సివిల్ సర్వీసు రాయాలని నిర్ణయించుకోవడం మొదలు నాది ఏకాంత వాసం అయ్యింది {ఏర్పరచుకున్నాను} ఈ ఎగ్జామ్స్ పైన కనీసం గైడ్ చేసే సంస్థలు సరయినవి మేమున్న సిటీ లో లేవు ,అటువంటి పరిస్థితి లో ఢిల్లీ నుండి హైదరాబాద్ నుండి బుక్స్ పోస్ట్ ద్వారా తెప్పించుకుని నా సొంత నోట్స్ తయారు చేసుకుంటూ ,పూర్తిగా పుస్తకాల తోనే నా సహజీవనం అయ్యింది .మా పాప ,తను సాయంత్రం త్వరగా వచ్చిన డిన్నర్ కానిచ్చుకుని ప్రక్క వీధి లో వున్నఅమ్మ వాళ్ళింటికి వెళ్ళిపోయి నిద్ర టైం కి ఇంటికి వచ్చేవారు ఆవిధం గా వాళ్లు నాకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేసేవాళ్ళు . వానలు రాని వరదలు రాని పండుగలు రాని అవేవి మా ఇంట్లో కనబడేవి కాదు .మొట్టమొదటి సారి ప్రిమిలిమినరీ పాస్ అయినప్పుడు మా పాప ముఖం లో వెలుగు లు ఇప్పటికి మరిచిపోలేను . నేను తనని తగినంతగా శ్రద్దగా పట్టించుకోపోయిన ఎక్కడికక్కడ సర్దుకుంటూ నేను సర్వీసు తెచ్చుకోవడమే ధ్యేయమన్నట్లునన్ను ఎంకరేజి చేసేది .అప్పట్లో స్టేట్ సర్వీసు స్టాఫ్ సెలక్షన్ అన్ని అటెంప్ట్ చేశాను ,సివిల్స్ మెయిన్ యెగ్జమ్ వరుసగరెండు సార్లు క్లియర్ కాకపోవడం తో నా సబ్జెక్టు పబ్లిక్ అడ్మినిస్త్రషన్ నుండి తెలుగు లిట్ట్ కి మార్చుకున్నాను. హైదరాబాద్ లో తెలుగుసాహిత్యం బాగా చెప్తారు ,వినకుండా రాయలేము ,మంచి నోట్స్ కూడా ఇస్తారు అని ఎవరో చెప్పగా అప్పుడు అడుగు బయటకు పెట్టాను ఒంటి స్థంబం మేడనుండి .
నేను హైదరాబాద్ వెళ్లడానికి చాల కష్టపడ్డాను. ప్రశాంతం గా ,ఒంటరిగా వుండటం అలవాటు పడ్డ నా మనస్సుకి సర్దిచేప్పుకోవడానికి ఎంతో ఇబ్బంది పడ్డాను ,ఒకటి కావాలంటే వేరొకటి వదులుకోవాల్సిందేనని అప్పటికే నాకు అర్ధం అవ్వింది.ఇల్లు వదిలి హైదరాబాద్ లోని ఒక హాస్టల్లో పడ్డాను ,హాస్టల్ కి నేను చేరిన స్టడీ సర్కిల్ కి ఒక పది నిమిషాల దూరం .అక్కడ కొత్త జీవితం మొదలయ్యింది -:( నా రూమ్ పక్క ఒక వైపు టీవీ లో ఆర్టిస్ట్ గా పనిచేసేవాళ్ళు ఒక ప్రక్క కమల నెహ్రూ పోలితెక్నిక్ లో చదివే అమ్మాయిలూ ఏదో జాబ్స్ కి ప్రయత్నించే అమ్మాయిలూ అలానే మాకులా స్టడీ సర్కిల్ అమ్మాయిలూ వుండేవాళ్ళు .మా వింగ్ లో దాదాపు గుంటూరు వాళ్లు వరంగల్ ,నల్గొండ వాళ్లు వుండేవాళ్ళు .వాళ్ళందర్నీ చూస్తోంటే వీళ్ళంతా జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తున్నట్లు తోచేది ,ఎప్పుడు నవ్వులు పువ్వులు విరిసేవి ,..నా ముందేమో కొండంత భాద్యత కనబడేది ,డిప్లొమా అమ్మాయిలూ నాతో త్వరగానే కలిసిపోయారు "అక్కా" అంటూ ,నాకోసం ఫుడ్ తీసుకు రావటం మొదలుకొని బాత్రూం రిజర్వు చేయడం వరకు . మాకు క్లాసు సాయంత్రం మూడు లేక నాలుగు గంటలకు వుండేవి తిరిగి వచ్చేసరికి ఎనిమిది దాటేది మనం తెలుగు తో పాటు జనరల్ స్టడీసేకూడా చేరాము . ఒక రెండు రోజులు ఒక్కదాన్నే వెళ్లాను తరువాత గుంటూరు అమ్మాయి క్లాసు లో పరిచయం అవ్వింది ,తను ఢిల్లీ జీ .యెన్ .టి యు లో చదివనాని నేనుండే హాస్టల్లో చేరానని పరిచయం చేసుకుంది తన రూమ్ కూడా నేనుండే వింగ్ లోనే వుండేది .