10, ఏప్రిల్ 2009, శుక్రవారం

ఈల అబ్బాయి

ఈ రోజు ఉదయాన్నే టీ తాగుతూ మా ఇంటి ముందున్న చెట్ల క్రింద తిరుగుతున్నా ....ఇంతల్లో కయ్యిమని విజిల్ వినబడింది ఒక్క క్షణం ఊపిరి తీసుకున్నట్లు మళ్ళావిజిల్ వినబడింది ,నేను బయటి నుంచే మా పార్వతి ని {పని చేసే అమ్మాయి } కేక వేసాను , "ఆ అబ్బాయి ఈ రోజు త్వరగా వచ్చేశాడు త్వరగా రా " అని. మా పార్వతి గబగబా చెత్త బుట్ట తీసుకుని వాకిట్లోకి వెళ్ళింది ,"ఏమైందో ఇంత బేగావచ్చేసిండు "అనుకుంటూ ఆమె వెనుక మా పైన వాళ్ల పనమ్మాయి చెత్తబుట్ట తో పార్వతి ని అనుసరించింది . ఇంతలో ఆగకుండా ఈల లు వరుసగా మోగుతూనే వున్నాయి ,మా కాలనీ వీధి లో వుండేవాళ్ళు దాదాపు అంతా చెత్త బుట్టలు వాళ్ల గేటు దగ్గర పెట్టారు మా ఇంటి కి ఒక ఇల్లు అవతల పెట్టిన జీప్స్ దగ్గర నుండి వస్తోన్నాయి ఈల ధ్వనులు ,ఎంతకి ఆ మున్సిపాలిటీ ఈల అబ్బాయి రాడేమని చూస్తే వాకబు చేయగా ఆ "విజిల్ " లోకసత్తాపార్టీ నాయకురాలు{మా వీధి లోనే వుంటారు } వాళ్ల కార్యకర్త్తల కొరకు తీసుకున్న విజిల్స్ , అవి ఇచ్చే ముందు వాటి పని తీరు చూడ్డానికి వారి అసిస్టెంటు వాటిని టెస్ట్ చేస్తూన్నారట ,విషయం తెలుసుకుని మేమంతా నవ్వుకున్నాము . ..విజిల్ మ్రోగ గానే మా చెత్త బుట్టలు తీసుకెళ్ళే అబ్బాయిగానే మేము కండిషన్ అయ్యున్నాము ........జయప్రకాశ్ మేలుకొలుపు బానే వుందనుకున్నాము చేత్తపారేయమని -:(

