18, ఆగస్టు 2011, గురువారం

అవినీతిరహిత సమాజం కావాలా!

అన్నాహజారే అంటే తెలియని వారుండరేమో అని అనిపించేంత విధంగా ప్రజలలోకి వచ్చారు .అవినీతిని వ్యతిరేకించే వారంతా వారికి మద్దతు పలుకుతున్నారు మంచి పరిణామం .
నీతి మార్గమం అవినీతి రహిత సమాజం కావాలనుకోవడం తప్పులేదు కాని అసలు విలువలు పాటించకపోవడం ఎక్కడినుండి మొదలవుతుందోనని మనలోకి మనం తొంగి చూసుకుంటే దానికి సమాధానం తప్పకుండా మనవద్ద దొరుకుతుంది .మనల్ని మనం బాగు చేసుకుని తరువాత మన పరిసరాల ఉద్దరణకు పాటుపడితే బాగుంటుంది .
ఇప్పటి యువతను చుస్తే ముచ్చటగా అనిపిస్తుంది.అవినీతిని అరికట్టాలి అనే నినాదం లో వారే ముందుంటారు .అటువంటి రాజకీయ పార్టీలకు తమ మద్దతు వుందని తేల్చి చెబుతారు.అవినీతి రహిత సమాజం కావాలని కోరుకుంటారు ....కాని ఆచరణలో ఇదంతా జరుగుతుందా? ఇటీవల ఎన్నికల్లో ఇటువంటి నినాదం తో వచ్చిన పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకుంది ?మాటల్లో ప్రతి ఒక్కరు ముఖ్యంగా యువత సమర్ధించిన వారే కాని ఫలితాలు అందుకు భిన్నం గా వచ్చాయి .
ఇంత అన్యాయాల్ని అక్రమాల్ని వ్యతిరేకించే యువత సమయం వచ్చినప్పుడు తమకి ఇష్టం అయిన నటుడు సినిమా వచ్చినపుడు బ్లాక్ లో టికెట్స్ కొని సినిమా చూడటానికి ఏమాత్రం వెరవరు పరోక్షంగా అక్రమర్గాన్ని ప్రోత్సహిస్తున్నట్లు వారికి తోచదా? అత్యవసరంగా కులధృవీకరణ పత్రమో ,జనన పత్రమో మొదలైన అవసరం అయినపుడు నిర్ణీత సమయం వరకు వేచివుండలేక అక్రమార్గాల్లో వాటిని తెప్పించుకోవడం పని పూర్తిచేసుకునేప్పుడు వారికి అవినీతిని పరోక్షంగా ప్రోస్త్సహిస్తున్నట్లు అనిపించదా?ఇలా ఉదాహరణలు చెప్పుకుంటే ఎన్నో ఎన్నెన్నో పాత తరం విలువలు ఇప్పుడుబలహీన పడుతున్నాయి .
అవినీతికి వ్యతిరేక పోరాటం చేయాలి కాని అది మన ఇంటి నుంచే మొదలు కావాలి .పిల్లలికి బాల్యం నుంచే విలువలు తల్లిదండ్రులు నేర్పించాలి తరువాత వాళ్ళు చదువుకునే స్కూలు భాద్యత వహించాలి .....అప్పుడే అందరు కోరుకునే అవినీతిరహిత సమాజం చూడగలం
(ఇది ఎవర్ని ఉద్దేశించి రాసింది కాదు..ఇంట్లో పిల్లలి తో వచ్చిన డిస్కషన్ ) కావాలా!

14 కామెంట్‌లు:

Mauli చెప్పారు...

