3, ఆగస్టు 2011, బుధవారం

చీకటి అంటే భయం పోయింది

"అమ్మ మమతా!నా గది లో టేబిల్ మీద పెన్ను వుంది తీసుకురామ్మా" ఇంగ్లీషు మాస్టారు


"అక్కడ చీకటి గా వుంది నాకు భయం నేను వెళ్ళను "మమత


"చీకటా..భయమా! అయితే ఏమైంది ?"ఇంగ్లీష్ మాష్టారు


"ఉహు ...నాకు భయం నేను వెళ్ళను "మమత .


"పిచ్చితల్లీ !డర్క్నెస్స్ ఇస్ నథింగ్బట్ అబ్సేన్సు అఫ్ లైట్ ..సన్ లైట్ లేకపోబట్టేగా ఈ చీకటి సన్ వచ్చిన వెంటనే వెలుతురు అంతా మన ఊహలోనే భయం వుంటుంది వూ ...మరి వెళ్లి తీసుకురా పో "... ఆ తండ్రీ కూతుళ్ళ


సంభాషణ అంతా గుడ్లప్పగించి వింటున్న నాకు చీకటి పట్ల భయం పోయింది నిజంగా ఆ వయస్సులో జ్ఞానోదయం అయింది.


ఇదంతా ఒక పాతికేళ్ళ క్రితం జరిగిన కథ .మేము విజయవాడ వచ్చిన క్రొత్తలో సిద్దార్థ కాలేజి ప్రక్క వీధిలో వుండేవాళ్ళం అక్క ఇంగ్లీష్ లిట్ కి మా ఎదురింట్లో వున్నా సిద్దార్థ కాలేజి ఇంగ్లీష్ లెక్చరర్ వద్ద సాయంత్రం ట్యూషన్ తీసుకునేది తనతోపాటు పి. జి చేసే నలుగురైదుగురు వుండేవారు . అమ్మ పిలవమని చెప్పిన లేక తోచకపోయిన వాళ్ళతో పాటు కుర్చుని వాళ్ళ మమత తో కబుర్లు చెప్పేదాన్ని .ప్రతీ రోజు క్లాస్స్ అయ్యాక ఆయన రాసిన కవితలు చదవడానికి ఇచ్చేవారు అప్పట్లో టెన్స్ టైమ్స్ కూడా ప్రచురణ అయినట్లుంది .అక్క కూడా కథలు కవితలు రాసే అలవాటు వుండటం తో మాస్టారు రాసినవి ఇస్తుండేవారు .అప్పట్లో అయన మా ఎదురింటి అంకుల్ లేక ఇంగ్లీష్ లెక్చరర్ గానే తెలుసు .


ట్యూషన్ లేనప్పుడు కాలేజి లేనప్పుడు కాని చేతిలో సిగరెట్టూ తో దీర్గాలోచనలో వాళ్ళ వరండా లోని కుర్చీలో కనబడేవారు దాదాపు ఎనిమిది సంవత్సరాలు ఎదురెదురు ఇళ్ళలో ఉన్నాము .తరువాత నాన్న వాళ్ళు స్వంత ఇల్లు కట్టుకుని వచ్చేయడం వాళ్ళు ఇల్లు ఖాళి చేసి జర్నలిస్ట్ కాలనీ కి వెళ్ళిపోవడం ..అప్పుడప్పుడు ఏ బుక్ ఎక్జిబిషన్ లోనో షాపింగ్ లోనో కనబడటం దాదాపు టచ్లో లేరనే చెప్పొచ్చు .


ఎప్పుడు చీకటి గదిలోకి వెళ్లి లైట్ వేయబోతున్న లేక భయమనిపించే చీకటిని చుసిన నాకు "వేగుంట మోహనప్రసాద్ గారు" గుర్తొస్తారు .నిశబ్దంగా చీకటిలో కలిసిపోయిన ఆ మహానుభావుని ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ

4 కామెంట్‌లు:

మురళి చెప్పారు...

'మో' తో చిన్నపాటి పరిచయం ఉన్నా, ఆయన రచనలు పెద్దగా చదవలేదన్న కొరత అలాగే ఉండిపోయిందండీ నాకు.. చదవాలి నెమ్మదిగా..

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

baagundhi.jeevithaanthapu veluthuru rekha..

జయ చెప్పారు...

మంచి అనుభవమండి. తప్పకుండా ఇది నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్.

Hima bindu చెప్పారు...

@మురళి
@వనజవనమాలి
@జయ
స్పందించిన మీ అందరికి ధన్యవాదాలు