29, ఏప్రిల్ 2010, గురువారం

నా అభిరుచులు

తరుచు మనం అటు ఇటు తిరిగే క్యాంపు ల ఉద్యోగం కావడంతో ఆయ ఊర్లలో ప్రశస్తమైన పండ్లు ,పూలు అలాగే స్వీట్స్ ఏంటో కనుక్కుని నచ్చిన వాటిని తిరిగి వచ్చేప్పుడు తీసుకోస్తుంటాను..మరచిపోతానేమోనని ముందే ఎవరికైన చెప్తాను వెళ్ళేప్పుడు గుర్తుచేయమని .పూలు విషయం కి వస్తే విశాఖపట్నం లో "సింహాచల సంపెంగ "పూలు లేకుండా తిరుగు ప్రయాణం చేయాలంటే నా మనసొప్పదు .ఎక్కువగా రైల్వే స్టేషన్ లో దొరుకుతాయి ,బయట మార్కెట్ లోను దొరుకుతాయి .బోల్డన్ని గుత్తులు కొని తెచ్చుకుంటాను .తెలుపు పసుపు రంగుల్లో వుండే ఈ పూలు తరగని సువాసననిస్తాయి .సింహాచలం లో మొక్కలు కూడా అమ్ముతారు మనం మొక్క కూడా పెట్టాం కాని ఇంతవరకు పూయలేదు చెట్టు పెరగనే లేదు . మచిలీపట్టణం లో మంగినపూడి బీచ్ దారిలో అమ్మే మొగలిపోత్తుల కొరకు ఆరాటపడతాను . నెల్లూరు వెళ్ళినపుడు పినాకిని లో ప్రయాణం చేస్తే చెన్నయి నుండి తెచ్చి అమ్మే 'చెంబెలిపూలు 'తప్పకుండా కొంటాను ,అరటి నార తో మాలలు కట్టి అమ్ముతారు ..అలానే చెట్టు సంపెంగ పూలు తో పినాకిని పరిమళాలు వెదజల్లుతది,పెదవడ్లపూడి వచ్చేసరికి గంపలు గంపలు మల్లెలు విరజాజులు చేరతాయి ...ఇవన్ని పిచ్చపిచ్చగా కొనిస్తానని వేరేచేప్పక్కరలేదు
. పండ్ల విషయానికి వస్తే ఏలూరులో దొరికే జామకాయ ఇంకెక్కడా దొరకదేమో అనిపిస్తుంది ,అక్కడి కాయలు తిని ఇంకెక్కడా తినాలన్పించదు.అలానే తేగలు నిడదవోలు ,చాగల్లు లోరుచి ఇంకోటి కనిపించదు.అలానే రేగుపళ్ళు గోదావరి జిల్లాలోనే బాగుంటాయి .సీతాఫలాలు తప్పకుండా రాజమండ్రి ,జంగారెడ్డిగూడెం నల్లజర్ల పరిసర ప్రాంతాల్లోనే బాగుంటాయి ,ఒక బుట్టడు మనతో ప్రయాణం చేయాల్సిందే .
చక్కెరకేళి లు రావులపాలెం లో చాలా బాగుంటాయి ..మామిడిపళ్ళు మా జిల్లా లోనే కాకుండా ప్రకాశం జిల్లా లో 'ఉలవపాడు ' అనే ప్రాంతం కాయలు చాల స్వీట్ గా బాగుంటాయి,ఒంగోలు వెళ్ళినపుడు తోటకి పంపించి మరి తెచ్చుకుంటాను .సీసన్ అయ్యాక మార్కెట్ లో ఎక్కువ దొరికేయి ఉలవపాడు కాయలే .
ఇక స్వీట్ విషయానికి వస్తే మచిలీపట్టణం వెళ్తే 'హల్వా ''లడ్డు ''తిరుగు ప్రయాణం లో ఉండాల్సిందే .చాల ప్రసిద్ది తాతారావు స్వీట్స్ అంటే .కాకినాడ వెళ్లి వచ్చేప్పుడు మన కూడా 'కోటయ్యకాజ", తాపేశ్వరం కాజాలు ,ఆత్రేయపురం పూతరేకులు వస్తాయి ..
ఈ రోజు ఒంగోలు వెళ్లాను .ఆఫీసు పనికన్నా ముందు అల్లురయ్య మైసూర్ పాక్ కి ఆర్డర్ పంపాను .అక్కడ ఆర్డర్ చేస్తేనే మనకి దొరుకుతుంది .ఒంగోలులో చాల ప్రసిద్ధిగల స్వీట్ అది .పది యేళ్ళ క్రితం మొదటిసారి అరటిఆకులో నెయ్యోడ్తూ పొట్లం కట్టారు ,ఇప్పుడు మామూలు స్వీట్ డబ్బాలో పెడుతున్నారు ,కొంచెం క్వాలిటీ తగ్గిందనుకోవచ్చు ..ఇలా ఊరుకో స్వీట్ తెచ్చుకుని నేనే మొత్తం తింటాను అనుకుంటున్నారా !మా పాప నేను కొంచం మాత్రం తీసుకుని మా బందుమిత్రులకి తినిపిస్తాను :-)