ఈ పద్దతి లో కూడా చిన్న చిన్న సమస్యలున్నాయి అ౦డి, తప్పని సరి అవసరం లో ఇవ్వాల్సి వస్తున్నది. తీసుకొనేవారు మాత్ర౦ ఎక్కువగా విలాసాలకోసం ఆస పడటం వల్ల తీసికొ౦టారు. ఈ గాప్ ని తగ్గి౦చ గలగాలి. ప్రజలు సామాన్యం గా బ్రతకడాన్ని ఇష్టపడినప్పుడు అవినీతి చాలావరకు తగ్గుతు౦ది కాని కాస్ట్ ని బట్టి క్వాలిటీ దొరకుతున్న చోట నీతి నేతిబీరకాయ అవ్వాల్సి౦దే. టెక్నాలజీ కూడా అవినీతి మరి౦త గా పెరగడానికి ఒక కారణం. :)

ఎ౦త స౦పాది౦చారన్న దాని ము౦దు ఎలా స౦పాది౦చారన్నది పెద్దగా కనిపి౦చదు అని ఒక వాదన :). చూడండి అవినీతి పరుడని తెలిసినా బాగా స౦పాది౦చాక,ఒకప్పుడు అసహ్యి౦చుకొన్న విష్యం కన్వీనియె౦ట్ గా మరిచిపోయి వారి ని గౌరవి౦చేస్తాము .

పైస్థాయి లో అవినీతి తగ్గుతూ ఉ౦టే, అక్కడ మిగిలే సొమ్ము వేల కోట్ల లో ఉ౦టు౦ది కాబట్టి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు ఏర్పడి, కి౦ది స్థాయిలో అవినీతి కూడా గణనీయం గా తగ్గుతు౦ది

Praveen Mandangi చెప్పారు...

కులాంతర వివాహం వల్ల పుట్టినా రిజర్వేషన్ కోసం తల్లి కులం పేరో, తండ్రి కులం పేరో చెప్పుకోవడం, ఎవరిది ఎంత తక్కువ కులమైతే ఆ కులం పేరు చెప్పుకోవడం, వీటిని తల్లితండ్రులే ప్రోత్సహించడం కనిపిస్తోంది. పిల్లలు వంద రూపాయలు చిల్లర దొంగతనం చేస్తేనే పరువు తీశావు అని కొడతారు. పరువు పోదు అనిపిస్తే ఎలాంటి నీచమైన పనైనా చెయ్యొచ్చా? పరువు మర్యాదల ముసుగులో అవినీతిని మనం చిన్నతనం నుంచే పిల్లలకి నేర్పిస్తున్నాం.

Hima bindu చెప్పారు...

@మౌలీ
ఇచ్చేవాడు లేకుంటే తీసుకునేవాడు వుండడు.తీసుకోవటం ఎంత తప్పు అనుకుంటామో ఇవ్వడం కూడా అంతే తప్పుగా పరిగణించాలి .అవసరం కోసం ఇచ్చేవారికి మరి అవినీతి గూర్చి మాట్లాడే హక్కు ఉంటుందంటార? నా దృష్టిలో లేదనే అనుకుంటాను .

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

"ఇచ్చేవాడు లేకుంటే తీసుకునేవాడు వుండడు.తీసుకోవటం ఎంత తప్పు అనుకుంటామో ఇవ్వడం కూడా అంతే తప్పుగా పరిగణించాలి"

____________________________________

మిగిలిన టపా అంతకంటే మీరు పైన మౌళిగారికిచ్చిన ఈ లైను మీద నా అభిప్రాయం చెప్తాను చిత్తగించండి :-)

చిన్నీ మనం ఈ స్టేజీ దాటిపోయి, నువ్వీపనికి ఇంత ఇస్తే కానీ చెయ్యం అనే స్టేజి లో వున్నాము. ఇది చాలా దురదృష్టకరం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక వ్యక్తికి ఓ ఆపీస్ లో ఓ ఎంప్లాయి సంతకం అవసరమైంది.అప్పుడు ఆ ఎంప్లాయీ ఏమంటాడు? చాలా సహజంగా రేపు రమ్మంటాడు. అంతే సహజంగా మనమేమంటాము, సార్ చాలా దూరం నుంచి వచ్చాను కొద్దిగా చూడండి సార్ అంటాము. సరే ఒక వెయ్యి యివ్వు పెడతానంటాడు.

మనమేమంటాము? చాలా ఎక్కువ సార్ అంటాము.
అప్పుడాయనేమంటాడు " సరే అండీ అలా ఐతే నాకు తీరుబడి అయ్యేదాకా మీరొక లాడ్జితీసుకోని వుండండి. రెండువేలవుతుంది అంటాడు"
ఇదీ పరిస్థితి. ఒక చిన్న సంతకానికి.


