14, ఫిబ్రవరి 2009, శనివారం

"ఇంతకీ నా పేరు ఏమిటి?"

"అనగనగా ఒక ఈగ, ఇల్లు అలుక్కుంటూ తన పేరు మరచిపోయిందట.." ఈ కథ నా చిన్నతనంలో విన్నప్పుడు తెగ ఆశ్చర్య పోయేదానిని..నిజంగా మన పేరు మరచిపోతామా అని..

పేరంటే గుర్తొచ్చింది, చిన్నతనంలో నా పేరు ఎవరైనా అడిగితే చెప్పటానికి చాలా బిడియపడేదానిని. మరీ ముఖ్యంగా మా అమ్మమ్మ వాళ్ళపల్లెటూరు వేసవిసెలవుల్లో వెళ్ళినప్పుడు, పిల్ల గ్యాంగ్ తో ఆటలప్పుడు వోడిపోయినవాళ్ళు ఉక్రోషంగా నన్ను ఇత్త డిబింది, రాగిబింది, నీళ్ళబింది అని గెలిచేసినపుడు అవమానంతో, అదేదో నేను నేరంచేసినట్లు ,అమ్మ దగ్గరకు వెళ్లి "ఎందుకమ్మా నాకీ పేరు పెట్టారు" అని మారాం చేసేదాన్ని. "మీ నాన్న పెట్టారమ్మా..చక్కటి పేరు..నీకేం" అనేది అమ్మ. నాన్న మీద చాలా కోపంగా ఉండేది, ఆయన్ని అడిగే ధైర్యం ఉండేదికాదు మనకి. ఎంచక్కగా పద్మ, ఉమా, లలిత అని పెట్టొచ్చుగా అనుకునేదానిని.

నేను రెండవ తరగతిలో వుండగా మా తెలుగు మాస్టారు హాజరు తీస్కోంటూ, నా పేరు పిలుస్తో "ఎవరమ్మా లేచినిలబడండి" అన్నారు. నేను అవమానంతో ఏం వినాలో అని లేచి నిలబడ్డాను. నా వంక మాస్టారు ప్రశంసపుర్వకంగా చుస్తూ "ఎంత చక్కటి పేరు పెట్టారమ్మా.. ఎవరుపెట్టారు? నాన్నగారు ఏంచేస్తారు?" వగైరా అడిగారు. నాకు ఇప్పటికి గుర్తే..నిజ్జంగా మాస్టారు నాపేరు పొగిడారా? లేక అందరిలా వెక్కిరించారా అని అనుమానపడ్డా. నా అనుమానాన్ని వమ్ము చేస్తూ, తరగతిలో అందరికి నా పేరులోని అర్ధం చెప్పారు. ఆ మాస్టారి పేరు శ్రీనివాసరావు.

కాలక్రమాన, నాలోవున్న నూన్యతా భావం పోయి, ఎవరైనా నా పేరు అడిగినా గర్వంగా అర్ధం కూడా చెప్పేదాన్ని. నాన్న లోని సాహిత్య అభిలాష ,అభిమానం,మొదటిగా పుట్టిన అక్కకి, నాకు, ఇంత మంచి పేర్లు పెట్టడానికి దోహదపడింది. ఎంతమందిలో ఉన్నా ప్రత్యేకంగా ఉంటాయి మా పేర్లు. ఇంతకీ..నా పేరుఏమిటి?

14 కామెంట్‌లు:

మురళి చెప్పారు...

బాగుందండి మీ పేరు వెనుక కథ.. ఏదో ప్రత్యేకమైన పేరే అయి ఉంటుంది. నాన్న గారు సాహిత్యాభిమాని అన్నారు.. ఆలోచిస్తాను.. తదుపరి టపాల్లో ఏమైనా క్లూలు ఇవ్వండి..

Mahitha చెప్పారు...

:)

హిమ బిందు.

కాని అక్క పేరు ఏంటో తెలియలేదు.