22 కామెంట్‌లు:

ఉమాశంకర్ చెప్పారు...

అన్యాయమండీ ఇలా నోరూరించడం.మీకే పాపం..

మొన్న ఒకపని మీద న్యూజెర్సి వెళ్ళి అక్కడ ఉండే ఒక ప్రసిద్దమైన షాపుకి వెచ్చాల కోసం వెళ్ళా. కౌంటర్ దగ్గర నోరూరిస్తూ స్వీట్లు.తిని చాలా రోజులయింది కదాని జాంగ్రీలు తెచ్చుకున్నా.సరైన నూనె వాడలేదేమో,తిందామని ఇలా నోటిదగ్గర పెట్టుకోగానే ఏదో తేడా.ఉసూరుమంటూ అస్సలు తినకుండా మొత్తం బుట్ట దాఖలు చేసేసా . :(

Hima bindu చెప్పారు...

@ఉమా
అయ్యో నోరూరించేసానా ..ప్చ్ ..సరే ప్రాయశ్చిత్తంగా మీకేం కావాలో నాకు ఆర్డర్ చేసేయండీ .పది రోజుల్లో మీ ఇంట్లో కి వచ్చే ఏర్పాటు చేస్తాను ...నిజంగా నిజం.

భావన చెప్పారు...

చిన్ని అన్యాయం ఇది మీకు ఇలా వూరించటం పువ్వులు స్వీట్స్ చెప్పి. చూసేరా పువ్వులైనా స్వీట్ ఐనా మా వూరికొక ప్లేస్... ప్రత్యేకత వుంది. మా వూర్లో ఇంకా చాలా వున్నాయి. అన్ని గుర్తు చేసి ఇలా దిగులు పెట్టటం అన్యాయం. :-((

Raj చెప్పారు...

మీరు ఎప్పుడైనా ధర్మవరం స్టేషన్లో వేడి వేడి ఇడ్లీలు...గుంతకల్ లో దోశలు ....గుంటూరు చెక్కరకేళీలు...మచిలీపట్టణం తాతారావు అప్పడాల పిండి..అప్పడాలు....వేటపలెం జీడిపప్పు...రుచి చూసారా?

Hima bindu చెప్పారు...

@భావన
మీ ఊర్లో చిలకలపూడి పాండురంగని గుడి .నాకిష్టం .అలానే చరిత్రకి సాక్షిగా నాటి బ్రిటిష్ కట్టడాలు అడుగడుగునా ....కాని ఒక్క మంచి హోటల్ కూడా వుండదు ఫుడ్ తిందాం అంటే .వర్షాకాలంలో నాకసలు ఇష్టం వుండదు మీ బందరు :-)
@రాజ్
ధర్మవరం ఇడ్లీ ,గుంతకల్ దోశలు తినే అవకాశం దొరకలేదండీ .అలానే బందరు తాతారావు అప్పడాలు ,పిండి ఎపుడు తినలేదు ...చెప్పారుగా ట్రై చేస్తాను .గుంటూరు చక్కెరకేళి ,వేటపాలెం జీడిపప్పు ఎప్పుడు అందుబాటులో ఉండేయే ...తిన్నాను .ధన్యవాదాలు ..

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

మా మానాన మేము ఇక్కడ మాడిపోయిన మసాలా దోశ తింటుంటే టపాలో లైనుకొక స్వీటు/పండు గురించి రాసి, గుర్తుకుతెచ్చి ఎందుకండీ మమ్మల్ని ఇలా ఊరిస్తారు....:-):-)
ఇందుకు ప్రతిగా ఈ టపాకు కమెంట్ పెట్టిన అందరికీ చిన్నిగారి చేత ఒంగోలు మైసూర్ పాక్ స్వీటు ఇప్పించాల్సిందే అద్దెక్చా!!

