10, ఏప్రిల్ 2009, శుక్రవారం

నా స్నేహితులు -6

సెప్టెంబర్ నెల చివరి లో కూడా మెయిన్ క్లాసు లు సీరియస్ గా జరిగేవి కాదు మా ఎగ్జాం వచ్చి నవంబర్ లో అక్కడ హాస్టల్లో చదువు వాతావరణం కాగడ పెట్టిన కనబడేది కాదు ,,అక్కడి నీళ్ళ వల్లోవాతావరణం వల్లో నాకు టైఫాయిడ్ , మలేరియా ఎటాక్ అయ్యాయి .మామూలు జ్వరమేనని భలవంతాన తిరిగేదాన్ని ,కదలలేక ఒకరోజు మంచం మీదనే వుండిపోతే రామ నా దగ్గరే ఉండిపోయి నాకు చేసిన హెల్ప్ మరిచిపోలేనిది ..అలానే నా పక్క రూమ్ పిల్లలు గోదాదేవి ,భాగ్య , శాంతి ని మరిచిపోలేను .చాల కాలం నాకు ఫోనులో తరుచు మాట్లాడేవారు తరువాత నా పని ఒత్తిడి లో పడిదూరం పెరిగిపోయింది .జ్వరం తీవ్రమయి అక్టోబర్ మొదటి వారం లో నేను మా ఊరు వెళ్ళిపోయాను మొత్తం సర్దుకుని .రామ అన్ని తానయి నేను ఇంటికి వెళ్ళేవరకు నాతోనే వుంది ...చాల దగ్గరయ్యాము .. అక్కడి వారందర్నీ వదిలి వెళ్లడానికి చాల భాద పడ్డాను ,వుండటం వల్ల నా చదువు కూడా నష్టపోవడం తో వెళ్ళిపోయాను . రామ తన స్నేహితుడి నే మ్యారేజి చేసుకుంది ఒక ఆఫీసర్ భార్యగా స్థిరపడింది ఇప్పటికి నాకు టచ్ లో వుండే స్నేహితురాలే .
నేను సివిల్ సర్వీసు తోపాటు గ్రూప్ వన్ రాయడం జరిగిందీ , నవంబర్ లో డిసెంబర్ లో వరుసగా మెయిన్స్రాసాను .అంతక్రితం రాసిన గ్రూప్ టుసంభందించి ఒక జాబు లో చేరటం జరిగిందీ ,,నాకు ప్రక్క మండలం లో వున్నా ప్రసన్నకుమారి నాకు మంచి మిత్రురాలే తనది మహబూబ్నగర్ లోని వనపర్తి ఎక్కువగా మీటింగ్స్ లో కలిసేవాళ్ళం మా ఇద్దరి అభిరుచులు చాల దగ్గరగా వుండేయిగంటల కొద్ది కబుర్లు దొర్లి పోయేవి .ఉద్యోగం లో శాశ్వత మిత్రులు వుండరు అన్నది మా స్నేహం పట్ల నిజం కాదు . నేను రాసిన సివిల్స్ మెయిన్స్ మరల పోవడం యధాప్రకారం కొంత కాలం డిప్రెషన్ ఉండటం తరువాత రాసిన గ్రూప్ వన్ పాస్ కావడం ఇంటర్వ్యూ కూడా సెలెక్ట్ కావడం జరిగిందీ .ఇంటర్వ్యూ ముందు రోజు వాసంతి పరిచయం కావడం తరువాత జుబ్ల్లె హిల్స్ ట్రైనింగ్ సెంటర్లో తను నా ప్రక్క రూమ్మేట్ అవ్వింది . వాసంతి కూడా మా గూటి పక్షే ,...విచిత్రమో యాద్రుచికమో తెలిదు కాని దాదాపు అందరు చక్కటి అభిరుచులున్న వాళ్ళే మా ట్రైనింగ్ పార్ట్ నెర్స్ ...అదే సమయం లో ప్రసన్నకుమారి వాళ్లకు ఒక నెల ట్రైనింగ్ జరిగిందీ అనుకోకుండా అక్కడ కలిసాము . నేను ఇల్లు ఊరు వదిలి అప్పటివరకు చదువులో పడ్డ అలసట తీర్చుకున్నది ఆ నలభయి ఐదు రోజుల్లోనే . మరల నా స్కూల్ రోజులు ,కాలేజీ రోజులు గుర్తుకు వచ్చాయి ,,మా పాప మీద కూడా భేంగా లేకుండా ఉతహంగా ఉల్లాసంగా గడిపాను గడపడమే కాదు నా ఫ్రెండ్స్ ఖాతా లో మరో నలుగుర్ని జమ చేసుకున్నాను .అందరు అల్లరి చేసే వాళ్ళే ఒక్కరు ఒక్క క్లాసు కూడా తిన్నగా వినేవాళ్ళం కాదు ,బహుశ అందరు అప్పటివరకు నాలానే అలసిపోయివుంటారు .{ తరువాత}

9 వ్యాఖ్యలు:

ఉమాశంకర్ చెప్పారు...

చక్కగా ప్లాన్ చేసుకున్నారు లైఫ్ ని.అదృష్టవంతులు మీరు.స్నేహితుల పరంగా ఇంకా.....

చిన్ని చెప్పారు...

@ఉమా
థన్క్యు...... నిజంగా స్నేహితుల పరంగా చాల సంతృప్తి వుంది .

మురళి చెప్పారు...

హమ్మయ్య.. మొత్తానికి సర్విస్ సాధించారు.. అభినందనలు.. మళ్ళీ సివిల్స్ ప్రయత్నించారా? (మీ జవాబు నాకు తెలుసు, రాబోయే భాగాలు చదవండి అంటారు:))

చిన్ని చెప్పారు...

@మురళి
ధన్యవాదాలు .... ఈ జాబ్ లో వుండగానే అదే సంవత్సరం రాసాను ప్రేలిమినరీ క్లియర్ కావడం యదా ప్రకారం మెయిన్స్ లో మార్క్స్ తగ్గడం ...నా దురదృష్టం ఎప్పుడు మూడు నాలుగు మార్క్స్ తేడా తో ఇంటర్వ్యూ తప్పిపోవడం .....ఎప్పటికైనా ఆ స్టేజి కి చేరకపోతాన అని సరిపెట్టుకుని విరమించుకున్నాను ...ఎక్కడికక్కడ సరిపెట్టుకుని బ్రతకడమే జీవితం కదండీ -:) వచ్చే టపా అన్నారు కాబట్టి ఇప్పుడు రాసాను మీకు జవాబు .

పరిమళం చెప్పారు...

ప్చ్ ... కష్టే ఫలే ...చిన్ని గారూ !

చిన్ని చెప్పారు...

@పరిమళం
ధన్యవాదాలు

రవిగారు చెప్పారు...

chinni mottaniki confered anna sadhincharu ga congrats , yeppudanna state govt ki deputation vachinappudu kalisi pani chestamemo chuddam .

చిన్ని చెప్పారు...

@రవిగారు
ధన్యవాదాలు తమరు ఎక్కడ చేస్తారండి ?

రవిగారు చెప్పారు...

prastutam kendra prabutwam lo