9, ఏప్రిల్ 2009, గురువారం

నా స్నేహితులు -5

సివిల్ సర్వీసు రాయాలని నిర్ణయించుకోవడం మొదలు నాది ఏకాంత వాసం అయ్యింది {ఏర్పరచుకున్నాను} ఈ ఎగ్జామ్స్ పైన కనీసం గైడ్ చేసే సంస్థలు సరయినవి మేమున్న సిటీ లో లేవు ,అటువంటి పరిస్థితి లో ఢిల్లీ నుండి హైదరాబాద్ నుండి బుక్స్ పోస్ట్ ద్వారా తెప్పించుకుని నా సొంత నోట్స్ తయారు చేసుకుంటూ ,పూర్తిగా పుస్తకాల తోనే నా సహజీవనం అయ్యింది .మా పాప ,తను సాయంత్రం త్వరగా వచ్చిన డిన్నర్ కానిచ్చుకుని ప్రక్క వీధి లో వున్నఅమ్మ వాళ్ళింటికి వెళ్ళిపోయి నిద్ర టైం కి ఇంటికి వచ్చేవారు ఆవిధం గా వాళ్లు నాకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేసేవాళ్ళు . వానలు రాని వరదలు రాని పండుగలు రాని అవేవి మా ఇంట్లో కనబడేవి కాదు .మొట్టమొదటి సారి ప్రిమిలిమినరీ పాస్ అయినప్పుడు మా పాప ముఖం లో వెలుగు లు ఇప్పటికి మరిచిపోలేను . నేను తనని తగినంతగా శ్రద్దగా పట్టించుకోపోయిన ఎక్కడికక్కడ సర్దుకుంటూ నేను సర్వీసు తెచ్చుకోవడమే ధ్యేయమన్నట్లునన్ను ఎంకరేజి చేసేది .అప్పట్లో స్టేట్ సర్వీసు స్టాఫ్ సెలక్షన్ అన్ని అటెంప్ట్ చేశాను ,సివిల్స్ మెయిన్ యెగ్జమ్ వరుసగరెండు సార్లు క్లియర్ కాకపోవడం తో నా సబ్జెక్టు పబ్లిక్ అడ్మినిస్త్రషన్ నుండి తెలుగు లిట్ట్ కి మార్చుకున్నాను. హైదరాబాద్ లో తెలుగుసాహిత్యం బాగా చెప్తారు ,వినకుండా రాయలేము ,మంచి నోట్స్ కూడా ఇస్తారు అని ఎవరో చెప్పగా అప్పుడు అడుగు బయటకు పెట్టాను ఒంటి స్థంబం మేడనుండి .
నేను హైదరాబాద్ వెళ్లడానికి చాల కష్టపడ్డాను. ప్రశాంతం గా ,ఒంటరిగా వుండటం అలవాటు పడ్డ నా మనస్సుకి సర్దిచేప్పుకోవడానికి ఎంతో ఇబ్బంది పడ్డాను ,ఒకటి కావాలంటే వేరొకటి వదులుకోవాల్సిందేనని అప్పటికే నాకు అర్ధం అవ్వింది.ఇల్లు వదిలి హైదరాబాద్ లోని ఒక హాస్టల్లో పడ్డాను ,హాస్టల్ కి నేను చేరిన స్టడీ సర్కిల్ కి ఒక పది నిమిషాల దూరం .అక్కడ కొత్త జీవితం మొదలయ్యింది -:( నా రూమ్ పక్క ఒక వైపు టీవీ లో ఆర్టిస్ట్ గా పనిచేసేవాళ్ళు ఒక ప్రక్క కమల నెహ్రూ పోలితెక్నిక్ లో చదివే అమ్మాయిలూ ఏదో జాబ్స్ కి ప్రయత్నించే అమ్మాయిలూ అలానే మాకులా స్టడీ సర్కిల్ అమ్మాయిలూ వుండేవాళ్ళు .మా వింగ్ లో దాదాపు గుంటూరు వాళ్లు వరంగల్ ,నల్గొండ వాళ్లు వుండేవాళ్ళు .