అభిమాన హీరోలు అనగానే నాకు ఒక విషయం మదిలో తళుక్కుమంటది .ఈ విషయం తప్పకుండ మీతో షేర్ చేసుకోవాల్సిందే .
నేను ఎనిమిదవ తరగతిలో ఉండగా జరిగిన ఉదంతం.మేము ఏలూరు సెయింట్ తెరిసా స్కూల్లో చదువుకున్నాము ,అందులోనే హాస్టల్లో ఉండేవాళ్ళం .హాస్టల్లో ఎక్కువ శాతం గోదావరి జిల్లా వాళ్ళుండే వాళ్ళు ,ఎపుడు సినిమాలే హాట్ టాపిక్ .ఉదయానే పేపర్ చూడమంటే సినిమా బొమ్మలు ,కొత్త సినిమాలు ,వాటి విశేషాలు చూసేవాళ్ళు ,అక్కడికి వెళ్ళాక మనము నేర్చుకున్నమనుకోండి ,....
మాది పద్నాలుగు మంది తో కూడిన గ్రూప్ ,ప్రతి ఒక్కరికి అభిమాన హీరో ,మరియు హీరోయిన్ ఉండే వారు.అంటే వారి మీద సర్వ హక్కులు వారివే ,పేటెంట్ అన్నమాట.,మనకి ఆ హీరో ఇష్టమైన చెప్పే హక్కు ఉండదు,మనసులోనే ఉంచుకోవలన్నమాట ,లేకపోతె వాళ్ళహీరో ముందు మనవాళ్ళు చులకన కావడమే కాకుండా ,గొడవలు పడేవాళ్ళు
మా విజ్జి మరీను మురళి మోహన్ ని మాట పడనిచేది కాదు,చూపు సరేసరి .
ఆ నేపధ్యం లో నేను ఎంచు కున్నాను కృష్ణం రాజు ని .
రాత్రి డిన్నర్ తరువాత మాకు ఒక గంట రేక్రేషన్ ఉండేది ,అపుడు మేము ,సినిమా కబుర్లు విన్నవి ,కన్నవి గోరంతలు కొండంతలు చేసి చెప్పుకునే వాళ్ళం ,మా అభిమాన హీరో లకి సంబంధించి న పాటలు పాడుకునే వాళ్ళం ,అదే విదంగా సండే మద్యాహ్నం నుండి డిన్నర్ వరకు ఫ్రీ ఉండేది ,ఆ సమయాల్లో ఇలాటి కబుర్లతో గడిపే వాళ్ళం .అభిమనహేరో ల కి సంభందించి ఏ వార్తా ఉన్నా కట్ చేసి దాచు కునేవాళ్ళం .
ఒకరోజు సినిమా పత్రికలో కృష్ణం రాజు గురించి రాస్తో అతని అడ్రస్ కూడా ఇచ్చారు. అతను నా అభిమాన హీరో కాబట్టి డైరెక్ట్ గ పేపర్ కటింగ్ ,నా దగ్గరకు చేరింది.నేను అడ్రెస్స్ దొరికింది కదా అని ఒక ఉత్తరం రాసాను ,అన్నయ్య మీ అభిమానిని అంటూ {హ..హ..హ}అతని నుండి లెటర్ వస్తే సిస్టర్స్ ఒపెంచేసి అక్షింతలు వేస్తారని ,చివరికి మా ఇంటి అడ్రెస్స్ ఇచ్చాను .నా స్నేహబృందమంత ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు .ఆ లెటర్ ని డే స్కాలర్ సహాయం తో పోస్ట్ చేసాం.
వేసవి సెలవవలు ఇచ్చారు ,మేము ఇంటికి వెళ్లి పోయాము .మాది చాల పెద్ద ఫ్యామిలీ .ఆడుకోవటానికి ఇంకొకరి అవసరం లేకుండా పిల్లలం మేమే సరిపోయేవాళ్ళం ,నాన్న ఇంట్లో ఉన్నంత సేపు పిన్ పడిన వినపడేది ,,ఆయన బయటకి వెళ్ళగానే గోలంతా మా ఇంట్లోనే ఉండేది .
