14, అక్టోబర్ 2009, బుధవారం

నా "అద్దాల గోల "

ఈ మద్య ఉదయాన్నే పేపర్ చదవాలంటే తెగ ఇబ్బందిగా వుంది ...ఇబ్భంది ఉదయాన్నే లేవటం లో అనుకుంటున్నారా ....అబ్బే ..అదేమీ కాదు అంత చిన్న చిన్న అక్షరాలూ మరీ నలకల్లా కనబడీ పేపర్ కాస్త దూరం పెట్టుకుని చదుతుంటే అంత కష్టపడే బదులు కాస్త ముఖానికి ఆ అద్దాలు తగిలించుకోరాదు అంటూ ఓ ప్రక్క ఈయనగారి వెక్కిరింత ...అసలే కళ్ళద్దాలు అంటే చిరాకు పొద్దున్న పొద్దున్నే ఏమి పెట్టుకుంటాం అందుకే లాంగ్ షాట్ లో చదుతు సరిపెట్టుకుంటున్న కొన్ని తరువాత చదవచ్చులే అని వాయిదా వేసేస్తున్నాను ..అస్సలు మొన్న మొన్నటివరకు గ్లాసెస్ లేకుండా బానే చదివాను రాను రాను తేడా స్పష్టంగా తెలుస్తుంది .కొన్నాళ్ల క్రితం గమనించి టెస్ట్ కి వెళితే ప్రాబ్లం ఏమీలేదు కాని గ్లాసెస్ వాడాలి అన్నారు డాక్టర్ ..అదేంటండీ ప్రాబ్లం ఏవిటంటే .....వయస్సు తల్లీ అన్నారు ...దీన్ని చత్వారం అంటారు ఒక్కోసారి తగ్గిపోతుంది ,చదివేప్పుడు రాసేప్పుడు తప్పనిసరిగా వాడండి ,కళ్ళు స్ట్రైన్ అవ్వవు అన్నారు ...

నేను ఉదయం పేపర్ చూడటం తప్పించి మిగిలిన సమయాల్లో అంటే ఆఫీసు పని లో ,పుస్తకాలు చదివేప్పుడో ,ఇలా సిస్టందగ్గర వున్నప్పుడో తప్పనిసరిగా నా సులోచనలకి పనిపెడుతూనే వున్నాను .
ఒకసారి ఒక జర్నలిస్ట్ పని మీద నా దగ్గరకి వచ్చారు ..మాట్లాడారు తనకి కావలసిన సమాచారం ఇచ్చాను ,ఏవో ఫైల్స్ చూసి చెప్పాల్సి వస్తే గ్లాసెస్ తీసి పెట్టుకుని ఫైల్ చూస్తూ చెబుతుంటే సడెన్గా అతను ...మీరు గ్లాసెస్ పెట్టుకుంటే పెద్దవాళ్ళ లా...వున్నారు అని ముఖం మీద అంత పరిచయం అప్పటికి లేకపోయినా అనేసారు .,అంతే మనము ఉలిక్కిపడ్డాం-:) అసలే మనకి సంతూర్ అని బిరుదాయే.....ఏ కాలేజ్ ?పెళ్లి అయ్యిందా అని అప్పటివరకు అనిపించుకుని :):)...ఇప్పుడేమో వెధవ కళ్ళద్దాల వలన పెద్దరికమా!...నేను తేరుకుని ''పెద్దదాన్నే కదా అలానే కనిపిస్తాను ''...అని వెధవ నవ్వు నవ్వి వురుకున్నాను .
ఇక ఆరోజు ఇంటికి వెళ్ళాకా మా పాపని ,మావారిని అడిగాను ,నేను అద్దాలు పెట్టుకుంటే ఏవైనా తేడా వుందా అని ,వాళ్ళ ప్రాణం తీశాను ...మా పాపమో '' కాస్త అమ్మ లా కనబడుతున్నావు ఇలానే రోజాంత పెట్టుకో ''అన్నది నన్ను ఎడ్పించడానికి..అమ్మ ని ,చెల్లిని అందర్ని అడిగి చివరికి తేలింది ఏవిటంటే మనకి అద్దాలు నప్పడం లేదని ..అలాటి కళ్ళద్దాలు పూర్తిగా వాడే పరిస్థితి వస్తుందేమోనని నా బెంగ . ..నిజానికి నాకు ఇవి కొత్త కాదు ఇది చెప్పాలంటే మరోసారి నా ఇంటర్ అయ్యి డిగ్రీ కి అడుగు పెట్టిన మొదటి నెలలోకి వెళ్ళాల్సిందే ..................రేపు చెబుతాను