వాళ్ళందర్నీ చూస్తోంటే వీళ్ళంతా జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తున్నట్లు తోచేది ,ఎప్పుడు నవ్వులు పువ్వులు విరిసేవి ,..నా ముందేమో కొండంత భాద్యత కనబడేది ,డిప్లొమా అమ్మాయిలూ నాతో త్వరగానే కలిసిపోయారు "అక్కా" అంటూ ,నాకోసం ఫుడ్ తీసుకు రావటం మొదలుకొని బాత్రూం రిజర్వు చేయడం వరకు . మాకు క్లాసు సాయంత్రం మూడు లేక నాలుగు గంటలకు వుండేవి తిరిగి వచ్చేసరికి ఎనిమిది దాటేది మనం తెలుగు తో పాటు జనరల్ స్టడీసేకూడా చేరాము . ఒక రెండు రోజులు ఒక్కదాన్నే వెళ్లాను తరువాత గుంటూరు అమ్మాయి క్లాసు లో పరిచయం అవ్వింది ,తను ఢిల్లీ జీ .యెన్ .టి యు లో చదివనాని నేనుండే హాస్టల్లో చేరానని పరిచయం చేసుకుంది తన రూమ్ కూడా నేనుండే వింగ్ లోనే వుండేది .ఆమె ఎప్పుడు బుక్స్ కాలేక్ట్ చేస్తూ ,osmaaniyaకి తిరుగుతూ క్లాసు టైం కి చేరేది రాత్రి డిన్నర్ తరువాత డిస్కషన్ అంటు నా రూమ్ కి వచ్చేది ఆ రోజు కబుర్లన్నీ పూస గుచ్చినట్లు నేను అడగకపోయినా చెప్పేది ,కబుర్లుఆసక్తిగా తోచి పక్క పిల్లలు వాళ్లు వీళ్ళు చేరేవాళ్ళు చివరికి ఆ అమ్మాయిల ఇందిరా పార్క్ విశేషాలు వాళ్ల బాయ్ ఫ్రెండ్ కబుర్లు ,ఆ తరువాత రోజు వాళ్ల ప్రోగ్రమ్మ్స్ ఇలా సాగేవి ....మన చదువు అలాలా సాగేది ,ఇంటి మీద బెంగ తో ఒక రెండు వారాలు మద్యలో ఊరేల్లోచ్చేదాన్ని .నేను చేరి నెల దాటాక ముందే రెండు వారాలు ఇంట్లో రెండు వారాలు హైదరాబాద్ లో వున్నాను .క్లాసు లు ఎప్పుడు సమయానికి జరిగేవి కావు పైగా వర్షాలు పడే కాలం చస్తూ బ్రతుకుతూ వెళ్తే క్లాసు కాన్సిల్ అనేవాళ్ళు ఆ తరువాత క్లాసు వుండేది ఈ మధ్య కాలం లో రాఘవేంద్ర కేఫ్ లో హోటల్ వాడిని పోషి స్తూ కాలక్షేపం చేసేవాళ్ళం ,తెలుగు క్లాసు మానేదాన్ని కాదు .నాకు తెలుగు క్లాసు లో రామ పరిచయం స్వల్పకాలం లోనే ఇద్దరం చాల దగ్గర అయ్యాము తను కూడా మేముండే హాస్టల్ క్రింద వింగ్ లో వుండేది తనది తిరుపతి అప్పటికే రెండేళ్ళ నిండి తను అక్కడ వుంటోంది ,చదువు మీద పెద్దగ ఇంట్రెస్ట్ వుండేది కాదు కాని తను చేసుకోబోయే అబ్బాయిని మాత్రం కంటికి రెప్పల చూసుకుంటూ చదివించేది ,అతను బాగా కష్టపడేవాడు [అతని పేరు ఇక్కడ రాయడం లేదు మంచి పోసిషన్ లో వున్నాడు }అతని స్నేహితులంతా బాగా చదివేవాల్లె ,వాళ్ళందరికీ నేను ఇన్స్పిరేషన్ అనేవాళ్ళు ఇల్లు పిల్లని వదిలి ఇలా వచ్చెనని ,కేఫ్ లో కూర్చుని మా సబ్జక్ట్స్ పై డిస్కషన్ పెట్టుకునేవాళ్ళం ,,,,{తరువాత}

