళ్ళడం అనగానే నా కళ్ళ ముందు కనపడే దృశ్యం ......అమ్మమ్మ ఊరిలోని పిల్లికోడు (ఏలూరు కాలువ కాబోలు )ఊరు పక్కనుండి వంపులు తిరుగుతూ వెళ్తుంది (ఎక్కడికో ) ఆ కాలువ ఒడ్డును సైనికుల్లాఅటు ఇటు నిలబడి విరగబూసి వుండేవి తంగేడుచేట్లు.ఎండి అడుగంటి వుండే కాలువ నీళ్ళ లో గాలికి రెపరెపలాడే ఆ పూల గుత్తులు ప్రతిభింభం ఇంకా ఈ కళ్ళలో అలానే వుండిపోయింది . పంటపొలాల్లో అక్కడక్కడ చింతచెట్ల ప్రక్కనే క్రొమ్మలు కనబడకుండా విరగభూసేవి . పిల్లలం ఆ చెట్ల క్రింద చేరి ఆటలాడే వాళ్ళం ,వాడ్ని వీడ్ని బ్రతిమాలి ఆ పూలగుత్తులు చేతుల నిండా పట్టుకెల్లెదాన్ని..అదోరకమయిన పిచ్చి వాసన వేసేవి ..పూలతో పాటు మొగ్గల గుత్తులు తెంపి చెట్ల క్రింద భయంకరమైన జూదం ఆడే వాళ్ళం -:) ఎవరైనా సాహస వీరులు ఇద్దరు పందేంకి మొగ్గల్లో వున్నపుప్పొడి కాడలు పట్టుకొని వాటి తలలు తెగడానికి యుద్ధం చేసే వాళ్లు , కొంచెం చిన్న పిల్లలం gumpuluga vidipoyi పందెం కాసేవాళ్ళం ...పెద్ద వాళ్లు కూడా చాల ఆసక్తిగా చూసేవాళ్ళు .మా ఆటలతో ఇంటి నిండా అవే వుండేవి ...ఆ మొగ్గలు పట్టుకుని ఇంట్లో ఖాళీగా ఎవరు దొరుకుతారా ఆడటానికి వెదుక్కునే వాళ్ళం . మా బొమ్మల పెళ్లి ఆటల్లో పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి అవే పూల దండలు .
ఒక వేసవి మధ్యాహ్నం పిల్లలందరం (మా అమ్మ వాళ్లు ఆరుగురు ,వాళ్ల పిల్లలం ) ఇంటి ఆ వరణలో వున్న గేదెల చావడిలో బొమ్మల తో ఆడుతున్నాం ,వాటికి పెళ్లి పూల దండలు హడావిడి నేను చూస్తో తంగేడు పూలతో చేసిన దండలు బొమ్మలకి చాల పెద్దవి అవుతున్నాయి ,బోలెడన్ని పూలు మిగిలి పోతున్నాయి అని మా అక్క వాళ్ళతో నేనొక ఐడియా చెప్పాను ,దాని ప్రకారం నేను ఇంట్లోకెళ్ళి ఊయ్యాలలో నిద్రపోతున్న మా పెద్దమామయ్య కూతురు సత్య ని (యేడాది పిల్లనుకుంట ) ఎవరు చూడకుండా చావడి లోకి తీసుకొచ్చా ,అప్పటికే రెండేళ్ళ మా చిట్టి తమ్ముడు శ్రీనుగాడ్ని మా అక్క వాళ్లు తయారు చేసి పీట మీద కూర్చోబెట్టారు ,నేనేమో ఈ బుడ్డి దాన్ని నిద్ర లేపి పడకుండా వాడి ప్రక్కన కూర్చోబెట్టి ఇద్దరికీ తంగేడుపూల దండలు వేసి పెళ్లి చేస్తుండగా ...ఇంట్లో నుండి అందరు కంగారుగా ఊయ్యాలలో పిల్ల లేదు అంటు వెదుకుతుంటే ....మా అమ్మ వాళ్ల నాయనమ్మ మా వద్దకు రానే వచ్చి పాప మెళ్ళో వున్న దండ పీకేసి మా అందర్ని తిట్ల దండకంతో తగులుకొంటే అందరం పరార్ పెళ్లి కొడుకుని వదిలేసి .........గంట దాక ఎవ్వరం పెద్దొళ్ళకి అందలేదు ..ఆ రోజు జీవితం లో మరిచిపోలేదు ,,ఇప్పుడు తలుచుకుని నవ్వుకుంటాం . తంగేడుపూల దండ ఎంతపని మా చేత చేయించిందో కదా అని .
మా ఇంటి ప్రక్క ఉత్తరం దిక్కు పెద్ద తంగేడు చెట్టు వుంది . ఉదయాన్నే వరండాలో కూర్చుని టీ తో పాటు వాటి అందాన్ని త్రాగుతాను .-:) దాని పక్కనే వున్న గుల్మొహర్ క్షణ క్షణం పస్పు పూలు రాలుస్తూ కుంకుం ప్రక్క పసుపు అద్దుతున్నట్లు ....భలే వుంటాది .... అన్నట్లు నిన్న ఏజెన్సీ ఏరియా కి పని మీద వెళ్లాను ......దారికిరువైపులా వున్న తంగేడు పూలు చూస్తూ నన్ను నేను మరిచిపోయాను ..అస్సలు ప్రయాణం అలసటే తెలిలేదు .....'ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై .....అడవి ...సాగిపోనా ..." ఒట్టు అక్కడినుండి రాబుద్ది కాలేదు . వేసవి కాలం లో మల్లెపూల తో పాటు గాజు తోట్టేల్లో నీళ్ళలో ఈ "అగ్నిపూలు " కూడా ఫ్లోవేర్వాస్ గా ఆమరుస్త్హాను ,ఇంట్లో .

31 కామెంట్‌లు:

మురళి చెప్పారు...

నాకు మాత్రం 'అగ్నిపూలు' సినిమా అందులో జయసుధ నటనా గుర్తొస్తాయండి ఈ పూలని చూసినప్పుడల్లా...

Sujata M చెప్పారు...

Wonderful !

సూర్యుడు చెప్పారు...

తంగేడు పువ్వులంటే వేరనుకుంటా. పసుపు రంగులో ఉంటాయి, మొక్కలు చిన్నవిగా ఉంటాయి, మేమవి, దసరాల్లో వాడేవాళ్లం.

~సూర్యుడు :-)

పరిమళం చెప్పారు...

చిన్ని గారు , వీటిని తంగేడు అనే కాకుండా ఇంకొక పేరుతొ కూడా పిలుస్తారు ..బాగా అలవాటైన పేరు సమయానికి గుర్తు రాలేదు . మా ఊర్లకేసి దారి పొడవునా రోడ్డు పక్కన విరగబూసి ఉంటాయి . వీటి రేకులను తడిపి గోళ్ళకు అంటిన్చుకోనేవాళ్ళం :)
తృటిలో తప్పించుకున్నారన్నమాట ! బాల్య వివాహ చట్టం నుండి :)

Bolloju Baba చెప్పారు...

did you read "thangedupulu" poetry anthology by Dr. N. Gopi

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

మేము కూడా తంగేడు పూలనే అంటాము. మా తోటచుట్టూరా చాలా చెట్లు వుండేవి కానీ మేము ఈ పూలతో ఆడిన గుర్తులేదు. వీటికంటే పెద్దగా వుండే తాటిచెట్లు, వాటిమధ్యలో చాకలి వారు గుడ్డలు కాగపెట్టి దాచిన కుండల మీదే మా చూపంతా..
అవునండీ, ఇంతకు పెళ్ళి చేసి పారిపోయి, ఇంటికి మళ్ళీ దొంగలా వచ్చి గోడమొత్తన దాక్కున్నారా?

