9, జనవరి 2011, ఆదివారం

హాయ్ లాండ్ లో హాయ్ హాయ్

నిన్న సాయంత్రం మా ఊర్లో వున్నా కృష్ణానది దాటి గుంటూరు జిల్లాలో వున్నా హాయ్ ల్యాండ్ కి వెళ్ళాము .చాలా బాగుంది .పిల్లలు బాగా ఎంజాయ్ చేయవచ్చు .వాటర్ వరల్డ్ మంచి అట్రాక్షన్ .అక్కడ ఆర్కిటెక్చర్ పురాతన బౌద్ద కట్టడాలకి నమూనా గ కనిపిస్తున్నాయి .గుంటూరు కృష్ణా జిల్లా వాసులకు మంచి రిలాక్షేషన్ పాయింట్.అక్కడ వున్నా వింతలు విశేషాలు చూద్దాం అని మేము వెళ్తే అక్కడకి వచ్చిన ప్రతి ఒక్కరు మా గుంపు వంక ఒక విచిత్రమైన లుక్ వేసి వెళ్ళేవారు అధికం .మొదట మాకు అర్ధం కాలేదు .తరువాత మా తమ్ముడు కొడుకు కోవిద్ 'పప్పా ఏమి మనల్ని ఇలా చూస్తున్నారు ఆగి నిన్ను చూపిస్తున్నారు 'అని అనడం తో అప్పుడు మాకు లైట్స్ వెలిగాయి:-)తమ్ముడి హెయిర్ స్టైల్ చూసి అని అర్ధం అయ్యింది .మా మీద మేము జోక్స్ వేసుకుంటూ హాయ్ లాండ్ లో హాయ్ హాయ్ గ ఎంజాయ్ చేసి వచ్చాము .




9 కామెంట్‌లు:

పరిమళం చెప్పారు...

:) :)

జయ చెప్పారు...

బాగున్నాయండి మీ విహారాలు. మేము విజయవాడ వెళ్ళినప్పుడు ఇది చూడలేదు. దీని గురించి మాకు తెలీదనుకుంటా:) మిమ్మల్ని చూపించినందుకు కూడా థాంక్స్.

Hima bindu చెప్పారు...

@పరిమళం
బహుకాల దర్శనం :) ధన్యవాదాలు .
@జయ
ఈ మధ్యకాలం లోనే (అయిదారునెలలు)అగ్రీ గోల్డ్ వారు హైవే ప్రక్కన చినకాకాని (గుంటూరు జిల్లా )లోహాయ్ లాండ్ పెట్టారండి.పిల్లలకి కాలక్షేపం కి బాగానే వుంటుంది.నన్ను బ్లాగులో చూస్తూనే వున్నారు కదండీ :-)

అజ్ఞాత చెప్పారు...

చిన్ని గారు మేమూ మా పిల్లని తీసుకుని హాయ్ లేండ్ వెళ్ళాలని ప్లేన్ చేస్తున్నాం . అయితే వింటర్ లో కంటే సమ్మర్ లొ బావుంటుందేమో అని ఆగాం . లోపలికి మన ఫుడ్ తీసుకెళ్ళనిస్తారా?అందులో రెస్టారెంట్స్ వుంటే అక్కడి ఫుడ్ ఎలావుంది? నైట్ ఎంతవరకు చూడనిస్తారు. కొంచెం చెప్తారా ?
మరో విషయం విజయవాడనుంచి కార్లో అక్కడికి చేరుకోటానికి ఎంత టై పడుతుంది . మాకు విజయవాడ మూడుగంటల ప్రయాణం

Hima bindu చెప్పారు...

@లలిత

రాత్రి సెవెన్ వరకు చూడవచ్చు .ఫుడ్ పర్వాలేదు .మిగిలినవివరాలు మీ బ్లాగ్ లో రాసాను .

ఆత్రేయ చెప్పారు...

ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా రెండు వారాల క్రితం తమ్ముడుని సాయి బాబా గుళ్ళో చూసా
తమ్ముడే అని ఏంటి గ్యారంటీ అంటారా మీరు చెప్పిన జుట్టు బ్లాక్ జీన్స్
మన తమ్ముడే గ్యారన్ట్రీ గా

Hima bindu చెప్పారు...

@ఆత్రేయ
హాయ్ మీది విజయవాడే నా !బాబా గుడికి రెండో మూడో సార్లు వెళ్ళాడు నమ్ముతాను వాడు మన తమ్ముడే :-)

రవిశేఖర్ హృ(మ)ది లో చెప్పారు...

అద్భుతం గా ఉండండి హైలాండ్.మేము చూసాము.పిల్లలకి సమయమే తెలీలేదు.

రవిశేఖర్ హృ(మ)ది లో చెప్పారు...

అద్భుతం గా ఉండండి హైలాండ్.మేము చూసాము.పిల్లలకి సమయమే తెలీలేదు.