]

]

8, ఏప్రిల్ 2009, బుధవారం

నా స్నేహితులు -4

పీ.జి. తరువాత నా ప్రపంచం ఇల్లు పుస్తకాలు మా పాప .దాదాపు మా ఫ్యామిలీ మెంబెర్స్ తో {అక్కాతమ్ముల్లు}తప్పించి నాకు బయట స్నేహాలు కొంత కాలం లేనట్టే ,మా శ్రీవారు వున్నా అభిప్రాయాల్లో ఉత్తర ,దక్షిణం . నా అభిరుచులన్నీ తనకు సిల్లీగా తోచేవి , నేను ఎంత అల్లరి దాన్నో తనంత పెద్దమనిషి తరహాగా వ్యవహరించేవాడు , నేను చక్కని పాటలు వింటోంటే తను ఇంట్లో వున్నంత సేపు చెత్త క్రికెట్ పెట్టేవాళ్ళు , ఏమి రాకపోతే స్పోర్ట్స్ చాన్నేల్ లో ఏదొకటి చూసేవారు పగలు రాత్రి తేడ లేకుండా క్రికెట్ వస్తోంటే చూస్తోనే వుండేవాళ్ళు .మా అమ్మ వాళ్ళింట్లో ఎవ్వరం క్రికెట్ చూడం ,టీవీ లో అది వస్తున్నంత సేపు నాకు కంపరంగా వుండేది , అలా మా ఇద్దరి అభిరుచుల్లో తీడావుండేవి . నాకేదైనా మంచి కథ చదివిన ,జోక్ చదివిన పక్కన వాళ్లకు చదివి వినిపించే దురలవాటు వుండేది ,ఇక్కడ ఆగలేక చెప్పిన ఊఁ కొట్టేవాళ్ళు కాని తిరిగి అడిగితె మళ్లీచెప్పమనే వారు ,పరిస్థితి అర్ధం అవ్వి తనని విసిగించడం మానేసాను. మా పాప తో నా ఊసులు మొదలయ్యాయి ,ప్రతిది తనకి చెప్పేదాన్ని ,అది ఇంతింత కళ్ళేసుకునిపెద్దదానిలా వినేది . మా పాప ,అతను స్కూల్ ఆఫీసు లకు వెళ్ళగానే నా ప్రపంచం లోకి వెళ్ళేదాన్ని , పాటలు వింటూ నేను అప్లై చేసిన జాబు కి సంభందించి బుక్స్ లోకి వెల్లిపొయెదాన్ని.నాకు మా పక్కింటి వాల్లెవరో తెలిదు ,ఎదురింటి వారెవరో తెలియదు , ఇంట్లోనుండి బయటకి రావడం అంటే అమ్మ వాళ్ళింటికి వెళ్ళడానికో ,లేదా సెకండ్ షో వారంకి ఒకసారి వెళ్లినపుడో మాత్రమె . మా పాప స్కూల్ నుండి వచ్చిన నన్ను డిస్ట్రబ్ చేయకుండా పక్కనే కుర్చుని చదవడమో ఆడడమోచేసేది వాళ్ల నాన్న వచ్చేంతవరకు . పగలంతా పుస్తకాలు తరువాత మా అమ్మాయే నా స్నేహితులు.మా పాప తన మూడవ ఏట నుండే నాకు చక్కటి సలహాలు ఇచ్చేది , బహుశ చదవడానికి అతిశయోక్తి గా వుందేమో కాని ఇది నిజం ,పెరిగేకొద్దీ తను నాకు మంచి స్నేహితురాలయింది , మేము ఇద్దరం కూర్చున్నామంటే మాకు సమయం కూడా తెలియదు . నేను చదివిన చదువుకి సంభందించి నాలుగు ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాను ,కాని జాబు రాలేదు. నా పీ.జి బాచ్ వాళ్ళంతా యెన్ .జి .వో. లలో ను , ఇండస్ట్రీ లలోను చేరిపోయారు , నేను మా చెల్లి చిన్న వాటికి సరిపెట్టుకోలేక సెంట్రల్ గవర్నమెంట్ లో పెర్సనల్ పోస్ట్ లకు ప్రయత్నిస్తో మిగిలిపోయాము కొంత కాలం వరకు . ఒక వుద్యోగం వచ్చినట్లు వచ్చి చేజారి పోయింది ఇటువంటి పరిస్థుల్లో మా అమ్మాయి ,మా శ్రీవారు నన్ను ఐ .ఏ .ఎస్ కి రాయమన్నారు.{:-( బ్లాగర్ పవన్ కళ్యాన్ ఐఏ ఎస్ ల } మా పాప నన్ను చాల చాల ప్రోతహించింది ఈ విషయం లో పెద్ద ఆరిందలనన్ను సివిల్ సర్వీసెస్ వైపు చూసేలా చేసింధనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు . అప్పటికే మా అక్క తమ్ముళ్ళు ఆ వైపు ప్రయత్న్నల్లో వుండడం వలన మా అమ్మాయి నన్ను ఆ దిశ గా మళ్లీ న్చిందని చెప్పవచ్చు .{ రేపు}

