24, నవంబర్ 2010, బుధవారం

దేశవాళిచిరుతిండ్లు
















ఇక్కడ ఫోటోలలో చూస్తున్నది తేగా అంటారు .రుచి చాల బాగుంటుంది .కొత్తగా ట్రై చేసేవాల్లకి అస్సలు నచ్చదనుకొండీ .ఇవి తాటి పండు ను భూమిలో నాటితే తయారవుతాయి త్రవ్వకుండా వదిలేస్తే బుల్లి తాటిచెట్టు వచ్చేస్తుంది .దీనిని తినడం కూడా కొంచెం కష్టమే ...కాని నేను మాత్రం నేర్చేసుకున్నాను ,ఎలా అంటారా ...చిన్నప్పుడు ముత్యాలముగ్గు సినిమా చూసి తెలుసుకున్నాను :-) అన్నట్లు తెగలు అన్ని చోట్ల దొరకవండీ దొరికిన అంత రుచి వుండవు ...రుచిగల తెగలు తినాలి అనుకుంటే గోదారి జిల్లాకి అడుగు పెట్టాల్సిందే .అక్కడ కూడా ఎర్రమట్టి ఇసుకనేలలో దొరికేవి పొడి పొడిగా చాలా బాగుంటాయి ఊనగట్ల చాగల్లు ప్రాంతాల్లోవి అధిక డిమాండ్ వుంటాయి .అటు ప్రాంతం వెళ్ళడం జరిగితే నా కూడా ఇంటికి తేవడమే కాక అదేదో నేనే పండించినట్లు అందరకి పంపిస్తాను .తినాలి అనుకున్న వాళ్ళు ఒకసారి అటు వెళ్ళినపుడు ట్రై చేయండీ .





14 కామెంట్‌లు:

జయంత్ కుమార్ చెప్పారు...

ఇవి చాలా బాగుంటాయండి........

తృష్ణ చెప్పారు...

అబ్బా తేగలే నాకు భలే ఇష్టం...అమ్మ చూడకుండా చందమామ తినటం. మంచివి చూసి కొనుక్కుని, కట్టంతా నేనే తినేసి దగ్గు తెచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయ్..:)

ఉమాశంకర్ చెప్పారు...

చాలా బావుందండీ.మా వైపుకూడా దొరికేవి. చిన్నప్పుడు బానే తిన్నా.

అయితే చివరి వాక్యం ఇంకా బావుంది. :)

మురళి చెప్పారు...

తేగని బెల్లం పొడి, నెయ్యి కాంబినేషన్ తో ఒకసారి ప్రయత్నించి చూడండి..

మురళి చెప్పారు...

తేగని బెల్లం పొడి, నెయ్యి కాంబినేషన్ తో ఒకసారి ప్రయత్నించి చూడండి..

మాలా కుమార్ చెప్పారు...

ఈ సారి మీరు పండించినవి మాకూ పంపండి . తిని ఎలా వుంటాయో చెపుతాను . అవును మరి , నేను ఇంత వరకు తేగలు తిన్లేదు :)

Hima bindu చెప్పారు...

@జయంత్
ధన్యవాదాలు అండీ .
@తృష్ణా
చందమామ లేతగా ఉన్న పార్ట్ నేను తింటానండీ..ఎక్కువ తింటే వాతం అంటారు ,అదేంటో నాకు ఎప్పుడు తెలియలేదు:-)
@ఉమా
ధన్యవాదాలు .చివరి వాక్యం ఏమిటి చెప్మా :-)
@మురళి
మీ గోదారివాళ్ళు భలే భలే వెరైటీలు చెప్తారండీ .ఓకే ట్రై చేస్తాను ముందు ఇంట్లో వాళ్లకి తినిపిస్తాను బాగుంది అంటే నేనే కనిపెట్టాను అంటాను లేదంటే మాత్రం మీ పేరే చెప్తాను చూసుకోండి :-):)
@మాలాకుమార్
మీ అడ్రెస్స్ చెప్పండి మేడం పంపిస్తాను ..కానీ కొన్నవి మాత్రమె :-)
ఒకప్పుడు మా అత్తగారి పెరట్లో తేగల పాతర వేసేవాళ్ళు .ఆ ఇంటి పెద్దలిద్దరూ వెళ్ళిపోయారు పిల్లలు తలో దిక్కు చెదిరిపోయారు .జ్ఞాపకాలు వదిలివెళ్ళివెళ్ళారు:-(

అజ్ఞాత చెప్పారు...

ఏమిటో తేగలు కూడా అంతరించే జాతుల్లో చేరిపోయాయా?
మా చిన్నప్పుడు తేగలే కాదు బుర్రగుంజులు కూడా తినేవాళ్ళం.
అవేమిటి? అని నన్ను అడక్కండి. నాకంటే మురళి గారు బాగా చెపుతారు.

Hima bindu చెప్పారు...

@bonagiri
గమనిస్తే ,ఇప్పుడు ఎవరు తింటున్నారండీ ?ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో పిజ్జా ,బర్గర్ చాట్స్ ఇతర బేకరీ తప్పించి దేశవాళి ఫూడ్స్ జోలికి వెళ్ళడం లేదు ...ఏదో మాలాంటి ట్రాన్సిషన్ స్టేజి వాళ్ళం వదలలేము .అన్నట్లు బుర్రగుంజు నాకు తెలుసు తాటి టెంకలో వుంటుంది ..కొబ్బరిల బాగుంటుంది ..సో మురళి ని అడగనక్కర్ల .

Viswa చెప్పారు...

Nenu Godavari Jillavadini.. anduke kasta chorava chesukuni. tegalu gurunchi naa abhiprayam cheputunna.
Maku.. Sarigga nagulachaviti natiki ivi. virivaga dorukutai..
Chala bavuntai.. kani edo cinemalo annatlu.. "Nenu tegalu tinevadila kanipistunnana" ani.. ee taravam varu vati jolike povadam ledu..
Viswa

Hima bindu చెప్పారు...

@Viswa
baavuntaayi ani ane vallalo nenu okadaanni.manalantivarame parichayam cheyali .tegala meeda chala jokes vunnayandi ...tegalu thinevallani tyagamayi ani koooda antaru :-) thanq.

swathi చెప్పారు...

naaku kudaa chala chala ishtam..asalu net lo deni gurinchi telustada ledha ani chala sepu search chesanu..but ila naa laga chala mandiki idhi ishtam ani telskoni chhala happy feel avtunnanu..e site chesina valaki thanks.....

swathi చెప్పారు...

naaku tegalu ante chaala ishtam..asalu dani gurinchi internet lo dorukutundo ledo ani search chesanu.. na laga vatini ishta pade vallu inthamandi unnaru ani telskoni chala happy feel ayyanu..e blog ni create chesina valaki chala thanks....

Hima bindu చెప్పారు...

@swathi
thankyou