28, అక్టోబర్ 2009, బుధవారం

నేను -౩

యధాప్రకారం గువ్వలన్ని పిల్లల్ని నా మీద వదిలి గూడు విడిచి ఆహరాన్వేషణ కి వెళ్ళాయి .పిల్లలని గోలచేస్తూ ఆడుకుంటున్నాయి .నేను నా వాళ్ళు కబుర్లలో మునిగిపోయము .ఒక్కసారిగా మా అడివంత కలకలం రేగింది .స్వేచ్చగా తిరుగాడే జంతుజాలం కకావికలమై నలు దిక్కులు పరుగులు తీసాయి .గువ్వపిల్లలన్ని భీతి తో తల్లడిల్లి ముడుచుకుని గూటిలో దూరాయి ...పరికించి చుసిన వింత జంతువులు ...వారే మనుష్యులు .

నా దగ్గరకి వచ్చి ఆపాదమస్తకం పరికించి చూసారు,నా తనువునెల్ల తడిమి తడిమి చూసారు .అందరిలో భలిష్టమైన వ్యక్తి ముందుకు వచ్చి నా పై చేయి వేసాడు ...ఒక్కసారే ఉలిక్కిపడ్డాను,భయంతో తడబడిపోయాను,నా ఆకులన్ని జలజలమని రాలిపడ్డాయి,ఆ వ్యక్తి సంతృప్తిగా ప్రక్కని వారితో ఏదో చెప్పాడు .నాకు అయోమయంగానూ,ఆనందం గాను వుండి నా సన్నిహితులవైపు గర్వంగా చూసాను .వారు నావైపు చుసిన జాలి చూపులు అర్ధం కాలేదు .
నా ఆలోచనల్లా ఒక్కటే ఇతగాడు నన్ను తనతో తీసుకు వెళ్ళతారేమో వెళ్ళితే నగర సందర్శనం అవ్వుతుంది కదా అని.....ఆలోచనలో వుండగానే పడింది నా మీద దెబ్బ .సొమ్మసిల్లి పోయాను.మెలుకువ వచ్చి చూడగా నా కాళ్ళ వరకు నరికేసాడు ఆ మానవుడు .

భాదని ఓర్చుకుంటూ కన్నీరు కారుస్తున్న నన్ను చూసి నా సన్నిహితులంతా నిస్సహాయంగా విలపించడం మరింత కుదిపేసింది.నన్నే నమ్ముకుని గూటిని ,గూటిలోని పిల్లల్ని వదిలివెళ్ళిన గువ్వల కలకలం ,పిల్లల వెక్కి వెక్కి ఏడ్పులు ,నేలను తాకి విగత జీవులైన పసి గుడ్లను చూసి శోకిస్తున్న ఆ పిచ్చి తల్లులను చూసి ......అయ్యో !నా ప్రాణమైన పోదేమీ అని రోదించాను .నా గుండెతో పాటు వాటి గూడులన్ని చెదిరిపోయాయి .
ఆ నలుగురు నన్ను నిలువునా క్రింద పడవేసి పాశవికంగా తాటి మొకులతో కట్టి నా వారి ముందే నన్ను భలంగా ఈడ్చుకుంటూ వెళ్ళారు ,కడసారిగా నావాళ్ళ కి కంట నీరుబుకుతుండగా కళ్ళతోనే వీడ్కోలు పలికాను .నన్ను ఈడ్చుకేల్లుతున్న వైనం చూసి అందరు ఒక్కసారే గొల్లుమన్నారు .నన్ను వదలక నా బిడ్డలైన పులుగులన్ని వారిని ముక్కుతో పొడుస్తూ భీభత్సం సృష్టించాయి .నా మనస్సు దిటవు పరచుకొని ,వారిని వారించి 'నా వారిలో నన్ను చూసుకొమ్మని ,నలుగురు కూర్చుని ముచ్చటించే వేళ నన్ను తలుచుకోమని హితవు పలికాను .,నా శరీరాన్ని కష్టపడి ఒక భారి వాహనం లో చేర్చారు ..కొంత దూరం వెంబడించిన నా బిడ్డలు మరి రాలేక శోకం తో వేనుతిరిగాయి .

అప్పటికే వాహనం లో నాలానే ఎందరో !అందరి కళ్ళు ఏడ్చి ఏడ్చి వాచిపోయాయి .మా అందర్ని కలిపి కట్టేశారు,ఎక్కడికి జారి పారిపోకుండా .దుఖాన్ని నిగ్రహించుకుంటూ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ చీకటిలో చుక్కలు చూస్తూ నిద్రలోకి ఒరిగిపోయాను .

14 కామెంట్‌లు:

భావన చెప్పారు...

జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పుష్ప విలాపం చదివే అయ్యో పాపం అనిపిస్తుంది పూలు కొయ్యాలంటే.. ఇంక ఇలా చేస్తే ఎంత బాధ గా వుంటుందో పాపం ఆ చెట్టుకు, తనను తన నుంచే వేరు చేసే రాక్షసులము కదు మనం.. బాగా చెపుతున్నారు. ఎదురు చూస్తాము ఇంకో భాగం కోసం.

మురళి చెప్పారు...

ఆసక్తికరం... కొనసాగించండి...

Padmarpita చెప్పారు...

