మా ఇంట్లో ఆరుగురి పిల్లల్లో ఎక్కువ వ్యవహారాలు ఫ్రెండ్స్ గ్యాంగ్ ను మైంటైన్ చేసే వాళ్లేవరఅని ఆలోచిస్తే ముందు మనముంటాము ఆ తరువాత పెద్ద తమ్ముడుంటాడు.ఇప్పటి కథే కాదు చిన్నప్పటి నుండి వున్నఅలవాటు.ఎప్పుడు సెలవలు రాని ఏవి రాని మేము ఇంట్లో ఆడుకోవాల్సిందే వస్తే మా స్నేహితులు మా ఇంటి కి వచ్చి ఆడుకోవాల్సిందే .మేము వెళ్ళ లంటే బోల్డన్ని ఆంక్ష లు వుండేవి ,ఇందు లో అబ్బాయిలకు ఏమి మినహాయిమ్పు వుండేయి కాదు :-(ఎక్కువగా పక్కింటి పిల్లలో ఎదురింటి పిల్లలో మాతో వచ్చి ఆడుతుండే వాళ్లు .స్కూల్ స్నేహితులు స్కూల్ వరకే పరిమితం అయ్యేవాళ్ళు . పరిస్తతులవల్ల కాని మా అమ్మ శిక్షణ కాని మేము ఆరుగురం మంచి స్నేహితులమే అన్ని విషయాలు షేర్ చేసుకునే వాళ్ళం. మనస్సుకు దగ్గరగా వచ్చిన స్నేహితులు నాకు గుర్తున్నంత వరకు ఆరవ తరగతి వరకు ఒక్కలిద్దరు మాత్రమె .
వేసవి సెలవలకో ,సంక్రాంతి పండుగకో అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ల ఊరు వెళ్ళినప్పుడు కొందరు చుట్టాల పిల్లలతో కలసి ఆడేదాన్ని వాళ్ల ఇళ్ళకు తిరిగేదాన్ని అలానే మా పెద్ద తమ్ముడు అందరితో కలిసి ఆడేవాడు .ఇప్పటికి ఊర్లు వెళ్ళితే మాకు స్నేహితుల కొదవ లేదు మిగిలిన నలుగురికి స్నేహితులు తక్కువ అనే చెప్పవచ్చు.
నాకు బాగా గుర్తున్నంత వరకు నాన్నమ్మ వాళ్ల ఊర్లో మా ఇంటి వెనుకనే బోడి {అన్నపూర్ణ అస్సలు పేరు }అనే అమ్మాయి నా వయస్సుది నేను వున్నన్ని రోజులు వదలక అంటిపెట్టుకుని వుండేది ,ఊరంతా తిప్పేది ,సంక్రాంతి ఎప్పుడు నాన్నమ్మ ఊర్లోనే జరుపుకునే వాళ్ళం ,తెల్లవారు ఝాము భోగి మంటలు దగ్గర్నుండి గట్ల పైన పూసే ముల్లగోరింత పూలు కోసుకోవడం బంతి పూలు కోసుకుని గుమ్మలకి దండలు కట్టడం వరకు పోటీలు పడేవాళ్ళం ,పాపం అన్నిటికి తనే వెనక్కి తగ్గేది .మేము సెలవలు అయ్యి తిరుగు ప్రయాణం అవ్వుతుంటే ఆ వుదయం నుండి భిక్కముఖం పెట్టేది .బోడి ని ఆఖరి సారి చూసింది నా సెవెంత్ క్లాసు సంక్రాంతి సెలవల్లో , వేసవి సెలవలు మొదలయ్యేప్పటికి బోడి చనిపోయిందని కబురు వచ్చింది .పిడకలు గుడు వద్ద పురుగు కుట్టిందని చెప్పిందని ,వాళ్లు పసరు వైద్యం చేయడం రాత్రికల్లా చనిపోవడం జరిగిందట , చనిపోవటం అంటే ఏమిటో మొట్టమొదటి సారి తెలుసుకున్నాను .అప్పటివరకు చావు మీద సరైన అవగాహన వుండేది కాదు ,మా ఊరు వెళ్ళినప్పుడు వాళ్ల ఇంటి వైపు వెళ్లడానికి భాదగా వుండేది , వాళ్ల అమ్మ {శకుంతల పిన్ని }నన్ను ఇప్పటికి చూసిన కంట తడి పెట్టుకుంటది ,వాళ్ల అమ్మాయిని తలుచుకుని , నాకు ఇప్పటికి సంక్రాంతి ,ముల్లగోరింత పూలు ,మినప ,పెసరకాయలు అనగానే స్మ్రితి పదంలో బోడి మెరుస్తది ఒక "మెరుపులా".
