17, ఏప్రిల్ 2009, శుక్రవారం

బ్లాగ్ లోకం -బంగారు లోకం

ఏమిటో రోజురోజు కి బ్లాగ్ మీద ఇష్టం పెరిగిపోతుంది ..పుస్తకాలు ,అంటే వారపత్రికలు ,నవలలు చదివినంత ఇష్టంగా బ్లాగ్ చూస్తున్నాను మరీ ముఖ్యమ్గా జల్లెడ ,కూడలిలో ఏమేమి కొత్త టపా లు వచ్చి చేరాయ అని ఆత్రంగా తెరచి చూస్తున్న .మా ఇంట్లో మా అమ్మాయికి ,మా శ్రీవారికి భయం పట్టుకుంది నా కళ్ళకి ఏవయినా అవ్వుతాదేమోనని ఇప్పటికే లైట్ అద్దాలు పెట్టుకుంటాను ఇప్పుడు అవి బూతద్దాలు అవ్వుతాఎమోనని .ఒక్కోసారి కొందరి బ్లాగ్స్ చదువుతూపడిపడి నవ్వుకుంటుంటే "హమ్మ ఇక్కడ కూడా మొదలు పెట్టావా " అంటూ బోల్డు ఆచ్చార్యపోతున్నారు ."కావాలంటే రా చదివి విన్పిస్తానని " మనం .నేను పుస్తకాలు చదువుతూ నవ్వడం ,ప్రక్కన వున్నావారికి చెప్పడం మనోళ్ళకి అలవాటే ...అయన వింటున్నట్టే వుంటారు కాని మనస్సు పెట్టరుఅందుకే మా అమ్మాయే అప్పుడప్పుడు నా బ్లాగ్ శ్రోత .
ఇక పోతే నా మిత్రుడు {బ్లాగ్ ని పరిచయం చేసిన } నేను కలిస్తే ఈ బ్లాగే ప్రపంచం ..మా ఇద్దరి కబుర్లు పూర్తిగా బ్లాగ్ చుట్టూనే .....అస్సలు తరచి చూసుకుంటే మేము ఏది మాట్లాడుకున్న తిరిగి తిరిగి బ్లాగ్ దగ్గర ఆగుతున్నాము ...అంత క్రితం ఎన్నో విషయాలపై మాట్లాడుకునే వాళ్ళం ..కథలు ,ఆఫీసు కబుర్లు ,తన కెరీర్ ఒకటేమిటి మొత్తం భూప్రపంచం అంతా తిరిగేవాళ్ళం (చెప్పుకునే వాళ్ళం )ఇప్పుడేమో "తెలుసా మీకు ఫలాని ఫలాని వాళ్లు గొడవలు పడ్తున్నారు ,ఫలాని బ్లాగ్ లో చక్కటి టపా రాసారు ,చదవటం మిస్ కావద్దు "అని ....ఇలా సాగుతున్నాయి మా కబుర్లు .....ఫోన్ లో కూడా ఇవీ మా సంభాషణలు ,ఎప్పుడైనా ఇంట్లో ఫోనులో నా సంభాషణ విన్న నా కూతురో మావారో ఎవరి గురించని వాకభు చేసి ...బ్లాగా అని నవ్వుతున్నారు .
రోజుకి ఒక్కసారైనా బ్లాగ్ చూసేంత అలవాటయిపోయింది. నిన్నటికి నిన్న వుదయం పక్క జిల్లా కాంప్ వెళ్లి ఎప్పుడో రాత్రికి అలసి ఇల్లుచేరాను ...రిఫ్రెష్ అవ్వి ఫుడ్ తిని హ్యాపీగా నిద్ర పోదాంలె అనుకుంటూ మూలగా ఒక లుక్ వేసా ,హాల్ లో నావంక చూస్తో కనబడింది "నా క్రొత్త ప్రపంచం ".అది ఓపెన్ చేయబోతుంటే వెనుకనుండి మా పాప "మమ్మీ ఇంత అలిసిపోయావు నిద్రపోరాదు "అంటూ వుంది తను చదుకుంటూనే . "పడుకుంటాను జస్ట్ జల్లెడ కూడలి లో కొత్త పోస్ట్ లు చూసి నిద్రపోతాను "అని హామీ ఇచ్చి బ్లాగ్ తెరిచాను ....ఇంకేముంది "అంత్యాక్షరి ' జరిగిపోతుంది ఇష్టమైతే రావచ్చో అనిన బాస్కర రామ రాజు గారి పిలుపు నా బ్లాగ్ లో చూసి అమాంతం దూకేసాం ....నా నిద్ర పారిపోయింది ..పాటలు గుర్తు తెచ్చుకోవడానికి నా మెదడుకి సాన పెట్టడమే కాకుండా మా అమ్మాయిని కూడా పుస్తకాల ముందునుండి లేపి మన పక్కన కూర్చోపెట్టేసాం .......(కూసే గాడిద మేసే గాడిద చందాన )అర్ధరాత్రి ఒంటిగంటవరకు -:( ఈరోజు ఇది మూడోసారి మనం బ్లాగ్ ఓపెన్ చేయడం ....ఏమోలే కొత్త భిచ్చగాడు పొద్దు ఎరగారని అమ్మ అంటూ వుండే సామెత నిజమేనేమో ........నిజానికి చాల ఎంజాయ్ చేస్తున్నాను ....ఈ బ్లాగ్ లోకం. కొంత టైం వృధా అవ్వుతున్నా .