10 కామెంట్‌లు:

జయ చెప్పారు...

కనిపించక పోతే, అద్దాలు తప్పవు కదండీ. చిన్న పిల్లలే అద్దాలు పెట్టుకోవాల్సి వొస్తోంది. కాబట్టి, అద్దాలకి, వయసుకీ సంబంధం లేదు లెండి. హాయిగా చదువుకున్న తరువాత, అద్దాలు తీసి లోపల దాచేయండి. సరేనా!...

Unknown చెప్పారు...

అబ్బనాది అదే పరిస్తితి అండీ బాబు .సరిగ్గా రెండేళ్ళ క్రితం మా బాస్, నేను inspection కి వెళితే అక్కడ ప్రజా పతినిధులు ఏదో representation ఇచ్చారు .మా బాస్ కాసేపు దాని కేసి ఏగా దిగా చూసి రవిగారు దీనికి సమాధానం చెపుతారు అంటే, అది చదివి నాకు చాల ఆశ్చర్యం వేసి మెల్లిగా అయన చెవిలో ఇది ఆల్రెడీ చేసేసాం పది రోజుల క్రితమే , మీకు తెలుసు గా అని చెపితే , వాళ్ళు వెళ్లి పోయాక ఆయన నా కాళ్ళ జోడు మర్చి పోయానండి అందులో ఏముందో తెలీకా అంటే ఏంటో అంత స్పష్టం గా కనబడుతుంటే మల్లి కళ్లజోడు ట్టా కళ్ళజోడు అని మనసులో అనుకున్నా .ఇది జరిగిన ఆరు నెలలకి పేపర్ తో మొదలైన ఇబ్బంది , (నాకు రీడింగ్ గ్లాస్ ఏంటి nonsense అని అశ్రద్ద చెయ్యడం తో)మెల్లిగా ఫైల్స్ దాక పాకింది .దాంతో వెంటనే రీడింగ్ గ్లాస్ వాడుతున్నా . ప్రస్తుతం నా పరిస్తితి పేపర్ పొద్దున్నే headlines మాత్రం చదవ గలిగి , walking నుంచి వచ్చాక మరో రెండు కళ్ళు తగుల్చుకుని మిగతావి చదువుతున్నా .కాబట్టి సిగ్గు పడకుండా మరో రెండు తగిలించు కొండి , కాలం తో పాటు వచ్చే మార్పుని ఆస్వాదించండి .

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

ఎక్కడో చదివాను...క్యారెట్ జ్యూస్ రోజూ తాగితే కళ్ళద్దాల పవర్ చాలా వరకు తగ్గుంచుకోవచ్చంట. మరి ప్రయత్నించండి..ఏంటీ అంత ఓపిక లేదంటారా? సంతూర్ గర్ల్ అనిపించుకోవాలంటే ఆమాత్రం కష్టపడాలికదండీ..!! :) పెద్దావిడలాగ కనిపిస్తున్నారని ఆ జర్నలిస్ట్ అన్నారంటే మీరు ఆరాధన సినిమాలో సుహాసిని పెట్టే కళ్ళద్దాల్లాంటివి పెట్టుకున్నారా ఏమిటి కొంపదీసి..

భావన చెప్పారు...