నేను ఎనిమిదవ తరగతిలో హాస్టల్ కి వెళ్ళాక చాల మంది స్నేహితులయ్యారు మాదొక పెద్ద గ్రూప్ అయిన అందులోనే సబ్ గ్రూప్ మల్లి అందులో ఇంకో సబ్ గ్రూప్ దాన్లో ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ వుండేవాళ్ళం నాగు నాకు చాల ఇష్టమయిన స్నేహితురాలు మనం ఎంత డామినేట్ చేసిన ఫీల్ అయ్యేది కాదు చాల నెమ్మదిగా వుండేది తనతో సరదాకి కూడా ఎప్పుడు గొడవ పడలేదు ,తనకి నాన్న చిన్నతనం లోనే పోయారని విని నాకు తనంటే ఎంతో జాలిగ వుండి అస్సలు భాద పెట్టడం ఇష్టం వుండేది కాదు.తను నాకు కోపం తెప్పించిన అస్సలు పట్టించుకునేదాన్ని కాదు ఇంటర్ బయాలజీ కలిసే చదివాము ,ఇంటర్ లో తనకి నాకు ఒకటే సెక్షన్ వస్తాదో రాదోనని ఆందోళన కూడా పడ్డాను. మా స్కూల్ గ్యాంగ్ అంత అదే కాలేజీ లో చేరారు అంత డిగ్రీ లు కలిసే ,మనం మాత్రం మిడ్ ఇంటర్ లో నా బృందాన్ని వదిలి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది .అప్పటి మా స్నేహం ఇప్పటికి కొనసాగుతూనే వుంది ప్రతి దినం మాట్లడుకో పోయిన మా మద్య చిన్నప్పటి చనువు వాతావరణం వుంటుంది .ప్రతి ఇయర్ ఏదొక సమయంలో మేము కలుస్తుంటాము ,మా పిల్లలకు ఆశ్చర్యంగా ఉంటది ,ఇంత పెద్ద గ్రూప్ ఇప్పటికి ఎలా వుంటారా అరమరికలు లేకుండా అని .అందరం రకరకాల ప్రదేశాల్లో వున్నాం విదేశాల్లో ముగ్గురున్నారు .అయిన ఎవరు వచ్చిన తీరిక కల్పించుకుని కలుస్తుంటాము .
నేను విజయవాడ వెళ్ళాక అక్కడ కెమిస్ట్రీ ,ఫిజిక్స్ ప్రైవేటు లలో పెద్ద గ్యాంగ్ తయారయింది .అందులలో ఇదివరకులా కాకుండా అబ్బాయిలు కూడా వుండేవారు ,మొత్తం పదకొండు మందిమి . అమ్మాయిలు ఐదు అబ్బాయిలు ఆరు దాదాపు వారంతా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు ,వాళ్ళలో ఫాతిమా నహీద్ అని నాకు అత్యంత ఇష్టమైన స్నేహితురాలు వుండేది ,మనకులాగా తనకిపుస్తకాల పిచ్చి ,ఆఖరికి డిటెక్టివ్ నవల కనబడిన ప్రవేట్ లోనే వెనక కూర్చుని చదివేది .
{తరువాత రాస్తాను }
31, మార్చి 2009, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
6 కామెంట్లు:
అబ్బా.. నా స్నేహితులందరినీ గుర్తు చేసేశారు.. బాగుందండి టపా.. తర్వాతి భాగం త్వరగా రాసేయండి..
@మురళి అప్పుడే చదివేసారా! పెద్ద టపా రాస్తే ఉమాశంకర్ లాటి వాళ్లకు బోర్ కొడతదేమోనని జడిసి రెండు మూడుగా పోస్ట్ చేద్దామని డిసైడ్అయ్యాను :) ధన్యవాదాలు
బావున్నాయ్ మీ జ్ఞాపకాలు.
పుస్తకాల పిచ్చి ఉన్న స్నేహితులుడటం మించిన అదృష్టం ఇంకేదీ లేదేమో?
అదేమీ లేదండీ, రెగ్యులర్ గా చదివే బ్లాగైతే ఎంత పెద్ద టపా అయినా పర్లేదు, రెగ్యులర్ గా చదవని బ్లాగుల్లో టపా సైజు చూసి అప్పుడప్పుడు కొన్ని మంచి పోస్టులు మిస్సయ్యాను..అదన్నమాట సంగతి.
చిన్ని గారూ ! వేసవి సెలవులు ,చిన్ననాటి స్నేహం గుర్తు చేశారు .మా అమ్మమ్మ గారి ఊరిలో నాకూ ఓ స్నేహితురాలుండేది .ఇప్పటికీ ఫంక్షన్స్ లో కలుస్తూనే ఉంటాం ...మరో విషయం ఏవిటంటే మా అమ్మ ,వాళ్ల అమ్మ కూడా ఫ్రెండ్స్ .మీలాగే ముల్లగోరింతలూ ..( మేం గొబ్బి పూలంటాం ) డిసెంబరాలూ కలిపి కట్టుకోనేవాళ్ళం .మొత్తానికి మధుర స్మృతులు మా కళ్ళ ముందుంచారు .
@ఉమా నిజంగానే మన అభిరుచి కలిగిన స్నేహితుల తో గడిపే ఆనందం నాకు వేటికన్న ఎక్కువ కాదు .మనకు తెలియకుండానే దగ్గరవుతాము,దాదాపు నా స్కూల్ ఫ్రెండ్స్ కాలేజీ ఫ్రెండ్స్ ఇదే కోవకు చెందినవారే . మురళి తో జోక్ చేసానండి నిజంగా కాదు మనకు రాయటానికి కుదరక.
@పరిమళం ఈ రకంగా మళ్ళి మీ భాల్యం లోకి వేల్లిపోయరన్నమాట .తూర్పు గోదావరి వాళ్ళు ముళ్ళ గోరింటల్ని గొబ్బిపూలు అంటారని ఈ మద్యనే తెలిసింది .కొబ్బరాకు సుధాకర్ గొబ్బిపూలు పుస్తకం చదివాను.
పదేళ్లయ్యాకా... .ఇపుడిలా నేను స్పందించడం. ...ఇపుడే. . నా పుస్తక ప్రస్తావన చూసి. . సంతోషంతో.. .
కామెంట్‌ను పోస్ట్ చేయండి