20, సెప్టెంబర్ 2009, ఆదివారం

"అమ్మ పిలిచింది"


మనకు భక్తి చాలా తక్కువ,కొన్ని పరిస్థితులవల్ల అలా తయారయ్యి వుండొచ్చు.ఒక్క షిర్డీ బాబానే గురువుగా భగవంతుని దూతగా నివేధించుకుంటాను...మనసులోనే మాట్లాడుకుంటాను.యెంతఅవకాశం వున్నా గుడులు గోపురాలు తిరగడం తక్కువఒకవేళ వెళ్ళిన అక్కడ ప్రాచిన శిల్పసంపద ,చారిత్రిక ప్రాశస్త్యం చూస్తానుఅలా అని నాస్తికరాల్ని కాదు....ఏమో నాకు నేనే అర్ధం కాను ...:(
ఒక ప్రక్క తిరుపతిలో బ్రహ్మొస్థవాలు ఇంకో ప్రక్క కనకదుర్గమ్మ శరవన్నవరాత్రులు,విద్యాలయాలకు సెలవులు ఎటుచూసినా"భక్త జనం ".....రాష్ట్రమంతా స్వైన్ ఫ్లూ భయం ....జాగ్రత్తలూ .
ఉదయాన్నే పేపర్ చూస్తూ "వీళ్ళకి ఇంత భక్తేంటి,పూజారులు భక్తులు వ్యాధి నుండి రక్షణ కొరకు మాస్క్ లు తగిలించుకొని ఇంత రిస్క్ తీసుకోపోతే యేం?" నేను .
"ఆ విలువ,భక్తి భక్తులకు తెలుసుఇటువంటివి ఏమి ఖాతరు చెయ్యరు " శ్రీవారు.
"ఇప్పుడే వెళ్లి దర్శనం చేసుకోవాలా ?..తోసుకుంటూ నానా కష్టాలు పడి పిచ్చిజనం " నేను .
"అది వారి ఆనందం ,వారి భక్తి కి కష్టం తెలిదు " మా పాప.
పేపర్ చదువుతూ టీ ముగించాను ....ఇంతలో ఫోన్ కాల్ సారాంశం గంటలో oka దగ్గర అరగంటలో హాజరు వేసుకుని వారు వెళ్ళేవరకు మనం vundaali .ఒక అయిదునిమిషాలు ముందే అటెండెన్స్ వేసుకున్నాను "అతి వినయంగా"....araganta taruvatha ........


కిటకిటలాడే జనసందోహం లో ఇంద్రకీలాద్రి మలుపులు తిరుగుతూ......ప్రక్కనే నిండు "కృష్ణ వేణి "సోయగాలు చూస్తూ తన్మయినైన నేను అమ్మ వారి అంతరాలయం లో ప్రవేశించగానే అమ్మ నవ్విన నవ్వు చూసి ఉలిక్కిపడ్డాను. .......ఏమన్నావు ప్రొద్దుటే ?చిలిపిగా ప్రశ్నించింది అమ్మ .
"నేనా!" తడుముకున్నాను .
ఎందుకొచ్చావు ?ఇంకా నవ్వుతు కళ్ళు ఇంత చేసి మరి .
నేనేమి రాలేదు.....అర్ధం అయ్యిందిలే ...."అమ్మ నువ్వు పిలిచావు "గడుసుగా నవ్వుకుంటూహారతి కళ్ళకి అద్దుకుంటూ బయటికి వచ్చేశాను ......

10 కామెంట్‌లు:

anagha చెప్పారు...

durgamme kadu, ae gudikayina vallu pilavande manamu vellamu.

మురళి చెప్పారు...

దసరా శుభాకాంక్షలు..

కొత్త పాళీ చెప్పారు...

She is beautiful, isn't she?
I love her enigmatic smile.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

>>>మనకు భక్తి చాలా తక్కువ,కొన్ని పరిస్థితులవల్ల అలా తయారయ్యి వుండొచ్చు...
>>>"ఇప్పుడే వెళ్లి దర్శనం చేసుకోవాలా ?..తోసుకుంటూ నానా కష్టాలు పడి పిచ్చిజనం " నేను ....

Same pinch...

దసరా శుభాకాంక్షలు.

Hima bindu చెప్పారు...

@అనఘ
నిజమేనా!....ఈ రోజు నాకెందుకో అలానే అన్పించింది...నా విమర్శ ...అంతలోనే తప్పనిసరిగా వెళ్ళాల్సి రావటం .
@మురళి
అప్పుడే పండుగా! మీక్కూడా శుభాకాంక్షలు .
@కొత్తపాళీ
అవునండి .....ఆ నవ్వు నాకు చాల ఇష్టం .పొరపాటునకూడా భక్తి తో కళ్ళు మూయను ...అలా చూస్తుండిపోతాను ....
వున్నంతసేపు .
@శేఖర్
థన్క్యు.....మనలాటి వాళ్ళు వున్నారన్నమాట ...మీక్కూడా శుభాకాంక్షలు .

మరువం ఉష చెప్పారు...

బాగుంది మీ అనుభవం, తన్మయత్వం చిన్ని. నాకు మా వూరి ముత్యాలమ్మ,పాదాలమ్మ ఇలాగే నచ్చుతారు. ఎంతైన జగన్మాత కాదేమిటి.

జయ చెప్పారు...

మనసులో ఉండే భక్తి పొమ్మన్నా ఎక్కడికి పోదు. నేను ఒకసారి చూసాను విజయవాడ కనకదుర్గమ్మను. జన్మజన్మలకు తీరని త్రుప్తి అది. ఇక్కడ తొమ్మిది రోజులు శంకరమఠంలో వివిధ అలంకారల అమ్మవారిని తప్పకుండా దర్శించుకుంటాను. మీ భావాలు చాలా బాగా వివరించారు.

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

Wow చిన్నీ గారూ, మనిషి మన్సులోని భావాల్ని ఎంత అందంగా చిత్రీకరించారు. మీకేకాదు ప్రతి వ్యక్తి అంతరంగాన ఇలాగే అనుకుంటాడనుకుంటాను. అనుకోకుండా అమ్మవారి దీవెనలు పొందారు. ధన్యులు.

sunita చెప్పారు...

గడుసుగా నవ్వుకుంటూహారతి కళ్ళకి అద్దుకుంటూ ....హ్మ్మ్...బాగుంది

Hima bindu చెప్పారు...

@ఉష
కనకదుర్గమ్మ గుడి అందము వర్ణించనలవి కాదు సుమా!కొండల్లో ప్రక్కనే కృష్ణమ్మ....ఆలయం పచ్చగా కళకళ లాడే అమ్మవారు .....కన్నుల పండుగగా ఉంటుంది .
@జయ
అదేకదండీ,మనం పెరిగిన వాతావరణం మనపై ప్రభావాం చూపుతుంది ...ధన్యవాదములు .
@భా.రా.రే
మనం నిరంతరం మనస్సుతో మాట్లాడుకుంటాం....అమ్మవారికి మనపై ప్రేమ ఎక్కువనుకుంటా చీటికి మాటికి పిలుస్తుంటాది..:)
@సునీత
ధన్యవాదాలు