బ్రిటిషు పాలకులు తమకోసం నిర్మించు కున్న ఆ భవనం హుందాగా చరిత్రకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలబడి వుంటుంది .రైలింగ్ పట్టుకుని టకటక మని చప్పుడు చేసుకుంటూ ఆ మెట్లు ఎక్కి దిగుతున్న ప్రతిసారి నా మనస్సు చరిత్రలోకి పరిగెడుతుంది .ఎప్పుడో బ్రిటీషువారు కట్టిన ఆ భవనంలో జిల్లా ముఖ్యాధికారి కొలువు వుంటుంది ,కొండరాళ్ళ తో చెక్క మెట్ల తో చాలా పటిష్టంగా వుంటుంది .పనిమీద ఎప్పుడు వెళ్ళిన నా మనస్సు వెళ్ళిన పని నుండి మరలి చరిత్రలోకి పరిగెడుతుంది .
చరిత్ర అంటే నాకు చాలా ఇష్టం .నేటి కథేగా రేపటి చరిత్ర!చరిత్ర ఎందుకు చదవాలి అదేమైన కూడు పెడుతుందా ఈ రాజు ఎప్పుడు పుడితే ఏమి చస్తే ఏమి ఆ తేదీలు సంవత్సరాలు బాబోయ్ అంటారు చాలా అమాయకంగా :-)
నేను చరిత్ర చదవబట్టే అది నాకు కూడు పెడుతుంది ఆ సబ్జెక్టు మీద ఇష్టం ప్రేమ ఇంకా వగైరా వగైరా ఉండబట్టే కదా ఒక ఆప్షన్‌గా తీసుకుని మాక్సిమం స్కోరు తో వరుసగా రెండు మూడు ఉజ్జోగాలు సంపాదించాను :-)
సమావేశ మందిరంలో కూర్చున్న నా కళ్ళు నిశితంగా కూడ్యాలు దర్వాజాల వైపు చక్కర్లు కొడుతుంటాయి .అప్పుడెప్పుడో పందొమ్మిదివందల ఇరవయ్యో లో భాధ్యతలు నిర్వహించిన నోరు తిరగని అధికారుల పేర్లనుంచి ఇప్పటివరకు నిర్వహిస్తున్నవారివి చెక్క ఫ్రేం లో రాసి వున్నాయి చదుకుంటూ అప్పటిలో అక్కడ కొలువు చేసిన గతించిన అధికార్లను ఊహ రూపం లో చూస్తూ రేపటి మనల్ని చూస్తుంటాను .
పాలకులుగామౌర్యుల్ని గుప్తులని అల్లాఉద్దిన్ ఖిల్జీ ని అక్బర్నిషేర్ష సూరిని ఔరంగాజేబుని తుగ్లక్ ని శివాజీ ని కృష్ణదేవరాయని ఇంకా ముఖ్యంగా మనకి పాలన వ్యవస్థని అంచెలంచెలుగా అందించిన "బ్రిటిషు "వారిని ఇష్టపడతాను .బ్రిటిషువారి జ్ఞాపకాలుగా మిగిలిపోయిన (వదిలివెళ్ళిన )ఆ పూరాతన కట్టడాలు నాకెంతో ఇష్టం .
31, జులై 2011, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
3 కామెంట్లు:
ఇంతటి ఘన చరిత్ర మనకుంది. కాని దానిని తిరష్కరించి చిన్నచూపు చూసి, పూర్తిగా కనుమరుగు చేస్తున్నారు ప్రస్తుతం. అటువంటి వారు చరిత్రహీనులు. చరిత్ర గొప్పతనం అందరూ గుర్తిస్తే బాగుండు.
రాష్ట్రంలో మెజారిటీ కలెక్టరేట్లు చారిత్రిక భవనాల్లోనే ఉన్నట్టున్నాయండీ.. వీలయితే ఆ దిశగా దృష్టి సారించండి.. బాగుంది సిరీస్..
@జయ
చాలామంది లో చిన్నచూపు చూసానండి కేవలం దాని విలువ తెలియక మాత్రమె .
@మురళి
నిజమే దాదాపు కలక్టరు ఆఫీసులన్నీ పూర్వకాలపు కట్టడాలే కాని ఇప్పటి హంగులతో వాటి పూర్వరూపం కోల్పోయి ఉన్నాయనుకుంటాను ,ఇవే కాకకొన్ని చోట్ల సముద్ర తీరప్రాంతాల్లో విద్యాలయాలు దేవాలయాలు ఇప్పటికి యధాతధంగా వున్నాయి .అన్నట్లు సీరిస్ రాయడం లేదండోయ్ అలాటి ఆలోచనకూడా లేదు అప్పటికప్పుడు నా మనస్సులోని భావాలు అలా పెట్టాను అన్నమాట !
కామెంట్‌ను పోస్ట్ చేయండి