ఆమె ఎప్పుడు బుక్స్ కాలేక్ట్ చేస్తూ ,osmaaniyaకి తిరుగుతూ క్లాసు టైం కి చేరేది రాత్రి డిన్నర్ తరువాత డిస్కషన్ అంటు నా రూమ్ కి వచ్చేది ఆ రోజు కబుర్లన్నీ పూస గుచ్చినట్లు నేను అడగకపోయినా చెప్పేది ,కబుర్లుఆసక్తిగా తోచి పక్క పిల్లలు వాళ్లు వీళ్ళు చేరేవాళ్ళు చివరికి ఆ అమ్మాయిల ఇందిరా పార్క్ విశేషాలు వాళ్ల బాయ్ ఫ్రెండ్ కబుర్లు ,ఆ తరువాత రోజు వాళ్ల ప్రోగ్రమ్మ్స్ ఇలా సాగేవి ....మన చదువు అలాలా సాగేది ,ఇంటి మీద బెంగ తో ఒక రెండు వారాలు మద్యలో ఊరేల్లోచ్చేదాన్ని .నేను చేరి నెల దాటాక ముందే రెండు వారాలు ఇంట్లో రెండు వారాలు హైదరాబాద్ లో వున్నాను .క్లాసు లు ఎప్పుడు సమయానికి జరిగేవి కావు పైగా వర్షాలు పడే కాలం చస్తూ బ్రతుకుతూ వెళ్తే క్లాసు కాన్సిల్ అనేవాళ్ళు ఆ తరువాత క్లాసు వుండేది ఈ మధ్య కాలం లో రాఘవేంద్ర కేఫ్ లో హోటల్ వాడిని పోషి స్తూ కాలక్షేపం చేసేవాళ్ళం ,తెలుగు క్లాసు మానేదాన్ని కాదు .నాకు తెలుగు క్లాసు లో రామ పరిచయం స్వల్పకాలం లోనే ఇద్దరం చాల దగ్గర అయ్యాము తను కూడా మేముండే హాస్టల్ క్రింద వింగ్ లో వుండేది తనది తిరుపతి అప్పటికే రెండేళ్ళ నిండి తను అక్కడ వుంటోంది ,చదువు మీద పెద్దగ ఇంట్రెస్ట్ వుండేది కాదు కాని తను చేసుకోబోయే అబ్బాయిని మాత్రం కంటికి రెప్పల చూసుకుంటూ చదివించేది ,అతను బాగా కష్టపడేవాడు [అతని పేరు ఇక్కడ రాయడం లేదు మంచి పోసిషన్ లో వున్నాడు }అతని స్నేహితులంతా బాగా చదివేవాల్లె ,వాళ్ళందరికీ నేను ఇన్స్పిరేషన్ అనేవాళ్ళు ఇల్లు పిల్లని వదిలి ఇలా వచ్చెనని ,కేఫ్ లో కూర్చుని మా సబ్జక్ట్స్ పై డిస్కషన్ పెట్టుకునేవాళ్ళం ,,,,{తరువాత}
]
]
9, ఏప్రిల్ 2009, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
7 కామెంట్లు:
వానలూ వరదలూ ఇంట్లో ఎలా కనపడతాయండీ.. పండగలవరకూ పర్లేదు గాని :) సరదాగా అడిగానులెండి..
చాలా కష్టపడ్డారండీ మీరు..
@ఉమా
అవునా ! కాని మా ఇంట్లో కిటికీ పక్కన కూర్చుంటే భూమి ,ఆకాశం పచ్చని చెట్లు చెట్ల మీద వుండే పక్షులు ,ఆకాశం లో ఎగిరే పక్షులు ,చెట్టు మీద కూర్చుని తీరికగా కూసే కోయిలను ,చిన్న చినుకు మొదలు కుంభ వ్రుస్టిని చూడొచ్చు.:(
బావుందండీ..
నిన్న అడిగారు కదా! నేనెక్కడా కోచింగుకు వెళ్ళలేదండి నా మకాం అంతా ఉస్మానియా మెయిన్ లైబ్రరీలోనే. ప్రిలింస్ లోనే చేతులెత్తేసి బ్రతకడానికి దగ్గరిదారి వెతుక్కున్నా కంప్యూటర్స్ లో చేరి.. :)
intaki sadhinchara leda?
@ఉమా
మంచి పని చేసారు ....ఎంతోమంది సంవత్సరాలు దాని మీదే పెట్టి కోరిన సర్వీసు రాక వచ్చినదాన్ని వదులుకోలేక ,చేసే ఉద్యోగానికి తగిన న్యాయం చేయలేక నడిపెస్తున్నారు
@రవి గారు
వచ్చే టపా లో రాస్తానండి ....సాధించానో ...లేదో ....
"మా ఇంట్లో కిటికీ పక్కన కూర్చుంటే భూమి ,ఆకాశం పచ్చని చెట్లు చెట్ల మీద వుండే పక్షులు ,ఆకాశం లో ఎగిరే పక్షులు ,చెట్టు మీద కూర్చుని తీరికగా కూసే కోయిలను ,చిన్న చినుకు మొదలు కుంభ వ్రుస్టిని చూడొచ్చు" మరి మాకెప్పుడు ఆహ్వానం :)
@పరిమళం
మీరు ఎప్పుడు వస్తానంటే అప్పుడు స్వాగతం పలకనూ! జూన్ నెలలో చాల బాగుంటుంది .
కామెంట్‌ను పోస్ట్ చేయండి