ఇన్నాళ్ళు పూలని చూస్తే గుర్తొచ్చేవారు...
ఇప్పుడు ఏచెట్టుని చూసినా గుర్తొస్తారు..
Waiting for next post...

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

చిన్ని గారూ, మీరిలా వ్రాసుకుంటూ పోండి, మేమలా కనురెప్పలు ఆర్పడం కూడా మానేసి చదువుకుంటూ పోతాం. కొంచెం టైపాట్లు కూడా సరిచేసుకుంటే ఇంక మీరు సూపరే సూపరు.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

చాలా ఇంట్రస్టింగ్ గా రాసారు...అసలు ఈ థీమ్ తీసుకోవటం వెనుక ఎమైనా సిట్యుయేషనల్ ఇన్స్పిరేషన్ ఉందేమో అని నా సందేహం..

Hima bindu చెప్పారు...

@భావన
లోతుగా ఆలోచిస్తే ఎంతో భాధాకరం కదండీ .ధన్యవాదాలండీ .
@మురళి
థన్క్యు
@పద్మర్పిత
థన్క్యు ...మా అమ్మ వాళ్లకి ఏ చెట్టుని పువ్వుని చూసిన ముందు నేనే గుర్తోస్తాను అంటారు ...నాకు 'చిప్కో 'మొవెమెంట్ గుర్తొస్తుంది .
@భా.రా.రె
సర్దుకుపోవలమ్మా :) నిజంగా ఓహో నా ?
@శేఖర్
మీదసలె డిటెక్టివ్ మైండ్ ....పట్టేశారు ..చెప్పేస్తాను ..థన్క్యు

sunita చెప్పారు...

బాగుంది.అడవిన పూసిన పూవు అనీ కుడి ఎడంగా వికాసం అనే బ్లాగులో గులాబీ గురించి ఇలానే చదివిన గుర్తు

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

>>సర్దుకుపోవలమ్మా :) నిజంగా ఓహో నా ?

అందుకే మరి ఆహా!ఓహో లో ఒకటి మిస్ అయి ఓహో మాత్రమే.

ఈ సిల్లీ కబుర్లు ప్రక్కన బెట్టి చెప్పాలంటే.. మీరచనలలో తేడా మీకే తెలుస్తుంది కదా? ఆలోచనలు విస్తృతమౌతున్నాయి కదా? ఒక చిన్న సన్నివేశాన్ని పాఠకుల బుర్రలోకి ఎలా ఇంజెక్ట్ చెయ్యవచ్చో నేర్చుకుంటున్నారు కదా? ఊహని వాస్తవ ఘటనలతో మేళవించడంలో నిష్ణాతులౌతున్నారు కదా? చివరిగా మీకో ప్రశ్న అవునా? కాదా? :)

Hima bindu చెప్పారు...

@సునీత
థన్క్యు...వికాసం చూడలేదండీ బహుశా చుసేనేమో గుర్తు రావడం లేదు .మా ఇంట జరిగిన ఒక ఉదంతం నుండి పుట్టుకొచ్చింది ఈ 'నేను '.
@భా.రా.రె
ఏమో తెలియడం లేదండీ ,నాకు కలిగిన ఫీలింగ్ యధాతధంగా పెడుతున్నాను ,ఈ టైపు గట్రామనకి కొత్త చెప్పాలంటే అ ఆ లు నేర్చుకున్నట్లే వుంది..నాకు చిన్నప్పటి నుండి రకరకాల ఫీలింగ్స్ ని డైరీలో రాయడం అలవాటు కొన్నాళ్ళకి అది చూసి చదువుకుని నవ్వుకోవడం ఒక్కోసారి ఆశ్చర్య పోవటం అలవాటే ......మరల పునర్జీవనం అన్నమాట .....-:)

మరువం ఉష చెప్పారు...

చిన్నీ! ఆ మధ్య ఒక కథ చదివాను. చనిపోదామని ప్రయత్నించే ఒక వ్యక్తికి రెండు రాళ్ల మధ్యన మొలకెత్తిన చిరు మొలక తన పయనం గురించి చెప్తుంది - తను పండులో వుండగా అది రాలినీటి ప్రవాహంలో కొట్టుకుపోవటం, అది ఒక పక్షి మింగటం ఇలా ఇలా సాగించి అతనికి బ్రతుకు పట్ల తిరిగి ఆశని రగిలిస్తుంది.

మా ప్యూన్ నరసింహులు నా సన్నజాజి తీగెనిమొదలుకంటా నరికేసిన బాధ తిరిగి గుర్తుకువచ్చింది. ఎంత యేడ్చానో, అమ్మ ఆపకపొతే వాడినీ నరికేద్దును :(

నీహారిక చెప్పారు...

చిన్ని గారు,
మీ భావాలు బాగా వ్యక్తపరిచారు.

తృష్ణ చెప్పారు...

నేనొప్పుకోను..ఒప్పుకోను..నేను కూడా మైండ్ పట్టేసాను కదా.....నన్ను కూడా మెచ్చుకోవాలి మరి...
బావుందండీ.... వెంఠనే చదవటం మిస్సయ్యాను...

Hima bindu చెప్పారు...

@ఉష
మరింకేం రాసేయండి :)
@నిహారిక
ధన్యవాదాలు

Hima bindu చెప్పారు...

trushna
thanq