8, ఏప్రిల్ 2009, బుధవారం
నా స్నేహితులు -4
పీ.జి. తరువాత నా ప్రపంచం ఇల్లు పుస్తకాలు మా పాప .దాదాపు మా ఫ్యామిలీ మెంబెర్స్ తో {అక్కాతమ్ముల్లు}తప్పించి నాకు బయట స్నేహాలు కొంత కాలం లేనట్టే ,మా శ్రీవారు వున్నా అభిప్రాయాల్లో ఉత్తర ,దక్షిణం . నా అభిరుచులన్నీ తనకు సిల్లీగా తోచేవి , నేను ఎంత అల్లరి దాన్నో తనంత పెద్దమనిషి తరహాగా వ్యవహరించేవాడు , నేను చక్కని పాటలు వింటోంటే తను ఇంట్లో వున్నంత సేపు చెత్త క్రికెట్ పెట్టేవాళ్ళు , ఏమి రాకపోతే స్పోర్ట్స్ చాన్నేల్ లో ఏదొకటి చూసేవారు పగలు రాత్రి తేడ లేకుండా క్రికెట్ వస్తోంటే చూస్తోనే వుండేవాళ్ళు .మా అమ్మ వాళ్ళింట్లో ఎవ్వరం క్రికెట్ చూడం ,టీవీ లో అది వస్తున్నంత సేపు నాకు కంపరంగా వుండేది , అలా మా ఇద్దరి అభిరుచుల్లో తీడావుండేవి . నాకేదైనా మంచి కథ చదివిన ,జోక్ చదివిన పక్కన వాళ్లకు చదివి వినిపించే దురలవాటు వుండేది ,ఇక్కడ ఆగలేక చెప్పిన ఊఁ కొట్టేవాళ్ళు కాని తిరిగి అడిగితె మళ్లీచెప్పమనే వారు ,పరిస్థితి అర్ధం అవ్వి తనని విసిగించడం మానేసాను. మా పాప తో నా ఊసులు మొదలయ్యాయి ,ప్రతిది తనకి చెప్పేదాన్ని ,అది ఇంతింత కళ్ళేసుకునిపెద్దదానిలా వినేది . మా పాప ,అతను స్కూల్ ఆఫీసు లకు వెళ్ళగానే నా ప్రపంచం లోకి వెళ్ళేదాన్ని , పాటలు వింటూ నేను అప్లై చేసిన జాబు కి సంభందించి బుక్స్ లోకి వెల్లిపొయెదాన్ని.నాకు మా పక్కింటి వాల్లెవరో తెలిదు ,ఎదురింటి వారెవరో తెలియదు , ఇంట్లోనుండి బయటకి రావడం అంటే అమ్మ వాళ్ళింటికి వెళ్ళడానికో ,లేదా సెకండ్ షో వారంకి ఒకసారి వెళ్లినపుడో మాత్రమె . మా పాప స్కూల్ నుండి వచ్చిన నన్ను డిస్ట్రబ్ చేయకుండా పక్కనే కుర్చుని చదవడమో ఆడడమోచేసేది వాళ్ల నాన్న వచ్చేంతవరకు . పగలంతా పుస్తకాలు తరువాత మా అమ్మాయే నా స్నేహితులు.మా పాప తన మూడవ ఏట నుండే నాకు చక్కటి సలహాలు ఇచ్చేది , బహుశ చదవడానికి అతిశయోక్తి గా వుందేమో కాని ఇది నిజం ,పెరిగేకొద్దీ తను నాకు మంచి స్నేహితురాలయింది , మేము ఇద్దరం కూర్చున్నామంటే మాకు సమయం కూడా తెలియదు . నేను చదివిన చదువుకి సంభందించి నాలుగు ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాను ,కాని జాబు రాలేదు. నా పీ.జి బాచ్ వాళ్ళంతా యెన్ .జి .వో. లలో ను , ఇండస్ట్రీ లలోను చేరిపోయారు , నేను మా చెల్లి చిన్న వాటికి సరిపెట్టుకోలేక సెంట్రల్ గవర్నమెంట్ లో పెర్సనల్ పోస్ట్ లకు ప్రయత్నిస్తో మిగిలిపోయాము కొంత కాలం వరకు . ఒక వుద్యోగం వచ్చినట్లు వచ్చి చేజారి పోయింది ఇటువంటి పరిస్థుల్లో మా అమ్మాయి ,మా శ్రీవారు నన్ను ఐ .ఏ .ఎస్ కి రాయమన్నారు.{:-( బ్లాగర్ పవన్ కళ్యాన్ ఐఏ ఎస్ ల } మా పాప నన్ను చాల చాల ప్రోతహించింది ఈ విషయం లో పెద్ద ఆరిందలనన్ను సివిల్ సర్వీసెస్ వైపు చూసేలా చేసింధనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు . అప్పటికే మా అక్క తమ్ముళ్ళు ఆ వైపు ప్రయత్న్నల్లో వుండడం వలన మా అమ్మాయి నన్ను ఆ దిశ గా మళ్లీ న్చిందని చెప్పవచ్చు .{ రేపు}
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
6 కామెంట్లు:
ఆసక్తికరం.. ఈ పవన్ కళ్యాన్ ఐ ఏ ఎస్ ఎవరండి?
@మురళి
అదేనండి కడపజిల్లా పులివెందుల వాళ్ళ అమ్మ నాన్న పొలం లో పని చేస్తూ వాళ్ళ అన్న వుద్యోగం కోసం వెయిట్ చేస్తూ వాళ్ళ చెల్లి అంత పవన్ ని కష్టపడి ఐ ఏ ఎస్ చదివిస్తూంటారు ,నిన్నటి టపా లో వుంది కదండీ -:(
ఎందుకో రేపటి పోస్టు ఆసక్తికరంగా ఉండబోతోందని నాకనిపిస్తోంది.. అంటే ఈ పోస్టు లేదని కాదు.. :)
@ఉమా
మీరు భలే వాళ్లండి మీరు ఎవర్ని నొప్పించరని అర్ధం అవ్వుతుంది , మనం రాసేది ప్రతీది నచ్చాలని ఎందుకను కుంటమండీ...ఏదో గుర్తున్నమెర జ్ఞాపకాలు రాసుకుంటూ .....:(
నేను కూడా సివిల్స్ మీద దండయాత్ర చేసాలెండి అందుకే ఆసక్తికరం అన్నాను :)
BTW, ఆ గేలరీలో ఏడవఫోటో లో కుడిపక్క చివర్న ఉన్నాయనే మీరెదుకుతున్న రచయిత, బ్లాగుమిత్రులొకరు ఈ విషయం చెప్పారు..
@ఉమా
గ్రేట్ ...రియల్లీ ఇంటరెస్టింగ్ ..మీరు ఆర్.సి .రెడ్డి స్టూడెంట్ అయ్యుంటారు .ఖదీర్ ని చూసానండి వాళ్ళ నాన్న ఫోటో లానే వుంది . థాంక్యూ .
కామెంట్‌ను పోస్ట్ చేయండి