6, అక్టోబర్ 2009, మంగళవారం

ఎవడి గోల వాడిదే

ఎవరిగోల వారిదంటే ఇదే కాబోలు ..ప్రకృతి వైపరీత్యలకి ఎవరు మాత్రం ఏమి చేయగలరు,ముందే గమనించితే సాద్యమైనంత (అంటే మానవునికి చేతనైనంత ) నివారణ ముందస్తు జాగ్రత్త తీసుకోవడం తప్పించి .ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ముఖ్యంగా ప్రాణ నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవడం ముఖ్యమైన కర్తవ్యం,మిగిలినవి అంటారా''బ్రతుకుంటే బలిసాకుతిని అయిన గడపొచ్చు"అనే నానుడి వుండనేవుంది.
కాని ఈ మీడియా ముఖ్యంగా ఎలెక్ట్రోనిక్ వాళ్ళు చేసే హడావిడి చూస్తుంటే చాల విచారం కలుగుతుంది,ఇరవయ్యి నాలుగు గంటల సమాచారం పేరుతో చెప్పడానికి ముడిసరుకు(-వార్తలు )లేక పూసింది అంటే కాసేసింది అంటూ వక్రభాష్యం చెబుతూ సగం ప్రజలలో భయాందోళనలు కలగచేయుచున్నారు .మూడు రోజుల నుండి వరధప్రాంతల్లో జిల్లా యంత్రాంగం పోరుగుజిల్లా యంత్రాంగం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న ప్రజలు 'అతి ధీమా 'తో యంత్రాంగానికి సహకరించక ఇప్పుడు నిండా నీరు వచ్చి మునిగాక వారిని ప్రభుత్వం పట్టించుకోలేదని,అన్నం ,పాలు లేవని చలికి వణుకుతున్నాంఅని ,మూగజీవాలు సైతం కరకట్టల్లో ఆవాసం చేయాల్సి వస్తుందని ,కరకట్టల మీదే వంటలని మీడియా ని పిలిచి కధనాలు చెబుతుంటే ,వారికి మీడియా తందాన అంటూ అధికారులు నిర్లక్ష్యం కరకట్టల మీద వంటలు అంటూ కధనాలు .....ఇదే మీడియా వారిని ఎందుకు ఖండించదు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి ,ప్రభుత్వం ,సేవ సంస్థలు వసతి బోజనాలు ఏర్పాటు చేసారు,ఆస్తులుకాదు ముఖ్యం ప్రాణాలు కాపాడుకుని ,కట్టు విప్పి మూగజీవాల ప్రాణం కాపాడమని ....అలాచెబితే ఎలా అక్కడితో కథ సుఖాంతం అవ్వుతుంది కదా ,కధనాలు వెదుక్కోవాలి కదా ..
ఇప్పటికిప్పుడు కొల్లూరు మండలం 'పెసరలంక 'లో జరగని పడవ ప్రమాదాన్ని జరిగినట్లు వక్రీకరించడం ...వార్తా వచ్చినపుడు అన్నీ పరిశీలించాకే చెప్పాలి ..అంటే కాని కథలు సృష్టించడం కాదు .ఏదేమైనా ప్రభుత్వం,ప్రభుత్వ యంత్రాంగం తమ ఇల్లు వాకిళ్ళు వదిలి రాత్రి పగలు బేదం యెరుగక''మీకు మేము ఉన్నాం ''అని వరద భాదిత సహాయ కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యారు .....ఇవ్వేమి మీడియా కి కనబడవు .....వినబడవు ....

12 కామెంట్‌లు:

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామన్నా ప్రజలు సహకరించలేదన్న మీ ఆవేదన అర్ధం చేసుకోదగ్గదే. అయితే అధికారులు తమకు ఏర్పాటు చేసిన సురక్షిత ప్రాంతాల్లో కనీస సదుపాయాల ఏర్పాట్లు ఉంటాయన్న నమ్మకాన్ని వాళ్ళల్లో కలిగించగలిగితే కొద్దిమంది అయినా వచ్చుండేవారేమో! చాలా మందికి అధికారులు వేరే చోటికి తరలిస్తామని వచ్చినా, అక్కడకెళ్తే డొక్కలు మాడుస్తారేమో అన్న భయం ఉండి ఉండొచ్చు.

--కమెంట్ బాక్స్ ని మార్చినందుకు థాంకులు.

SRRao చెప్పారు...

అన్నిటిలోనూ మంచీచెడూ ఉన్నట్లే ప్రభుత్వ అధికారుల్లోనూ ఉన్నారు. రాత్రింబవళ్ళు నిద్రాహారాలకు దూరమై సేవలందించిన వాళ్ళూ ఉన్నారు. కంటితుడుపు చర్యలతోనూ, రాజకీయనాయకుల వెంట తిరుగుతూ అదే ప్రజా సేవ అని నమ్మించేవాళ్ళూ ఉన్నారు. ఎటొచ్చీ ఈ తేడాలు గుర్తించే జ్ఞానం సామాన్య జనానికి ఇంకా రావటం లేదు. అందుకే వారికి వమ్మకం కలగడం లేదు.

