23, డిసెంబర్ 2009, బుధవారం

మరచిపోలేని కథ

  1. డిసెంబర్ ఇరవయ్యిఆరు రెండువేల తొమ్మిది నాటికి మన దేశాన్ని సునామి తాకి సరిగ్గా అయిదు సంవత్సరాలు అవుతుంది .ఆనాటి ప్రకృతి ప్రళయాన్ని కళ్ళకి కట్టినట్లు రాసిన కథ "కడలూరు వెళ్ళాలి ఒక నీలిమ కోసం".ఈ కథ రెండు వేల అయిదు జనవరి పదహారు 'ఆంధ్రజ్యోతి 'ఆదివారం అనుభంధం లో ప్రచురించబడింది . ఈకథ ఉత్తమ కథ గా "కథరెండువేల అయిదులో " చోటు చేసుకుంది పైన ఆకాశం ,కింద భూమి ,చుట్టూ నీరు .భూమి బద్దలైనపుడో ,నీరు ఉప్పొంగినపుడో మనిషి కాళ్ళ కింద నేలకరిగిపోతుంది .నమ్మినవాళ్ళు ,నమ్ముకొన్న ప్రపంచం ఆనవాళ్ళు అన్ని క్షణాల్లో చెదిరిపోయినపుడు,విశాలాకాశం కింద ఒంటరిగా నిలబడ్డప్పుడు జీవితానికి అర్ధం ఏవిటనే ప్రశ్న ముందుకొస్తుంది .మనుషుల మద్య నిరంతరం ఉండే సవాలక్ష అంతరాలు అర్ధం లేనివని అవగాహన ముందుకొస్తుంది . ప్రతి వాక్యము రచయిత అక్కడ వీక్షించి లేక ఆ స్థితిని అనుభవించి రాసారా అన్న ప్రశ్న మన మస్తిష్కం లో రేగుతుంది . కథ చదివి పొగిలి పొగిలి ఎడ్వటమే కాక మా ఇంటిల్లిపాది చదివించి ఎడ్పించాను. రచయితని ప్రత్యక్షంగా ఒక సమావేశం లో కలిసినపుడు నేను అడిగిన ప్రశ్న మీ సన్నిహితులకథ రాసారా అని .ఈ రోజు ఈ కథను గూర్చి ప్రత్యేకంగా గుర్తు చేసుకోవడానికి కారణం కల్పన గారు వారి బ్లాగ్ లో ఈ కథ గురించి ప్రస్తావించారు .నేను మరచిపోలేని మరువరాని కథ ఇది ,ఎవరైనా చదవని వారుంటే చూస్తారనే ఉద్దేశముతో పరిచయం చేస్తున్నాను .రచయిత శ్రీ చోరగుడి జాన్సన్ గారు .వీరు సమాచార పౌర సంభందాల శాఖలో డిప్యుటీ డైరక్టర్ గా పనిచేస్తున్నారు .వీరు కథలు వ్యాసాలూ సమీక్షలు తరుచు రాస్తుంటారు .ఈ కథ సంకలనం అన్ని ప్రముఖ పుస్తకాల షాపులలో దొరకవచ్చును .
j

14 కామెంట్‌లు:

Kalpana Rentala చెప్పారు...

చిన్నీ, ఈ కథ గురించి మీరు రాసింది కరెక్ట్. అయితే మీరు రచయత ని కలిసినప్పుడు, మీరు అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం ఏమిటో రాయలేదు. ఏమన్నారు ఆయన? వంశీ కథల మీద మీరు ధైర్యంగా, సూటిగా, నిజాయితీ గా మీ అభిప్రాయం రాయటం బావుంది.
కల్పన

భావన చెప్పారు...

బాగుంది చిన్ని పరిచయం. ఈ సారి పుస్తకం వచ్చినప్పుడు తప్పక గుర్తు పెట్టుకుని ముందు చదువుతాను.

Bolloju Baba చెప్పారు...

abbaa you too remember it.

what a story madam. i still remember the lines of the story very very vividly.

recently i quoted this in blogs somewhere.

adbuthamaina kadha idi.

really really superb story on a natural calamity ever written in telugu.


thanks for reminding it mam

bollojubaba

మురళి చెప్పారు...

చాలా మంచి కథ.. చాలాసార్లు చదివాను.. కోడి మీద రాసిన వ్యంగ్య కథ కూడా బాగుంటుంది.. అయితే మొన్న సాక్షి ఫండే లో వచ్చిన జాన్సన్ గారి కథ నిరాశ పరిచింది..

మరువం ఉష చెప్పారు...

చిన్నీ, ఈ కథ నాకు కూడా స్పష్టంగా కళ్ళ ముందు కదలాడుతున్నంత గుర్తు వుంది. అప్పట్లో కనపడిన అందరితో ప్రస్తావించేదాన్ని.

పరిమళం చెప్పారు...

