31, జులై 2009, శుక్రవారం

నా బహుమతి 'పుస్తకం'

ఈ మద్య ఒక నవలని మరల చదవవలసినపుడు దానికోసం పుస్తకాల షెల్ఫ్ అంతా గాలించినా దొరకలేదు .ఎమైపోయిందబ్బా అని ఆలోచిస్తుంటే ఫ్లాష్ బాక్ లు కళ్ళ ముందు గిర్రున తిరిగాయి సినిమాల్లో లాగ.అప్పుడప్పుడు వచ్చే స్నేహితులు నచ్చిన పుస్తకాలు తీసుకుపోయి వాళ్ళిష్టం వచ్చినపుడు అంటే యాడదికో ,ఆర్నేల్లకో మళ్ళి తీసుకొచ్చిపడేయడం ,అలా ఆ పుస్తకానికి రెక్కలొచ్చి ఉంటాయని సరిపెట్టుకుని ఇంకోటి తెచ్చిపెట్టుకున్న .అలా అని నేను పుస్తకాలు ఎవరి దగ్గర తీసుకొని చదవనని కాదు , ఒకవేళ తీసుకున్న సదరు యజమానికి చెక్కు చెదరకుండా ఇచ్చే ప్రయత్నం చేస్తాను , పైగా ఆ పుస్తకానికి అట్ట వేసుకుని మరి చదువుతాను యధాతధం గా ఇవ్వాలనే ప్రయత్నంతో . నాకో చెడ్డ అలవాటుంది ,చదవడం తో ఆపకుండా చదివిన దాన్ని గురించి ఎవరోకరి తో చెప్పడం ,వాళ్లు ఆ పుస్తకం చదవాలనుంది ఇవ్వమని అడగడం ,సదరు పుస్తకం అడిగిన వాల్లెంటపడికూడా పోవడం అది మనింటి మొహం చూడడానికి నెలలు పట్టడం ,ఒక్కోసారి జాడలు కూడా లేకపోవడం , మా ఇంట్లో మా పెద్ద తమ్ముడు కనిపించినవల్ల చదువుతాడు ,చదివి దాన్ని ఎక్కడ వదిలేస్తాడో తెలీదు ,అదేమంటే చదివేసాంగా అంటాడు ,తన దగ్గరికి పుస్తకాలు వెల్లాయంటే ఆశలు వదులుకోవాల్సిందే .తనని తరుచు విసుక్కుంటాను ,జాగ్రత్త లేదని ,...చిన్నప్పుడైతే ఎవరికైనా ఏవైనా ఇస్తే అడిగేసేదాన్ని ,ముఖ్యంగా పుస్తకాలు లాటివి . ఇప్పుడైతే అడగడానికి చచ్చే మొహమాటం. నా చిన్నతనం లో జరిగిన సంఘటనా తరుచు గుర్తోస్తుంటాది,అదీ చెప్తాను .