7, ఏప్రిల్ 2009, మంగళవారం

నా స్నేహితులు -3

నాకు డిగ్రీ చదువుతుండగానే మ్యారజేకావడం అయిన చదువు కొనసాగించడం జరిగిందీ ,డిగ్రీ తరువాత నేను ఏంఏ సోషల్ వర్క్ చేరాను ,లలిత బి.ఎడ్. లో చేరింది అయిన మా మద్య అస్సలు గ్యాప్ రాలేదు .మా ఇద్దరి మధ్య రహస్యం అంటు వుండేది కాదు ప్రతి చిన్న విషయం మాట్లాడుకునేవాళ్ళం , ఫాతిమా కూడా వుత్తరాల ద్వారా మాతో టచ్ లో వుండేది .ఆశ అప్పుడప్పుడు మాత్రం కలిసేది తన సి.ఏ. తో బిజీగావుండేది . ఒకరోజు వుదయాన్నే ప్రముఖ నాస్తిక కేంద్ర నాయకుడు మా ఇంటికి వచ్చి మా చిన్న మావయ్య {అన్నయ్య} లలిత ఆరునెలల క్రితం ఒక గుడి లో పెళ్లి చేసుకున్నారని రిజిస్టర్ కూడా చేసారని ,మా వాడు ఇంట్లో చెప్పడానికి మొహమాటపడుతున్నారని,ఆమె వాలింట్లో చెప్పగానే గొడవలు అయ్యావని అందుకని వారి ఆశ్రయం కోరారని ,అతిఎస్ట్ సెంటర్ వారు తమదయినా రీతి లో మళ్ళిపెళ్లి చేస్తామని అందుకని అందరు సమ్మతించాలని కోరారు . అమ్మ నాన్నలకు ,ఇంట్లో మాకు మతి పోయింది ....అందులోకి తను మాతో పాటు వాడిని "అన్నయ్య" అనేది ,అస్సలు సూచనప్రాయంగా ఎప్పుడు మాతో అనలేదు ,ఎవరితో చెప్పకపోఇన నాతో చేపుతుందనే ధీమా నా అణువణువున వుండేది ,వాడు కూడా కనీసం చెప్పకుండా పైగా బయటి వ్యక్తుల్ని తీసుకురావటం నాకైతే షాక్ ,ఆ తరువాత అమ్మమ్మ తాత గారు రావడం కథ సుఖాంతం అవ్వడం జరిగిందీ .చాల రోజులు నేను తన ముఖంలోకి చూడలేదు ,మనస్సు లో తెలియని దూరం తను మాత్రం ఇదివరకటిలా వుండటానికి ప్రయత్నించినా నా మనస్సు చాల కాలం అంగీకరించలేదు . ఇప్పుడు అది మా చిన్న అత్తయ్య మా అమ్మకి మరదలు మాత్రమె .కాని తను ఒప్పుకోదు నాకోసమే చేసుకున్నాను అంటుంది:) నాకు పీ.జి లో ఎవరు మనస్సుకు దగ్గరైన స్నేహితులు లేరు అందరికి పోటీగా భావించేవారు మనమే అక్కడ నాయకులం అల్లరి వ్యాపకాలు తగ్గాయి వయస్సు తోపాటు.నా దృష్టి అంతా చదువే మా పెద్ద చెల్లెలు కూడా నాకు నాకు బాచ్ మీటే అయ్యింది అందరికన్నా ఎక్కువ మార్క్స్ గురించి తపన పడేదాన్ని . అందరి ద్రుష్టి లో పెళ్ళయింది ఈమెకు ఇంకా చదువు అవసరమా అన్నట్లు వుండేది చాలామంది అనేసేవారు హ్యాపీగా ఇంట్లో వుండక ఇలా స్లమ్స్ ఫీల్డ్ వర్క్ లు ఎందుకు అనేవారు ,ఇండస్ట్రియల్ రిలేషన్స్ నా సెకండ్ ఇయర్ లో స్పెషల్ సబ్జెక్టు నా దృష్టి అంత పెర్సనల్ మేనేజర్ తెచ్చుకోవడం పై వుండేది ,అప్పుడు నా ప్రియమయిన స్నేహితులు పుస్తకాలే {మిగిలినది రేపు-:)

6, ఏప్రిల్ 2009, సోమవారం

నా స్నేహితులు -2

నా స్నేహితుల పుణ్యాన అసలు సమయం తెలిసేది కాదు .ఆదివారం కాని పండగ రోజు కాని మనకు నిరంతరం ప్రవేట్లు వుండేవి :) మా బోటనీ ట్యుషన్ పక్కనే రఫీ వాళ్ల ఇల్లు వుండేది ,అతను కూడా మా బాచ్ వాడే ,వాళ్ళఅక్క డిగ్రీ అయ్యి ఇంట్లో ఖాళీగా వుండేది అక్క కి పెళ్లి సంభందాలు చూస్తుండేవాళ్ళు ,ఆవిడ మా అందరికి లీడర్ గ వుండేది .రఫీ వాళ్ల అమ్మ నాన్న ఇంట్లో వుండేవాళ్ళు కాదు ,ఆయన బిజినెస్ ఆవిడ ఏదో జాబు చేసేవారు ,సో మా అందరి మీటింగ్ ప్లేస్ వాళ్ల ఇల్లే . వాళ్ల ఇంట్లో వాళ్ళంతా అందరితో ఆప్యాయమ్గా వుండేవాళ్ళు వాళ్ల పండుగలకు తప్పకుండ మేమంతా వుండవలసినదే .నిజంగా మేమంతా అరమరికలు లేకుండా కలసిపోయాము .నా గర్ల్ ఫ్రెండ్స్ మాత్రం మా ఇంటికి స్వేచ్ఛగా రాగాలిగేవారు అబ్బాయిల్ని ఇంటికి పిలిచేంత ధైర్యం వుండేది కాదు , అమ్మ ఏమి అనదుకాని నాన్న ఏమైనా అంటారేమోనని పిలిచేదాన్ని కాదు ఇంటర్ ఫైనల్ జరిగేప్పుడు ఫిజిక్స్ పేపర్ లీక్ అయిన సంధర్బంలో అందరు మా ఇంటికి ఒక రాత్రి పూట వచ్చారు నాన్న వున్నారు ,నాన్న వాళ్ళందరితో బానే మాట్లాడారు ,అప్పటినుండి మేము వేరు వేరు బ్రాంచెస్ కి వెళ్ళిన ఊరు వస్తే ఇంటికి వచ్చి కలిసి వెళ్ళేవాళ్ళు .నా క్లోజ్ ఫ్రెండ్ ఫాతిమా హైదరాబాద్ వెళ్ళిపోయింది ,వాళ్ల నాన్న ట్రాన్స్ఫర్ వల్ల.మేము ఇద్దరం చాల సంవతరాలు వుత్తరాలు పెద్దపెద్దవి రాసుకునేవాళ్ళం ,మా కబుర్లన్నీ చదివిన పుస్తకాల మీద ,మేము అయిదుగురం మెడిసిన్ కి రాసాము కాని ఎవరికి సీట్ రాలేదు ,మిగిలిన అబ్బాయిలందరూ ఇంజనీరింగ్ లో చేరారు ఒక్క రామ మాత్రం చేరలేదు

నా స్నేహితుల్లో రజని కి ఇంటర్ సబ్జెక్టు ఒకటి మిగిలింది ,లలిత్ నేను ఒకటే కాలేజిలో చేరాము ఇంకో ఫ్రెండ్ ఆశ వేరే కాలేజ్ లో చేరింది ,నాది బిఎస్సి అయితే లలిత్ బియ్యే ,నాన్నకి నన్ను ఎలా అయిన మెడిసిన్ లో చేర్పించాలని ,నాకు తెలీకుండానే అన్ని ఏర్పాట్లు చేసేసారు ,అమ్మ దగ్గర ఏడ్చి గోల చేసి నేను చదవలేనని మొత్తుకుంటే పయ్మేంట్ సీట్ డ్రాప్ అయ్యింది , సైన్సు కూడా చదవను ఆర్ట్స్ లోకి పంపమని గోల చేసి {అన్నం మాని మౌనం} పర్యవసానం నాన్న ఆర్ట్స్ మార్చడానికి వొప్పుకుని మా ప్రిన్సిపాల్ ని రిక్వెస్ట్ చేస్తే ఆ సిస్టర్ ఒప్పుకోల ,వొక రెండు నెలలు చూసి చదవలేకపోతే మారుస్తాను అన్నారు , నా మొండితనం కి నాన్న నాతో చాల నెలలు మాట్లాడలేదు , మొత్తానికి రెండు నెలలకి లలిత్ వున్నా క్లాసు లో చేరాను ,కేవలం తనకోసం ఆర్ట్స్ కి వెళ్లాను ,ఫాతిమా తరువాత తన ప్లేస్ లలిత్ అవ్వింది ,తనే కనుక లేకపోతె ఈ సరికి నేను డాక్టర్గా వుండేదాన్ని .ఆ వయస్సులో స్నేహితులే లోకంగా వుండి మా నాన్న కోరిక తీర్చలేకపోయానని ఇప్పటికి అనిపిస్తుంది . మేము డిగ్రీ మొదటి సంవతరం లో వుండగా ఇంటర్ పోయిన రజని హంగ్ చేసుకుని చనిపోయింది ,తన సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చిన రోజు ,మా స్నేహితులంతా ఆ షాక్ నుండి కోలుకోవడానికి చాల కాలం పట్టింది .

లలిత మా ఇంట్లో ఒక సభ్యురాలిగా కలిసిపోయింది ,తను మా ఇంటికి రాని రోజు వుండేది కాదు ,నేనంటే చాల ప్రేమ అనేది అందరిని వరుస పెట్టె పిలిచేది ,మాతో పాటు మా బాబాయి కొడుకు ,అమ్మ చిన్న తమ్ముడు ఇంట్లో వుండి చదివేవాళ్ళు ,వాళ్ళని మాలనే అన్నయ్య అనేది , అన్నిటికి తానయి కలిసిమెలసి వుండేది ,నాకు చాల ప్రాణం గ వుండేది , కాని లలిత నాకు వొకరోజు పెద్ద షాక్ ఇచ్చింది ...{మిగిలినది తరువాత }