"పైన ఆకాశం ,కింద భూమి ,చుట్టూ నీరు .భూమి బద్దలైనపుడో ,నీరు ఉప్పొంగినపుడో మనిషి కాళ్ళ కింద నేలకరిగిపోతుంది .నమ్మినవాళ్ళు ,నమ్ముకొన్న ప్రపంచం ఆనవాళ్ళు అన్ని క్షణాల్లో చెదిరిపోయినపుడు,విశాలాకాశం కింద ఒంటరిగా నిలబడ్డప్పుడు జీవితానికి అర్ధం ఏవిటనే ప్రశ్న ముందుకొస్తుంది .మనుషుల మద్య నిరంతరం ఉండే సవాలక్ష అంతరాలు అర్ధం లేనివని అవగాహన ముందుకొస్తుంది"చిన్ని గారు , ప్రస్తుతం ఈపరిస్థితి మన రాష్ట్రానికి చాలా అవసరమనిపిస్తుంది. ఎప్పుడో 2012 లో వచ్చే ప్రళయం ( నిజమైతే ) ఇప్పుడే వస్తే బావుండనిపిస్తోంది .మీ కధాపరిచయం బావుంది .

Hima bindu చెప్పారు...

@కల్పన రెంటాల
ధన్యవాదాలండీ .
ఆ రచయిత గుండె తడి నుండి వచ్చినదటండీ. అప్పటి పరిస్థితుల కధనాలు చూసి చలించి రాసినదని చెప్పారు . ఆ కథ చదివినవారందరూ నాలానే ప్రశ్నించారట .
@భావన
ఈ పుస్తకం రెండువేల ఆరు సెప్టెంబర్ లో ముద్రితమైన్దండీ .ఈ కథ సంకనంలోని కథలన్నీ బాగున్నాయండీ .మీకు కావాలా ?
@బొల్లోజు బాబా
నన్ను ఈ కథ బాగా కదిలించిందండీ.కథ ముగియగానే రచయిత ఫోన్ నంబర్ కోసం చూసాను .అమాంతం వెళ్లి కలవాలనే అన్పించింది .అనుకోకుండా కథ చదివిన నాలుగు నెలలకి ఒక కార్యక్రమం లో నేను ముఖ్య అతిధిగా ఆయన గౌరవ అతిధిగా స్టేజ్ మీద కలిసాం ..అక్కడ కలిసే వారకి నాకు తెలీదు వారు చోరగుడి జాన్సన్ అని .ఇక నా ఆనందం కి అంతులేదు,ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించేసి బోల్డు బోల్డు మెచ్చుకుని ,ఒక పావు గంటలో కనిపించి వచ్చేద్దాం అనుకున్నది రెండు గంటల పయనే గడిపాను ..కథ గుర్తు చేసినందుకు "కల్పన "గారికే అభినందనలు చెందుతాయండీ .

Hima bindu చెప్పారు...

@మురళి
కోడి కథ వార్త ఆదివారం లో వచ్చింది కదండీ .ఈ వారం ఫన్డే కథ గురించే కల్పన గారు రాసారు .
@ఉష
నేను అచ్చు మీలానే అందరితో చెప్పి చదివించి తిట్లు కూడా తిన్నాను ,వాళ్ళ మనసు పాడు చేసానని .అప్పట్లో సునామీ అనుభవం ఒక ఆరునెలలు నిద్రపోనీయలేదాయే .
@పరిమళం
నిజమే ...మనం ఒకింత ఆత్మా పరిశీలనతో ఆలోచిస్తే అంతా "మిధ్య " అనిపిస్తుంది -:) ధన్యవాదాలు .

భావన చెప్పారు...

నేను ఎప్పటి కప్పుడూ పుస్తకాలు తెప్పించుకుంటాను. నా దగ్గర కధ 03 వక వున్నట్లు వున్నాయి. తరువాత సిరీస్ అమ్మ మార్చ్ లో వస్తోంది ఇక్కడికి అప్పుడు తెప్పించుకుంట. ఒక సూట్ కేస్ కేవలం పుస్తకాలకే. చాలా థ్యాన్క్స్ చిన్ని అడిగినందుకు.

కొత్త పాళీ చెప్పారు...

జాన్సన్ గారితోనేమో రెందు గంటలు కబుర్లాడారా?
నా సభకి వచ్చి కూడా ఒక్క మాటతో మాయమై పోయారా?
I hurted now!

Hima bindu చెప్పారు...

@కొత్తపాళీ
హుమ్మ్ ! మీ సభలో గంట కూర్చున్నాను కదండీ -:( ప్రారంభం నుండి చివరివరకు .మీరేమో మాట్లాడేంత తీరికగాను లేరాయె.మీ వీరిగాడి వలస నన్ను వెంటాడుతూనే వుంది :)

ప్రవీణ్ మలికిరెడ్డి చెప్పారు...

can anybody post that story pls

Thanks
Praveen

ప్రవీణ్ మలికిరెడ్డి చెప్పారు...

Can any body post that story pls?

Hima bindu చెప్పారు...

@ప్రవీణ్
ప్రయత్నిస్తామండీ బ్లాగ్ లో పెట్టడానికి .