1, జులై 2011, శుక్రవారం

అతను యేమయ్యాడో

అతను యేమయ్యాడోఒకటే ఆలోచన .ఇప్పుడా అప్పుడా దాదాపు మేము ఈ ఇంట్లో కి వచ్చినప్పటి నుండి పరిచయమంటే సుమారు ఎనిమిది ఏళ్ళు అనుకోవచ్చు .ప్రతి సోమవారం గురువారం వచ్చేవాళ్ళు .పోయిన ఏడాది ఇలానే టెన్షన్ పడ్డాను నెలరోజులు కనబడపోయేసరికి..అప్పట్లో ఎండలకి అనారోగ్యం వలన ఇల్లు కదలలేక పోయారట .ఇప్పుడు అలానే అనుకుని మనస్సుకి సరిపెట్టుకున్న ఏదో కీడు శంకిస్తుంది .నాకు చాలా ఇష్టం అయిన వ్యక్తి .ఈ వయస్సులో కూడా తన పాత సైకిల్ వేసుకుని ఓపిక కూడగట్టుకుని సైకిల్ హండిల్ కి ఇరువైపులా బరువైన పుస్తకాల సంచులు తగిలించుకుని నెమ్మదిగా బరువు మోసుకుంటూ..అమ్మా .పాపా అంటూ అతి కష్టం మీద నూతిలోంచి మాట్లాడినట్టు పిలుస్తాడు .నేను పలకపోతే అక్కడే వున్నా ఉయ్యాలలో నాకు కావలసిన పత్రికలూ పెట్టేసి వెళ్ళిపోతాడు . నెలవారి డబ్బులు ఇస్తే తప్ప ఏ రోజు నోరు తెరిచి అడగలేదు .రాకపోయినా తను ఎక్కడున్నా ఆరోగ్యంగా వుండాలని రోజు దేవునికి మొరపెడ్తున్నాను.ఈనాడు లో పత్రిక ప్రమోటర్ గా చేరి ఇప్పుడు ఒంట్లో ఓపిక సన్నగిల్లి గడవక అప్పటి వాసనలతో అక్కడక్కడ ఆదరిస్తున్న సాహిత్యభిమానుల ఆదరణ తో కదిలే గ్రంధాలయం లా బ్రతుకు బండి లాగిస్తున్నాడు ....ఈ రోజుల్లో ఇలాటి వ్యక్తులు చాలా అరుదుగా తారసపడ్తుంటారురోజు ఉదయం వస్తాడేమో అని ఎదురు చూపులు నాతో పాటు పాప మావారు ఏమయి ఉంటాడని రోజుకోసారయిన తలుస్తారు .తన అడ్రెస్స్ కాని నంబర్ కాని తెలీదు ఎన్నిసార్లడిగిన మీకు తెలీదమ్మా రాలేరమ్మ అనేవాళ్ళు నంబర్ తనకి లేదని ప్రక్కవాల్లది ఎప్పుడు వాడుకోలేదని చెప్పేవాడు ....నాకైతే వీధి వీధి వెదకాలని వుంది :-(

5 కామెంట్‌లు:

మాలా కుమార్ చెప్పారు...

ఈ సారీ ఎండల వలనే రాలేకపోయారేమో . ఈ సారి వచ్చినప్పుడు అడ్రెస్ తీసుకోండి .

మురళి చెప్పారు...

ఇలాంటి వాళ్ళు నాకూ అప్పుడప్పుడూ పరిచయం అవుతూ ఉంటారండీ.. పేరు తెలీదు.. చిరునామా ఉండదు.. ఉన్నట్టుండి కనిపించడం మానేస్తే కలిగే బాధ వర్ణనాతీతం.. అతను త్వరలోనే మీకు కనిపించాలని కోరుకుంటూ..

జయ చెప్పారు...

"నాకైతే వీధి వీధీ వెతకాలనుంది"....ఎంత బాధో అర్ధమై పోతుంది. తప్పకుండా కనిపిస్తాడు. ఈ సారు తప్పకుండా అడ్రెస్ తీసుకోండి. బుజ్జులు ఎలా ఉంది. చూసి చాలా రోజులైంది.

తృష్ణ చెప్పారు...

నేను మీ టాపాలు లేవు..ఎలా ఉన్నారో అనుకుంటుంటే...
nice to see you...keep blogging !

Hima bindu చెప్పారు...

@మాలాకుమార్

నేను అలా అనుకునే మనస్సుని బుజ్జగిస్తున్నాను .

@మురళి

ఇలా ఆలోచించొద్దు అనుకున్న బుద్ధి మారడంలేదు .థాంక్యూ .

@జయ

అయన నంబర్ లేదండీ .ఇల్లు కూడా ఎక్కడో పాతబస్తిలో (విజయవాడ )అన్నట్లు గుర్తు.బుజ్జులు చాలా అల్లరిది అయ్యింది .దానికి ఒక తమ్ముడు (నల్లోడు)వచ్చాడు .ఇద్దర్ని కలిపి బ్లాగ్ లో పెడతాను .ఇల్లు పీకి పందిరి వేస్తున్నారు.

@తృష్ణ

హమ్మో !బ్లాగ్ లోకం లో నన్ను తలుచుకునే వాళ్ళు కూడా వున్నారా!థాంక్యూ థాంక్యూ .పని అలసట ,తీరికలేనితనం వెరసి మనసు తనువు vishraanthi korukovadamtho kanabatam ledu .