18, జనవరి 2010, సోమవారం

"బ్లాగ్ లోకం -బంగారు లోకం "???????


"బ్లాగ్ లోకం -బంగారులోకం " అని సరిగ్గా తొమ్మిది నెలల క్రితం(ఏప్రిల్ ) పోస్ట్ రాసాను ,అప్పటికి నేను బ్లాగ్ రాయటం మొదలెట్టి రెండునెలలు అయ్యింది .అప్పట్లో టైం చాల వేస్ట్ చేస్తున్నాను అనే బెంగ ఒక ప్రక్కన చూడకుండా ఉండలేని పరిస్థితి మరోప్రక్కన .అప్పట్లో చాల మంది చాల రకాలుగా సలహాలు ఇచ్చారు .ఏదో క్రొత్త కాబట్టి ఇలా అంటున్నారు మరో మూడు నెలలు ఆగి అభిప్రాయం చెప్పమన్నారు .బ్లాగ్ చదవడం ,రాయడం అంటే విముఖత కలగలేదు కాని నా దైనందిన జీవితంలో మాత్రం మార్పులు కలిగాయి .ముఖ్యంగా నేను అమిత ఇష్టంగా చదివే పుస్తకాల నుండి కొంత దూరం అయ్యి వాటి స్థానే బ్లాగ్ ఆక్రమించింది రెండు నా పూల మొక్కల ఆలనాపాలనా నిర్లక్ష్యం చేయడం జరిగింది అలాగే అద్దంలా మెరిసే నా ఇల్లు కొంచెం మసకబారింది వస్తువులు స్థానబ్రంశం చెందితే కలవరపడే నేను నిర్లిప్తంగా తయారయ్యానుఆఫీసు వర్క్ మీద కొంత ప్రభావం చూపింది నాలో కొంత నిర్లక్ష్యం ఏర్పడింది .నా కళ్ళచుట్టూ డార్క్సర్కిల్స్ ఏర్పడుతున్నాయి అలసట వలన.
ఇవండీ నా ఆత్మాపరిశీలనలో తేలిన నెగిటివ్ అంశాలు . నన్ను నేను నియంత్రించుకోవడంలో కొంత వరకి సఫలం అయ్యాను .నా ఆఫీసు పని కి అంతరాయం కలగకుండా పూర్తిగా ఆఫీసు సమయంలో కూడలి ,జల్లెడ హారం చూడటం మానేసాను అసలు బ్లాగ్ అనేదాన్ని తెలియనట్లే ఉంటున్నాను .ఎటొచ్చి ఇంటికి వచ్చాక మాత్రం వీలున్నప్పుడల్లా ఓపెన్ చేస్తున్నాను .ఇది కూడా నియంత్రిన్చాలనే ఆలోచనలో వున్నాను .
.బ్లాగ్ ల వలన మనసుకి నచ్చిన మిత్రులు కూడా కలిసారు...బహుశ ఈ బ్లాగ్ లోకం లోకి అడుగుపెట్టకపోతే నాకు పరిచయం అయ్యేవారు కాదుగా .....

అసలు బ్లాగ్ లోకం బంగారులోకమా అని తరచి తరచి నేను రకరకాల బ్లాగ్స్ చదువుతుంటే నేను గమనించినవి కొన్ని ....(రేపు)

10 కామెంట్‌లు:

కాజ సురేష్ చెప్పారు...

మీ నియంత్రణ చిట్కాలు నేను కూడా ఆచరించాలి.

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

బ్లాగుల బంగారు లోకంవల్ల బంగారం లాంటి చిన్ని వదనం చిన్నబోవుటయా? చిన్ని పెద్దకళ్ళ చుట్టూరా చిన్న వలయాలా? గాలి వాటుకు నాట్యాలాడుతూ కళ కళ లాడిన చిన్న చిన్న మొక్కలు ఖిన్నులగుటయా? హతవిధీ ఏమీ ఈ వైపరీత్యం? ;)

అజ్ఞాత చెప్పారు...

good and bad exists everhere .. telugu blogs are no exception .. మనం ఎలా తీసుకుంటున్నాం అనేది ముఖ్యం ..

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

కొంచెం మనకు మనం కొన్ని పరిమితులు విధించుకుంటూ(ఆఫీస్లో చూడకూడదు..రోజుకో గంట మాత్రమే బ్లాగులు చదవటం...అనవసర విషయాలు పట్టించుకోకపోవటం...లాంటివి) వాటికి లోబడి ముందుకు వెళితే బ్లాగ్లోకం నిజంగా బంగారు లోకమేనండి నా దృష్టిలో...

మాలా కుమార్ చెప్పారు...

అవును .బ్లాగ్ లో పడ్డాక మీరు చెప్పిన నెగిటివ్ విషయాలు నాకూ జరిగాయి . అందుకే నేను బ్లాగ్ తో ఎక్కువ సమయము గడపకుండా వుండటానికి విశ్వప్రయత్నం చేస్తున్నాను .

మురళి చెప్పారు...

తర్వాతి భాగం కోసం ఎదురు చూస్తూ..

మధురవాణి చెప్పారు...

తరవాత మీరేం చెప్పబోతున్నారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నానండీ చిన్ని గారూ..

ప్రేరణ... చెప్పారు...

అవునా ఇలాంటి అనర్ధాలు ఉన్నాయా అని రేపటి టపాకోసం ఎదురుచూస్తూ ఆలోచిస్తున్నానండి.

Hima bindu చెప్పారు...

@కాజ సురేష్
నిజంగానే మన అమూల్యమైన సమయాన్ని కొంత కోల్పోతాము ,అంత పెద్దగ పని లేకపోతె తప్పించి . నియంత్రణ అవసరం నా మట్టుకునా అనుభవ పాఠం.
@భా.రా.రె
మీకు అన్నీ హాస్యంగానే కనబడుతాయి -:(
నా చెట్లు ,మొక్కలు మాత్రం నాకోసం బెంగపెట్టేసుకున్నాయి,అంతగా నిర్లక్ష్యం చేసాను ....సో దిద్దుబాటులో ....
@A to Z dreams
అందుకే కదండీ నా 'ఆత్మా పరిశీలన '
@శేఖర్
ఆఫీసు వరకు నా పట్టు సాధించగలిగాను ,ఇంట్లో కూడా పరిమితులు విధించుకొనే ప్రయత్నంలో ...ఈ బంగారులోకం మత్తులో పడిపోతున్నాను అనే నా భాధ ఇది నా వర్క్ పైన ,ఇతరత్రా విషయాల పయిన ప్రభావం చూపుతుంది.
@మాలకుమార్
అవునండి ఆడవారికి మరీ ఇబ్బంది ,మగవాళ్ళకి పనేమీ ఉండదుగా -:)
@మురళి
వామ్మో !ఇది సీరియల్ కాదండి ,రాత్రి రాయడానికి భద్దకం వేసి ఆపేసాను ,ఏదో నా 'నా మనసులో మాటలు ' నాలుగు పంచుకుందామనే ,ముఖ్యంగా నా లాటి కొత్త వాళ్ళ కోసం

Hima bindu చెప్పారు...

@మధురవాణి
@ప్రేరణ
ధన్యవాదాలు :)