11, ఏప్రిల్ 2009, శనివారం

నా స్నేహితులు -7

అప్పటి మా ట్రైనింగ్ తరువాత వివిధ జిల్లాల్లో మాకు పోస్టింగ్స్ రావటం చేసే వృత్తిలో ఎవరికీ వారు తీరికలేకుండా అవ్వడం తో నెమ్మది నెమ్మదిగా మేమంతా అప్పుడప్పుడు కలిసేవాళ్ళం కాస్త తగ్గించేసాం ,,,నేనే ముఖ్యంగా ఎటు వెళ్ళకుండా ఉద్యోగం ..ఇల్లు , చదువు వీటిలోపడి పోయాను .ఆ ఇయర్ కూడా నా మెయిన్ ఎగ్జాం క్లియర్ కాలేదు ..ఒకరకంగా విరక్తి తో చేసే ఉద్యోగం లోనే ఆనందం వెదుక్కోవడానికినిశ్చయించుకున్నాను . {అందని ద్రాక్ష పుల్లన చందాన :)}
చాల ఆలస్యమ్గా తెలుసుకున్నాను ...రాజకీయాల్లోనూ ఉద్యోగుల్లోను శాశ్వతమిత్రులు శాశ్వత శత్రువులు వుండరని ...అంతా ప్లాస్టిక్ నవ్వులు ప్లాస్టిక్ పువ్వులే ...నేను చాల కాలం అమాయకంగా అందరిని నమ్మేదాన్ని ,,అంతా నాలానే వుంటారనుకునేప్రతిది ఓపెన్ గా మాట్లాడేదాన్ని ..నాకు ఒకే ఒక్క మంచి స్నేహితుడు వుండేవాడు .. అతనిది కూడా మా బాచ్ సెలక్షన్ {పేరు రాయట్ల} మంచి మేధావి ,గోల్డ్ మెడలిస్ట్ సివిల్స్ ఇంటర్వ్యూలుపోగొట్టుకుని ఇక్కడ అడ్జస్ట్ కాలేక డిప్రెషన్ తో అలవాట్లతో జీవితాన్ని అర్ధంతరంగా ముగించేసుకున్నాడు ....నాకన్నా చిన్నవాడు ఎంతో మంచి భవిష్యత్తు వున్నవాడు తినే కంచం ముందు కూర్చుని అలానే ఒరిగిపోయాడనే వార్త నన్నెంతో తీవ్రంగా కలిచివేసింది ...నేనెప్పుడు మందలిస్తూ బుద్దులు చెప్తానని అక్కయ్యా అంటూ పిలిచేవాడు తను ఎప్పుడు మాట్లాడాలనుకుంటే అప్పుడు సమయం కూడా చూడకుండా ఫోన్ చేసి చెప్పేవాడు ,,నేను నిద్ర లేచి ఓపిగ్గా చెప్పేదాన్ని ....తను చనిపోబోయే ముందు రెండురోజుల ముందు కాల్ చేసాడు అదే చివరి పిలుపు కనీసం తనని చూడ్డానికి కూడా వీలుపడలేదు ఎంతో దూరం ....అత్యవసరంగా ముగించేసారు . ఇతను తప్పించి నాకు డిపార్ట్ మెంట్ లో నాకు స్నేహితులు లేరనే చెప్పవచ్చు .

నిజం చెప్పాలంటే ఒక మూడు ఏళ్ళు క్రితం వరకు నా లోకం అంత నేను చేసే ఉద్యోగమే .....పూర్తిగా మునిగిపోయాను .ఇంటి విషయాలు ఆఫీస్కి వెళ్ళేవి కాదు కాని ఆఫీసు మాత్రం ఇంట్లో వుండేది ....ఇంట్లో కుడా నా మీద పెద్దగ భాద్యతలు లేకపోవడం ఆఫీసు పనిని ఎంజాయ్ చేస్తూ పూర్తిగా నాకెంతో ఇష్టమయిన పుస్తకాలు ఎక్కడో జ్ఞాపకాల పొరల్లో భద్ర పరిచాను . ఆ సమయం లోనే మా పాప చదువు నిమిత్తం దూరంగా ఉండటం ...అంతా ఖాళి గా వెలితిగా వున్నా సమయం లో వృత్తిరీత్యా పరిచయమైన ఇద్దరు జర్నలిస్టు మిత్రులు నా స్నేహితుల జాభితాలో చేరారు ...చాల దగ్గరయ్యారు ,,ఇద్దరు దాదాపు ఆరు నెలల తేడాతో కలవడం జరిగిందీ ,,ఎంతో మంది కలుస్తుంటారు కాని అక్కడివరకే మా పరిచయాలు పరిమితమయ్యేవి ,వీరిలో ఒక స్నేహితుడు నా అలవాట్లనే మార్చేసారు మరిచిపోయిన నా ప్రపంచం లోకి వెనుకకి తిరిగి చూసుకునేలా చేసారు ..తను చదవని పుస్తకం లేదు చూడని సినిమా వుండదు . సున్నితమయినవాడు చిన్న వయస్సులోనే అరవయ్యి ఏళ్ళ అనుభవం వున్నా వాడిలా మాట్లాడే తన ముందు ఎవరయినా తల వంచాల్సిందే .ఇంకో మిత్రురాలు అభిరుచులు వేరయినా ఇద్దరం ఎంతో కలిసిపోయాము ..నాకు ఎప్పుడు ఒక సందేహంతొలుస్తుంది ...తనకోసం కన్నా నా కోసం ఎక్కువ ఆలోచిస్తుందేమోనని తన కుటుంబ సభ్యురాలిగా నన్ను చూస్తుంది ,నేనుఈ రకంగా నేను ఎంతో అదృష్టవంతురాలని అని చెప్పవచ్చు ...నేను వీళ్ళ తో గడిపితే ఎంతో సేద తీరతాను . ఈ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది నా మిత్రుడే . ఇదండి నా స్నేహితుల జాభితా .....ఎంతోమంది వున్నా కొందరు మాత్రమె హృదయాన్ని తాకుతూ .....వారు ఎక్కడ వున్నా ఎన్నేళ్ళయినా మనస్సు పొరల్లో రెపరెపలాడుతూ వుంటారు .
రేపు ఆదివారం నా చిన్ననాటి {ఎనిమిదవ తరగతి } స్నేహితురాలు తణుకు నుండి నా దగ్గరకి వస్తోంది ...సో రేపంత మనం బిజీ బిజీ .............................

12 కామెంట్‌లు:

మురళి చెప్పారు...

మీ టపాలు చదువుతుంటే చిన్నప్పటినుంచి ఇప్పటివరకు నా స్నేహితులంతా గుర్తొచ్చారండి.. . ఏమిటో.. కొందర్ని కలుసుకుంటూ ఉంటాము, మరికొందర్ని మర్చిపోతూ ఉంటాము.. మంచి స్నేహితులు దొరకడం కూడా ఓ అదృష్టమే అనిపిస్తూ ఉంటుంది నాకు. తర్వాతి టపాలో చిన్ననాటి స్నేహితురాలి ముచ్చట్లన్న మాట :)

ఉమాశంకర్ చెప్పారు...

బాధపెడుతూ,అంతలోనే సంతోషపెడుతూ, జీవితమంటే ఇలానే ఉంటుంది అని చెప్తున్నట్టు ఉన్నాయి మీ స్నేహితుల వివరాలు.. మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు..

అజ్ఞాత చెప్పారు...

avunu andi meeru chepindi kuda nijama.. e post chusaka naku gamyam cinemalo allari naresh ki bullet taligi bridge meda chanipoyaka hero too, terrorist cheptadu.. same dialogue.. exact ga gurtu ravatledu... chala bagundi me snehitula story nenu kuda ekkuva samayam na school frinds tone gaduputanu...

Hima bindu చెప్పారు...