తృష్ణ చెప్పారు...

సంపెంగ పువ్వుల్ని గుర్తు చేసారు...కాకినాడలో మా సొంత ఇల్లు ఉండే రోజుల్లో మా నానమ్మ వేసిన తోటలో ఆకుపచ్చ సంపెంగలు మూడు చెట్లు, సింహాచలం సంపెంగ ఒక పెద్ద చెట్టు ఉండేవి.ఇంకా బోలెడు పూల చెట్లు ఉండేవి. ఆకుపచ్చ సంపెంగ అందేవి కానీ సింహాచలం సంపెంగలు పైనెక్కడో పూసేవి.ఉన్నన్ని రోజులూ మా అన్నయా నిచ్చెన వేసుకుని చెట్టెక్కి ఎక్కి కోసి ఇచ్చేవాడు...భలే రోజులు గుర్తు చేసారండీ..ధన్యవాదాలు..

తృష్ణ చెప్పారు...

సంపెంగ పువ్వుల్ని గుర్తు చేసారు...కాకినాడలో మా సొంత ఇల్లు ఉండే రోజుల్లో మా నానమ్మ వేసిన తోటలో ఆకుపచ్చ సంపెంగలు మూడు చెట్లు, సింహాచలం సంపెంగ ఒక పెద్ద చెట్టు ఉండేవి.ఇంకా బోలెడు పూల చెట్లు ఉండేవి. ఆకుపచ్చ సంపెంగ అందేవి కానీ సింహాచలం సంపెంగలు పైనెక్కడో పూసేవి.ఉన్నన్ని రోజులూ మా అన్నయా నిచ్చెన వేసుకుని చెట్టెక్కి ఎక్కి కోసి ఇచ్చేవాడు...భలే రోజులు గుర్తు చేసారండీ..ధన్యవాదాలు..

మురళి చెప్పారు...

:-) :-) so 'sweet'

Hima bindu చెప్పారు...

@శేఖర్
అయ్యొయ్యో ...మాడిపోయిన మసాల దోషాలు తింటున్నారా !మంచిరోజులు వస్తాయిలెండి .మిత్రులందరి తరుపున మీ విన్నపం ఆలకించితిని.....అందరి అడ్రేస్స్లు నాకు పంపండి ఘుమఘుమలాడే ఒంగోలు మైసూరు పాక్ తల ఒక పార్సెలు పంపిస్తాము ....పనిలోపని మా నూజివీడు చిన్నరసాలు కూడా తలో బుట్టెడు పంపేదా :-)
@తృష్ణ
ఓహ్! మీ కాకినాడలో ఉండేవా .. అన్నవరం కొండపైన సింహాచల సంపెంగ చెట్లు చాలా వున్నాయి కొన్ని చేతికి అందుతాయి ..ఇక్కడ మా ఇంట్లో ఆకుపచ్చ సంపెంగలు రోజు పూస్తున్నాయి ప్రతి గదిలో ఒకటి ఉంచుతున్నాను.
@మురళి
స్వీట్స్ తినని వాళ్లకి స్వీట్ గా వుందా :-).

కొత్త పాళీ చెప్పారు...

ఊరించడం సంగతి పక్కన బెడితే, ఇటువంటి నాలెడ్జి మన జాతికి, నేలకి సంబంధించిన వారసత్వపు జ్ఞానం ఇప్పుడు చాలా కొరవడిపోతోంది. ఎప్పుడో 192ఒల్లో రాసిన అడివిబాపిరాజుగారి నారాయణరావు నవల్లో ఆయన ఆంధ్ర దేశంలో ఈ చోటు దీనికి ప్రసిద్ధి అని చాలా చెబుతారు. మీరిలా చక్కగా అన్నిటినీ ఒకచోట క్రోడీకరించి చెప్పినందుకు అభినందనలు. పూలూ, పళ్ళూ తినుబండారాలే కాకుండా ఇతర చేతిపనులు, నేతలు, వస్తువులు - ఇలాంటివి కూడా మీ దృష్టికి వస్తే, వాటిక్కూడా ఒక లిస్టు పెట్టండి.

రాధిక చెప్పారు...

