7, ఏప్రిల్ 2009, మంగళవారం
నా స్నేహితులు -3
నాకు  డిగ్రీ చదువుతుండగానే  మ్యారజేకావడం  అయిన  చదువు కొనసాగించడం  జరిగిందీ ,డిగ్రీ  తరువాత  నేను ఏంఏ  సోషల్ వర్క్  చేరాను  ,లలిత  బి.ఎడ్. లో చేరింది  అయిన  మా మద్య  అస్సలు గ్యాప్  రాలేదు .మా ఇద్దరి మధ్య  రహస్యం అంటు వుండేది కాదు  ప్రతి చిన్న విషయం  మాట్లాడుకునేవాళ్ళం , ఫాతిమా కూడా  వుత్తరాల ద్వారా  మాతో టచ్  లో వుండేది .ఆశ  అప్పుడప్పుడు మాత్రం కలిసేది తన సి.ఏ. తో బిజీగావుండేది .     ఒకరోజు  వుదయాన్నే  ప్రముఖ  నాస్తిక కేంద్ర నాయకుడు  మా ఇంటికి  వచ్చి   మా  చిన్న మావయ్య {అన్నయ్య} లలిత  ఆరునెలల క్రితం  ఒక గుడి లో  పెళ్లి చేసుకున్నారని  రిజిస్టర్ కూడా  చేసారని   ,మా వాడు  ఇంట్లో  చెప్పడానికి  మొహమాటపడుతున్నారని,ఆమె వాలింట్లో  చెప్పగానే గొడవలు  అయ్యావని  అందుకని  వారి ఆశ్రయం  కోరారని  ,అతిఎస్ట్  సెంటర్ వారు  తమదయినా  రీతి లో  మళ్ళిపెళ్లి   చేస్తామని  అందుకని  అందరు  సమ్మతించాలని  కోరారు . అమ్మ  నాన్నలకు  ,ఇంట్లో మాకు  మతి పోయింది ....అందులోకి  తను  మాతో పాటు  వాడిని "అన్నయ్య" అనేది  ,అస్సలు  సూచనప్రాయంగా  ఎప్పుడు మాతో అనలేదు ,ఎవరితో చెప్పకపోఇన  నాతో చేపుతుందనే  ధీమా  నా అణువణువున  వుండేది ,వాడు కూడా  కనీసం  చెప్పకుండా   పైగా బయటి వ్యక్తుల్ని తీసుకురావటం  నాకైతే  షాక్ ,ఆ తరువాత  అమ్మమ్మ  తాత గారు రావడం   కథ  సుఖాంతం  అవ్వడం జరిగిందీ .చాల రోజులు  నేను తన  ముఖంలోకి  చూడలేదు  ,మనస్సు లో తెలియని  దూరం  తను  మాత్రం ఇదివరకటిలా  వుండటానికి  ప్రయత్నించినా  నా మనస్సు  చాల కాలం అంగీకరించలేదు . ఇప్పుడు  అది  మా చిన్న అత్తయ్య  మా  అమ్మకి  మరదలు మాత్రమె .కాని  తను ఒప్పుకోదు  నాకోసమే  చేసుకున్నాను అంటుంది:)  నాకు  పీ.జి  లో ఎవరు  మనస్సుకు దగ్గరైన  స్నేహితులు లేరు అందరికి పోటీగా  భావించేవారు మనమే  అక్కడ  నాయకులం అల్లరి వ్యాపకాలు  తగ్గాయి  వయస్సు తోపాటు.నా దృష్టి అంతా  చదువే మా పెద్ద చెల్లెలు  కూడా   నాకు   నాకు బాచ్ మీటే  అయ్యింది  అందరికన్నా  ఎక్కువ మార్క్స్ గురించి తపన పడేదాన్ని . అందరి ద్రుష్టి లో పెళ్ళయింది   ఈమెకు ఇంకా చదువు  అవసరమా  అన్నట్లు వుండేది చాలామంది అనేసేవారు  హ్యాపీగా  ఇంట్లో వుండక  ఇలా స్లమ్స్ ఫీల్డ్ వర్క్ లు  ఎందుకు అనేవారు ,ఇండస్ట్రియల్ రిలేషన్స్  నా సెకండ్ ఇయర్ లో  స్పెషల్  సబ్జెక్టు  నా దృష్టి అంత  పెర్సనల్ మేనేజర్  తెచ్చుకోవడం పై వుండేది ,అప్పుడు  నా ప్రియమయిన  స్నేహితులు  పుస్తకాలే {మిగిలినది  రేపు-:)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
10 కామెంట్లు:
ఆ నాస్తిక కేంద్ర నాయకుడు ఎవరండీ? నాకు నాస్తికకేంద్రంతో మంచి పరిచయం వుంది. అందుకే ఆసక్తి.
@శరత్ గారికి
మీకు తెలిసిన వారి పేరు చెప్పండి అవునో కాదో చెప్తాను .
అందరికీ కొంత జీవితం అయ్యాక స్నేహితులు దూరమైపోతారా ఏంటి?
నాతో సహా చాలామందికి ఇలాంటి గతమే ఉండటం వినాను. అందుకనే అడిగాను.
అన్నయ్యా అంటూ పెళ్ళా ? ప్చ్ ...
బాగుందండి ఆసక్తి కరంగా.. నెమ్మదిగా వారపత్రికలకి సీరియల్స్ రాసేస్తారేమో..
బావుంది.. ఇంతకీ ఖదీర్ ఎవరో తెలుసుకున్నారా?
@భవాని
కొంత మంది దూరమైపోతారండి వారు మన కళ్ళ ఎదుటే వున్నా ఆకాశమంత దూరం లో వుంటారు ,కొందరు సప్త సముద్రాలవతల వున్నా మా మనస్సులో చెరిగిపోరు
@పరిమళం
నాకు అందుకే బయటవారిని పిలిచే పిలుపులకు నమ్మకం వుండదు ,నేను ఎవ్వరిని అలా పిలవను సొంతవాల్లని తప్పించి
@మురళి భలే హాస్యం చేస్తారు , ముందు మీరు రాయండి తరువాత నేను :)
@ఉమా
ఖదీర్ ని గుర్తుపట్టలేదండి
మీ స్నేహితుల పోస్టులన్నీ ఇప్పుడే చదివాను. Looks like you had an interesting journey so far!
విజయవాడ నాస్తికకేంద్రమేనా? అందరూ తెలుసు. ఒక్క పేరని ఏం చెప్పను.
@తెరెసా ధన్యవాదాలు ..నిజంగానే నా జీవిత ప్రయాణం లో ఊహించని మలుపులే ముఖ్యమ్గా పెళ్లి తోనే "ఇక అమ్మ లాగ " ఇంతేకదా జీవితం అనుకున్నాను .
@శరత్ గారు
నాస్తికులంటే ఒక్క విజయవాడ వాళ్ళేనా ! చారువాక ఆశ్రం వాళ్ళు కూడా నాస్తికులే కదా .....
కామెంట్‌ను పోస్ట్ చేయండి