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

తంగేడంటే ఇవి కావండి.తంగేడు చెట్లు చిన్న పొదలు రోడ్ల ప్రక్కన,బంజరు భూముల్లో కనిపిస్తూ పసుపుపూలతో నిండిఉంటాయి,కాయలు చిక్కుడు కాయ ఆకారంలో పలుచగా ఉంటాయి. ఈ చెట్టును సమూలంగా మధుమేహవ్యాధి చికిత్స లో వాడతారు.

హరే కృష్ణ చెప్పారు...

తంగేడు పూలు కాకుండా వేరే పేరు ఉందండీ...సమయానికి గుర్తు రావడం లేదు..పూలతో తలలు నరికే ఆట చాలా బావుంటుంది..కొన్ని లక్కీ గా చాలా బలంగా వుంటాయి నా చిన్నపుడు స్కూల్ లో బాగా ఆడేవాళ్ళం..నాకే కాదు చాలా మందికి బాల్య స్మృతులను గుర్తుకు తెప్పించారు మీకు ధన్యవాదములు..బాగా రాసారు టపా

అజ్ఞాత చెప్పారు...

http://viseshaalu.blogspot.com/2008/03/blog-post.html
ikkada undi tangedu choodandi.

అజ్ఞాత చెప్పారు...

http://medplants.blogspot.com/2008/07/cassia-angustifolia.html

idikooda choodandi

అజ్ఞాత చెప్పారు...

http://hridayam.wordpress.com/cover-page/
చిన్నిగారు అది గుండెచప్పుడు బ్లాగు దానిలో తంగేడు, మోదుగ, బతకమ్మ పండగ లోని పూల బతుకమ్మ అన్నీ ఉన్నాయి చూడండి
( మీకు పూలంటే ఇష్టంగా అందుకే ఇది ఇచ్చాను :))

అజ్ఞాత చెప్పారు...

అన్నట్టు మీరు పెట్టిన ఫొటోలోని పూలను గుల్మొహర్ పూలు అంటారు. అగ్నిపూలు అనికూడా అంటారు. ఎర్రతురాయి అని కూడా.

http://en.wikipedia.org/wiki/Royal_Poinciana


పైలంకెలో గుల్మొహర్ కు సంబంధించిన పూర్తివివరాలు వికీపీడియా లో చూడవచ్చు.

జ్యోతి చెప్పారు...

తంగేడు పూలు పసుపుగా ఉంటాయి. ఇవి కావే???

Padmarpita చెప్పారు...

నాకు తెలిసి వీటిని "గుల్మొహర్" అంటారు అనుకుంటానండి..
తంగేడు పువ్వులు పసుపు రంగులో వుండి వాటిని దసరాకి బతుకమ్మలో పెడతారు అని తెలుసు.
బతుకమ్మ పాటకూడా వుంది...
"తంగేడు చెట్టు క్రిందా ఓలలనా...
లింగు పుట్టింది ఓలలనా....
లింగుకు నీళ్ళుపోసి ఓలలనా...
కట్టాకు బొట్టు పెట్టి ఓలలనా...
ఇంకొకరికిత్తునా ఓలలనా...
నా చిన్నా లింగు ఓలలనా...
ఇంకొకరికిత్తునా ఓలలనా...
నా చిన్నా లింగు ఓలలనా...
ఇంకొకరికిత్తునా ఓలలనా...
నా చిన్నా లింగు ఓలలనా..."
(Just iam sharing my views, dn't think in other way)

Hima bindu చెప్పారు...

@మురళి
నాకు మాత్రం యద్దనపూడి నవల గుర్తొస్తుంది -:)
@సుజాత
ధన్యవాదములు
@సూర్యుడు
మేము ఇలానే అంటాము ...మరి మీ వైపు వీటిని ఏమని పిలుస్తారు . పసుపువి తెలీదండి .
@పరిమళం
నాకిప్పుడు అర్ధమైంది ....ప్రాంతం బట్టి వివిధ మాండలికాల్లో వాటిని పిలుస్తారని .. తప్పించుకోవడం ఏమో కాని పెళ్లి చెడగొట్టిందని ఆవిడ మీద చాల కాలం కోపంగా వుండేది .

Hima bindu చెప్పారు...

