6, ఏప్రిల్ 2009, సోమవారం

నా స్నేహితులు -2

నా స్నేహితుల పుణ్యాన అసలు సమయం తెలిసేది కాదు .ఆదివారం కాని పండగ రోజు కాని మనకు నిరంతరం ప్రవేట్లు వుండేవి :) మా బోటనీ ట్యుషన్ పక్కనే రఫీ వాళ్ల ఇల్లు వుండేది ,అతను కూడా మా బాచ్ వాడే ,వాళ్ళఅక్క డిగ్రీ అయ్యి ఇంట్లో ఖాళీగా వుండేది అక్క కి పెళ్లి సంభందాలు చూస్తుండేవాళ్ళు ,ఆవిడ మా అందరికి లీడర్ గ వుండేది .రఫీ వాళ్ల అమ్మ నాన్న ఇంట్లో వుండేవాళ్ళు కాదు ,ఆయన బిజినెస్ ఆవిడ ఏదో జాబు చేసేవారు ,సో మా అందరి మీటింగ్ ప్లేస్ వాళ్ల ఇల్లే . వాళ్ల ఇంట్లో వాళ్ళంతా అందరితో ఆప్యాయమ్గా వుండేవాళ్ళు వాళ్ల పండుగలకు తప్పకుండ మేమంతా వుండవలసినదే .నిజంగా మేమంతా అరమరికలు లేకుండా కలసిపోయాము .నా గర్ల్ ఫ్రెండ్స్ మాత్రం మా ఇంటికి స్వేచ్ఛగా రాగాలిగేవారు అబ్బాయిల్ని ఇంటికి పిలిచేంత ధైర్యం వుండేది కాదు , అమ్మ ఏమి అనదుకాని నాన్న ఏమైనా అంటారేమోనని పిలిచేదాన్ని కాదు ఇంటర్ ఫైనల్ జరిగేప్పుడు ఫిజిక్స్ పేపర్ లీక్ అయిన సంధర్బంలో అందరు మా ఇంటికి ఒక రాత్రి పూట వచ్చారు నాన్న వున్నారు ,నాన్న వాళ్ళందరితో బానే మాట్లాడారు ,అప్పటినుండి మేము వేరు వేరు బ్రాంచెస్ కి వెళ్ళిన ఊరు వస్తే ఇంటికి వచ్చి కలిసి వెళ్ళేవాళ్ళు .నా క్లోజ్ ఫ్రెండ్ ఫాతిమా హైదరాబాద్ వెళ్ళిపోయింది ,వాళ్ల నాన్న ట్రాన్స్ఫర్ వల్ల.మేము ఇద్దరం చాల సంవతరాలు వుత్తరాలు పెద్దపెద్దవి రాసుకునేవాళ్ళం ,మా కబుర్లన్నీ చదివిన పుస్తకాల మీద ,మేము అయిదుగురం మెడిసిన్ కి రాసాము కాని ఎవరికి సీట్ రాలేదు ,మిగిలిన అబ్బాయిలందరూ ఇంజనీరింగ్ లో చేరారు ఒక్క రామ మాత్రం చేరలేదు

నా స్నేహితుల్లో రజని కి ఇంటర్ సబ్జెక్టు ఒకటి మిగిలింది ,లలిత్ నేను ఒకటే కాలేజిలో చేరాము ఇంకో ఫ్రెండ్ ఆశ వేరే కాలేజ్ లో చేరింది ,నాది బిఎస్సి అయితే లలిత్ బియ్యే ,నాన్నకి నన్ను ఎలా అయిన మెడిసిన్ లో చేర్పించాలని ,నాకు తెలీకుండానే అన్ని ఏర్పాట్లు చేసేసారు ,అమ్మ దగ్గర ఏడ్చి గోల చేసి నేను చదవలేనని మొత్తుకుంటే పయ్మేంట్ సీట్ డ్రాప్ అయ్యింది , సైన్సు కూడా చదవను ఆర్ట్స్ లోకి పంపమని గోల చేసి {అన్నం మాని మౌనం} పర్యవసానం నాన్న ఆర్ట్స్ మార్చడానికి వొప్పుకుని మా ప్రిన్సిపాల్ ని రిక్వెస్ట్ చేస్తే ఆ సిస్టర్ ఒప్పుకోల ,వొక రెండు నెలలు చూసి చదవలేకపోతే మారుస్తాను అన్నారు , నా మొండితనం కి నాన్న నాతో చాల నెలలు మాట్లాడలేదు , మొత్తానికి రెండు నెలలకి లలిత్ వున్నా క్లాసు లో చేరాను ,కేవలం తనకోసం ఆర్ట్స్ కి వెళ్లాను ,ఫాతిమా తరువాత తన ప్లేస్ లలిత్ అవ్వింది ,తనే కనుక లేకపోతె ఈ సరికి నేను డాక్టర్గా వుండేదాన్ని .ఆ వయస్సులో స్నేహితులే లోకంగా వుండి మా నాన్న కోరిక తీర్చలేకపోయానని ఇప్పటికి అనిపిస్తుంది . మేము డిగ్రీ మొదటి సంవతరం లో వుండగా ఇంటర్ పోయిన రజని హంగ్ చేసుకుని చనిపోయింది ,తన సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చిన రోజు ,మా స్నేహితులంతా ఆ షాక్ నుండి కోలుకోవడానికి చాల కాలం పట్టింది .