19 కామెంట్‌లు:

Padmarpita చెప్పారు...

same pinch....

ఉమాశంకర్ చెప్పారు...

చిన్ని గారు,

బావుంది.

ఒక మూడునెలల తరువాత ఇదే విషయం మీద మీ అభిప్రాయం వినాలని ఉందండీ. చూద్దాం అప్పుడేమంటారో.. :)

అజ్ఞాత చెప్పారు...

how about learning to type telugu without mistakes, as a start? There are dime a dozen mistakes for each line in this post.

Kathi Mahesh Kumar చెప్పారు...

బ్లాగును ఒక passion చేసుకోండి addiction కాదు. జైహో బ్లాగ్స్.

Hima bindu చెప్పారు...

@పద్మర్పిత
ఇంచుమించు అందరిది అదే పరిస్తితేమో .......బహుశా మొదట్లో .
@ఉమా
తప్పకుండ చెపుతానండి...కొంచెం తగ్గుతాదేమో :)
@అజ్ఞాత గారు
మరేమోనండి మేము తప్పులు లేకుండా రాయలేమని అర్ధం అవ్విందండి ...అది మీరు ధ్రువీకరించారు ,ఏదో కొత్తలో నోరు జారాను తప్పులు లేకుండా రాస్తానని ....కొంచం మనకి రాజకీయ నాయకుల్తోటి సావాసం ఎక్కువ .....మాట నిలబెట్టుకుంటే వాళ్ళు మన ఫ్రెండ్ షిప్ చెయ్యరని ......:( అక్కడికి కష్టపడ్తున్న రెండోసారి వెనక్కి చూడకుండా ....మనకి టైపు ,రాయటం లాటివి రావు ,,ఎవరైనా రాసుకొస్తే అడ్డంగా సంతకం చెయ్యడమే మనకు ఇప్పటివరకు తెలుసు .ప్రయత్నిస్తాం ,,ధన్యవాదాలు .
@కత్తిమహేష్ గారికి
ధన్యవాదాలు ...అలానే పాటిస్తాము .

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

మనకి టైపు ,రాయటం లాటివి రావు ,,ఎవరైనా రాసుకొస్తే అడ్డంగా సంతకం చెయ్యడమే మనకు ఇప్పటివరకు తెలుసు ...

ఇది చదివి ఆఫీసు లో గట్టిగా పైకే నవ్వేశా . ఏమైందో ఏమో సీరియశస్ గా పని చేసుకొనేవాళ్ళు గూడా నన్ను చూసి గట్టిగా నవ్వుకున్నారు. నా పరువు పోయింది.. ఇకచూడు.. నిన్నొదల బొమ్మాలీ అన్నట్టు, మీ ప్రతి టపా చదవకపోతే చూడు.... ( చూడండి ).

oremuna చెప్పారు...

