నిన్న అత్యవసరంగా మా కమిషనర్ హైదరాబాద్ లో మాకు మీటింగ్ పెట్టారు .పది గంటలకల్లా మేము ఆయన ఛాంబర్ లో వుండాలని ఆర్డర్ చేసారు .బస్ లేక ట్రైన్ ఐతే టైం కి లేట్ అవుతదేమోనని కార్ లో నిన్న తెల్లవారు ఝాము ఐదు కి ఇంటినుండి బయలుదేరాను .సాధారణంగా ఆ రూటు లో కార్ ప్రెఫెర్ చేయము తప్పనిసరి అయితేనే వెల్తుంటాము .
బయలుదేరింది మొదలు కాకి ల హడావిడి అంతా ఇంత కాదు ,సిటీ ఔటర్ రింగ్ దగ్గర స్ముగ్లర్స్ ని పట్టుకున్నంత హడావిడి చేసారు .మొత్తం కార్ అంత చెకింగ్ ,ప్రతి ఒక్కడు డిక్కీతెయడం వెనుక సీట్ లోకి తొంగి చూడడం ,డ్రైవర్ జేబులు కాంప్ క్లెర్క్ జేబులు తడమడం ఇలా మూడు స్టేజి లో విసిగించారు .దారిలో అక్కడకడ కనబడే అక్సిందేన్త్స్ చూసుకుంటూ [ఇవి కనబడకపోతే హైదరాబాద్ దారి కాదు } హయత్ నగర్ వరకు వెళ్ళాము ,అక్కడి నుండి వున్నాయి మా తిప్పలు ఆ ట్రాఫిక్ వ్యూహంలోపడిపది కాదు పన్నెండు గంటలకు ఇబ్బంది పడుతూ ఛాంబర్ లో అడుగుపెట్టాను .అదృష్టం కొద్ది నా కొలీగ్స్నా ఎప్పటికప్పుడు నా పరిస్థితి ఫోనులో విని మా బాస్ కి వివరించారట .
సాయంత్రం నాలుగు గంటలకి మరల మన గమ్యస్థానం కి తిరుగు ప్రయాణం ..మళ్ళామొదలయ్యాయి ఎల్ .బి నగర్ దాటగానే మా తిప్పలు ,ఈసారి మేము కులాసాగా తీసుకున్నాము ,దిక్కి తెరిచి , వెనుక నా సీట్ లోను ముందు సీట్ లోను చూడడం ,కరడుకట్టిన తీవ్రవాదుల్ని కూడా అల చెక్ చేయరేమో నని నా సందేహం , మూడు ప్రదేశాల్లో ఆపి చెక్ చేసారు ,మాతో పాటు తిరుగు ప్రయాణం లో వొక నల్ల బాగ్ నిండా ముఖ్యమైన పేపర్స్ తీసుకోచ్చాము ఆ బాగ్ మాత్రం ఎవ్వరు తనిఖి చేయాల ,అది తలుచుకుని మేము నవ్వుకుంటూఉండగానే నాలుగో ప్లేస్ లో ఎకయేకి బాగ్ మొత్తం ఓపెన్ చేసి చూసారు , దయ తలచినట్లు చలో అన్నారు .నిజంగా మన ఎన్నికలు ఇంత పకడ్బందీగ జరుగుతున్నాయ అని సందేహం నాలిగింటికి బయలుదేరితే రాత్రి పన్నెండింటికి ఇల్లు చేరాను . మరి ఇంత గ కట్టుదిట్టం చేసిన మద్యం ,మనీ నామినషన్ రోజే ఎలా ప్రవహిస్తున్నాయో అర్ధం కావట్లా ! కొసమెరుపు ....తనిఖి చేసిన నా కార్ మీద గవర్నమెంట్ వెహికల్ అని వుంటుంది .
4, ఏప్రిల్ 2009, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
3 కామెంట్లు:
అబ్బో.. మన ఖాఖీల లీలలు అన్నీ ఇన్నీ కావు.. అయినా జరిగేవి జరిగిపోతూనే ఉంటాయి..
మీకు జరిగిన అనుభవమే నాకు కూడా ఎదురయ్యింది
మా అమ్మాయిని, చంటిబిడ్డను తీసుకుని వస్తుండగా కడప దాటిన తర్వాత ఇదే సీను.ఊరికే తనిఖీ చేయవచ్చుకదా దానికో buildup,హడావిడి,మాటల్లో కాఠిన్యం ఏదో మనమంతా ఉగ్రవాదులయినట్లు,దొంగలమయినట్లు.అసలువాళ్ళ దగ్గర మాత్రం కళ్ళు మూసుకుపోయింటాయి.
సరే మనల్ని ఇబ్బంది పెట్టినా వాళ్ళపని వాళ్ళు సమర్ధంగా నిర్వహిస్తున్నారులే అని అనుకుందామనుకుంటే ఆ అవకాశం కూడా ఇవ్వటంలేదు వీళ్ళు, జరిగేవన్నీ నిరాటంకంగా జరిగిపోతూనే ఉంటాయి..
కామెంట్‌ను పోస్ట్ చేయండి