లలిత మా ఇంట్లో ఒక సభ్యురాలిగా కలిసిపోయింది ,తను మా ఇంటికి రాని రోజు వుండేది కాదు ,నేనంటే చాల ప్రేమ అనేది అందరిని వరుస పెట్టె పిలిచేది ,మాతో పాటు మా బాబాయి కొడుకు ,అమ్మ చిన్న తమ్ముడు ఇంట్లో వుండి చదివేవాళ్ళు ,వాళ్ళని మాలనే అన్నయ్య అనేది , అన్నిటికి తానయి కలిసిమెలసి వుండేది ,నాకు చాల ప్రాణం గ వుండేది , కాని లలిత నాకు వొకరోజు పెద్ద షాక్ ఇచ్చింది ...{మిగిలినది తరువాత }

11 కామెంట్‌లు:

పరిమళం చెప్పారు...

ఏమా షాకు ...ఏమా కధ ..చిన్ని గారు , ఇదన్యాయం ...గ్రాఫిక్స్ మహేష్ గారు సస్పెన్స్ కధలు రాస్తానన్నారు ..ఆయన మొదలెట్టకుండానే మీరందరూ మమ్మల్ని సస్పెన్స్ లో పెట్టేస్తున్నారు .

అజ్ఞాత చెప్పారు...

can u tell me address name of nemalikannu and khadeer blog please...
u r blog is nice all da best

మురళి చెప్పారు...

ఇప్పుడే 'జాజిపూలు' బ్లాగు నుంచి వస్తున్నా.. అక్కడ కూడా ఓ టపాని సస్పెన్స్ లో పెట్టి 'సశేషం' అన్నారు.. ఇక్కడికి వస్తే మీరు కూడా అదే మాట..

Hima bindu చెప్పారు...

@అజ్ఞాత గారు మీకు నెమలికన్ను మురళి అడ్రెస్స్ నేమ్ కావాలంటే ఆయన బ్లాగ్ లో అడగండి తనకు ఇష్టమయితే ఇస్తారు ..అలానే ఖదీర్ బ్లాగ్ వుందా ,ఆ సంగతి మాకు తెలిదు ,నిన్నటి జల్లెడ లో అక్కిరాజు బ్లాగ్ లో రచయితల సమావేశం లో నాగార్జున సాగర్ లో గ్రూప్ ఫోటో లో ఖదీర్ వున్నారని తెలిసి ఎవరా అని పోల్చుకోవడానికి ఇంకా ప్రయత్నిస్తున్న ..ఇక నేనేమి చెప్పగలను ,అక్కిరాజు ని అడగండి . ధన్యవాదాలు .

Hima bindu చెప్పారు...

@పరిమళం గారు టైం కుదరక మొత్తం రాయలేక పోతున్న ,ఆహ మనం సస్పెన్స్ పెట్టేస్తున్నామ! కాసేపట్లో రాసేస్తా :)
@మురళి కాస్త రచయిత్రి లా ఫీల్ అవ్వుతూ సశేషాలు రాస్తున్న ,ఎలాగు పత్రికలూ మనవి ప్రచురించారు ,ఇక్కడ ఆ భాద లేదుగా :)

ఉమాశంకర్ చెప్పారు...

పాపం రజని.చదువుకి మరీ అంత ప్రాణం తీసేంత విలువా? ఇప్పటికీ టెంత్, ఇంటర్ రిజల్ట్స్ వచ్చేటైం లో ఇలాంటి వార్తలు కనీసం రెండు మూడు ఉంటాయి.. బాధాకరం..

ఇదన్యాయమండీ, అయినా "నా స్నేహితులు -2" లాస్ట్ పార్ట్ అని మీరెక్కడా చెప్పలేదుగా సో, నాదే తప్పు.. ఇంకా ఎన్ని పార్ట్స్ ఉన్నాయో కాస్త ముందే చెబ్దురూ..

ఉమాశంకర్ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఉమాశంకర్ చెప్పారు...

ఒకే వ్యాఖ్య రెండుసార్లు వచ్చినట్టుంది, ఆ రెండిట్లో ఒక వ్యాఖ్య ని తొలగించి ఇదిగో ఈ మూడో వ్యాఖ్య రాస్తున్నాను. :(

Hima bindu చెప్పారు...

@ఉమా ఆ టీన్ ఏజ్ అలాంటిది ,అందులోకి అందరం బానే చదువుతూ తను ఆ విదంగా అయ్యేసరికి అలా చేసింది .ఆశ రజని కి చెల్లెలే ,బహుశా పోలుస్తూ వుంది వుంటారు , నా స్నిహితులు ఇప్పటి వరకు రాస్తాను .:)

Hima bindu చెప్పారు...

@ఉమా నాకు డిలీట్ చేయడం తెలీడం లేదు లేకపోతె రెండు పబ్లిష్ చెసెదాన్నికాదు వీలైతే చెప్పండి.

ఉమాశంకర్ చెప్పారు...

చిన్ని గారు,
మీరు ఈ-మెయిల్ నుంచి వ్యాఖ్య ని పబ్లిష్ చేసేటప్పుడు మెయిల్లోనే Reject this comment. అని ఉంటుంది. అది నొక్కితే చాలనుకుంటా.. అదే బ్లాగరు Dash Board నుంచయితే ఆ రెండో వ్యాఖ్యని టిక్ చేయకుంటే సరి...