2, ఏప్రిల్ 2009, గురువారం
వకుళ పూలంటే .....
వకుళ పూలంటే "బొగడ పూలు " అని ఒక జర్నలిస్ట్ మిత్రురాలు చెప్పారు ,ముందుగా ఒక జర్నలిస్ట్ మిత్రుడ్ని అడిగాను తను బిజీగావుండి ఆలోచించలేక పోయారట .ఇంతకి ఆ పూలు మా కాలనీ రోడ్లన్నీ చోట్ల నక్షత్రాల్లా పడివుంటాయి ,వాటి కాయలు ఆరెంజి కలర్ లో కంటికింపుగా తినడానికి కూడా పనికి వస్తాయి .మా ఇంటిముందు సంపెంగ పక్కనే పెట్టాను కాని ఈ పూలకి ఇంత చరిత్ర వుందని సుధామూర్తి "ఏం .డి .గారి భార్య "నవల చదివాక తెలిసింది . కన్నడ లో రాసింది తెలుగు లో అలకనంద పబ్లిషర్స్ ప్రచురించారు .అనువాదం ఇంపుగా లేక పోయిన {నా అచ్చు తప్పుల్లా}వదలకుండా ఏకబిగిన చదివేస్తాము .చాల చాల బాగుంది .కుదిరితే తప్పకుండ చదవండి ,కారీర్ లో పడి సాఫ్ట్ వేర్ వాళు వైఫ్ ని ఏవిదంగా నిర్లక్ష్యం చేసారో అనుభవపూర్వకంగా రాసినట్లు తోచింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
10 కామెంట్లు:
'పారేసిన చోటే వెతుక్కోమన్న' నానుడి నిజం చేశారన్న మాట. ఒక జర్నలిస్ట్ చెప్పలేక పొతే, మరో జర్నలిస్టు నే అడిగారంటే.... మొత్తానికి ఓ కొత్త విషయం తెలుసుకున్నాం.. అన్నట్టు మీ బ్లాగులో అచ్చు తప్పులు తగ్గుతున్నాయి.. కృషి కొనసాగించండి..
చిన్నిగారూ !మొత్తానికి సాధించారన్నమాట ! మరి నా ఫోటో ? :) :)
>>ముందుగా ఒక జర్నలిస్ట్ మిత్రుడ్ని అడిగాను తను బిజీగావుండి ఆలోచించలేక పోయారట ... ఇలాంటివి ఇలా కూడా తప్పించుకోవచ్చనే కొత్త విషయం చెప్పారు. బాగుంది టపా.
@మురళి కొంచెం నా మీద నాకు నమ్మకం పెరిగేట్లు చేస్తున్నారు హమ్మయ్య :)
@పరిమళం గారు తప్పకుండ ,నే పెట్టిన చెట్టు ఇంకా చిన్నదే అది పూయగానే ఫోటో తీసి మరి పెడతాను -:)
@బాస్కర్ గారు ధన్యవాదాలు ,ఇప్పుడే మీ రాములవారి కళ్యాణం కి వచ్చి వెళ్ళాను బాగుంది .
హమ్మయ్య! మొత్తానికి తెలిసింది కదా. . ఇక మీరు ప్రశాంతంగా నా స్నేహితులు -2 రాసేయొచ్చు అనుకుంటా..
పూలు పూసాక పరిమళగారితో పాటు నాకు పంపండి....
@ఉమా నిన్న నే రాద్దామనుకున్న కుదరలేదు ,ఈ రోజు కాంప్ వెళ్తోన్న అస్సలు కుదరదు రేపు తీరికగా రాస్తాను .
@పద్మ నిజమైన పూలే పంపిస్తాను అడ్రెస్స్ ఇస్తే మా కాలనీ లో వుంటాయి .
బొగడ కాదనుకుంటాను..పొగడ అనుకుంటానండి
@మాధవుడు గారికి ,అలా కూడా అంటారు వ్యవహారిక బాషలో బొగడ అంటారు. ధన్యవాదములు
ఎవరికీ వుండదేమో అంత భయం, మా అక్కకి బొగడ పూలంటే హడలు. దాని దడ చూస్తే నాకు మహా ఆనందం. చిన్నపుడు దాని అల్లరి అదుపు చేయటానికి, పిల్లల్ని కొట్టకుండా వుండటానికి వాళ్ళకి తలలో ఆపూలే పెట్టేవారట. ఇప్పటికి ముట్టుకోదు. నాకు మాత్రం ఆ నక్షత్రాలని పోలిన పూలు చాలా ఇస్టం. మొన్నీమధ్య ఇండియాకి నాన్నగారు అద్దెకున్న ఇంటికి వచ్చినపుడు గుమ్మం ప్రక్కనే విరబూసి నవ్వే ఆ చెట్టుని చూసి చిన్నప్పటి నేస్తాన్ని చూసినంతగా పులకరించిపోయాను. మీ టపాలో క్రొత్త విషయాలు కూడా తెలుసుకున్నాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి