మా పక్కింటి వాళ్లు వచ్చినప్పటినుండి ఉదయం కాని సాయంత్రం కాని సందడి సందడిగా వుండేది ..ఆ అమ్మాయి కూనిరాగాలో లేక టీవీ రాగాలో వినవస్తుందేవి ...అరేయ్ ..ఒరేయ్ బంగారం పిలుపులు వారి మద్య .చాల నిశ్శబ్దంగా వుండే లోకాలిటీలో వాళ్ళదే సందడంతా ..ఆ అబ్బాయికి శనివారం ఆఫ్ అనుకుంటాను ...ఆ రోజు ఇంట్లో కనబడే వాడు .వచ్చినప్పటినుండి ఒక మూడు నెలలు ఇదే సందడి .ఆ తరువాత అసలు కథ ప్రారంభం అవ్వింది .
ఒక శనివారం ఉదయం పక్కింట్లో నుండి కెవ్వుమని కేక వినబడింది .ఇంతకి ఏవిటంటే ఆ అమ్మాయి మీద బల్లి పడిందట ..ఇక ఊరు వాడ అదిరిపోయేలా "మమ్మీ ..మమ్మీ అని ఏడుపు ..ఆ అబ్బాయి సముదాయించలేక తంటాలు పడ్తున్నారు ...ఆ అమ్మాయి వాళ్ల పేరెంట్స్ కి ఫోన్ చేసి ఫోనేలోనే ఏడ్పులు .....నాకయితే సందేహం వచ్చింది నిజంగా బల్లి భయమా లేక అమ్మ వాళ్ల మీద బెంగాతోనా అని (స్వానుభవం :)) నెమ్మదిగా వాళ్ళింట్లో నవ్వులు పువ్వులు స్థానే "నిశభ్ధం ఆవరించింది . ఆ అమ్మాయి గొంతు వినబడడం తగ్గింది . ఇదివరకు విని వినబడనట్లుందే అతని కీచు గొంతు వినిపిస్తుంది ...ఇదివరకు అతను వెళ్తుంటే గేటు బయటకు యెదురెల్లె ఆ అమ్మాయి కనీసం వరండాలోకి రావడం లేదు ..,ఆ అమ్మాయి ముఖం లో విషాదం కొట్టవచ్చినట్లు కనబడేది ..ఆమె పేరెంట్స్ మహారాష్ట్రలో వుద్యోగ రీత్యా వుంటున్నట్లు తెలిసింది ,..ఆ అబ్బాయికి సెలవురోజు న కచ్చితంగా గొడవ జరగాల్సిందే,,..అంత కేకలు వేస్తూ బయటికి వస్తూ ఏమి జరగనట్లు అమాయకంగా వెళ్తుంటాడు (వద్దన్నా మా కళ్ళల్లో ,చెవుల్లో పడతాయని వాళ్ళకి తెలిదాయే )..ఒకరోజు అతని అక్క ఇద్దరు పిల్లలతో వచ్చింది ...ఆవిడ ఇద్దర్ని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తూ ...తన తమ్ముడు చెప్పినట్లు నడుచుకోమని ,,అయినదానికి కానిదానికి పుట్టింటికి ఫోన్లు చేయడం మానమని ,,డిగ్రీ చదివింది కాబట్టి ఖాళీగా వుండక వుద్యోగం చేయమని ...మొత్తం బుద్దులన్ని మరదలుకే చెప్పింది ...ఆ అమ్మాయి చదివింది హింది మీడియం కాబట్టి తెలుగు చదవడం రాయటం రాదు కొన్నాళ్ళు నేర్చుకున్నాక బయటకు వెళ్తాను అని పాపం ఆ అమ్మాయి సంజాయిషీ ఇచ్చింది . అతని అక్కయ్య వెళ్ళిన రెండురోజులకు ఒక రాత్రి ఆ ఇంట్లో పెద్ద గొడవ ...బహుశ చేయి చేసుకున్నట్లున్నాడు ...ఆ అమ్మాయి గుండె పగిలేలా ఏడ్చింది .... ఇక ఈ అమ్మాయి ఇక్కడ వుండదు వెళ్ళిపోతుంది అనుకున్నాను ..నేను నా హడావిడిలో గమనించలేదు ...వారం తరువాత ఆ అబ్బాయి వెళ్ళగానే తను తయారయ్యి బయటికి వెళ్ళిపోయేది ..ఆ అమ్మాయి వుద్యోగ ప్రయత్నం చేసి ఒక కార్పొరేట్ కాలేజీ లో చిన్నపాటి వ్యుద్యోగం సంపాదించుకుంది .. ఇంట్లో ఆ అబ్బాయి సణుగుడు తెలుస్తూనే వుంటుంది ..పాపం ఆమె వురుకులు పరుగుల మీద పనులు చేస్కుంటూ కాలేజీ కి పరుగులు తీస్తుంది ..వాళ్ళింట్లో ఆమె కూనిరాగాలు లేవు టీవీ రాగాలు లేవు అప్పుడప్పుడు వినబడే ఆ కీచుగొంతు దాని వెనుక వచ్చే వెక్కిళ్ళు తప్ప . వాళ్లు పక్కింట్లోకి వచ్చి ఆరు నెలలు కూడా సరిగ్గా చూసుకోలేదు ....నాకు అర్ధం కానిది ఒక్కటే ,బయట ఆఫీసు లో అంత మంచి పేరు ,అక్కచెల్లెళ్ళతో ప్రేమ ,బయట పెద్దవారితో గౌరవంగా కాని భార్య దగ్గరకి వచ్చేసరికి అంత అమానుషంగా ఎలా ప్రవర్తిస్తున్నాడో ....