ఒకరోజు మద్యాహ్నం మా అమ్మ మా అందర్నీ చుట్టూ కూర్చోబెట్టి ఏవో కథలు చెబుతుండగా ,నాన్న ఇంటి ముందున్న ఆఫీసురూం నుండి నన్ను పిలిచారు ,సాదారణంగా గెస్ట్ లు వచ్చినపుడే ,ఏ కఫ్ఫే,టీ చెప్పడానికో,పనివాళ్ళు అందుబాటులో లేనపుడే మమ్మల్ని పిలిచేవారు. అలాంటిదేదో అనుకుని నాన్న రూమ్ లోకి వెళ్ళాను .నాన్న ముఖం చాల సీరియస్ గ ఉంది {అసలెప్పుడు సీరియస్ ఇంకా అన్నమాట }అక్కడ ఎవ్వరు లేరు .
"ఏంటి నాన్న పిలిచారు "వినయంగా అన్నాను .
నాన్న నా వైపు చూడకుండా ,కాబినెట్ సైజు ఫోటో,ఒక లెటర్ చేతి లో పైకి ఎత్తి చూపిస్తో "ఏంటిది?"అన్నారు.
ఒక్క క్షణం నాకు అర్ధం కాలేదు .నాన్న చేతి వంక చూడగానే ,ఫోటో లో హుందాగా కృష్ణం రాజు ,అతని లెటర్ పాడ్ మీద నాకు రాసిన ఉత్తరం ,ఒక్కసారే ఆనందము ,వెంటనే భయం కలిగింది .
"ఇదన్న మాట కాన్వెంటు లో మనం చేస్తున్న ఘనకార్యం ,సిస్టర్స్ నీవేదో తెలివి కలదానివి ,అది ,ఇది అంటే నేను ఘర్వపడుతున్నాను "
మన దగ్గర సమాధానం లేదు .అస్సలికే నాన్నంటే భయం,అక్కడ సిస్టర్స్ కి జడిసి మన స్నేహితుల ప్రోద్బలంతో ఇంటి అడ్రెస్స్ ఇచ్చాను ,ఐన ఇలా ఉత్తరం వస్తుందని కాని,నాన్న ఇలా చూస్తారని కానీ అనుకోలేదు .
"చూడమ్మా ,ఏదైనా చూసి వదిలివేయాలి ,ఆహ్లాదం కోసం మనం సినిమాలు చూస్తాం ,వాళ్లు తమ వృత్తి గ నటిస్తారు .అది వారి ఉద్యోగం,ఇపుడు నేను ఉద్యోగం చేసినట్లుగా ,ఐన అదంతా రంగుల ప్రపంచం ,అదే నిజమనుకుని భ్రమపడకు ,తీరిక దొరికితే మంచి పుస్తకాలు చదువు ,మరొక్క సారి ఇల్లాంటి సంధర్బం తీసుకురాకు ,"అని మెత్తగా మందలించారు.
తలాడించి ఇంట్లోకి వెళ్తోన్న నన్ను ,వెనక్కి పిల్చి ,"ఇదిగో తీసికో "అంటూ ఫోటో ,ఉత్తరం నా చేతి లో పెట్టి వెళ్ళమన్నారు .బిక్కచచ్చిన నేను గది లోకి వచ్చి అమ్మ వాళ్ళకి చూపించాను .తమ్ముడు వాళ్ళు ఫోటో చూసి గంతులు వేస్తోంటే ,పెద్దయ్యాక అక్కలుగా మనం చెప్పాలేమో అనుకున్నాను,.నాన్న దగ్గర ఏమిజరిగిందో మనం చెప్పకుండానే అమ్మకి ,అక్కకి అర్ధం అవ్వింది .
చాల కాలం ఆ ఉత్తరం ,ఫోటో నా "మధురస్మృతుల"కట్ట లో ఉండేది .
సెలవుల తరువాత స్కూల్ కి వెళ్ళిన నా అభిమాన హీరో గురించి మాట్లద్తే వొట్టు.సినిమాలంటే మనల్ని ఆహ్లదపరిచేవి అని అప్పటికి ,ఇప్పటికి నమ్ముతాను.
ఇప్పటికి తల్చుకుంటాను ,నాన్న తన టీనేజ్ కూతురికి ఎంత హుందాగా చెప్పారు,అని.
ఇదండీ మన అభిమాన హీరో గారి కథ .
