24, సెప్టెంబర్ 2010, శుక్రవారం

నా అమరనాథ్ యాత్ర

"అమ్మాఅమరనాథ్ యాత్ర కి వస్తావేమో రాజిపిన్ని కనుక్కోమంది " సాయంత్రం కాస్త త్వరగా ఇల్లు చేరిన నన్ను అడిగింది నా పుత్రికారత్నం .
హు ...ఇంకా తీర్థయాత్రలు చేసే వయస్సుకి చేరలేదేమోనని నా అనుమానం రిటైర్ అయ్యాక ఆలోచిస్తాను అని చెప్పు "అని నవ్వుతూ అనేసాను ఒక ప్రక్క ఇదేవిటి ఇంత సడెన్గా అమరనాథ్ మీద ద్రుష్టి మళ్ళింది ఎందుకాఅని ఆలోచిస్తూ ...
"నువ్వు వస్తావని మేము వెళ్ళకుండా ఎదురు చూస్తున్నాం రా మమ్మీ "కొంచెం బ్రతిమాలుతూనా జూనియర్ .
"నువ్వు వెళ్తావా !"నేను .
"నీకు మన ఊర్లో ఏమి జరుగుతుందో నీకు తెలీదు కదూ,అచ్చు అమరనాథ్ యాత్ర ఫీలింగ్ కలుగుతుందట ఎగ్జిభిషన్ గ్రౌండ్ లో పెట్టారట చాల బాగుందట ఒక్క అరగంట "అమ్మాయి .
పావుగంటలో తయారయ్యి అక్కడున్నాంఎంట్రీ ఫీజ్ తో కలిపి అరవయ్యి రూపాయిలు,చక్కటి సృష్టి నిజంగా హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేస్తున్న అనుభూతి కాస్త విజయవాడ వేడిగాలి తప్పించి :-) కొండల్లో జలపాతాల హోరులో వాగు నీళ్ళు దాటుకుని గుహలోని స్పటిక లింగం దర్శనం చేసుకున్నాం .అక్కడ మాత్ర ఏ.సి పెట్టారు,అక్కడ తమిళ స్వామి భక్తులకి వివరిస్తున్నారు.
తప్పక చూడండి విజయవాడలో వున్నవారు .

14 కామెంట్‌లు:

వీరుభొట్ల వెంకట గణేష్ చెప్పారు...

Oops, I missed it then. I thought it's waste of money & time. Last week, when I went to home, my sister told me about this. Few days back, my family members went to PWD grounds. They also told me that Tamilians organized this show. There, even vendors(including chat items) were also Tamilians.

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

ఎంత ఆత్రంగా వచ్చానో అంత నిరాశ పర్చారు :(... పోన్లేండి, రిటైర్ అయ్యాకన్నా అమరనాథ యాత్రను చేయండి :-)

కొత్త పాళీ చెప్పారు...

interesting!

Hima bindu చెప్పారు...

@వీరుబోట్ల వెంకట గణేష్
నిజంగానే మీరు మంచి అవకాశం మిస్ అయ్యారు,అవునండి చాట్ ,ఇతరత్రా తినుబండారాలు వాళ్ళు తమిళ్ వాళ్ళే ...తెలుగు అర్ధం కావట్ల "ఒరు సమోసా చాట్ వేణు "అదు మాదిరి పాకెట్ ఇల్లా " అని వచ్చి రాని తామిళ్ లో సోల్లితేనే చక్కగా రెస్పాండ్ అవుతున్నారు .:-)
@బా.రా.రె
ఏం పాపం చేసాం నాయన తీర్థయాత్రలు చేయమంటున్నారు ఇంకా చాలా చ్చాలా టైం వుంది :-)
@కొత్తపాళీ
ధన్యవాదాలు

మాలా కుమార్ చెప్పారు...

ఇదా ? ఈ మద్య మీ పోస్ట్ లు కనబటము లేదు . ఓహో అమర్నాథ్ యాత్రకెళ్ళారా అనుకుంటూ వచ్చాను . మీకో సంగతి తెలుసా యాత్రలు వయసైపోయాక అస్సలు చేయలేరు . అయ్యో చిన్నప్పుడే చూడలేక పోయామే అనుకుంటారు . అందుకే వయసులో , వోపిక వున్నప్పుడే వెళ్ళాలి .

మురళి చెప్పారు...

ప్చ్... ఫోటో పెట్టాల్సిందండీ..

Hima bindu చెప్పారు...

