19, ఫిబ్రవరి 2010, శుక్రవారం

నేలటికేట్

హమ్మ్...ఇన్నాళ్ళకి నేలటికెట్ తీసుకొని సినిమా చూసాను.చిన్నప్పుడు చాలాసార్లు అనుకునేదాన్ని ఎంచక్కగా స్క్రీన్ కి దగ్గరగా కూర్చుంటే అందర్నీ దగ్గరనుండి చూడొచ్చు కదా అని ,ఆ కోరిక ఇన్నాళ్ళకి మా అమ్మాయి ద్వారా తీరింది .
మద్యాహ్నం ఇంటికి లంచ్ కి వెళ్ళగానే నా కూతురు ,చెల్లి కూతురు పెద్ద ప్లాన్ తో ఎదురొచ్చారు ,యెట్టి పరిస్థితిలో ఈ రోజు శేఖర్ సినిమా "లీడర్ "చూడాల్సిందేనని పైగా అదీను ఈ రోజే రిలీజ్ అయ్యిందని వాళ్లకి జతగా చెల్లి వంతపాడింది,టికెట్స్ రిజర్వు చేయించమని. అరగంటలో సినిమా మొదలవబోయే సినిమాకోసం అడగక అడగక అడిగారు పిల్లలని కాస్త పెద్ద మనస్సు చేసుకుని నాలుగు టికెట్లు సంపాదించాను ,వాళ్ళు టికెట్స్ ఇచ్చేప్పుడు స్క్రీన్ ఒన్ అనగానే ఎదోకట్లే వీళ్ళు (నేను )సినిమా చూడటం కావాలిగాని అంటూ లోపలి వెళ్లాం .వెళ్ళాక గాని తెలియలేదు అది నేల టికెట్ అని స్క్రీన్ కి దగ్గరలో రెండో వరుసలో కూర్చున్నాం.సినిమా మొత్తం తల కొంచెం పైకి యెత్తి చూడాల్సి వచ్చింది (సీట్స్ దరిద్రంగా వున్నాయి ) వందరూపాయలు టికెట్ ,పేరుకి inox .జీవితంలో మొదటి ఆట మొదటిసారి స్క్రీన్ కి అత్యంత దగ్గరలో చూసాం ,ఏదో శేఖర్ కమ్ముల కాబట్టి కాస్తంత సర్దుకున్నాను లేకపోతె వాళ్ళని అక్కడ వదిలేసి చక్క వచ్చేసేదాన్ని.ఆనంద్ గోదావరి తో శేఖర్ అభిమానిని కనీసం హ్యాపీ డేస్ లా అయినా సినిమా ఉండకపోతుందా అనే ఆశ తో ఓపికగా సినిమా అంతా చూసాను .
ఏదో చెప్పాలనుకుని చెప్పలేకపోయాడు.....అనిపించింది .ఏవిటి కథా అని ఆలోచిస్తే "నల్లధనం" వెతికి తీసి ప్రజలకి పంచాలి అన్నా సందేశం కనిపిస్తుంది .మరీ లీడర్ టైటిల్ కొంచెం కన్ఫుజింగా వుంది తల్లి పాత్ర ద్వారా లీడర్ వేరు పోలిటిసియన్ వేరు అని చెప్పించడం , తండ్రి సాధించలేక అవినీతి వ్యవస్థలో కొట్టుకుపోవడం ,దానికి విరుగుడుగా తానూ సాధిస్తాను అనడం ఆ లక్ష్యం చేరుకోవడానికి తండ్రి సంపాదించిన నల్లధనాన్నే వాడుకుని ముఖ్యమంత్రి కావడం చిరాకు కలిగించింది .అసలుకే తక్కువ సినిమాలు చూస్తాను చూడక చూడక చాలారోజులకి చుస్తే సినిమా నిరాశాపరచినదే అనిపించింది .పాటలు 'జయ జయ ప్రియబారత ,మా తెలుగు తల్లి బ్యాక్గ్రౌండ్లో వినులకింపుగానే వున్నాయి చివరిలో వచ్చిన కాథానాయకి కళ్ళకింపుగా ముద్దుగా వుంది,అన్నట్లు ఆమె కట్టిన చీరలు బాగున్నాయి,పాటలు పర్లేదు .

15 కామెంట్‌లు:

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

డబ్బులిచ్చి తలపట్టుకోని వచ్చారా? పోన్లేండి అమృతాంజనం ఫ్రీగా ఇచ్చుంటారులే :)

ఐనా నేల బెంచీల మీదకూర్చొని ఈలలేసుకుంటూ సినిమా ఎంజాయ్ చేయలగానీ ఇలా చూడ్డానికి వెళతారా ఎవరైనా? భలే బాగయింది. ఇంతకీ మీ పిల్లలకు నచ్చిందా సినిమా అండి?

