26, జనవరి 2010, మంగళవారం

చేదు జ్ఞాపకం

రిపబ్లిక్ డే అనగానే నా మనస్సు తొమ్మిది యేళ్ళు వెనక్కి పరిగెట్టి కొద్ది క్షణాలు మనస్సు చేదేక్కుతుంది. నాడు భారత దేశాన్ని భుజ్ తదితర ప్రాంతాల్ని తీవ్రంగా కుదిపేసి తీవ్రమయిన భూకంపం కొన్ని క్షణాల్లోనే వేలాది ప్రాణాలు బలి తీసుకుంది. ఆనందం గా గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్న చిన్నారులు స్కూలు శిధిలాల క్రింద నలిగిపోయారు ,భయంకర మయిన వ్యధలు ..గాధలు ఇప్పటికి తేరుకొని కోలుకొని అనాధలు ..ప్చ్ .చాలాకాలం వెంటాడిన ఆ సంఘటనలు ...మనవంతు ఎంత చేసిన అది అత్యల్పమే ...ప్రక్రుతి ముందు అల్పులమే ...ఆనాడు అసువులుబాసిన చిన్నారులకి ,పెద్దలకి నా ప్రగాడ "నివాళి ".

6 కామెంట్‌లు:

జయ చెప్పారు...

నిజమేనండి. చాలా హృదయవిదారక సంఘటన. ఏనాటికీ మర్చిపోలేము. తల్లితండ్రుల వ్యధ ఏనాటికీ తీరనిది.

మురళి చెప్పారు...

ఎప్పటికీ మర్చిపోలేని ప్రకృతి విలయాల్లో ఈ భూకంపం ఒకటి.. శతాబ్దంలోనే పెద్ద విపత్తు అన్నారప్పట్లో..

ప్రేరణ... చెప్పారు...

ప్చ్...భాధాకరమైన విషయం!

Unknown చెప్పారు...

చాలా విషాద ఘటనను గుర్తుచేసారు .

పరిమళం చెప్పారు...

నిజమే కొన్ని వైపరీత్యాలను మర్చిపోలేం ...

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

అప్పట్లో ఇండియాటుడే మేగజైన్ లో దీనికి సంభందించి వేసిన ఫోటోలు ఇప్పటికీ గుర్తున్నాయండి నాకు. నిజంగా అది చాలా దురదృష్టకర సంఘటన...