అవి మేము చిత్తూర్ లో వున్నా రోజులు .అప్పుడు నేను అయిదు ఆరు తరగతులు చదివాను .అప్పటికే వేసవి తరువాత క్లాసు లు మొదలయ్యి రెండు నెలలు దాటి పోయాక ఒక ప్రభుత్వ స్కూల్లో మమ్మల్ని చేర్పించారు. మేము సంచార జాతికి చెందినోల్లం కాబట్టి ఎక్కడికి వెళ్తే అక్కడి వాళ్ళతో కలిసిపోతామన్నమాట :) మరి ఏడాదికో ఊరాయే . అక్కడ చదువు తో పాటు ఆటపాటలు ,అనేక సాస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే వాళ్లు . అక్క ,నేను అన్నింటా పార్టిసిపేట్ చేసేవాళ్ళం .ఒకసారి చిల్డ్రెన్స్ డే సందర్భంగా భారిగా పోటీలు నిర్వహించారు .నేను పాటలు,నృత్యం,పైంతింగ్,వ్యాస రచన ,వక్రుక్త్వ (స్పీచ్) పోటీలు అన్నిటికి నా పేరు ఇచ్చేసా ,అస్సలే మనం జాక్ అఫ్ అల్ ట్రేడ్సే కదా ముందు వెనుక ఆలోచించకుండా గొప్పగా దూకేసాం .అన్నింటిలో పాల్గొని చిన్నదో పెద్దదో బహుమతులు గెలుచుకున్నాం ,ఏమి లేని చోట ఆముదం వృక్షం చందాన ....అసలు కథ ఇక్కడ మొదలయ్యింది ,వక్రుత్వపు పోటిలకు పేరు ఇచ్చాను కాని ,అదేంటో నాకు సరిగ్గా తెలిదు ,ఆ రోజు మద్యాహ్నం నుండి మా అక్క ప్రాణం తీసేసా , ఎలా మాట్లాడాలి ,ఏమి మాట్లాడాలని ,అక్క తో తిట్టించుకుంటూ నేను మాట్లాడవలసిన 'గ్రంధాలయాలు ' మీద రాయిన్చుకున్నాను.చూడకుండా అంతమంది ముందు స్టేజి మీద చెప్పడం ఆ రోజుల్లో నాకు హీర్కులియన్ ఎఫ్ఫోర్ట్ అని చెప్పొచ్చు .రెండు ,మూడు సార్లు తన ముందు ప్రాక్టిస్ చేయించింది .సరిగ్గా చెప్పడం లేదని 'గ్రంధాలయాన్ని'బట్టి వేయించింది .(మనకి లెక్కలు కూడా స్టెప్ ల తో సహా బట్టి వేయడం అలవాటే )...భయం వేస్తె ఎవరి వంక చూడకుండా చెట్ల వంక ,ఆకాశం వంక చూస్తూ చెప్పెసేయమంది .

నా పేరు స్టేజి మీద పిలవగానే నా కాళ్ళ లో వణుకు వచ్చేసింది .,నిజానికి నాకు పాటలు ,డాన్సులు అందరి ముందు చేయడం కొత్తేమి కాదు ...మైక్ ముందు ఒంటరిగా స్పీచ్ నాకు కొత్త . మైక్ ముందు అందరిని చూస్తూ బేలగా వుండిపోయాను ,మా టీచర్ జడ్జి లు సైగలు చేయడం తో మా అక్క కోసం వేదికను ధైర్యం కోసం ...ఇక లాభం లేదని మెదడంతా బ్లాంక్ అవ్వుతుండగా గొంతు సవరించు కుని సభకు ,ప్రధాన ఉపాధ్యాయునికి నమస్కారాలు చెప్పి ఇలా మొదలెట్టాను "గ్రంధలయములనగా పుస్తకములు బద్రపరుచు స్థలము"అని రెండు సార్లు చెప్పి ,అనక ఒక్క ముక్క గుర్తు రాక ఎదురు కూర్చున్న జనాలే మనస్సంతా నిండిపోయి ,ఏడుపొచ్చి ,నన్ను రక్షించేవారే లేరా ఇక్కడ అని ,బేల చూపులు చూస్తున్న నన్ను మా క్లాసు టీచర్ చొరవగా స్టేజి మీద నుండి దిగి పోవడానికి సహాయపడ్డారు.

ఇక చుడండి నా తరువాత ఒక్కొక్కరు మాట్లాడేవాళ్ళు తమ పేర్లు పిలవగానే రావడం ,దిక్కులు చూస్తూ నోరు పెగలక వెళ్లి పోవడం .ఆఖర్న వెంకటరత్నం అనే అబ్బాయి స్ప్పేడ్ గ వచ్చి అందరికి నమస్కారాలు గబగబా చెప్పేసి ,తను మాట్లాడబోయే టాపిక్ మరిచిపోయి బుర్ర గోక్కుంటూ నిలబడి పోయాడు అలా జునియర్ విభాగం పోటీలు ముగిసాయి .ఆ పోటికి సంభందించి మొదటి ,రెండో భాహుమతులు మా హెడ్ మాస్టర్ అప్పుడే స్టేజి మీద ప్రకటించారు ఫస్ట్ నాకు ,సెకండ్ వెంకటరత్నం కి ఇచ్చారు .ఇంటికెళ్ళే దారంతా అక్క నన్ను తిడుతూనే వుంది ,ఇంట్లో అందరికి చెప్పి నవ్వడం , "అయితేనేం నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చినదిగా "అని సిగ్గులేకుండా వాదన పెట్టుకున్నాబహుమతి ప్రధానం చిల్డ్రన్స్ డే నాడు జరిగిందీ .అక్కా ,నేను చాల తెచ్చుకున్నాము .వ్యాస రచనకి ,ఎలాక్త్యుషన్ కి పుస్తకాలు బహుమతులుగా ఇచ్చారు .నా వ్యాస రచన కు మొదటి బహుమతి "పాయసం తాగిన పిచ్చుక " నా బ్రహ్మాండ మైన ప్రసంగానికి "చరిత్రకెక్కిన చరితార్ధులు "అనే పుస్తకం ఇచ్చారు .

