10, ఏప్రిల్ 2009, శుక్రవారం

ఈల అబ్బాయి

ఈ రోజు ఉదయాన్నే టీ తాగుతూ మా ఇంటి ముందున్న చెట్ల క్రింద తిరుగుతున్నా ....ఇంతల్లో కయ్యిమని విజిల్ వినబడింది ఒక్క క్షణం ఊపిరి తీసుకున్నట్లు మళ్ళావిజిల్ వినబడింది ,నేను బయటి నుంచే మా పార్వతి ని {పని చేసే అమ్మాయి } కేక వేసాను , "ఆ అబ్బాయి ఈ రోజు త్వరగా వచ్చేశాడు త్వరగా రా " అని. మా పార్వతి గబగబా చెత్త బుట్ట తీసుకుని వాకిట్లోకి వెళ్ళింది ,"ఏమైందో ఇంత బేగావచ్చేసిండు "అనుకుంటూ ఆమె వెనుక మా పైన వాళ్ల పనమ్మాయి చెత్తబుట్ట తో పార్వతి ని అనుసరించింది . ఇంతలో ఆగకుండా ఈల లు వరుసగా మోగుతూనే వున్నాయి ,మా కాలనీ వీధి లో వుండేవాళ్ళు దాదాపు అంతా చెత్త బుట్టలు వాళ్ల గేటు దగ్గర పెట్టారు మా ఇంటి కి ఒక ఇల్లు అవతల పెట్టిన జీప్స్ దగ్గర నుండి వస్తోన్నాయి ఈల ధ్వనులు ,ఎంతకి ఆ మున్సిపాలిటీ ఈల అబ్బాయి రాడేమని చూస్తే వాకబు చేయగా ఆ "విజిల్ " లోకసత్తాపార్టీ నాయకురాలు{మా వీధి లోనే వుంటారు } వాళ్ల కార్యకర్త్తల కొరకు తీసుకున్న విజిల్స్ , అవి ఇచ్చే ముందు వాటి పని తీరు చూడ్డానికి వారి అసిస్టెంటు వాటిని టెస్ట్ చేస్తూన్నారట ,విషయం తెలుసుకుని మేమంతా నవ్వుకున్నాము . ..విజిల్ మ్రోగ గానే మా చెత్త బుట్టలు తీసుకెళ్ళే అబ్బాయిగానే మేము కండిషన్ అయ్యున్నాము ........జయప్రకాశ్ మేలుకొలుపు బానే వుందనుకున్నాము చేత్తపారేయమని -:(

11 కామెంట్‌లు:

రాజ మల్లేశ్వర్ కొల్లి చెప్పారు...

:-)

పరిమళం చెప్పారు...

చెత్త పారేయమని.... :) :)

మురళి చెప్పారు...

ముగింపు బాగుంది.. స్నేహితుల్ని మధ్యలో వదిలేసినట్టున్నారు...?

ఉమాశంకర్ చెప్పారు...

బావుంది :)

Padmarpita చెప్పారు...

ఇంకా నయం వాళ్ళ అదృష్టం బాగుంది...

మరువం ఉష చెప్పారు...

జయప్రకాష్ నారాయణ గారు ఒంగోలు కలక్టర్ గా పనిచేసేరోజుల్లో నాన్నగారు ఆ సమీప ప్రాంతాల్లోనే ఇంజినీరుగా పనిచేసారు. సీనియరు అయినా కూడా ఆయన వ్యక్తిత్వానికి తెగ ముచ్చట పడేవారు. కనీసం మరో 10 యేళ్ళకైన జనాల్లో కనువిప్పు వచ్చి నాయకులనేవారు ఎలావుండాలో తెలుసుకుంటే బాగుండును. ఈ ఈల ప్రయోగం బాగుంది. జనాలకి తమ తమ సత్తా తెలుపుతూ, మేల్కొలుపుతూ ఆయన సాగిస్తున్న ఈ ప్రహసనం దిగ్విజయమవ్వాలని కోరుకుంటున్నాను. మీ టపా ఉద్దేశ్యం ఇది కాకపోయినా నా మనసు అలా స్పందించింది.

రాజ మల్లేశ్వర్ కొల్లి చెప్పారు...

పరిమళం గారు, బాగా పట్టేశారు...!! :-) :-)
"చెత్త పారేయమని.... :) :)"

Hima bindu చెప్పారు...

@రాజ మల్లేశ్వర్ గారు మీరు పరిమళం గారు అన్నట్లే మేము చాల జోక్స్ వేసుకున్నాం ....కాబట్టే బ్లాగ్ మిత్రులతో సరదా గా పంచుకోవాలని

Hima bindu చెప్పారు...

@పరిమళం ,పద్మర్పిత ఉమా ధన్యవాదాలు .
@మురళి నా స్నేహితులు రాయటం ఆపను...మీకు ఎంత బోర్ కొట్టినాసరే .....వదలను కాకా వదలను .
@ఉష గారు ధన్యవాదాలు ....జయప్రకాశ్ ఆశయాలు మంచివే కాని ఆచరణలో ఆ పార్టీ వాళ్ళే విఫలమవుతున్నారు ..ఎలేక్షన్స్ లో ఆ పార్టీ గుర్తు విజిల్ .
బొగడ పూలంటే ఇష్టం లేని వారెవరు వుండరేమో .....మీ అక్క గారికి అవంటే ఎందుకు భయమో ! వకుళ దేవి వాటితోనే పూజ చేసేదట ,అందుకే వాటికి ఆ పేరట .

వేణూశ్రీకాంత్ చెప్పారు...

హ హ :) బాగుంది.

Hima bindu చెప్పారు...

@వేణు శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు