16, అక్టోబర్ 2009, శుక్రవారం

ఒక్కసారి ఆలోచించండీ

దీపావళి అందరికి ఇష్టమైన పండుగే ...చిన్నప్పుడు నాకు చాల చాల ఇష్టం ...పుట్టిన రోజుకోసం ఎదురు చూసినట్లు ఎదురు చూసేదాన్ని ...కాని ఈసారి పండగ చేసుకోవడం అంటే మనస్సు ఒప్పడం లేదు ...చేసుకునేంత మంచి వాతావరణం లేదు .........రాష్ట్రం లో కొన్ని ప్రదేశాల్లో ఇంకా ఆనాటి జాడలు పోలేదు అయిన తప్పదు మన పద్ధతి ప్రకారం మనం జరుపుకుంటాం ....
ఒక్కసారి భాణసంచా కొనేప్పుడు ఆలోచించండీ అనవసరంగా తగలబెట్టేవాటిల్లోకొంత వరద ప్రాంత భాధితులకు వెచ్చించండి ...మన ఆనందం కోసం వెచ్చించే రూపాయి ఒకరి ఆకలి అయిన తీరుస్తుందేమో .....ఆలోచించండీ.

6 కామెంట్‌లు:

మురళి చెప్పారు...

నిజమేనండీ.. ఆలోచించాల్సిన విషయమే...

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

మేమసలు ఆలోచించనక్కరలేదు.. సంచులు లేవు, బాణాలూ లేవు.. ఏదో చెక్కలు, మొగ్గలు, అరిసెలు, గారెలు తప్పించి.

Maruti చెప్పారు...

నిజమే..

పరిమళం చెప్పారు...

వరదబాధితుల సహాయనిధికిస్తే మంచిదనిపిస్తుంది .

తృష్ణ చెప్పారు...

what you said is 100% correct madam..!

Hima bindu చెప్పారు...

స్పందించిన మిత్రులకి ధన్యవాదాలు