21, ఏప్రిల్ 2010, బుధవారం

ఒక్క నిమిషం

దాదాపు అన్ని స్కూళ్ళ లోను కాలేజిలలోను ఫైనల్ పరీక్షలు అయ్యిపోయి వేసవి సెలవలు మొదలయ్యాయి .పదవతరగతి రాసిన పిల్లల విషయంలో ఇప్పటికే తల్లిదండ్రులు అప్పోసప్పో చేసేసి ఏదొక కార్పోరేట్ కాలేజి లో సీట్ రిజర్వ్ చేసేసుకుని వుంటారు .ఆ పిల్ల భవిష్యత్తు దాదాపు స్కెచ్ వేసినట్లే రెండేళ్ళు రెసిడెన్స్ కాలేజి ఆనక "ఎంసెట్"లాంగో షార్ట్ టేర్మో..తరువాత ఇంజినీర్ ,డాక్టర్ ..ఆ తరువాత "డాలర్ ".......గ్రామాల్లోను ,పట్టణాల్లోను ఇదే బాట .ముఖ్యంగా మా కోస్తా వారి ప్లాన్ ఈ విధం గానే వుంటుంది .
పిల్లల కి చదువు చెప్పించడం సామాన్యులకి తలకి మించిన బరువుగానే తోస్తుంది ,అయిన వున్నా కుంటా ,సెంటు తెగనమ్మి పిల్లలికి చదువు చెప్పిస్తు కార్పోరేట్ కాలేజీలను కుభేరుల్ని చేస్తున్నారు
స్థోమత వున్నవారు ఏవిదం గా చేసిన పెద్ద నష్టపోయేది ఏముండదు ,ఎటొచ్చి లేని వారి పరిస్థితే ఆలోచించాలి .దాదాపు గ్రామాల్లోనే 70 % నివసిస్తున్నారు చాలావరకు వ్యవసాయం ,కూలిపనులు చేసేవారే ఎక్కువ ,వారంతా గ్రామం లో వున్నా ప్రభుత్వ బడిలో తమ పిల్లల్ని చదివిస్తూ ఆ పైన చదివించలేక ఎటువంటి అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తుందో తగిన సమాచారం లేక ఆ ఊరి పెద్దో ,మోతుభారి రైతో ,లేక అక్కడి ఉపాధ్యాయుని సలహా చేత తమని మించిన బరువైన ఇంజినీరో ,డాక్టరీ నో చదివించాలని తము తిని తినక పిల్లల్ని పట్టణాల్లో రెసిడెన్సీ కాలేజీల్లో చేర్పిస్తున్నారు .పిల్లలు చదివి ఉద్యోగాలు తెచ్చుకుని వాళ్ళు సెటిల్ అయ్యి పెద్దవారిని మంచి చెడు చూసుకునే సమయానికి వారు తలకి మించిన అప్పులతో ఆరోగ్యం క్షీణించి వృద్దాప్యం తో ఒంటరిగాకాలం వెళ్ళబుచ్చడం జరుగుతుంది .
పైన పేర్కొన్న చదువులే కాక ఎన్నో రకాల వృత్తివిద్యలు వున్నట్లు బహు కొద్దిమందికి మాత్రమె తెలుసు .పదవతరగతి పూర్తి కాగానే ఒకటి లేక రెండు సంవత్సరాల సర్టిఫికట్ కోర్సు చేయగానేవెంటనే ఉపాధి లభిస్తుంది దానిని ఆధారం చేసుకుని ఆ పై డిప్లోమ ,ఇంజినీరింగు డిగ్రీ చేయడానికి ఎంతో అవకాశం వుంది .దాదాపు ఇటువంటి వృత్తి విద్యలు 65trades మన రాష్ట్రం లోనే పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో లభిస్తున్నాయి .అదేవిధంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్వహించే డిప్లోమ కోర్సుల తో త్వరితగతిన ఉపాధి పొందవచ్చును తన కుటుంబం కి ఆసరాగా నిలబడుతూనే పై చదువులు చదవను వచ్చు.ఇవే కాక పారామెడికల్ కోర్సులు చేసి వెంటనే ఉపాధి పొందవచ్చును .
పదవతరగతి ,ఇంటర్ చదివిన తరువాత పై చదువులు గాని ,ఏదైనా ఉపాధి సంభందిత సమాచారం పొందాలంటే మీ జిల్లా లోని ఉపాధి కార్యాలయం లో ఉన్నటువంటి ఒకేషనల్ గైడెన్స్అధికారిని సంప్రదించినట్లయితే తగిన సమాచారము ,సలహాను పొందవచ్చును .అభ్యర్ధి అభిరుచి సాంఘిక స్థోమత బట్టి అభ్యర్దికి లభించే అవకాశాలు ,స్కాలర్షిప్పులు,మార్గదర్శకాలు పొందవచ్చును .
తగిన సమాచారం కోసం ఈ క్రింద పేర్కొన్న వెబ్ సైట్ చూడవచ్చును .

పైన రాసిన సమాచారం చదివిన ఏ ఒక్కరైన (ముఖ్యం గా ఉపాద్యాయులు ) తమకి తెలిసిన పిల్లలకి తెలిపినచో వారి జీవితానికి ఎంతోకొంత సహాయపడినవారు అవ్వుతారు .మనం వెచ్చించే అర నిమిషం చాలు చిన్ని సలహా జీవితాన్నే ఉన్నత స్థితికి మార్చొచ్చు .

3 కామెంట్‌లు:

జయ చెప్పారు...

చిన్ని గారు చాలా మంచి ఇంఫర్మేషన్ ఇచ్చారు. ఇంటర్ తరువాత, ట్రావెల్,టూరిజం & హాస్పిటాలిటీ మానేజ్మెంట్, హోటల్ మానేజ్మెంట్, ట్రేడ్ & ఫారన్ ఎక్చేంజ్, ట్రాన్స్లేషన్ కోర్స్, కొన్ని ఇతర కంప్యూటర్ కోర్స్ లు చేసినా కూడా మంచి గవర్న్మెంట్, ప్రైవేట్ సెక్టార్స్ లో ఉపాధి సంపాదించుకోవచ్చు. ఇవన్నీ షార్ట్ టర్మ్ కోర్స్ లే. అంతే కాకుండా ఈ కోర్స్ ల తరువాత బాంక్ లోన్ తో తామే స్వయంగా సంస్థలు ఏర్పరిచి ఇతరులకు కూడా ఉపాధి కల్పించొచ్చు. ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా డెవలప్ అవుతున్న కోర్స్ లు.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

తప్పకుండా చెబుతామండీ..

Hima bindu చెప్పారు...

@జయ
@శేఖర్
చాలా థాంక్సండీ ...మనం ఇచ్చే చిన్ని సలహా జీవితాలే మలుపు తిరగడం చూసాను ,అందుకే రాసాను .