31, ఆగస్టు 2011, బుధవారం

ప్రమోషన్ వచ్చినట్లే

హమ్మయ్య !ఇన్నాళ్ళకి నేను ఎదురుచూసిన ప్రమోషన్ వస్తుంది .ఏప్రిల్ నుండి మొదలు పెడితే ఇప్పటికి అయ్యింది .నేను మరీ తొందర పడుతున్నట్లు మా చిన్నారి అభిప్రాయం కాని ఎప్పుడు జరగవలసినవి అప్పుడు జరిగితేనే అందం అర్ధం కూడా అని మా ఆలోచన వెరసి అమ్మనాన్న ల అభిప్రాయం అదే.
కెరీర్ ని తీర్చి దిద్దుకోవడం మన చేతిలోనే వుంది ఒకదానితో ఒకటి ముడి పెట్టుకుంటే మనం వెళ్ళవలసిన రైలు దాటిపోవచ్చేమో అని నచ్చచెప్పడానికి చాలా కష్టపడవలసి వచ్చింది .దాదాపు అత్తగారి హోదా వచ్చేసినట్లే ..నాలుగు నెలలు ఆగితే పూర్తిగా అత్తగార్నే :)

13 వ్యాఖ్యలు:

ఉమాశంకర్ చెప్పారు...

WOW.. Congrats andee.

What you said is absolutely true.

చిన్ని చెప్పారు...

@ఉమ శంకర్
థాంక్యూ :)

కొత్త పాళీ చెప్పారు...

huh??

చిన్ని చెప్పారు...

@కొత్త పాళీ
మనకేనండీ:)

sunita చెప్పారు...

Congrats!!

చిన్ని చెప్పారు...

@సునీత
థాంక్సండీ

SRRao చెప్పారు...

అభినందనలు చిన్ని గారూ !
మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు
శిరాకదంబం వెబ్ పత్రిక

సిరిసిరిమువ్వ చెప్పారు...

అభినందనలు. మీ చిన్నారికి ఆశీస్సులు.

టైటిలు చూసి మీ ఉద్యోగంలో ప్రమోషన్ అనుకున్నా:)

చిన్ని చెప్పారు...

@శిరాకదంబం రావుగారు
ధన్యవాదాలండీ .మీకును వినాయకచవితి శుభాకాంక్షలు .
@సిరిసిరి మువ్వ
ధన్యవాదాలండీ .ఇవేనేమో అసలైన ప్రమోషన్స్ :)

భాస్కర రామి రెడ్డి చెప్పారు...

ఓ.. congratulations Chinni. నా అడ్రస్ మీదగ్గర వుంది కదా? స్వీట్స్ పంపటం మర్చిపోకండి. ఒకవేళ లేకున్నా ఏంపరవాలేదు. మళ్ళీ చెప్పమన్నా చెప్తాను :))

చిన్ని చెప్పారు...

@బా.రా.రె
స్వీట్స్ పోస్ట్లో పంపడం ఎందుకు ఏకంగా మా అమ్మాయే స్వయంగా మీ ఇంటికి పట్టుకుని వస్తుంది అన్నట్లు మా అమ్మాయిని అల్లుడిని బోజనానికి పిలవడం మర్చిపోమకండీ :)వుండేది 'జెర్సీ సిటీ 'లోనే :-)

జయ చెప్పారు...

కాబోయే అత్తగారికి అభినందనలు. అమ్మాయికి శుభాకాంక్షలు.

చిన్ని చెప్పారు...

@జయ
థాంక్యూ :)