19, మే 2009, మంగళవారం

మనచదువులు

వేలంవెర్రి అనేది కోస్తా వాళ్లకు వున్నంత ఇంకొకరి వుండదేమోనని నా అనుమానం (మనది అదే బండి) ఒక్కళ్ళు ఏదైనా మొదలెట్టి సక్సెస్ అవితే ఇక మిగిలినవాళ్ళంతా అదే బడి బాట ,అది ఎడ్యుకేషన్ కావొచ్చు లేదా క్రీడా రంగం కావొచ్చు.ముఖ్యంగా మా కృష్ణాజిల్లా వాళ్ళకి పుట్టకతోనే వస్తుంది .కాని ఆయ రంగాలను ఎంపిక చేసుకునేప్పుడు మన పిల్లల్లో ఆ సత్తా వుందా లేదా అని కనీసం ఆలోచించరు .పక్కింటి వాళ్ళో ,ఎదురింటివాల్లో లేపోతే చుట్టాలో ఇంజినీరు అయ్యాడంటే మనింటోపిల్లో పిల్లాడో ఖచ్చితంగా అవ్వాల్సిందే ,అలా వాళ్లు రూపాంతరం చెందడానికి ఊళ్లలో వున్నా భూమి గట్రా హరించాల్సిందే(మళ్ళి ఎలాను కట్నంగానో ,డాలర్ గానో అంతకంత తెచ్చేస్తారు )మొత్తం మూటగట్టి కార్పొరేట్ కాలేజి ఖజానా నింపల్సిందే...ఈ నేపధ్యం లో పాపం ఆ పిల్లలకి వచ్చే వొత్తిడి ఎవ్వరికీ అవసరం లేదు .ఒక్కో కళాశాల చూస్తోంటే అవి కాలేజిలా, కోళ్ళఫారాల అర్ధం కావు .ఇంతకీ చూస్తే అక్కడ బట్టి పట్టడం ఎలానో నేర్చుకోవచ్చు ,తిన్నగా ఒక్కళ్ళు తమ స్వంత బుర్ర వుపయోగించడం తెలిదు ఎంత తెలివైన వాడయిన సరే అక్కడికి వెళ్తే వాళ్ల ప్రయోజకత్వం వలెనే (కాలేజి)రాంక్ సాధించినట్లు పబ్లిసిటీ ...ఇంకా పదో తరగతి ఫలితాలు రాలేదు కాని పిల్లలకి ఇళ్ళ దగ్గర ప్రవేటేలో జూనియర్ ఇంటర్ సిలబస్ అయిపోయింది ...పోటి పడి చదివించేస్తారు ...అన్నట్లు ఇక్కడ కాలేజీల్లో చదివే పిల్లలు ఎప్పుడు లేబరేటరీ దిక్కు చూడరు ఏకంగా ఫైనల్ పరీక్ష రోజే చూడడం ..అది కార్పోరేట్ చదువు . ప్రస్తుత పరిస్థితిలో (ఆర్ధిక సంక్షోభం) వీరి ఆలోచన మారిందా అంటే ....ప్చ్ ..చూడాలి

4 కామెంట్‌లు:

radhika చెప్పారు...

ప్చ్ ..చూడాలి

హరేఫల చెప్పారు...

నేను ఇక్కడ రాజమండ్రి లో కొన్ని బోర్డ్ లు చూశాను. నర్సరీ క్లాసులకు -- " కేరళ నుండి వచ్చిన టీచర్లతో " మా కాన్వెంట్ లో ఇంగ్లీష్ నేర్పుతాము అంటూ.

కేరళ నుండి వస్తే ఏమిటంట ? అదేమిటో పెద్ద ఇమేజ్ వచ్చేసింది వీళ్ళకి--ప్రపంచం లో వీళ్ళకంటే ఇంగ్లీష్ ఎవరూ బాగా మాట్లాడలేరని!!

Hima bindu చెప్పారు...

@రాధిక గారు ధన్యవాదాలు .
@హరేఫల గారు
మీరు చెప్పింది అన్ని చోట్లా జరుగుతూనే వుంది ,,కాస్త ఫెయిర్ గా వుండి నాల్గు ఇంగ్లీష్ మాటలు మాట్లాడితే వాళ్ళ ఎడ్యుకేషన్ తో నిమిత్తం లేకుండా టీచర్స్గా చేస్తున్నా వాళ్ళు నాకు తెలుసు ..ఏమి ఇంటర్నేషనల్ స్కూల్సో అర్ధం కావట్లా సంవత్సరానికి ఒక లక్ష కడితే చాలట ....చెప్పుకుంటే చాల వుంటాయండి ముఖ్యంగా మా జిల్లాలో .

మురళి చెప్పారు...

"ఒక్కో కళాశాల చూస్తోంటే అవి కాలేజిలా, కోళ్ళఫారాల అర్ధం కావు.." చాలా పెద్ద విషయాన్ని ఒక్క వాక్యంలో చెప్పేశారు.. పిల్లల ఆసక్తులని బట్టి కాక పక్కవాళ్ళ ఆసక్తులకి అనుగుణంగా చదివించడమే విషాదం.. మంచి టపా..