సుభద్ర చెప్పారు...

mee peru himabindu ayyiuntundi.
gurtochindaaaaaaaaa

Padmarpita చెప్పారు...

ఇప్పుడే మీ బ్లాగ్ లోకి తొంగిచూసాను...
Welcome to our world...
మీ పేరు "బిందు" కాకపోతే చెప్పేయండి, మనం ఫ్రెండ్స్ కదా!

uma చెప్పారు...

రాగిబింది, ఇత్తడిబింది అని హింట్ ఇచ్చారు కాబట్టి మీ పేరు బిందు, కరెక్టేనా..?

Hima bindu చెప్పారు...

హాయ్ ఉమగారు ,పేరు మిదనిరేస్పొండ్ అయినర ,,ఎనీ హౌ ma blog visit చేసినందుకు థన్క్యౌ.

Hima bindu చెప్పారు...

హాయ్ ఉమగారు ,పేరు మిదనిరేస్పొండ్ అయినర ,,ఎనీ హౌ ma blog visit చేసినందుకు థన్క్యౌ.

Unknown చెప్పారు...

మీ గురువు గారు చెప్పిన వివరణ కూడా రాస్తే బాగుండేది

Hima bindu చెప్పారు...

@ఫణి గారికి ,,మా గురువు గారి వివరణ ఇంకోసారి రాస్తనండి ..రెండు సంవతరలనుండే నా వెనుకటి ప్రపంచంలోకి వచ్చాను ,నా పేరు గుర్తు చేసుకొనే ప్రయత్నాలో ఉన్నాను ,,ఒక ఫ్రెండ్ వలన.

Unknown చెప్పారు...

oho mi peru parimala anna mata e blag lokam lo kotta ga vikasincharu mi suvasanala gubalimpulanu ye pramaada la joliki pokunda vedajalla galaru .

Hima bindu చెప్పారు...

థాంక్స్ రవిగారు , కాని నా పేరు పరిమళ కాదు. తప్పకుండ మీ సలహా పాటిస్తాను .
మా తోట లోని సంపెంగలు , విరజాజులు , నైట్ క్వీన్ , ఆయా కాలాలలో రోజు మా ఇంటిలోకి
పరిమళాలు వెదజల్లు తావి .

ఏకాంతపు దిలీప్ చెప్పారు...

ఇలానే నాకు రెండో తరగతిలో రూప అని క్లాస్మేటు ఉండేది, చుట్టాలు కూడా... మేమంతా అర్ధ రూపా, ఒక్క రూపా, రెండు రూపాలు... అని ఏడిపించేవాళ్ళము... ( రూపాయిని పల్లెటూళ్ళల్లో రూపా అనే అంటారు కదా) ... అదే రూప తరవాత మా అత్త కి కోడలయింది... ఆ మధ్య 15 ఏళ్ళ తరవాత ఒక పెళ్ళిలో కనపడితే నన్ను గుర్తుపట్టి వాళ్ళింటికి ఆహ్వానించింది...

Hima bindu చెప్పారు...

చాల సంతోషంగా ఉంటది కదండీ ,ఎన్నో ఏళ్ళ తరువాత కలిస్తే .

అజ్ఞాత చెప్పారు...

మీ కథ చదివినంత సేపు మీరు "అర్జున్" సినిమాలో మహేష్ బాబు తన పేరు సినిమా ముగిసే సమయంలో చెప్పినట్టు మీ పేరు కూడా అలాగే వెల్లడిస్తారని అనుకొని పప్పులో కాలేసాను. మీ మాస్టారు మిమ్ములను పొగిడారో, లేక అవమనించారో తెలవడం లేదు అని మీరు చెప్తుంటే నాకు మా తెలుగు పంతులు జయరామి రెడ్డి గారు చెప్పిన "వ్యాజస్తుతి" గుర్తుకొస్తుంది. వ్యాజస్తుతి అంటే 'తిట్టినట్టు పొగడడం లేక పొగిడినట్టు తెట్టడం'.