@మాలా కుమార్
నోటేడ్ మేడం :-)
@మురళి
ఇలా వుంటుంది అని మనకి తెలిస్తే కదా వాళ్ళని నిరాశ పరచడం ఎందుకని వెళ్లాను.బహుశ అమ్మ వాళ్ళు వెళితే పిల్లలు ఫొటోస్ తెస్తారేమో చూడాలి

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

"దంతంబు ల్పడనప్పుడే తనువునం దారూఢియున్నప్పుడే,
కాంతా సంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు గానప్పుడే,
వింత ల్మేన జరింపనప్పుడే కురుల్వెల్వెల్ల గానప్పుడే,
చింతింపన్వలె నీపదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా"
అంటాడు ధూర్ఝటి.
తీర్థయాత్రలు చేయడానికి పాపం చెయ్యక్కర్లేదనుకుంటానండి.నమ్మకం ఉంటే దేవుడ్ని ధ్యానించుకోడానికి వయసుతో సంబంధమూ లేదు(పై పద్యానికి అర్ధం చెప్పక్కర్లేదనుకుంటాను కదండి),చక్కగా మనింట్లో కూర్చుని కూడా ధ్యానించచ్చంటాడు ఆ పెద్దమనిషే ఇలా,

"కేదారాది సమస్త తీర్థములు కోర్కిం జూడ( బో నేటికిన్,
గాదా ముంగిలి వారణాశి కడుపే కైలాసశైలంబు నీ,
పాదధ్యానము సంభవించునప్పుడే భావింప నజ్ఞాన ల
క్ష్మీదారిద్ర్యులు గారే లోకులకటా! శ్రీకాళహస్తీశ్వరా"

అదండీ సంగతి.

Hima bindu చెప్పారు...

@శ్రీనివాస్ పప్పు
భలే గుర్తు చేసారండి ధూర్జటి ని :-) జీవనసారన్నంత అనుభవించి తన అసహాయ స్థితి ని తలుచుకుంటూ రాజుల్ని దైవాన్ని దూషించే మహాకవి అంటే నాకు చాల ఇష్టం .
ఇక "పాపం"సంగతంటారా భా.రా.రె తో వున్నా కొద్దిపాటు చనువు తో సరదాగా అలా అన్నాను .
భగవంతుని మనస్సులో స్మరించుకుంటూ మానవత్వం తో సాటివారితో మసులుకోవాలి అనే సూత్రాన్ని నమ్మేవారిలో నేను ఒకదాన్ని.థాంక్యూ .

భావన చెప్పారు...

హారిని. ఐతే వర్ట్యువల్ గా అమర్ నాధ్ యాత్ర కు వెళ్ళేరా. నైస్. నేను అమర్నాధ్ మానససరోవరం వెళ్ళాలని ప్లాన్. మా అబ్బాయి కాలేజ్ కు వెళ్ళగానే ప్లాన్ చేస్తున్నా. అధ్బుతం అట. ఐనా మీరు వర్ట్యువల్ గా చూసేసారు గా, మీకు చెప్పేది ఏమి వుందిలే. నైస్. విజయవాడ వాళ్ళు కొండ మీది దుర్గమ్మనే కాదు కైలాసం లో ఆమె పతి ని కూడా చూసొచ్చేస్తున్నారన్న మాట. ఎతైనా విజీవాడోళ్ళు కాదు. :-)

Hima bindu చెప్పారు...

@భావన
అదే మరి మన విజివాడోల్ల గొప్పదనం :-)

జయ చెప్పారు...

హైద్రాబాద్ లో స్నో వరల్డ్ అలాంటిదేనండి. కాకపోతే హిమాలయాల ఫీలింగ్ మాత్రమే ఉంటుంది. నేను చార్ ధాం యాత్ర చేసి ఇప్పటికే నాలుగేళ్ళయిపోయింది. అటువంటి ప్రయాణాలు చిన్నప్పుడే బాగా ఎంజాయ్ చేయ గలుగుతాం. దూరాలు నడవాలన్నా, కొండలూ గుట్టలూ ఎక్కాలన్నా, ప్రకృతి అస్వాదించాలన్నా చిన్నప్పుడే కదా ఆ ఓపికలుండేది.ఓపిక లేనప్పుడు ఆయాసాలే కాని అనుభూతి ఏముంటుంది. కేవలం భక్తి కోసం అయితే ఇంట్లోనే ఏ వయసులో నైనా చాలు. అంతే కదా చిన్నిగారు:) ఇంతకీ బుజ్జులూ ని అమర్నాథ్ యాత్ర చేయించారా లేదా:)

పరిమళం చెప్పారు...

:) :)

Hima bindu చెప్పారు...

@JAYA
@PARIMALAM
THANKS andi:-)