@మురళి
హు....మీ గురించే త్వరగా ముగించేసా ...:)...ఇంకా చిన్న నాటి స్నేహితులేమిటండి ....నా ఊహ వచ్చినప్పటినుండి నా మనస్సుకి తాకిన వారి గురించి ఇచ్చాను ......
@ఉమా
నేను చెప్పాలి ధన్యవాదాలు ఈ పిచ్చి రాతలు ఓపికగా చదివినందుకు
@దీపు
నేను సినిమాలు తక్కువ చూస్తాను చూసిన పెద్దగ గుర్తున్చుకోను ,,అదేదో కామిడి అవ్వితే తప్ప ...మీరు దేని గురించి అన్నారో అర్ధం కాలేదు ..ధన్యవాదలు

పరిమళం చెప్పారు...

"స్నేహితురాలితో చిన్ననాటి ముచ్చట్లు "తర్వాతి టపాలో...అన్న మాట !

Hima bindu చెప్పారు...

@పరిమళం
మురళి వరుస కథనాలు ఆపడం లేదని ఎడ్పిస్తున్నారు.......నిజం కాదు .

మురళి చెప్పారు...

మీరు అపార్ధం చేసుకున్నట్టు ఉన్నారండి. చిన్నప్పటి మిత్రులు వస్తున్నారంటే, ఆ విశేషాలు కూడా పంచుకోబోతున్నారా అని అడిగాను. నా వ్యాఖ్య మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే దానిని వెనక్కి తీసుకుంటున్నాను.

Bhãskar Rãmarãju చెప్పారు...

స్నేహం బతకటానికి టానిక్కు లాంటిది.
సరే ఇక్కడ ఆసక్తికరంగా ఓ ప్రోగ్రాము నడుస్తోంది. మీరూ పాల్గొనవచ్చు http://paatapaatalu.blogspot.com/2009/01/blog-post.html

మరువం ఉష చెప్పారు...

నిజమేనండి. స్నేహితులు విషయంలో మీరు పంచుకున్న అనుభవాలు చాలా వరకు అందరి జీవితంలో వుంటాయి. నాకూ అలా చిన్నన్నటి నుండి నిన్నా మొన్నా జీవితంలోకి వచ్చినవారున్నారు. స్నేహితం అక్షయం వంటిదేమో. క్రొత్తగా మిత్రులనిస్తూనేవుంటుంది, ఆ విషయంలో మన హృదయం పుష్పకవిమానమేమో, మరొకరికెపుడూ చోటువుంటుంది. మీకు గుర్తువుండే వుంటుంది ప్రదీప్ గారి టపా ఒకదానిలో మనం స్నేహం గురించి ఒకసారి మాట్లాడాం. http://pradeepblog.miriyala.in/2009/02/blog-post_10.html

మరువం ఉష చెప్పారు...

నిజమేనండి. స్నేహితులు విషయంలో మీరు పంచుకున్న అనుభవాలు చాలా వరకు అందరి జీవితంలో వుంటాయి. నాకూ అలా చిన్నన్నటి నుండి నిన్నా మొన్నా జీవితంలోకి వచ్చినవారున్నారు. స్నేహితం అక్షయం వంటిదేమో. క్రొత్తగా మిత్రులనిస్తూనేవుంటుంది, ఆ విషయంలో మన హృదయం పుష్పకవిమానమేమో, మరొకరికెపుడూ చోటువుంటుంది. మీకు గుర్తువుండే వుంటుంది ప్రదీప్ గారి టపా ఒకదానిలో మనం స్నేహం గురించి ఒకసారి మాట్లాడాం. http://pradeepblog.miriyala.in/2009/02/blog-post_10.html

Hima bindu చెప్పారు...

@ఉష గారు
మీరు గుర్తు చేసాక వెనక్కి వెళ్లి మిరియాల బ్లాగ్ చూసాను ..మీరు బాగా రాసారు ...అప్పుడే నేను బ్లాగ్ లో కొత్తగ వచ్చాను ,మీకు భలే గుర్తు!

పరిమళం చెప్పారు...

చిన్ని గారు !ఏడిపించడం కాదండీ ! మీ ముచ్చట్లలో మా జ్ఞాపకాలు వెతుక్కుందామనే స్వార్ధం ...అంతేనండీ !