26, ఫిబ్రవరి 2009, గురువారం
23, ఫిబ్రవరి 2009, సోమవారం
తామరాకులో ఆమ్లెట్
తామరాకులో ఆమ్లెట్ ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా?,తామరాకులో మల్లెపూలు కట్టడం తెలుసు గుడిలో ప్రసాదం తినడం తెలుసు ,కాని ఇదేమిటబ్బాఅని అనుకుంటే తప్పకుండ నా బాల్యంలోకితొంగి చూడవలసిందే అమ్మమ్మ వాళ్ళఊరు వెళ్ళాల్సిందే.
మేము చిన్నతనంలో నాన్న గారి ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో ఉండేవాళ్ళం .ప్రతి వేసవి సెలవులకి కృష్ణాజిల్లాలోని అమ్మమ్మ వాళ్ళ ఊరో ,నానమ్మ ఊరో వెళ్ళేవాళ్ళం .అమ్మమ్మ వాళ్ళ ఊరొచ్చి అప్పటికి వారం రోజులు అయ్యుంటది మాకు ఆడుకోవడానికి తక్కువ స్నేహితులు ఉండేవారు..అంతామా మామయ్యా స్నేహితులే .మామయ్యంటే పెద్దాడు కాదు మా అమ్మ కి చిట్టి తమ్ముడే మా అక్క కన్నా రెండేళ్ళు మాత్రమె పెద్దవాడు .అందుకే మేము వాడిని అరేయి ,ఒరేయి అన్నయ్య అనే వాళ్ళం .మాకేమో వాడితోనూ ,వాడి స్నేహితులతోను ఆడుకోవాలని,వాడేమో మమ్మల్ని తప్పించుకుని వెళ్ళిపోయేవాడు ఎప్పుడు వాడి స్నేహితులతో రహస్య సమాలోచనలో ఉండేవాడు.వాడు చేసే అల్లరి పనులు తాతయ్య వాళ్ళకు చెప్తామని తప్పించుకు తిరిగేవాడు .ఇంట్లో ఉన్నంత సేపుమాతోనే ఆడేవాడు
.మమ్మల్ని ఎండలో తిరగనిచ్చే వాళ్లు కాదు .,మాకేవైన అవ్వితే మా నాన్న తో వేగలెమని,,అది కాక డాక్టర్ సదుపాయం తక్కువని ఇంట్లో వాళ్ళు మేము ఎండలోకి తిరగకుండా మా పైనే కళ్లు వేసి ఉండేవారు .
ఒకరోజు మావయ్య స్నేహితులంతా పిట్టలను కొట్టే కర్రలను పట్టుకొని మా ఇంటికి వచ్చారు .అప్పుడు మా తాతగారు ఇంట్లోనే ఉన్నారు .మా మావయ్య వాళ్ళను చూసి తాత గారు నిద్రపోయాక వస్తానని వాళ్ళతో రహస్యంగా చెప్పి ఇంట్లోకి వచ్చాడు. అది మన కంట్లో పడింది.అక్కకి చెల్లికి కూడా చెప్పాను .ముగ్గురం వాడిని ఎంతో బ్రతిమిలడం మమ్మల్ని కూడా తీసికెళ్ళమని.సరేనని బుద్ధిగా చెప్పి మేము ఆటల్లో పడగానే తప్పించుకుపోయాడు.మేము ఎప్పటికో గమనించి పెద్దలందరూ కబుర్లలోనునిద్రలోను ఉన్నారని గమనించి పాలేరుకుర్రవాడిని అమ్మ వాళ్లకు చెప్పొద్దని మండుటెండలో ఇంటి వెనుక వైపు నుండి పంటపొలాల్లో పడ్డాం. మా వాడిని వెతుక్కొంటూఎందుకంటె ఖ చ్చితంగా వాడు ఏ చెరువులోనో ,ఏదో చింత చెట్టు మొదట్లోనో తేలేవాడు .