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

ఈ ఆపత్కాల సమయంలో ఇల్లూ వాకిలీ వదిలి పని చేసినందుకు ధన్యవాదాలు.

Praveen Mandangi చెప్పారు...

కాచుకుకూర్చున్న గుంట నక్కల్లా విరాళాలు వసూలు చేసే స్వచ్ఛంద సంస్థలకి కూడా వరదల వల్ల లాభమే. కర్నూల్ జిల్లాకి చాలా దూరంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో కూడా కొంత మంది వరద రిలీఫ్ పేరుతో విరాళాలు వసూలు చేస్తున్నారు.

Hima bindu చెప్పారు...

@శేఖర్
మీ వ్యాఖ్యని తీవ్రంగా ఖండిస్తున్నాను,ఆ సమయం లో వారికి కావలసింది ప్రాణ రక్ష అంతేకాని ఆస్తులు కాదు ,సొంత గడ్డని ,ఊరుని విడిచి రావడం చాలా భాదకరమే కాని తప్పనిసరైనప్పుడు నీళ్ళ లో మునిగి అనామకంగా కొట్టుకుపోయి చావడం కంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన రక్షిత ప్రదేశాల్లో తాత్కాలికంగా వుండటం క్షేమం కదా !వారికి ఏ.సి. గదులు పట్టు పరుపులు ఏర్పాటు చేయలేకపోవచ్చు కాని యుద్దప్రాతికదపైన ఏర్పాటు చేసిన శానిటరీ ఫెసిలిటీ ,స్వచ్చమైన త్రాగు నీరు ,శుచికరమైన ఆహారము వైద్య సహాయం వారికి ఇరవయ్యి నాలుగు గంటలు చూసే సిబ్బంది ఇంతకంటే ఈ సంక్షేమరాజ్యం లో ఏం కావాలి ?

Hima bindu చెప్పారు...

SRRao
ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడైన కనీస జ్ఞానం తో ఆలోచించాలి కదండీ, అధికారులు చేయడం గొప్ప అని నేను అనను ,వారు ప్రభుత్వం నుండి నెల జీతం తీసుకుంటున్నారు కాబట్టి వారి భాద్యత ప్రభుత్వ ఆదేశాలు పాటించడం .

Hima bindu చెప్పారు...

@భా.రా.రే
హవ్వ !నేను ఇల్లు వాకిలి వదిలి పనిచేయడం ఏంటండీ? మీ జిల్లా కోసం పనిచేసినోళ్ళకి చెప్పండీ.పోనిలే ఉచితంగా వచ్చిన థాంకులు :) వదులుకోవడం ఎందుకు తీసేస్కుంట .

Hima bindu చెప్పారు...

@ప్రవీణ్ శర్మ
అటువంటి మనస్తత్వం వున్నవారికి వరదలే రావాల ఎలా అయిన చేస్తారు .వరద సహాయం కోసం శ్రీకాకుళం కర్నూల్ కి పెద్ద దూరం కాదు .....స్పందించే హృదయమే వుండాలి కాని ఎల్లలు అడ్డు కాదు ...సప్త సముద్రలకటువైపు వున్నా మన బ్లాగ్ మిత్రులు అందరికంటే ముందు పూనుకోలేదు ! వారితో పోలిస్తే శ్రీకాకుళం పెద్ద దూరం కాదు..మీ ఊరు వాళ్ళు నిజంగానే సహాయం చేయడానికి వసూలు చెస్తుండొచ్చు ..వారిని శంకించడం తప్పండీ.

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

మా జిల్లాకు మీరు పోలేదా.. అలాగయితే నా థ్యాంక్స్ నాకిచ్చేయండి. ఇంగొకరికి చెప్పుకుంటాను :)

anagha చెప్పారు...

ప్రభుత్వ యంత్రాంగంతో పాటు మీడియ వారు పగలు రాత్రి కరకట్టాలమీద ఉన్నారు .ముందుగావారు ఇచ్హిన హెచ్హారిక లవలన పెద్ద ప్రమాదము తప్పింది,లేకపోతె ప్రాణ నష్టం ఎక్కువ వుండేది . అధికారులకు(వారి డ్యూటీ అయినప్పటికీ),
మీడియావారికి ప్రజలు ధన్యవాదాలు చెప్పాలి.

మురళి చెప్పారు...

నిజమేనండీ...

Bhaskar Ponaganti చెప్పారు...

నిజంగా ఎవడి గోల వాడిదే, ఎందుకు జోలె పడతారో, ఎంత వసూలు చేస్తారో, ఎంత ఖర్చు పెడతారో ఎవరికి తెలుసు.VIP లు మాత్రం ఆస్తి పన్ను మినహాయింపు కోసం ఎన్ని జిమ్మిక్కులైనా చేస్తారు. ఎవడెక్కడ పోతే ఎవడికేంటి....