అదే ఒక కాంట్రాక్ట్ తీసుకొన్నామనుకోండి. ఆ ప్రాంత ఎమ్మెల్యే కు చచ్చినట్టు 6%-8% ఇవ్వాల్సిందే? అంటే ఒక కోటి రూపాయల కాంట్రాక్టుకు దరిదాపు ఏడు నుంచి ఎనిమిది లక్షల రూపాయలిచ్చుకోవాలి. ఎందుకివ్వాలి? ఇవ్వకపోతే వర్క దగ్గరకి పనోళ్ళు రారు. వర్క్ దగ్గర దించిన మెటీరియల్స్ రాత్రికి రాత్రే మాయమవుతాయి. లేకపోతే పనంతా అయ్యాక అక్కడేదో బొక్క పెట్టేస్తారు. ఇలాంటి విపరీత పోకడలు లేని కాంట్రాక్ట్ వొక్కటీ కనిపించదు. అన్నీ తట్టుకొని పనయింది అనిపిస్తే బిల్ పాస్ చేసే దగ్గర చిన్న క్లర్క్ దగ్గరనుంచి పైన సెక్రటరీ దాకా ఉండే పర్సెంటేజెస్ మీకు తెలియనవికావనుకుంటాను. ఇవ్వకపోతే ఓ నాలుగు నెలలు బిల్ ఆపేస్తారు. దాంతో ఆకాంట్రాక్ట్ మీద వీడికొచ్చిన లాభం హుష కాకి. రాస్తూ పోతే ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. ఇప్పటికే చాలా పెద్ద కామెంట్ వ్రాసా :-)

నా అభిప్రాయమైతే, ఈ దశ దేశంపై చాలా దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. ఇలాంటి అవినీతిని నిర్మూలించాల్సింది అధికారులు, రాజకీయనాయకులు మాత్రమే. ముందు వాళ్ళు సరిగ్గా పనిచేస్తే పనికోసం వచ్చినవారు పడిగాపులు పడే ఇబ్బందులు తగ్గుతాయి.

Yogeshwar Khandesh చెప్పారు...

"వ్యక్తీ నిర్మాణం జరిగితేనే - జాతి నిర్మాణం జరుగుతుంది"
ఇది అక్షర సత్యం
వ్యక్తీ అవినీతి రహితంగా మారినపుడు - జాతి (దేశం) అవినీతిరహితంగా మారుతుంది

కాని మనం అవినీతి పై అనర్ఘలంగా గంటల తరబడి ఉపన్యాసాలు ఇవ్వగలం కాని ఆచరణలో మాత్రం కనిపించదు - ఇది నిజం మనం ఒప్పుకొని తీరాల్సిన నిజం

Mauli చెప్పారు...

చిన్ని గారు,

@అవసరం కోసం ఇచ్చేవారికి మరి అవినీతి గూర్చి మాట్లాడే హక్కు ఉంటుందంటార?

ఖచ్చిత౦గా 'వారికే' హక్కు ఉ౦ది. బలవుతున్నది ఇచ్చేవాళ్ళు కాబట్టి :)

'ఇవ్వని వాళ్ళు' స్కూల్ అడ్మిషన్ కి మెడికల్ సర్టిఫికేట్, పోలిసోడి ను౦డి పాస్పోర్ట్ ఎలా సాధిస్తారు ?

Hima bindu చెప్పారు...

@ప్రవీణ్ శర్మ
నేను చెప్పేది అదే .పిల్లల వ్యక్తిత్వం రూపు దిద్దడం లో తల్లిదండ్రుల పాత్రే అధికం అంటాను .ఇటీవల కాలం లో జరిగే ఆడపిల్లల వేధింపులు ,ఆసిడ్ దాడులు ఇవన్ని జరగటానికి కారణం ఇంట్లో పిల్లల పెంపకం లో తల్లిదండ్రులు వహిస్తున్న నిర్లక్ష్యం అని చెప్పవచ్చు .
@భా.రా .రె
ఇలాటి అవినీతిని నిర్మూలించాల్సినది అధికారులు ,రాజకీయ నాయకులే ""హ్మం ..ఎంత మాట ! ఆ స్టేజి దాటిపోయమని మన తరువాతి తరానికి అలవాటు చేయాలంటారా!



చీకటిని తిట్టుకుంటూ ఎవరో వచ్చి దీపం వెలిగిస్తారు అని ఎదురు చూసేకంటే మీరే ఒక దీపం వెలిగించొచ్చు కదా !మనం పాటించనపుడు మనం సమాజాన్ని తిట్టుకోకూడదు మనము అందులోని భాగస్వాములమే.



ఒకరి అవసరం వేరొకరికి అవకాశంగా మారుతుంది .మన చేతుల్లో వున్నది ఒక్కటే రాబోయే తరాలనయిన విలువలున్నసమాజం నిర్ముంచుకోవడానికి గట్టి పునాదులు వేయడం .హమ్మయ్య పెద్ద క్లాస్స్ తీసుకున్న కదా :-):)

Hima bindu చెప్పారు...

@Yog
"కాని మనం అవినీతి పై అనర్ఘలంగా గంటల తరబడి ఉపన్యాసాలు ఇవ్వగలం కాని ఆచరణలో మాత్రం కనిపించదు - ఇది నిజం మనం ఒప్పుకొని తీరాల్సిన నిజం"
మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
@సాయి
మీ లింక్ చూసానండీ .ఇంచుమించు ఒకేరకంగా వ్యక్తపరిచాం

Hima bindu చెప్పారు...

@Mauli
పైన నా సమాధానం ఇచ్చానండీ .

Mauli చెప్పారు...

చిన్ని గారు,

అవినీతిని నివారి౦చాల్సినది అధికారులు, రాజకియనాయకులని నేను కూడా అనుకోవడం లేద౦డీ . అలా అయితే అన్నాహజారే లా౦టి మామూలు జన౦ అవసరం వచ్చేది కాదు.
ప్రజలే పటిష్టమైన చట్టాలు వచ్చేలా పోరాడి నాయకులు , అధికారులలో అవినీతి తగ్గేలా చెయ్యాలి. అప్పటివరకు వారు ఇ౦కో రకం టాక్సు అనుకొని ముఖ్యా వసరాలకు ల౦చ౦ ఇవ్వాల్సి౦దే.

అది కాక అధికారులు, నాయకులు ప్రజల సొమ్ము వారికి 'తెలీకు౦డా' దోచేస్తున్నారు. కనీస౦ చెప్పి దోచుకోమన౦డి. :) చట్టాలు అవి అస్సలు అవసర౦ ఉ౦డదు. ఇష్టం ఉ౦టే మనమే సరే అ౦టాము ;-)

Hima bindu చెప్పారు...

@Mouli
చెప్పి దోచుకోమనలా ! సమాజం అంతా అవినీతిమయం ప్రతి పనికి మూల్యం చెల్లించనిదె పనికాదు అనేది ఏమాత్రం "నిజం "కాదు .నాణానికి బొమ్మ బొరుసు వున్నాయి

Mauli చెప్పారు...

అ౦తా అవినీతి మయమైతే కాదు లె౦డి.

ఏదో కాస్త అవకాశమున్న డాక్టర్లు, పోలీసులు, మిగిలిన వాళ్ళు మనని అడిగే తీసుకొ౦టారు. అలా గే ప్రాజెక్ట్ కట్టడానికి ఇ౦త, ఈ పధకానికి౦త అనికూడా వాళ్లె అడిగి తీసుకొ౦టే, ఈ చట్టాలు, దీక్షలు,చర్చలు ఉ౦డవు. ఇచ్చే వాళ్ళని అవినీతి పరులనేవాళ్ళు కూడా ఉ౦డరు. అదన్నమాట :)

Mauli చెప్పారు...

ఈ టపా కూడా వీలైతే చూడగలరు,
http://teepi-guruthulu.blogspot.com/2011/04/blog-post.html

Hima bindu చెప్పారు...

@మౌళి
చుస్తానండి.ఇకపోతే మీ వ్యాఖ్యకు కొన్ని నవ్వులు :):)