Hima bindu చెప్పారు...

హబ్బ మేం అమృతాంజన్ రాయమండి అది అమ్మావాళ్ళు రాస్తారు మాది జండుబాం-:)
పిల్లలకి ఎందుకు నచ్చదు !అవినీతి మీద యుద్దకాండ జరుగుతుంటే ,అవేవి కాపోయిన హీరో వాళ్లకి చాలా నచ్చేసాడు యాక్షన్ మాత్రం నచ్చలేదంట.
విజిల్స్ వేయాలనే తోచలేదండీ-:(

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

చిన్ని గారు..సేం పించ్..నేను కూడా లీడర్ సినిమాని నేల టికెట్ లోనే చూశాను. నిన్న Ad Labs లో ప్రీమియర్ షోకి వెళ్ళినప్పుడు మొదటి వరసలో సీట్లు మావి. నాకైతే మెడకాయ పట్టేసింది. ఏంటో ఈ ధియేటర్ల డిజైన్ అని అనిపించింది.

Padmarpita చెప్పారు...

నేను మీకన్నా ముందెప్పుడో నేలటికెట్టులో రెండు సినిమాలు చూసేసానోచ్చ్:):)

ఉమాశంకర్ చెప్పారు...

"లీడర్" గురించి బోల్డుమంది రాసారు ( రాస్తారు) కాబట్టి నేను నా నేలటికెట్ గురించి రాస్తా :)

నేను నా చిన్నప్పుడు బోల్డు సినిమాలు చూసానండీ అలా..చాలా వరకు ఎన్టీవోడివే ..బాగా గుర్తున్నవంటే "కొండవీటి సింహం ", "నాదేశం". సినిమా మొదలైన ఒక పావుగంటకి నెమ్మదిగా నాకళ్ళు అలవాటుపడేవి అంత దగ్గరగా చూడ్డానికి..ఆ తరువాత పెద్ద తేడా తెలిసేది కాదు..

Hima bindu చెప్పారు...

@శేఖర్
థాంక్యూ -:)...నేను చెల్లి మెడలు నొప్పిఅని భాధ పడ్డాం కాని పిల్లలు మాత్రం బానే ఉందిగా అని బుకాయించారు .
@పద్మార్పిత
సో ఇప్పటికి అలవాటు పడిపోయి వుంటారు -:)
@ఉమా
నేను సినిమా రివ్యూలు రాయడం ఎప్పుడైనా చూసారా ?మనం అంత మేధావులం కాదండీ ఏదో నా సొదవ్యధ బ్లాగ్ వుంది కదా అని రాసుకుంటూ వుంటాను.నేలటికెట్ గొప్ప అనుభవం ..పనిలోపని సినిమా చూసి యెట్లా ఫీల్ అయ్యానో రాసాను.అబ్బ చిన్నప్పుడు కాబట్టి మీరన్నట్లు సినిమా ఆనందం లో కళ్ళు లాగిన ,మెడ పట్టేసిన ఏమి తెలిసేదికాదు ఇప్పుడు చూడండీ ముందు వరుసలో -:):)

జయ చెప్పారు...

బాగుందండి మీ నేల టికెట్. నేను కూడా ఇదివరలో రెండు మూడు సార్లు I max లో నేలటికెట్ కే వెళ్ళాను. నేను లీడర్ చూద్దామనుకుంటున్నానే!

మురళి చెప్పారు...

Welcome back అండీ.. 'లీడర్' ఏవరేజ్ సినిమా అని మిత్రుల ఉవాచ.. అయినా శేఖర్ కమ్ములకి పబ్లిసిటీ ఎలా చేయాలో తెలుసు కాబట్టి... చూడాలి, ఏం జరుగుతుందో.. నేను కలర్ మాయాబజార్ రెండో సారా లేక లీడర్ మొదటిసారా? అని బొమ్మా బొరుసూ వేస్తున్నా :):)

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

ఉమాశంకర్ గారి వ్యాఖే నాది కూడా.అయినా ఆ సోకే వేరుకదా ఎంటీవోడి సినిమా నేలటిక్కట్టు సూపర్ కాంబినేషన్ విత్ విజిల్స్ అబ్బో బెమ్మాండం.

మురళీ గారు కలర్ మాయాబజార్ నూరోసారయినా అలోచించకండి తొక్కలో లీడర్ చూడకపోయినా నష్టం లేదు (ఉచిత సలహా).

తెలుగు వెబ్ మీడియా చెప్పారు...