4, ఏప్రిల్ 2009, శనివారం

ఎన్నికల ప్రహసనం

నిన్న అత్యవసరంగా మా కమిషనర్ హైదరాబాద్ లో మాకు మీటింగ్ పెట్టారు .పది గంటలకల్లా మేము ఆయన ఛాంబర్ లో వుండాలని ఆర్డర్ చేసారు .బస్ లేక ట్రైన్ ఐతే టైం కి లేట్ అవుతదేమోనని కార్ లో నిన్న తెల్లవారు ఝాము ఐదు కి ఇంటినుండి బయలుదేరాను .సాధారణంగా ఆ రూటు లో కార్ ప్రెఫెర్ చేయము తప్పనిసరి అయితేనే వెల్తుంటాము .
బయలుదేరింది మొదలు కాకి ల హడావిడి అంతా ఇంత కాదు ,సిటీ ఔటర్ రింగ్ దగ్గర స్ముగ్లర్స్ ని పట్టుకున్నంత హడావిడి చేసారు .మొత్తం కార్ అంత చెకింగ్ ,ప్రతి ఒక్కడు డిక్కీతెయడం వెనుక సీట్ లోకి తొంగి చూడడం ,డ్రైవర్ జేబులు కాంప్ క్లెర్క్ జేబులు తడమడం ఇలా మూడు స్టేజి లో విసిగించారు .దారిలో అక్కడకడ కనబడే అక్సిందేన్త్స్ చూసుకుంటూ [ఇవి కనబడకపోతే హైదరాబాద్ దారి కాదు } హయత్ నగర్ వరకు వెళ్ళాము ,అక్కడి నుండి వున్నాయి మా తిప్పలు ఆ ట్రాఫిక్ వ్యూహంలోపడిపది కాదు పన్నెండు గంటలకు ఇబ్బంది పడుతూ ఛాంబర్ లో అడుగుపెట్టాను .అదృష్టం కొద్ది నా కొలీగ్స్నా ఎప్పటికప్పుడు నా పరిస్థితి ఫోనులో విని మా బాస్ కి వివరించారట .
సాయంత్రం నాలుగు గంటలకి మరల మన గమ్యస్థానం కి తిరుగు ప్రయాణం ..మళ్ళామొదలయ్యాయి ఎల్ .బి నగర్ దాటగానే మా తిప్పలు ,ఈసారి మేము కులాసాగా తీసుకున్నాము ,దిక్కి తెరిచి , వెనుక నా సీట్ లోను ముందు సీట్ లోను చూడడం ,కరడుకట్టిన తీవ్రవాదుల్ని కూడా అల చెక్ చేయరేమో నని నా సందేహం , మూడు ప్రదేశాల్లో ఆపి చెక్ చేసారు ,మాతో పాటు తిరుగు ప్రయాణం లో వొక నల్ల బాగ్ నిండా ముఖ్యమైన పేపర్స్ తీసుకోచ్చాము ఆ బాగ్ మాత్రం ఎవ్వరు తనిఖి చేయాల ,అది తలుచుకుని మేము నవ్వుకుంటూఉండగానే నాలుగో ప్లేస్ లో ఎకయేకి బాగ్ మొత్తం ఓపెన్ చేసి చూసారు , దయ తలచినట్లు చలో అన్నారు .నిజంగా మన ఎన్నికలు ఇంత పకడ్బందీగ జరుగుతున్నాయ అని సందేహం నాలిగింటికి బయలుదేరితే రాత్రి పన్నెండింటికి ఇల్లు చేరాను . మరి ఇంత గ కట్టుదిట్టం చేసిన మద్యం ,మనీ నామినషన్ రోజే ఎలా ప్రవహిస్తున్నాయో అర్ధం కావట్లా ! కొసమెరుపు ....తనిఖి చేసిన నా కార్ మీద గవర్నమెంట్ వెహికల్ అని వుంటుంది .

2, ఏప్రిల్ 2009, గురువారం

వకుళ పూలంటే .....

వకుళ పూలంటే "బొగడ పూలు " అని ఒక జర్నలిస్ట్ మిత్రురాలు చెప్పారు ,ముందుగా ఒక జర్నలిస్ట్ మిత్రుడ్ని అడిగాను తను బిజీగావుండి ఆలోచించలేక పోయారట .ఇంతకి ఆ పూలు మా కాలనీ రోడ్లన్నీ చోట్ల నక్షత్రాల్లా పడివుంటాయి ,వాటి కాయలు ఆరెంజి కలర్ లో కంటికింపుగా తినడానికి కూడా పనికి వస్తాయి .మా ఇంటిముందు సంపెంగ పక్కనే పెట్టాను కాని ఈ పూలకి ఇంత చరిత్ర వుందని సుధామూర్తి "ఏం .డి .గారి భార్య "నవల చదివాక తెలిసింది . కన్నడ లో రాసింది తెలుగు లో అలకనంద పబ్లిషర్స్ ప్రచురించారు .అనువాదం ఇంపుగా లేక పోయిన {నా అచ్చు తప్పుల్లా}వదలకుండా ఏకబిగిన చదివేస్తాము .చాల చాల బాగుంది .కుదిరితే తప్పకుండ చదవండి ,కారీర్ లో పడి సాఫ్ట్ వేర్ వాళు వైఫ్ ని ఏవిదంగా నిర్లక్ష్యం చేసారో అనుభవపూర్వకంగా రాసినట్లు తోచింది.