ఇప్పటికిప్పుడు అర్జంటుగా ఇండియా వచ్చినా ఇవన్నీ తినడం కుదరదండి :( నా పేరు చెప్పి మీరే తినండి.నేను సీతాఫలం తిని ఏడేళ్ళయిందండి :( మిరు చెప్పిన లిస్ట్ లో మా ఊరి పేరు కూడా వుందండి.గెస్ చెయ్యగలరా?నాకా స్వీటంటే మహా చిరాకు.ఎవ్వరింటికెళ్ళినా అదే పెడతారు :( ఆ స్వీటు...............చెప్పేస్తాలెండి ......కా కా కా కాజా

జయ చెప్పారు...

చిన్ని గారు, మరి హైద్రాబాద్ బిరియాని, గులాబులు, అంగూర్, స్వీట్స్...వీటి సంగతో...!!!పోనీ నన్ను పంపించమంటారా మీకు.

జయ చెప్పారు...

చిన్ని గారు, మరి హైద్రాబాద్ బిరియాని, గులాబులు, అంగూర్, స్వీట్స్...వీటి సంగతో...!!!పోనీ నన్ను పంపించమంటారా మీకు.

Hima bindu చెప్పారు...

@కొత్తపాళీ
ముందుగా మీ అభినందనలకి ధన్యవాదాలండీ .నేను ఆఫీసు పని మీద ఆయ ప్రాంతాలకి వెళ్ళినపుడు( నవలలు ,కథల్లో చదివినవి )ఏదొక వెసులుబాటు చూసుకుని అక్కడ ప్రశస్తమైన ,చారిత్రాత్మక ప్రదేశాలు కూడా చూస్తాను ,విజయనగరం లో గురజాడవారి ఇల్లు ,అప్పటి రాజ ప్రసాదములు ,వేయిపడగలు చదివి చల్లపల్లి కోట ,మోపిదేవి ఆలయం ,సాయంకాలం నవల చదివి 'పద్మనాభం 'ఇలా చుసోస్తుంటాను అదొక సరదా.మొన్న ఈ మద్య బ్లాగ్ లో ఒంగోలు లోని సాయిబాబా గుడి గురించి చదివి పనయ్యి వచ్చేప్పుడు ఆ గుడికి వెళ్లోచ్చాను.చాలా బాగుంది .మీ సూచన ప్రకారం తప్పక రాస్తాను .

Hima bindu చెప్పారు...

@రాధిక
ఓహ్!మీ ఊరు తాపేశ్వరం కదండీ .........అమ్మో ఏడు సంవత్సరాలు అయ్యిందా సీతాఫలం తిని !బహుశా సీసన్ అయ్యాక వస్తుంది వుంటారు .ఇప్పుడు 'రామాఫలం 'దొరికే సీసన్ .ఇంచుమించు ఒకే రుచి .
@జయ
మీ హైదరాబాద్ భిరియని అందరికి అందుబాటులో వుంటాది అనుకుంటాను :-) జి.పుల్లారెడ్డి హల్వా నాకు చాల ఇష్టం ,ఒక రెండు కేజీలు పంపండి ..తిని పెడతాం... గులాబీలు ఎన్ని పంపిన అస్సలు వద్దు అనను .మీ ఇష్టం

జయ చెప్పారు...

చిన్ని గారు, ఎక్కడైనా దొరికేది హైద్రాబాద్ బిరియాని కాదుకదా:) పోన్లెండి, మరి మీకు హల్వా ఎక్కడికి పంపమంటారు. సరదాగా ఒకసారి మీరు ఇటు టూర్ వేసుకోవచ్చుగా. ఇంకా ఎన్నైనా చేయొచ్చు.

Hima bindu చెప్పారు...

@జయ
బవాచి లోనే తినాలి అంటారా :-) నెలకోసరయిన మీ భాగ్యనగరం హాజరు వేసుకోవాల్సిందే తప్పదు :-(
అయితే మీతో కలసి అల్లరి చేస్తానికి వస్తాన్లెండి .

సూర్యుడు చెప్పారు...

సాయంకాలమైంది (http://www.eenadu.net/sahithyam/display.asp?url=chaduvu110.htm) నవల (కొనుక్కోడానికి) ఎక్కడ దొరుకుతుంది?

Hima bindu చెప్పారు...

@సూర్యుడు
విశాలాంద్ర బుక్ హౌసు లో దొరుకుతున్దండీ

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

ఈ సారొచ్చేప్పుడు ప్రతిదీ ఒకటి ఎక్కువ తేవడం మర్చిపోకండి. ఇక్కడ తినే వాళ్ళం చాలా మందిమే వున్నాము.

సూర్యుడు చెప్పారు...

@చిన్ని:

Thanks for the information.

Regds,
~sUryuDu