ఇది ఒకరకమైన బలహీనత. కొంచెం కంట్రోల్ లో ఉండండి.
ఓ వారం బ్లాగ్ శలవు తీసుకోండి.

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

మున్నా, అమెరికాలో ఆ జాగ్రత్త అక్కరలేదోమోనండి. నటించకుండా, మనపని మనము చేస్తూ , మీటుంగులలో అప్పుడప్పుడు నాలుగు ఉచిత సలహాలు విసిరేస్తే మిగిలిన టైం మనిష్టం అనుకుంటా.

అజ్ఞాత చెప్పారు...

same here too

నేస్తం చెప్పారు...

ha ha మొదట్ట్లో ఇలాగే ఉంటుంది క్రమం క్రమం గా అలవాటు తగ్గుతుంది ,నా పోస్ట్ లు గమనిస్తే మొదట్లో వారానికి రెండు చొప్పున తెగ రాసేసేదాన్ని , ఇప్పుడు నెలకోసారి రాయాలన్నా బద్దకం :)

అజ్ఞాత చెప్పారు...

you are addicted

MURALI చెప్పారు...

Hi uma Sankar adigina prasne nadi. oka 3 months tarvata mi abhiprayam telusu kovali. Memukuda kothalo office panulu mani mari blogllo munigi amdariki blogs gurinchi cheputu gadipevallam.

@Oremuna
asthra sanyasam chesina bhishmuDu yuddam apamani evariki cheppaledu.

మురళి చెప్పారు...

నేనేమో స్వానుభవంతో 'కొత్త బ్లాగరి పొద్దెరగడు' అనుకుంటున్నా.. అందరూ ఇంతేనన్న మాట.. బాగుందండి..

cbrao చెప్పారు...

How Addicted to Blogging Are You?
Take a test at
http://www.oneplusyou.com/bb/blog_addiction

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

చిన్నిగారు,
మీ లానే నేను కూడా కొత్తలో రోజుకు చాలా సార్లు కూడలి, జల్లేడ చూసేవాడిని. మీరు ఈ బ్లాగ్ప్రపంచానికి అడిక్ట్ అవ్వనంత వరకు ఎన్ని సార్లు చూసినా ప్రాబ్లమ్ ఉండదు. పైన అజ్నాత గారికి మీరిచ్చిన సమాదానం చూసి నాకు భలే నవ్వొచ్చిందండి. అవేమీ పట్టించుకోకుండా సరదాగా మీ బ్లాగింగ్ కొనసాగించండి.

మంచి స్నేహితుడు చెప్పారు...

హ హ హ నాది ప్రస్తుతానికి ఇదే తంతు ఎన్ని రోజులు ఉంటుందో ఈ ఆవేశం బహుశ ఆయసం వచ్చే వరకు అనుకుంటను....

Hima bindu చెప్పారు...

@బాస్కర రామి రెడ్డి గారికి
హ.హ్హ ...చదవండి .."అచ్చు తప్పులు అన్నంలో రాళ్ల ల పంటికి అడ్డు పడ్తున్నాయని" అందరు ఒకే మాట ,ముఖ్యమ్గా నా స్నేహితుడు .
@ఒరెమున (తెలుగులో ఇంతేనండి )
చిత్తం ప్రభు ! అలానే సెలవు తీసుకుంటాను.
@నేస్తం
ధన్యవాదాలు ..మీవి చదువుతుంటాను ..సరదాగా వుంటాయి.
@మురళి {ఇంగ్లీష్} తప్పకుండ చెబుతాను .ధన్యవాదాలు .
@ మురళి (తెలుగు)కొత్త సామెతలు బాగున్నాయండి.

Hima bindu చెప్పారు...

@cbrao..ధన్యవాదములండి ..తప్పకుండ చూస్తాను .
@శేఖర్ పెద్దగోపు
అలానే కొనసాగిస్తానండి ...ధన్యవాదములు .
@మంచి స్నేహితుడు
నిజమేనండి ....జీవితం లో ఎక్కడో చోట అలసట తో ఆగలిసిందే కదూ.

పరిమళం చెప్పారు...

same pinch! కొన్ని కారణాలవల్ల దాదాపు పది రోజులు సెలవు తీసుకున్నా ! miss you all ! నిజంగా !