ఒకరోజు అంటే ప్రోగ్రామం అయిన రెండు రోజులకు అనుకుంటాను , మాకు సోషల్ కి వచ్చే టీచర్ క్లాసు రూం లో నన్ను ,వెంకటరత్నం ని లేపి మాకు బహుమతులుగా వచ్చిన పుస్తకాలను మరునాడు తెచ్చి చుపమన్నది .మరునాడు నేను హడావిడిగా నా పుస్తకాల బాక్స్ లో పెట్టుకుని ,ఆవిడ క్లాసు రూం లో వచ్చిందో లేదో నేను వెంకటరత్నం పోటీపడి ఆవిడ దగ్గరికి వెళ్లి నా రెండు పుస్తకాలు ఆవిడ చేతుల్లో పెట్టాను అదేదో ఘన కార్యం చేసినట్లు .ఆమె చక్కగా ఆ పుస్తకాలని తన హ్యాండ్ బాగ్ లో పెట్టుకుని సాయంత్రం స్టాఫ్ రూం కి వచ్చి కలెక్ట్ చేసుకోమంది .సాయంత్రం స్టాఫ్ రూం కి వెళ్లాను ,అప్పటికే ఆవిడ వెళ్లిపోయారని చెప్పారు .మరునాడు స్కూల్ కి వెళ్ళగానే స్టాఫ్ రూం కి ముందే వెళ్లాను .,ఆ టీచర్ నన్ను చూసి ,ఇంట్లో మరచిపోయాను రేపు తెస్తాను అని చెప్పింది , ఆ రేపు రేపు కాస్త నెలలు దాటేయి ,ఒకరోజు మాత్రం మొహం చిట్లిస్తూ నలిగి జీర్ణవస్థలో వున్నా 'పాయసం తాగిన పిచ్చుక ' ఇచ్చింది .ఆమె నన్ను చూడగానే అడగకుండానే రేపు అనేసేది .ఆ రేపు కాస్త మా యన్యుఅల్ పరీక్షలయ్యి ,వేసవి లో కొవ్వూరు వెళ్ళేదాకా జరిగిందీ.ఇప్పటికి నాకు ఆ పుస్తకం గుర్తొస్తే మనస్సు కలుక్కుమంటుంది .,ఆవిడ ఎక్కడుందో కనుక్కుని నా పుస్తకం నాకు ఇవ్వు అనాలన్పిస్తుంది.తరచుగా తలపుల్లోకి వచ్చి అసహనంగా అన్పిస్తుంది ,అప్పుడప్పుడు అనిపిస్తుంది 'అయాచితంగా' వచ్చింది కాబట్టి నిలవలేదేమోనని . ఇదండీ రెక్కలొచ్చి ఎగిరిపోయినా నా జ్ఞాపకం నా పుస్తకం .నేను పూర్తిగా చదవకుండానే నా చేతుల్లోంచి జారిపోయిన ముత్యం .

22 కామెంట్‌లు:

శరత్ కాలమ్ చెప్పారు...

నేను పదవతరగతిలో క్లాసులో సెకండ్ వచ్చిన సందర్భంగా మా నాన్నగారు రేపిడెక్స్ ఇంగ్లిష్ స్పీకింగ్ కోర్స్ బహూకరించేరు. ఇది ఇప్పటికీ భద్రంగా దాచుకున్నా.