@బోల్లోజుబాబ
చదవలేదండీ ....ధన్యవాదములు ..చదువుతాను .
@విజయమోహన్
మరి ఈ పూలని మీరేమంటారు ......మా కృష్ణా జిల్లాలో పల్లెల్లో ఇలానే పిలుస్తారు . గుల్మొహర్ వేరు ,అవి పసుపుగా వుంటాయి .
@హరే కృష్ణ
పేరు ఇప్పటికైనా గుర్తోచ్చినదండీ ...నేను మొగ్గలు బాగా తుంపెసేదాన్ని పుష్టిగా వుండేవాటి కోసం ...ధన్యవాదములు .

మరువం ఉష చెప్పారు...

చిన్ని, పాపం అంత మంది చెప్పాక నేనూ అదే చెప్తే బాగోదు కాని - వీటి పేరు అగ్నిపూలు. తంగేడు పూలకి రామాయణానికి ఓ పిట్ట కథ కూడా వుంది. సీతాదేవిని రాముడు అడవికి పంపినపుడు, ఇది ఫక్కున నవ్విందట, అందుకే ఆవిడ ఆగ్రహించి "నీవు పూజకీ, అలంకరణకీ పనికి రావు, నిన్ను చూడగానే విరిచి పడేస్తారు" అని సపించిదట. చిన్నపుడు త్రోవ వెంట విరిచి పడి వుండి, కాళ్ళ క్రింద నలిగే ఆ పూలని చూసి నేను నా జిజ్ఞాస వలన తెలుసుకున్నదిది. కానీ, అప్పటినుండే నేను వీటిని తల్లో గుచ్చుకు తిరిగేదాన్ని. ప్రకృతిని, సీతాదేవిని కించపరిచే ఆ కథ పట్ల నా నిరసన అలా తెలిపాను. ఇకపోతే, అగ్ని పూలని కోడి పందాలకి వాడేవాళ్ళం. సరీగ్గా గుర్తు లేదు కాదు కానీ అవి కూడా పల్నాటి చరిత్రలోని పందాలంత వీరోచితంగా ఆడేవాళ్ళం. నేను ఆ చెట్లు భలే ఒడుపుగా ఎక్కిదిగేదాన్ని. పైగా అందులోని రంగు రంగుల పత్రాన్ని తినేదాన్ని కూడా, చలా రుచిగా వుంటుంది. ఇపుడూ తింటారా అంటే ఏమో yikes, yaak అంటానేమో. చివరగా కొసమెరుపు, యద్దనపూడి సులోచనారాణి గారు "అగ్నిపూలు" చివరి భాగం నాగార్జున సాగర్ లో వ్రాసారు. ఆవిడని నేను కలిసి చాలా ప్రశ్నలు వేసాను. మహా ముచ్చట పడి ఇంత చిన్న పిల్లా, ఎంత చక్కని మాటలో అనటం గుర్తు. ;)

Hima bindu చెప్పారు...

@భాస్కర రామిరెడ్డి
హమ్మయ్య ..మీరైనా నాకు తోడు దొరికారు -:) అందరు ఇవి తంగేడు కాదంటున్నారు చూడండి .
మీ తాటి చెట్ల లో చాకలి బట్టల అనుభవాలు మాకు చెప్పండి ....అందరం చదివి ఆనందిస్తాము కదా !
ఆ రోజు అలా పీటల మీద పెళ్లి చెడగొట్టిందని అమ్మ వాళ్ళ నాయనమ్మ తో పచ్చి కొట్టాను . మా తమ్ముడు పెద్దయ్యాక చేసుకోమని వాడిని ఎంత బ్రతిమాలినా వాడు నో అన్నాడు (మా చెల్లి లా వుందని పోలికలు ) -:)
@అజ్ఞాత
చాల చాల ధన్యవాదములు ,,నాకు అజ్ఞాతలంటే చాల భయం ...రబ్బిష్ కామెంట్స్ రాస్తారని ....కాని మీ లాటి మంచి అజ్ఞాతలున్నారని ఇప్పుడే తెలిసింది :)
@జ్యోతి
ధన్యవాదములండి ....కాని మా ఊర్లో ఇలానే అంటాము .
@పద్మర్పిత
చాల బాగుంది ...నాకు చాల విషయాలు తెలిసయండి థాంక్యూ .