పెళ్ళయిన ఆరునెలలకే వెలిసిపోయిన బొమ్మలా ఆ అమ్మాయి తిరుగుతుంటే మనసు పిండేసి నట్లు వుంటోంది ...దూరంలో వున్నా ఆ తల్లిదండ్రులు అమ్మాయి ఇక్కడ ఆనందంగా వుందిలే అని భ్రమల్లో వుంటారు ...ఒకవేళ తెలిసినా "సర్దుకోమ్మా" అంటారేమో ...ప్చ్..
ఇదండీ మా వంటింటి కిటికీ చెప్పిన పక్కింటి కథ .
24, మే 2009, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
11 కామెంట్లు:
Chalamandi kadhalu anthe...pelli ayyina kottalo anuragam...konnirojulo asalu roopam..andariki parayyi ammayyi okkate...puttitintivariki "ada"pille...attintivariki "ada"pille
I dont think you are 100% right, You dont even know whats happening exactly, you are guessing everything and blaming one person. You should do it when you know the other person completely. Huh, didnt expect this from you.
I dont think you are 100% correct, You dont even know exactly whats happening over there, still you are blaming one person. Huh , didnt expect this from you.
@చూడండి అజ్ఞాత గారు పక్కింటి కథ నేను విన్నది చూసింది ప్రతిది రాయలేదు ...వీలైనంత వరకు కుదించి రాసాను ...నేను ఒక వ్యక్తినే నిందించలేదు ఇక్కడ నా ఊహలైతే రాయలేదని తెలుసుకుంటే చాలు. ...అప్పుడు ,ఇప్పుడు ..ఎప్పుడు ఆడవారి పరిస్థితి ఎలా వుందో చివరి నా మాటలో చెప్పాను ...పెళ్ళయిన తరువాత (ఫ్యామిలీ పెట్టాక ) నేను ఎప్పుడైనా కంప్లైంట్స్ చెబితే మా తల్లిదండ్రులు చెప్పిన ఒకే ఒక్క డైలాగ్ "సర్దుకోమ్మా" అని .....ఒక్కసారి కోపం తమయించుకోలేక నా చేతిలో వున్నా వేడి వేడి టీ కప్ అతని మీదకు విసిరేసాను ,ఆయన తప్పుకున్నారు అదృష్ట వశాత్తు ..అప్పుడు తను నావైపు చూసిన చూపు ఇప్పుడు మరిచిపోలేను ..తను నేను ఒకవారం మాట్లాడుకోలేదు ...నాలో నేను ఆలోచించుకోవడానికి ,,అడ్జుస్ట్ కావడానికి దోహదపడింది ....నేనేమి సరదాకి విసిరి వుండనుగా అవతల మనల్ని అంటేనే కదా! ఏమైనా రెండు వేరు వేరు కుటుంబాలనుండి వచ్చిన వారు ఒకరిని ఒకరు గౌరవించుకుని కలిసి బ్రతికితేనే వారి పిల్లలకి మంచి జీవితాన్ని ఇచ్చిన వారౌతారు....
చాలా మంది కధలు ఇంతే.....
హ్మ్ ...ప్చ్ .... :( :(
@పద్మర్పిత
నాకు తెలిసి ఎనభై శాతం ఇంతేనండి....
@ పరిమళం
వావ్ !....ఏంటండీ అన్ని కవళికలు .....:)
'పుణ్యపురుషుడు' అనుకున్నా.. చివరికి ఇలా చేశాడా?
అంతే ఆడవాళ్ళ కథలు అప్పటికి ఇప్పటికి. అప్పుడు చేత్తో కొడితే ఇప్పుడు మాటలతో కొడతారు తేడా అంతే.
తల్లి దండ్రులైనా భర్త ఐనా కాస్త తేడా మనుషులైతే మొదట బలైయ్యేది ఆడపిల్లే.
ఆడవాళ్ళని హింసించటంలో కొందరు తల్లి దండ్రులు మాత్రం తక్కువేం లేరు భర్తపోయి తల్లి ఇంట్లో ఉన్న ఓ అమ్మాయి అంటుండేది "ఆయన దేవుడు చీ వీళ్ళా!" అని.
@మురళి
అతను పుణ్య పురుషుడే కావచ్చు నెత్తిమీద కోరికల మహమ్మారి వుంటే అతను అలా పరిణామం చెందుచూ
వుండొచ్చు కదా -:)
@అజ్ఞాత
మన వ్యవస్థ అలా వుంది ......ప్రవాహానికి ఎదురీదితే ....ఎన్నో దెబ్బలే .....
అంత మంచి వాడు అయితే అలా చెయ్యడు..ఏడూ మాస్టర్ ప్లాన్ వుండే వుంటుంది
కామెంట్‌ను పోస్ట్ చేయండి