Padmarpita చెప్పారు...

ప్చ్...ప్చ్....మళ్ళీ ఆ పుస్తకానికి రెక్కలు వచ్చి మీముందు వాలితే బాగుండును.

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

"గ్రంధలయములనగా పుస్తకములు బద్రపరుచు స్థలము"..

wow.. First prise for elocution? you are great andi. :)

"అయితేనేం నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చినదిగా "అని సిగ్గులేకుండా వాదన పెట్టుకున్నా"

Yeah.. what else we expect in 6th grade? :)


(మనకి లెక్కలు కూడా స్టెప్ ల తో సహా బట్టి వేయడం అలవాటే)

Good ability :-)

ఉమాశంకర్ చెప్పారు...

భలె ఉన్నాయండీ మీ జ్ఞాపకాలు..పుస్తకాలపేర్లు వెరైటీగా ఉన్నాయి "పాయం తాగిన పిచ్చుక", "చరిత్రకెక్కిన చరితార్ధులు" :) ..మొత్తానికి ఒక్క వాక్యానికే ఫస్ట్ ప్రైజు కొట్టేసారు..

కాస్త లేటుగా.. కంగ్రాచ్యులేషన్స్ :)

మురళి చెప్పారు...

నేనూ ఇలాగే పాటల పోటీలో పాల్గొని బహుమతి గెలుచుకున్నానండీ :-) ఆ సీన్ గుర్తొచ్చి నవ్వుకున్నా.. ఇక, పుస్తకాలతో నా కష్టాలు ఎన్నని చెప్పమంటారు? ఎవరికయినా ఇస్తే పుస్తకం తిరిగి వచ్చేంత వరకూ టెన్షన్.. ఐతే నాక్కూడా భద్రంగా చదివి ఇచ్చేసేవాళ్ళూ, కొంచం నలిగినా కొత్త పుస్తకం కొనిచ్చేవాళ్ళూ ఉన్నారు.. వాళ్ళకైతే రెండో ఆలోచన లేకుండా ఇచ్చేస్తాను.. ఎవరికయినా పుస్తకం ఇచ్చేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించాలని తెలుసుకోడానికి నాకు చాలా పుస్తకాలు ఖర్చయ్యాయి :-) బాగుంది మీ టపా.. కొన్ని అప్పుతచ్చులు మినహా :-)

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

చిన్నిగారు,
భలే..మీకు ఆ కాంపిటీషన్ లో ఫస్ట్ రావటం.:)
మీకో విషయం చెప్పనా...ఇలా పుస్తకాలు తీసుకుని ఉంచేసుకునే బాపతులు ఒక్క నవలలు,నాన్ ఫిక్షన్ సంభందిత పుస్తకాల చదివేవారి కేటగిరిలో మాత్రమే ఉంటారనుకుంటే పొరపాటే. నా ఇంజనీరింగ్ పుస్తకాలు, మంచి మంచి మెటీరియల్స్ కూడా ఇలాగే క్లాస్మేట్స్ తీసుకుని మళ్ళీ ఇచ్చేవారు కాదు. అలా ఎన్నో ఖరీదైన పుస్తకాలు మళ్ళీ కొనుక్కున్న సందర్భాలు అనేకం నాకు. తెలిసి తెలిసి మనం ఏమో చదివి ఊరుకోక పక్కవాళ్ళతో ఫలానాది ఎంత బాగుందో! అంటూ చెప్పి పుస్తకాలు పోగొట్టుకుంటాం.

అవునండీ మీకు మీ టీచర్ కొట్టేసిన ఆ పుస్తకం బయట ఎక్కడా దొరకలేదా? ఎప్పుడో ఆ(మీది కాదులెండి :)) పుస్తకం నేను చూసినట్టు గుర్తు.
బావుంది మీ టపా.
గతంలో 'మనసులో మాట' సుజాత గారు కూడా ఇలాంటి టాపిక్ మీదే ఒక టపా రాసినట్టు గుర్తు.

