18, ఫిబ్రవరి 2011, శుక్రవారం
ఇదే జీవితమా!
ఎందుకో నా ఆలోచన ధోరణిలో రాను రాను మార్పు కనిపిస్తుంది.ఒకప్పుడు వున్నపోటీ తత్వం ఇప్పుడు ఉండటంలేదు ప్రతిపనికి ఇప్పుడు చేయకపోతే నష్టం ఏవిటి నేనే ఎందుకు చేయాలి చేయకపోతే వచ్చే పరిణామాలు ఏవిటి ఇలా సాగిపోతుంది ....నావరకు ఫరవాలేదు కాని నాకున్న ఒక్కగానొక్క బిడ్డ మీద కూడా నా ప్రతికూల ఆలోచనలు ప్రసరిస్తున్నాను.ఒకప్పుడు విపరీతంగా ప్రోత్సహించిన నా నోటి తోనే అంత కష్టపడకు సర్వీసులు తెచ్చుకోవడమే జీవితం కాదువేరే వైపు కూడా జీవితం వుంది ఇంకా నచ్చినట్లు జీవించవచ్చు అని హితవులు పలుకుతున్నాను .నాకులా తను ఎందుకు ఇబ్బంది పడాలి అంత అవసరమాఅని నా మనస్సు ఎదురు తిరుగుతుందికొన్ని సౌఖర్యాలు అధికారాల తోపాటు ఎన్నో అసౌఖర్యాలు మనస్సుకి నచ్చనివి కూడా భరించాలి. తినడానికి నిద్రపోవడానికి సమయం లేని పని ఒత్తిడితో కొన్నాళ్ళకి ఆరోగ్యాన్ని కోల్పోయి చివరికి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమి మిగుల్చుకుంటామో అర్ధం కావడం లేదు..దీనికి ఎక్కడో చోట ఆనకట్ట వేయవలసిందే అనుకుంటాను .గతంలో ఎంతోమంది మిత్రులు ఇంతా కష్టపడాలా అని అంటుంటే వారు ఇలా నిరుత్సాహ పరుస్తున్నారు ఇదేమి ధోరణి అనిపించేది.మనకోసం మనం బ్రతుకుతూ సాధ్యమైనంత మనకున్న పరిధిలోనే సాటి మనుష్యులకు సాయపడలేమా..దానికిప్రభుత్వుద్యోగమే తోడ్పాటు కావాలా స్వచ్చంద సంస్థ ద్వారాకూడా మన అభీష్టం మేర తోడ్పాటును అందించవచ్చును కదా అనిపిస్తుంది.బహుశా అక్క కూడా ఇలానే ఆలోచించి కొన్ని నెలలుబ్రేక్ తీసుకుందేమో..హ్మం ...ప్రతిది తెలియకుండానే అక్క అడుగుల్లో అడుగులు వేస్తూ నడుస్తున్న నేను తనలానే మార్పు కోరుకున్టున్నానేమో చూడాలి.నాన్న మాకు ఇచ్చిన స్ఫూర్తి మా పిల్లలకి ఇవ్వలేకపోతున్నాం ప్చ్... ..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
4 కామెంట్లు:
chinni garu, Everybody goes through these phases. With age and experience we see things in a totally different way. That is a good thing. Hardworkers like you will do good in what ever you choose to do.
Thanks
Ravi
Visit Bighelp
@రవి
మీరు ఇచ్చిన సైట్ చూసాను .థాంక్సండీ.
<>
నిజమే మీరు చెప్పింది కాని కొన్ని ఉద్యోగాల్లో ఏది అవాయిడ్ చెయ్యలేం కదా ..మీరన్న పైవన్నీ మనతో మనలో ఒక భాగమైపోయాయి.అప్పుడప్పుడు అల అనిపించినా మళ్ళీ రొటీన్ అంతే ...we have to go on
@BHAANU
THANQ:)
కామెంట్‌ను పోస్ట్ చేయండి