నేల బెంచీల మీదకూర్చొని ఈలలేసుకుంటూ సినిమా ఎంజాయ్ చెయ్యడం పల్లెటూర్లలో అయితే బాగుంటుంది కానీ టౌన్ లో బాగుండదు కదా భరారె గారు. 2006లో బిజినెస్ పెట్టినప్పటి నుంచి సినిమాలు చూడడం దాదాపుగా మానేశాను. నేల బెంచిల కింద నల్లి పురుగులు ఉండగలవు. నా దగ్గర పని చేసే కుర్రాళ్ళు చెప్పారు. వాళ్ళకి కూడా నేల టికెట్ తీసుకుని సినిమా చూసిన ఎక్స్పీరియెన్స్ ఉంది.

Hima bindu చెప్పారు...

@జయ
అయ్యో చూడండీ జస్ట్ నా ఫీలింగ్ రాసాను .నాకు నచ్చినవన్ని అందరికి నచ్చాలని లేదుగా ,అలానే అందరికి నచ్చినవి నాకు నచ్చాలని లేదు -:)
@మురళి
వావ్ !హారతి పళ్ళెం కనబడటం లేదు -:)...థాంక్యూ ...
ఏది డిసైడ్ అయ్యింది సార్. నాకనుమానం 'మాయాబజార్'....అమ్మో నేను చుడాలండీ మాట ఇచ్చాను...
@శ్రీనివాస్ పప్పు
అయ్యో మేం మిస్ అయ్యమండీ ,ఇప్పుడలా చేస్తే అందరు అదోరకంగా చూస్తారేమో -:)
@ప్రవీణ్
నిజమే ఈ భా.రా.రె కి ఏమి తెలీదు అన్ని తప్పుడు సలహాలు ఇస్తారు .పల్లెటూర్లో కాబట్టి తను అలా చేసి వుంటారు -:):) .

అజ్ఞాత చెప్పారు...

నేల టికెట్ తొ సినిమా చూడాలంటే టూరింగ్ టాకీసులోనో పాత థియేటరులోనో చూడాలి కదా.
నేను చిన్నప్పుడు చాలాసార్లు (55 పైసలు టికెట్)చూసాను.
బెంగళూరులో ఫిల్మ్ సిటీలో ఒక టూరింగ్ టాకీస్ ఉంది.
దాంట్లో పది నిముషాల 'షోలే' చూసి టూరింగ్ టాకీసుని మా అమ్మాయికి పరిచయం చేసాము.

భావన చెప్పారు...

నాకు పర్లెదు అనిపించింది అంటే మరి నేల టికెట్ కాదు గా అందుకనేమో మరి ;-) హీరోయిన్ ఆమె చీరలు నచ్చాయి నాకు కూడా.టీనేజ్ హీరో హీరోయిన్ లు ఇంట్లో నుంచి వచ్చి ప్రేమ గురించి సందెశాలు ఇవ్వకుండా, హీరో అసయ్యం గ ’ఒసే, తింగిరి’ అంటూ హీరోయి ’ఏరా, వెధవ ’ ఇంకా ఆ తిట్లు కూడా గుర్తు లెవు అవేమి లేకుండా, బాంబులు రక్తం అలాంటి భీబత్సాలు, ఒంటీ చేత్తో ట్రైన్ లు ఆపేసే సోది కార్యక్రమాలు లేకుండా వుంది కదా సినిమా నాకు అందుకైనా ఒక సారి చూసేద్దాము లే అని చుసేసాను. సెకండ్ ఆఫ్ లో కాసేపు శేఖర్ కమ్ముల కన్ఫ్యూజ్ అయినట్లు అనిపించింది కాని మా వాళ్ళు ఎవరొ చెప్పేరు 40 నిమిషాలు ఎడిట్ అయ్యిందట కదా సినిమా?

మాలా కుమార్ చెప్పారు...

నేల టికెట్ అంటే ఇప్పుడు కూడా నేల టికెట్లూ అవి చూడటాలూ వున్నాయా అనుకున్నాను సుమండి . బాగుంది మీ నేల టికెట్ .

Hima bindu చెప్పారు...

@బోనగిరి
నేను ముద్దుగా పెట్టుకున్నాను inox రెండోవరుసలో చూసాను ,చాల చాలా ఇబ్బంది పడ్డాను .టూరింగ్ టాకీస్ నేను చుడలేదండీ.
@బావన
సో మీక్కూడా ఆ హీరోయిన్ చీరలు నచ్చాయ -:):)
@మాలా కుమార్
అయ్యో నేల టికెట్టు వుంటుంది కదండీ !