నెమ్మది నెమ్మదిగా ఎదుగుతూ లేత ప్రాయం వీడి పరిపూర్ణత్వం ఏర్పడింది నా తనువునకి .నా మేను విశాలమై నా ఆలోచనలు విస్తారం అయ్యాయి .అమాయకత్వం వదిలి జీవితం చూడటం నేర్చుకున్నాను ...నా చుట్టూ నా ఈడువారే భిడియం వీడి నా చుట్టూ వున్నవారితో నెయ్యమెరిపాను.మా మద్య ఎన్నో ఊసులు ,పగలంతా మా కబుర్లకు అంతే వుండేది కాదు రాత్రల్లాగువ్వల వద్ద నుండి మేము విన్నవి కన్నవి పంచుకునేవాళ్ళం .
రాత్రయ్యేసరికి నా తనువంత సందడే ..చిన్న కీటకాలు మొదలు రంగురంగుల పిట్టలకు ఆవాలము నేనే ..వారిని ముద్దుగా హత్తుకున్నానేగాని కొంచమైన విసుగుచెంధలేదు .ఒక గడసరి గువ్వ నన్ను తొలచి నా హృదయం లోనే గూడు కట్టుకుంది నన్నడగకుండానే....ఎక్కడినుండి తెచ్చుకుందోగానిబుల్లి గువ్వని ముద్దుగా కాపురం నా లోగిలిలోనే పగలల్లా ఆ గువ్వల జంట పిల్లలికి కాపలాగా లాలిస్తూ ....వాటి సుఖ సంతోషాల్లో ,వ్యధల్లో పాలు పంచుకుంటూ రెక్కలొచ్చి రివ్వునెగిరిపోయే పిల్లల్ని చూసి దిగులు పడుతూ కొత్తగానన్ను చేరే గువ్వల జంటలకి స్వాగతం చెబుతూ ...ఇలా ఎన్నో జంటల జీవితాలకి సాక్షి భూతం అయ్యాను
నా వయస్సు తోపాటే ప్రపంచ జ్ఞానం పెరిగింది .కాకమ్మ చిలకమ్మలు ఎప్పుడు మనుష్యుల గురించే మాట్లాడుకునేవాళ్ళు ,వాళ్ళు ఎలా వుంటారో మాకు చూడలన్పించేది .వారి మాటల బట్టి నాగరికత మార్పు వస్తుందని తెలుస్తుంది .రాను రాను అవి పట్టణాలకి వెళ్ళే పరిస్థితి తగ్గిపోతుందట,ఎంతో ఆందోళన పడుతూ అవి చెప్పుకునే కబుర్లు వింటుంటే మా మనుగడకి ఏదో ముప్పు వుంటుందని తోచేది .అసలు అవి చెప్పుకునే కబుర్ల కోసం సాయంత్రం నుండే ఎదురు చూపులు ...ఎప్పుడైనా రావలసిన సమయానికి అవి రాకపోతే ఎంతో ఆందోళనకి గురయ్యేదాన్ని .....గువ్వల ఊసులు వింటే మాకు ఆ నగరాలను చూసిరావాలనే కోరిక గా వుండేది
ఎన్నో వసంతాలు ,శిశిరాలు చూసిన ఈ నా జీవితం నిస్పృహగా మారుతున్న తరుణం లో ఒక అధ్బుతం జరిగిందీ ....
12 కామెంట్లు:
good feel ..iam waiting for nEnu-3
చిన్ని గారూ ఒక నిజమైన ఆహా,ఓహో వేసుకోండి.
Again waiting for next post:)
పైనున్న ఒకటి+రెండు+మూడు కి అమ్మో చిన్నీ భలే కూడా కలిపి నాలుగో వ్యాఖ్యగా చదువుకోవాసింది. కాస్త సాధక బాధల్లో వేలు సహకారం తక్కువగా వుంది.
ఆ....నాకు అర్ధం అయిపోయింది..మీరు మీ గురించి కాదు "చెట్టు స్వగతం" రాస్తున్నారు..
నిన్న టపా అసంపూర్ణంగా ఉందే అనుకున్నాను కానీ రాయలేదు..అందరితో పప్పులో కాలు వేయించేసారు కదా...
కానీ నిన్న మటుక్కు ఒక మనిషి కూడా వేయదగ్గ ప్రశ్నే అది..
అందువల్ల నా సమాధానం తప్పు కాదోచ్..(హి..హి..హి)!!
చిన్ని గారూ,
ఇది మరీ దారుణమండీ..ప్రకటనల మధ్య సీరియల్ లా
మరీ ఇంత కొంచెమా.
హ్మ్మ్.. ఎన్నో వసంతాలు శిశిరాలు చుసిన అనుభవజ్ఞు రాలిని ఆశ్చర్య పరిచిన విచిత్రం ఏమిటి అబ్బా?
వావ్.. మరో సీరియల్.. కానివ్వండి...
నగరంలో అన్ని కాగితం పూలె ఉంటాయి అని చెప్పండి,అడవిలోనే ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్న "చెట్టమ్మ"ని అద్బుతం చూపిస్తానని పట్టణం తీసుకురాకండి.
where is nEnu-3?
@తృష్ణ
-:)
@శ్రీనిక
వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా :)
@భావన
ఎన్ని వసంతాలు శిశిరాలు చూసిన ఎప్పటికప్పుడు ప్రతిది "అద్భుతమే "మనకి ....:)
@మురళి
సీరియల్ కాదు ,అలా రాయాలని మూడ్ వస్తే రాస్తాను కాసేపటికి విసుగొస్తే ఆపేస్తాను ,డ్రాఫ్టు గ వుంచాలి అనిపించదు ..అదీ సంగతి
@అనఘ
ఏదో ఊహించేస్తున్నారే
@భా.రా.రే
పూర్వం నేను చదివిన కథల్లో భోజరాజు ముఖం చూడగానే కవిత్వం వచ్చేదట పామరుడికి కూడా ,అలానే మీ లోగిల్లు దర్శించి దర్శించి కవిత్వం నేర్చుకుంటున్నాను (మీ అంటే మరువం ,క్రిష్ణగీతం మొదలైనవి ) ఈ జవాబు మీరు గత టపాలో అన్నదానికి ...నేను ఈరోజు వస్తాను .:)
@సుభద్ర
క్షమించండి మీకు సమాధానం ఇచ్చాను అనుకున్నాను ...మూడవ భాగం రాసాను .ధన్యవాదములు .
@పద్మర్పిత
ధన్యవాదములు
@ఉష
ధన్యవాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి