3, మే 2009, ఆదివారం

నేను ఎవర్నీ

వేకువనే సుర్యునితోపాటు లేచి గోల చేసే పక్షుల కిలకిల రావములు వింటూ -నేనో పక్షినవుతా
మంచులో తడిసి ముగ్దల వున్నా గులాబీ ని చూసి మురిసిపోయే నేను -ఓ గులాబీనవుతా
రాత్రంతా వెన్నెల వానలో తడిసిన పచ్చిక పరకమీద మెరసిపోయే మంచు బిందువులు చూసిన -నేనో హిమన్నవుతా
మబ్బుదుప్పటి మాటు బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటూ వేలుగుకిరణలు వెదజల్లుతూ బయటికి తొంగి చూసే
బాలభానుడ్ని చూసి మురిసి తడిసిపోయే నేను -ఓ వెలుగు కిరణంమవుతా
శిశిరంలో వలువలు విడిచి నునుసిగ్గుగా ఆహార్యం కోసం ఎదురుచూస్తోన్న వృక్షాన్ని చూస్తో -ఓ కొమ్మనవుతా
రాత్రి రాకను ఆహ్వానిస్తూ సుగంధాలు వెదజల్లే విరులజూసి మైమరచి -నేను ఓ పరిమళంనవుతా
తొలకరి జల్లులకి సేదతీరుతూ తనలోని తాపం తీర్చుకుంటున్న భూదేవి ఒడి లోకి -నేనొక చినుకవుతా
అలల నురుగులతో ఎగసిపడే అనంతమైన సంద్రాన్ని చూస్తో -నేనో సిందువైపోతా
అంతమేలేని ఆకాశంలో కారుచీకటిలో రవ్వల్ల మెరిసిపోతున్న చుక్కలజూసి -నే చుక్కనవుతా
పసిపాపల బోసినవ్వుల కేరింతలు చూసిన నన్ను నేను మరచి -ఓ పసిపాపనవుతా
మానవత్వం నిలువెల్ల పుణికి పుచ్చుకున్న మదర్ తెరిస్సాను తలుచుకున్న -నేనో తెరిస్సాను కానా?
ఇంతకి నేను ఎవర్నో ?

7 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

రెక్కలు విచ్చే పక్షిని చూస్తూ నేను కూడా రెక్కలు విచ్చుకుని ఎగురుతా

మురళి చెప్పారు...

బాగుందండి మీ భావన..

పరిమళం చెప్పారు...

చిన్ని గారూ ! భావుకతలో మిమ్మల్ని మీరే మరిచిపోయారా ? నేను పరిమళం ...మీరు చిన్ని .. :) :)
బావుందండీ ! మీరు ప్రకృతిలో మమైకమైపోయిన తీరు !

ఉమాశంకర్ చెప్పారు...

బావుందండీ..

అయితే ఇంతకీ మీరు చిన్ని కాదంటారు.. - :)

Hima bindu చెప్పారు...

@మిరియాల ప్రదీప్
నేనయితే పక్షిలా ఎగురుతూ లోకసంచారినవుతా ......
@మురళి
నిజంగా బాగుందా !
@పరిమళం
ఒక్కోసారి నన్ను నేను మరిచిపోతాను ....ముఖ్యంగా "ఏకాంతం'"లో ....నేను ఓ పరిమళాన్ని :)
@ఉమా
నేను చిన్ని వాళ్ళ అమ్మను ....చిన్నిని కాదుగా :):)....

Ajay :) చెప్పారు...

chinnii...ee kavitha chaduvutunte maa chinnu gurtuku vachhindi...adi kuda amayakamgaa ilane raastundedi..

వెన్నెల చెప్పారు...

మీ ఊహాలోకంలో కాసేపు నన్ను కూడా విహరింపచేయినచ్చినందుకు కృతజ్ఞతలు....చాలా చాలా బావుంది...