అయ్యో చిన్నీ అద్దాల మసక లో మసి బారినట్లయ్యిందా మీ సంతూర్ అందం.. అయ్యో కోపగించుకోకండి అందరం అదే బోట్ లో (సంతూర్ విషయం కాదు నాకు అంత సీన్ లేదు, కళ్ళజోడు విషయం లో) వున్నాము. ప్చ్ నాకు కూడా డాక్టర్ అదే చెప్పేడూ... కళ్ళజోడు కొనటానికి బద్దకం తో చిన్న అక్షరాల తో రంగు రంగులతో రాసే బ్లాగర్ లను బతిమాలుకుంటున్నా బాబ్బాబు కొంచ మార్చండమ్మ మీకు పుణ్యం వుంటుంది అని. :-(

మురళి చెప్పారు...

ఈ విషయంలో నేను రివర్స్ కేసు అండీ.. అద్దాలు ఎప్పుడు వస్తాయా అని చిన్నప్పటినుంచీ ఎదురు చూశాను.. 'కళ్ళద్దాలు పెట్టుకునే వాళ్లందరూ మేధావులు' అనే అమాయకత్వపు అభిప్రాయం వల్ల :):)

Hima bindu చెప్పారు...

@జయ
వయసుకి అద్దాలకి సంభంధం ఉందండీ ...ప్రశాంతంగా ఇన్నేళ్ళు చదివి మద్యలో తప్పనిసరి అవ్వడం భాధాకరం ...నాకు వచ్చింది చత్వారం -:)
@రవిగారు
సిగ్గు పడటం లేదండీ..రాను రాను పరిస్థితి ఎంత తీవ్రంగా తయారవ్వుతుందో వాపోవడం
@శేఖర్
మనకి కేర్ తీసుకునే ఓపిక లేదనే చెప్పాలి ...మీ సలహాకి ధన్యవాదాలు ......నేను వాడేవి మంచి గ్లాసెస్ ఏదో చిన్న పిల్లాడుగా మనసులో మాట అనేసాడు.

Hima bindu చెప్పారు...

@భావన
అయ్యో బావన గారు 'అందం 'కాదండీ ....:) వయసు గురించి నేను రాసింది ......మమ్మీ అంటూ అమ్మాయి వస్తే నమ్మరు కదా ....నా కూతుర్ని చూసి అందరు భ్రమ పడతారు ....ఆ సీన్ గురించి నేను చెప్పేది .అర్ధం అయ్యిందనుకుంటాను .
@మురళి
అదీ అయ్యింది ...చేబుతానుగా ....నిన్నంత అవుట్ అఫ్ స్టేషన్ వుండటం వలన పూర్తిగా రాయలేకపోయాను ....

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

చిన్ని గారూ అద్దాలు లేక నిన్నంతా కామెంట్ వ్రాయలేదు. అలగకండేం :)
ఓ, ఆ సంతూర్ యాడ్ లో మీరేనా?

తృష్ణ చెప్పారు...

అచ్చం మురళిగారు రాసినట్లే నేనూ ఇంకా అనుకుంటూ ఉంటాను...కళ్ళజోడు పెట్టుకునే వాళ్ళలో ఒక రకమైన గాంభీర్యత, హుందాతనం కూడా కనిపిస్తాయి నాకు....నేనెప్పుడు పెట్టుకుంటానో...!!
(ముందుంది ముసళ్ళ పండుగ అంటారా..?)

Hima bindu చెప్పారు...

@భా.రా.రే.
''సంతూర్ యాడ్ లో నేనేనండీ .....భలే కనిపెట్టేసారే .....ఆ పాప మాత్రం మా పాప కాదు -:)
అలిగేసాక అలాగా వద్దన్నా ఒప్పుకోం.
@తృష్ణ
ఇప్పటివరకు రాలేదు కాబట్టి కొంచెం ముందే జగ్రత్తపడన్డెం....మీ తమ్ముడు చెప్పినట్లు (ఏటిగట్టు శేఖర్ )..-:)