Hima bindu చెప్పారు...

@ఉష
చాల తెలీని విషయాలు చెప్పారండి ....తలలో పెట్టుకుని నిరసన తెలపడం చాల ముచ్చటగా వుందండి ..నేను జామ ,మామిడి చెట్లు ,గోడలు ఎక్కేదాన్ని ,కాని తంగేడు ఎప్పుడు ఎక్కలేదు :) అన్నట్లు మేము తినేవాళ్ళం ,పుల్లగా వుండేయి...గ్రేట్ ! యద్దనపూడి ని కలిసారా ...చిన్నప్పుడు మన ఆరాధ్య దేవత ....ఆరడుగుల హీరో ,పడవలాటి కార్ .......జ్ఞాపకాలూ...:)

మరువం ఉష చెప్పారు...

అయ్యయ్యో, ఆవిడ నాకు ఆరాధ్యదైవం కాదు సుమా, అలాగే యాధృచ్చికమే అయినా హీరో అని చెప్పను కానీ నా సహచరుడు పేరదే, రాజశేఖర్ ;) ఇక కార్ నేను కొనుక్కునదే నా బెంజ్ హహ్హా. నా కలలు నేనే నెరవేర్చుకున్నానన్న మాట!

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

చిన్నిగారు, మీ మాటకు ఎదురు చెప్పకుండా అందరికీ తలా ఒక తంగేడు దండ లంచంగా ఇవ్వండి. ఏది చెప్పమంటే అది చెప్తారు. అన్నట్టు నేను చూసిన తంగేడు చెట్లు ఇంత పెద్దగా వుండేవి కావు, కానీ పసుపు, ఎరుపు, కాషాయ రంగుల పూలు చూసిన గుర్తు.

సిరిసిరిమువ్వ చెప్పారు...

చిన్నిగారు, బాగున్నాయి మీ పూల కబుర్లు. అవి తంగేడు పూలు కాదండి, తంగేడు పూలు పసుపు వర్ణంలో ఉంటాయి. మీ ప్రాంతంలో ఆ పేరుతో పిలుస్తారేమో! ఈ పూల గురించి వేణు గారి టపా కూడా చూడండి.http://venusrikanth.blogspot.com/2008/06/blog-post_26.html

Hima bindu చెప్పారు...

@ఉష
మనకి ఆరద్యం అన్నది ,, మన అంటే నన్ను నేను గౌరవించుకోవడం -:)... మీ మీద జెలస్ గా వుంది ...రాజశేఖర్ మీ వారి పెరైనందుకు .:)
@భాస్కర రామిరెడ్డి
మీరు పార్టీ ఫిరయిస్తున్నారు ,మొదటేమో తంగేడు అన్నారు ...ఇప్పుడేమో ఇంత పెద్దవి కాదంటారా .....సరే మీకు ఇస్తాను ఒక పూల దండ ......ఇప్పుడు చెప్పండి తంగేడు కదూ -:)
@సిరిసిరిమువ్వ ధన్యవాదాలండి ...మీరు చెప్పిన వేణు శ్రీకాంత్ గారి బ్లాగ్ ఇప్పుడే చూసాను ...చాల detail గ రాసారు ...అందరం చిన్నతనం లో ఇలాటివి ఏదొక స్టేజి లో అనుభవించినట్లు తెలుస్తోంది ..ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తున్నరండి ...ఎవ్వరు ఖచ్చితంగా చెప్పలేకపోయారు ...చిన్న చెట్లని చిట్టకేసరి ,చిట్టి తురాయి అంటారు .

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

మీరు పూలదండ ఇచ్చారు కదా..అవి తంగేడే.. అసలు విషయం ఏమిటంటే, చిన్నప్పుడు మా వూర్లో గుల్మొహర్, అగ్నిపూలు అసలలాంటి పేర్లే తెలియవు. హైదరాబాద్ వచ్చాకే వేరే పేర్లు విన్నాను.

మరువం ఉష చెప్పారు...

భాస్కర రామి రెడ్డి గారు, అవి తురాయి, కొక్కిరాయి, అగ్నిపూలు. అంతే. తంగేడు అంటే చిన్న పొదల నిండు పసుపు పూలు. ఇక దండనకీ, ఉత్తర, దక్షిణాలకి [మీరు లంచం అన్నదానికి ప్రతీకారం] మేము
లొంగే రకాలం కాదు. ;) అవునూ మీ పేరు కుదించాలంటే, భాస్కరనా, రామి రెడ్డి గారనా సంబోధించాలి?

Hima bindu చెప్పారు...

@ఉష
భాస్కర రామిరెడ్డి గారిచ్చిన ఉపాయం ఆయన మీదే ప్రయోగించాం నా పార్టీలో చేరారు . ఇక ఒకటే ఉపాయం మిగిలుంది ,నాలుగు పిందెలు తెంపి మనము యుద్ధం చేద్దాము ఎవరు గెలిస్తే వాళ్ళు చెప్పిన పేరే ఖాయం చేద్దాము.యుద్ధం రానివారికి ఎలా చేయాలో డెమో తో సహా "వేణు శ్రీకాంత్ " బ్లాగ్ గత యాడాది జూన్ లో మెలకువలతో వివరించారు ,నేను సాయంత్రమే చూసాను . అన్నట్లు బాస్కర్ గారి పేరు మరీ పొడవైనది ....మూడు ముక్కలుగా పర్వాలేదేమో -:)

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

నాపేరును బ్లాగులోకంలో ఆత్రేయ గారి పద ప్రయోగంతో ఇప్పటికే మూడు అక్షరాలకు పడిపోయింది. "భారారె" అని. మీరు ఇంకా కుదించాలని అనుకుంటే.. చంద్రముఖిలో "రా రా..." లాగా "భారా..." అని వాడుకోండి. ఇదేంటి ఇలాగుంది అనిపిస్తే "భారారె" తో సెటిల్ అయిపోండి. అమెరికా వాడి పిలుపుకు అలవాటు పడ్డాక తెలుగు వారు ఎలా పిలిచినా సునాయాసంగా అర్థమౌతుంది.

మరి ఆలస్యం ఎందుకు .. తంగేడు పూలతో కొట్టుకోండి. నేను సినిమా చూస్తాను.చివరిలో మీకు క్రికెట్ లో Australia అంపైర్ ల లాగా తీర్పు చెప్తాను.

Hima bindu చెప్పారు...

@భారా ...
చాల బాగుందండి సింపుల్ గా ..యుద్ధం మొదలయింది కాని పూల పేరు కోసం కాదు ఉషాజి సమక్షంలో కాంసిలయాషన్ జరుగుతుంది -:)

మరువం ఉష చెప్పారు...

* చిన్ని, భా. రా. గారు ఆకాంక్షించినట్లు మనం కాస్త తంగేడు పూలతో కొట్లాడుకుందామా? ;) ఈ టపా చదివినపుడు ToDo List లో వ్రాసుకున్నాను మీకు తంగేడు పూలు చూపాలని. ఈ ప్రొద్దు అలా అలా తాజా వ్యాఖ్యలు చూస్తూ ఈ టపా చూడటం తారసిల్లింది. ఇక్కడ చూడండి "4) 2007 ముఖచిత్రం – తంగేడు పువ్వులు" http://hridayam.wordpress.com/cover-page/

Hima bindu చెప్పారు...

@ఉషాజి
చూసానండి ,,,కాని ఒక్కో చోట ఒక్కో రకంగా పిలుస్తున్నారు .....మా ఇంటి పక్క చెట్టు విరగాబూసిందండి ,మన యుద్దానికి సరిపడా కత్తులు ఇవ్వగలదు ధన్యవాదాలు

నాని చెప్పారు...

anduke naa blog pere తంగేడుపూలు ani petukunnanu