ఉమాశంకర్ చెప్పారు...

oops.. ఇప్పుడే చూసా , నా కామెంటులో అప్పుతచ్చు :) సారీ అండీ..

భావన చెప్పారు...

అయ్యయ్యో చిన్ని గారు పాయసం తాగి పిచ్చుక ఎగిరి పోయిందా? నేను ఇలా పుస్తకాలు పోతున్నాయి అని దాని మీద నా పేరు అడ్డ్రెస్స్ స్టిక్కర్ అంటించా, ఐనా లాభం లేదు.. అడిగితే పోయింది ఐతే ఏమిటి.. పుస్తకమేగా ఏదో పట్తుచీరో బంగారమో లా మొహం పెడతావేమిటి అని కూడా అడుగుతారు నన్నైతే.. నాకు బాగా బాధ వేసింది చలం గారి సుధ్ పోయినప్పుడు, వడ్డెర చండీదాస్ గారి అనుక్షణికం పోయినప్పుడు (అవి మళ్లీ దొరక లేదు..), ఇంకో మంచి స్నేహితురాలు you forever by లోబ్సాంగ్ రాంప తెలుగు వెర్షన్ మరణం లేని మీరు పోగొట్టి ఈండియా వెళ్ళినప్పుడు తెచ్చి ఇచ్చింది తెలుగు ఇంగ్లీష్ వెర్షన్ కూడా . ఇలారాస్తుంటే ఒక పోస్టే అవుతుందేమో

కొత్త పాళీ చెప్పారు...

super.
ఈ వక్తృత్వప్పోటీలు గట్రా జరిగేప్పుడు, బకరాగాళ్ళొచ్చి స్టేజెక్కి బలైపోతూంటే ఆ జడ్జీలుగా కూర్చునే మేష్టార్లకి కొంచెం దయైనా ఉండదు, వాళ్ళని దింపేసి మోక్షమిద్దామని.
ఆరూ ఏడూ సంగతి నాకు గుర్తు లేదు గానీ ఎనిమిది నించీ పదిదాకా విజయవాడ, కృష్ణాజిల్లా వోలుమొత్తం తెలుగు ఎలొక్యూషన్ రంగాన్ని దున్ని పారేశాను. మా బళ్ళో పోటీలకి ఏవో పుస్తకాలే బహుమతులిచ్చేవారు, నాకు సరిగ్గా గుర్తు లేదు, ఏం గెలిచానో.

చిన్నిగారూ ఏమనుకోనంటె పంక్చువేషన్ గురించి చిన్న సూచన. కామా, ఫులిష్టాప్ - వీటికి ముందు స్పేస్ ఉండదు, తరవాత ఉంటుంది. గమనించండి.

జీడిపప్పు చెప్పారు...

భలే ఉంది మీ బహుమతి కథ. ఎనిమిదో తరగతిలోనేమో, ఇద్దరే పాల్గొన్న పోటీలో నాకు మొదటి బహుమతిగా Wren and Martin English grammar పుస్తకం ఇచ్చారు.

Hima bindu చెప్పారు...

@శరత్ 'కాలం'
ఇప్పుడు అంతకంటే విలువైనవి వచ్చిన 'భాల్యం' లో పొందిన అనుభూతి ముందు దిగదుడుపే! నాకొచ్చిన బహుమతులు ఏవి కనబడటం లేదు కాని ఫిఫ్త్ నుండి పి.జి వరకు తెచ్చుకున్న ప్రైజెస్ తాలుక సర్టిఫికెట్స్ మాత్రం భద్రంగా వున్నాయి .

Hima bindu చెప్పారు...

@పద్మర్పితా
ధన్యవాదాలండి , కనీసం ఆ పెద్దావిడకి ఇలా బ్లాగ్ లు చదివే అలవాటుంటే సిగ్గుపడి వెనక్కి ఇచ్చేస్తుందేమో చూద్దాం :)

Hima bindu చెప్పారు...