మేము ఎక్కువ ప్రయాసపడకుండానే దొంగలంతా దొరికారు.మేము ముగ్గురం పొలాల గట్లపైనున్న జనపపూల కొమ్మల్నిరేమ్మల్ని తొలగించుకొంటు ,ముఖమంతా చెమటలతో గాలికి రేగిన మా తలలపై పడిన జనప పుప్పొడితో ఒగరుస్తూ ఆ పిల్ల గ్యాంగ్ ని చేరాము. మమ్మల్ని చూడగానే మా వాడి ముఖంలో కంగారు ఆశ్చర్యం ఒక్కసారే ముప్పిరికోనగా 'అమ్మావాళ్ళకి చెప్పకండే ఈ సంగతి 'అంటూ మా ముగ్గురితో ఒట్టు వేయించుకున్నాడు .అసలు మేము ఏమి చెప్పకూడదో తెలియకపోయినా అసలు మేము ఇటు వచినట్లు తెలిస్తే మాకు పూజ జరుగుతదని తెలిసిన బింకంగా హామీ ఇచ్చాము
అక్కడ వాళ్లు మమ్మల్ని చూసి మాటలు ఆపేశారు అక్కడ ఏదో జరుగుతోంది .కాని ఎలా కనుక్కోవాలో అర్ధం కాలేదు . మిగిలిన ముగ్గురు కనబడలేదు నలుగురు మాత్రమె ఉన్నారు మిగిలినవారేరి "అని అరా తీశాను అన్నయ్య ఏదో చెప్పేలోపు మా చెల్లి చూసేసింది ."అక్క పక్కన భోదే లో దాక్కున్నారుపసి గాడు "అని చెప్పింది. దాగుడు మూతలు ఆడుతో మమ్మల్నిఆడనివ్వరా "అంటు పంట భోదే వైపు పరిగెత్తి చూదుము కదా భోదే నుండి పొగలు సన్నని మంటలు మా వెనుకనే అందరు మూగారు.తొంగి చూసిన మాకు ఒకటే ఆశ్చర్యం!
మూడు ఇటుక రాళ్ళ తో పొయ్యి పెట్టి దాని పై కుండ పై పెట్టె మూత పై సలసల నూనెలో కాలుతున్న ఆమ్లెట్ ,,
"హమ్మ దొంగల్లార మీరు ఇంటి వద్ద నుండి గుడ్లు తెచ్చి ఇలా దొంగతనంగా వండుకు తింటున్నారా"అని నేను అంటున్నానో లేదో అన్నయ్య స్నేహితులు అప్పుడే పక్కనే ఉన్నా చెరువు లో త్రుంచుకొచ్చిన తామరాకులో వేడివేడి ఆమ్లెట్ పెట్టి మా ముగ్గుర్ని తినమని ఇచ్చారు మా మవయ్యేమో తినొద్దు అమ్మ ఊరుకోదు తెలిస్తే అని,,మేము ముగ్గురం వాడి వంక నిర్లక్ష్యంగా చూసి తలో ముక్క తిన్నాము ,ఇంతలో మా ఇంటి పాలేరు మమ్మల్ని వెదుకుతూ వచ్చాడు అమ్మ మాకోసం కంగారు పడుతోందని తెలిసిందని చెప్పాడు అంతే మేము ముగ్గురం చేతి లోది అక్కడ పారేసి ఒకటే పరుగు దారిలో చెప్పాం "రాముడు ,,అన్నయ్య వాళ్లు ఏమి చేస్తున్నారో తెలుసా ?"అని .అదేదో రహస్యం కనుక్కోన్నట్లో ,,.ముందు మీరు త్వరగా ఇంటికి నడవండి అమ్మ కోపంగా ఉంది అంటూ అయిన మనం వినిపించుకోకుండా "అన్నయ్య వాళ్ళు ఆమ్లెట్ వేసుకున్తోన్నారు ఎవరు చూడకుండా "అన్నాను.దానికి రాముడు "తూథ్ "వాళ్లు కాకి గూళ్ళు పిచిక గూళ్ళు చెదరగొట్టి అలాటి పనులు చేస్తన్నారు ,మన బాబు తినడు సరదాగా కలుస్తాడు అని వివరించాడు .అంతే మేము ఒక్క పెట్టున అరుస్తో మేము తిన్నది "కాకి"గుడ్ల అనివుమ్ము ఊస్తో వాంతి అవుతదేమో అన్నంతగా ఏడుస్తో ఇంటికి పరిగెత్తికెళ్ళి అమ్మకి విషయం చెప్పడం,మాకు "వాంతులు "కాలేదు కాని వీపులు విమానం మోత ఎక్కినవి .ఆ తరువాత మా మామయ్యా సంగతి తాతగారు చూసారు..అది వేరే కథ.ఇప్పటికి తల్చుకుని నవ్వుకుంటాం ..
',

అనర్హుడికి
ఒక అనర్హులు నేను అపురూపంగా రాసుకున్న జ్ఞాపకాల పరిమళం ఫై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు మనస్తాపంతో ఆ పోస్ట్ బ్లాగ్ నుండి తొలగించాను.వ్యాఖ్యానించడం ఫై స్వేచ్ఛా ఉండవచ్చుకాని "లేకికామెంట్స్"భరించరానివి.
20, ఫిబ్రవరి 2009, శుక్రవారం
పరిమళం
సాయంత్రంఆఫీసు నుండి ఇంట్లో కి అడుగు పెడుతూ గేటు తిసానో లేదో ఓ అల్లరి కెరటం చల్లగా నన్ను తాకింది .తన తాలుక పరిమళం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది.తన వైపు చూడగానే రారంమంటూ అల్లరిగా నవ్వింది.
నిద్ర కళ్ళ తోనే నిన్ను పలకరించి నీ దాహం తీర్చ కదా ,,అలసి వచ్చిన నన్ను ఇంట్లోకైన వెళ్ళనియవ అని ముద్దుగా
విసుక్కుంటూనే వెళ్ళాను ."నీకోసం ఏమి దాచానో చూడు ,ఉదయానే చెబుదామంటే ,నాతొ గడపినది ఎక్కడ ?,అందర్నీ చూడాలంటూ విసుక్కుంటూ వెళ్ళవు కదా !"అంటు గారం కార్చింది నా 'చంపకం'.ఎంతమందిలో ఉన్నా నీకు సరి రారెవరు అంటు ,తన తను లతనేల్ల తాకేనో ,లేదో ఒక్కసారే తన సువాసనతో నన్ను మత్తెక్కించింది .నాతొ ఇంట్లోకి వచ్చేయమని అడిగినతడవే ,,సిగ్గుపడుతూ ఆకుల మాటు కళ్లు విప్పి అచ్చర్యముగా నన్ను చూస్తున్న బుజ్జి పాపాయినినా చేతిలో పెట్టింది .అబ్బురంగా అందుకుని ఇంట్లోకి తేసుకు వెళిగాజు తొట్టి లో వేసానా ,,ఇల్లంతా "పరిమళమే".ఇది నా సంపెంగ చెట్టు కథ.నే నాటిన మా తోట లోని ఓ ఆత్మా కథ.

14, ఫిబ్రవరి 2009, శనివారం
"ఇంతకీ నా పేరు ఏమిటి?"
"అనగనగా ఒక ఈగ, ఇల్లు అలుక్కుంటూ తన పేరు మరచిపోయిందట.." ఈ కథ నా చిన్నతనంలో విన్నప్పుడు తెగ ఆశ్చర్య పోయేదానిని..నిజంగా మన పేరు మరచిపోతామా అని..
పేరంటే గుర్తొచ్చింది, చిన్నతనంలో నా పేరు ఎవరైనా అడిగితే చెప్పటానికి చాలా బిడియపడేదానిని. మరీ ముఖ్యంగా మా అమ్మమ్మ వాళ్ళపల్లెటూరు వేసవిసెలవుల్లో వెళ్ళినప్పుడు, పిల్ల గ్యాంగ్ తో ఆటలప్పుడు వోడిపోయినవాళ్ళు ఉక్రోషంగా నన్ను ఇత్త డిబింది, రాగిబింది, నీళ్ళబింది అని గెలిచేసినపుడు అవమానంతో, అదేదో నేను నేరంచేసినట్లు ,అమ్మ దగ్గరకు వెళ్లి "ఎందుకమ్మా నాకీ పేరు పెట్టారు" అని మారాం చేసేదాన్ని. "మీ నాన్న పెట్టారమ్మా..చక్కటి పేరు..నీకేం" అనేది అమ్మ. నాన్న మీద చాలా కోపంగా ఉండేది, ఆయన్ని అడిగే ధైర్యం ఉండేదికాదు మనకి. ఎంచక్కగా పద్మ, ఉమా, లలిత అని పెట్టొచ్చుగా అనుకునేదానిని.
నేను రెండవ తరగతిలో వుండగా మా తెలుగు మాస్టారు హాజరు తీస్కోంటూ, నా పేరు పిలుస్తో "ఎవరమ్మా లేచినిలబడండి" అన్నారు. నేను అవమానంతో ఏం వినాలో అని లేచి నిలబడ్డాను. నా వంక మాస్టారు ప్రశంసపుర్వకంగా చుస్తూ "ఎంత చక్కటి పేరు పెట్టారమ్మా.. ఎవరుపెట్టారు? నాన్నగారు ఏంచేస్తారు?" వగైరా అడిగారు. నాకు ఇప్పటికి గుర్తే..నిజ్జంగా మాస్టారు నాపేరు పొగిడారా? లేక అందరిలా వెక్కిరించారా అని అనుమానపడ్డా. నా అనుమానాన్ని వమ్ము చేస్తూ, తరగతిలో అందరికి నా పేరులోని అర్ధం చెప్పారు. ఆ మాస్టారి పేరు శ్రీనివాసరావు.
కాలక్రమాన, నాలోవున్న నూన్యతా భావం పోయి, ఎవరైనా నా పేరు అడిగినా గర్వంగా అర్ధం కూడా చెప్పేదాన్ని. నాన్న లోని సాహిత్య అభిలాష ,అభిమానం,మొదటిగా పుట్టిన అక్కకి, నాకు, ఇంత మంచి పేర్లు పెట్టడానికి దోహదపడింది. ఎంతమందిలో ఉన్నా ప్రత్యేకంగా ఉంటాయి మా పేర్లు. ఇంతకీ..నా పేరుఏమిటి?

9, ఫిబ్రవరి 2009, సోమవారం
రొటీన్ కి భిన్నంగా...
మంచు పడుతున్న ఓ ఉదయం వేళ లేత చిగుళ్ళ కొసల నుంచి జాలువారే హిమబిందువులు అప్పుడే ఉదయిస్తున్న భానుడి లేత కిరణాలు సోకి కరుగుతున్న వేళ ప్రకృతి కాంతను చూడ్డం ఎంత బాగుంటుంది..?
ఓ సాయంత్రం..నీలాకాశంలో ఎగిరే కొంగల బారుని చూస్తూ కెంజాయ రంగులో పశ్చిమానికి కుంగి పోతున్న సూర్యుడి నుంచి వీడ్కోలు తీసుకోవడం..ఈ అనుభూతిని మాటల్లో వర్ణించ గలమా?
మననుంచి ఏమి ఆశించి ప్రకృతి మనకీ వరాలని ఇస్తోంది.. ఆమె నిజంగా ఏమైనా ఆశించినా మనం ఇవ్వగలమా? ఉదారంగా మనకి లభిస్తున్న కానుకలని మనం అందుకో గలుగుతున్నామా?
ఉహు.. మనకి సూర్యోదయాన్ని చూడడం కన్నా న్యూస్ పేపర్ కోసం ఎదురు చూడడంతోనే ఉదయం వేళ గడిచిపోతుంది.
ఇక సూర్యాస్తమయమా? అంటే ఏమిటి? ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళే వేళ.. రేపటి రోజుకోసం కూరలు పళ్ళు కొనుక్కునే సమయం..
'అదే సూర్యుడు..నా చిన్నప్పటినుంచీ చూస్తూనే ఉన్నా..' అనబోతున్నారా? ఐతే మీరెప్పుడూ సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని ఆస్వాదించ లేదన్నమాట.
ఒక్క రోజు..కనీసం ఒక్కపూట.. మీ ముఖ్యమైన పనులన్నీ వాయిదా చేసుకుని సుర్యోదయాన్నో, సూర్యాస్తమయాన్నో చూడండి..రొటీన్ జీవితం నుంచి బ్రేక్ కోసం ఎక్కడికో వెళ్ళనవసరం లేదని అనిపించకపోతే నన్ను అడగండి..

6, ఫిబ్రవరి 2009, శుక్రవారం
కొత్తగా బ్లాగు లోకం లోకి..
ఇదో కొత్త ప్రపంచం నాకు..ఇల్లు, ఉద్యోగం..కొంచం ఖాళీ దొరికితే మనసుకు నచ్చే పుస్తకాలు, సంగీతం.. కొద్ది రోజుల క్రితం వరకు ఇదే నా ప్రపంచం. ఇప్పుడు కొత్తగా బ్లాగులతో పరిచయం అయ్యింది.. మీ అందరితో పంచుకోడానికి నా దగ్గర ఎన్నో ఊసులు ఉన్నాయనిపించింది..అందుకే ఈ చిరు ప్రయత్నం.. నా బ్లాగులోకి మీ అందరికి స్వాగతం..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)