@భాస్కర రామిరెడ్డి
మీ అభినందనలకు ధన్యవాదాలండి ,మరీ అంత వయస్సులో అంతటి 'కలాపోసన ' మానవమాత్రులకు సాద్యమా!నేను కాబట్టి :) అసలే ఈ మద్య లెక్కలు తలుచుకుని టెన్షన్ పడుతుంటే మీ బ్లాగ్ లో మరీ జడిపిస్తూ ఆ ఫోర్ములాలేన్టండి మీలాంటి 'మేథావి' ల కోసమేనా ఆ టపా!

Hima bindu చెప్పారు...

@ఉమాశంకర్
యేమిటోనండీ మాలాటి వారి బ్లాగ్స్ పెద్ద మనస్సు తో చదివి ఎడాపెడా 'అచ్చు తప్పులు' అంటించుకుంటున్నారు . మాకేమి పర్వాలేదు మేము సర్దుకుపోతాం .:) మీ అభినందనలకు ధన్యవాదములు .

Hima bindu చెప్పారు...

@శేఖర్ పెద్దగోపు
మీ మాటలతో నాకెక్కడో 'ఆశ' తళుక్కుమందండి ,చెప్పండి ఎక్కడ చూసారో ? నాది కాదు అన్నారంటే తప్పకుండ నాదే అని నా డౌట్ :) మీకు గాని చిత్తూరు లో చుట్టాలు వున్నారా......
నిజమేనండి మీరన్నట్లు చదువుకునే పుస్తకాలను హస్తగతం చేసుకున్న వాళ్ళని చూసాను ,నాకు తెలిసిన అమ్మాయి దగ్గర హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీ ముద్రతో వున్నా పుస్తకాలు డజన్లకొద్దీ చూసాను ,కొనగలిగి వుండి ఆ అమ్మాయికి అదో జబ్బు .

Hima bindu చెప్పారు...

@మురళి
హ హ్హ ....మీరు నాలానే ఒకే ఒక్క లైన్ పాడారా ? చక్కగా ఒక టపా రాసేయండి చదివి ఆనందిస్తాము ..
దాదాపు పుస్తక ప్రియులందరికీ ఇలాటి అనుభవం ఎప్పుడోసారి ఎదురయ్యి వుంటాది .

Hima bindu చెప్పారు...

@భావన
నిజానికి పుస్తకాలు బంగారం,పట్టు చీరలకన్న ఎంతో విలువైనవని వారికి తెలీదు కదా ,తమది కాని దాన్ని అంత అలసత్వం తో ఎలా చూస్తారో అర్ధం కాదు.మీ అనుభవాలు రాయండి టపా రూపంలో .

Hima bindu చెప్పారు...

@కొత్తపాళీ .
హొలే కృష్ణా మీదేనా ! అప్పటికి మేము రాలేదుగాని వచ్చుంటే మీకు నేను పోటి అయ్యుండే దాన్నేమో :)
తప్పకుండ సరిచేసుకుంట నండీ. ధన్యవాదములు .

Hima bindu చెప్పారు...

@జీడిపప్పు
ధన్యవాదాలండి . మీ పోటి కి మా పోటికి పెద్ద తేడా లేదు , ఇక్కడ ఇద్దరిమే వీరులం :) నోరు విప్పినోళ్ళం.

పరిమళం చెప్పారు...

అందుకే మరి నేను పుస్తకాల్ని ఎవరికీ ఇవ్వంది :)
ఐతే నాదగ్గర అందరూ సీడీలు ,డీవీడీలు తీసుకొని జాతీయం చేసేస్తుంటారు :)
ఏమైనా బహుమతిగా వచ్చిన పుస్తకం కదా బాధగా ఉంటుంది .

murthy చెప్పారు...

మీరు చెప్పిన ఆనవాళ్ళని బట్టి... ఆ మేడం ఇందిర గారు లేక చెంగమ్మ గారు అయిన్దోచ్చు. ఇందిర మేడం లేరని విన్నాను. చెంగమ్మ మేడం లాస్ట్ ఇయర్ మా బాచ్ కలిసినప్పుడు, గురు సత్కారానికి వచ్చారు. ఎందుకైనా మంచిది.. ఓ మాట అడిగేయ్య మంటారా... :-) ఎందుకైనా
రామకృష్ణ

Hima bindu చెప్పారు...

sure...adigeyandi :-)