29, అక్టోబర్ 2009, గురువారం

నేను -4

కళ్ళు తెరిచి చూసేసరికి నేనొక విశాలమైన ప్రాంగణం లో వున్నాను ఇక్కడ పక్షుల కిలకిలలు సెలయేటి గలగలలు లేవు .అంత రణగొణ ధ్వనులు,దుమ్ము ,రకరకలయిన మనిష్యులు వస్తుపోతున్నారు నన్ను తాకి ''నిఖార్సైన జాతి"అంటున్నారు .వారి మాటలు అర్ధం కాలేదు కాని ఒక్కటి మాత్రం తెలిసింది ,మేము పుట్టిపెరిగిన నేలమంచిదని నీరు మంచిదని వాటితో జాయలు వస్తాయని దాని వలెనే నా అందం ఇనుమడించిందని....
మా కోసం పోటీపడి పెద్దమొత్తం చెల్లించి సాయంత్రం వరకైనా అక్కడ వుండనీయలేదు.
అక్కడినుండి మరొక ప్రదేశానికి చేర్చారు ...నాకు ఒకటే ఆశ్చర్యం ,ఇంత చిన్న మానవుడు మమ్మల్ని ఎంత అవలీలగా తరలిస్తున్నాడో అని.బక్కచిక్కిన ఒక వ్యక్తి తన చేతిలో సరంజామా తో వచ్చి మమ్మల్ని చూసి అతని కళ్ళు మెరవగా ఆప్యాయంగా స్పృశించాడు ,అతని వెనుక వచ్చిన వారికి ఏదో పురమాయించాడు.నన్ను ప్రక్కకి తీసుకువచ్చి వారివద్దనున్న రంపాలతో అడ్డదిడ్డంగా నన్ను ముక్కలు ముక్కలు చేసారు,అదృష్టం నా గుండెను కోయలేదు...కోసినా భరించే శక్తి నాకొచ్చింది .ఆ నాటినుండి ఆ ముగ్గురు మమ్మొధలక దినారాత్రులు మాతోనే గడిపారు ,చెప్పొద్దు !నాకు ఆసక్తిగానే వుండేది వారేం చేస్తారా చూడాలనే .నా భాదని నా వారిని మరచిపోయి ఈ కొత్త ప్రపంచంలో పడిపోయాను ఆసక్తిగా చూస్తూ ..
మమ్మల్ని చూస్తే మాకే ఆశ్చర్యంగా వుండేది వారి చేతుల్లో నునుపుదనం సంతరించుకున్నాం ముట్టుకుంటేనే జారిపోయేట్టుతయారయ్యాం ,మాకు రకరకాలైన లేపనాలు అద్దేవారు నాజుకుదనం కోసం మిషనుల్లో పెట్టేవారు ..ఆ బక్కచిక్కిన వ్యక్తికి మేము ప్రాణం అని అర్ధం అయ్యింది ,ఎంత అందంగా చేసిన తృప్తి పడక ఇంకా మాకు మెరుగులు దిద్దేవాడు,ఎండ వానకి కూడా మేము తట్టుకుని నిలబడాలనే కోరిక వ్యక్తం చేసేవాడు

ఈ మానవుడు యెంతవిచిత్రమైన వాడు !స్వతః సిద్దంగా పూసిన పూలను కాయలను కర్కశంగా చిదిమి మరల పునః సృష్టిగావిస్తున్నాడు.నా బాధను మరపించుటకు నా పూలను నన్నే నమ్మి ఆశ్రయించిన పిట్టలను నాలోనే చెక్కాడు చూసి మరచిపోమ్మని
ఒక మద్యాహ్నం ఆదమరచి నిద్రలో వుండగా నా చెక్కిలిమీద వెచ్చని కన్నీటి బొట్లు నన్ను మలచిన ఆ శిల్పి కనులనుండి ,యేమి జరుగుతుందో చూసేలోపు నేను అక్కడినుండి తరలించబడ్డాను ,మనస్సు భాధతో ఒక్క క్షణం కలవరపడింది ,అయిన ఇలాటి అనుభందాలకి అతీతంగా తయారవ్వాలన్న నా సంకల్పాన్ని నిర్వీర్యం చేయదలుచుకోలేదు .
నేను క్రొత్తగా వచ్చిన ప్రదేశం చాల బాగుంది ..అందరు నాలానే మలిచిన వారేఅంతా నా జాతే ..ఒక్కొక్కరి అందం చూడటానికి కళ్ళు చాలడం లేదు ...యేమి హొయలు ! యేమి నిగారింపు లో ! ముసిముసి నవ్వులతో పలకరింపులు ,కుశలం ప్రశ్నలు ...అబ్బ నేను వెళ్లి గంటయిన కాలేదు ఎక్కడినుండో ముగ్గురబ్బాయిలు వచ్చి నన్ను నాతో మరో ఇద్దరినీ ఎంచుకుని మమ్మల్ని బయటికి తీసుకు వచ్చేశారు ,మమ్మల్ని చాల దూరం తీసుకెళ్లాలని వారిలో వారు అనుకుంటుంటే తెలిసింది ..మమ్మల్ని అపురూపంగా కట్టి చీకటి బండిలో పెట్టారు గాలి వెల్తురు లేక తెగ ఇబ్బంది పడ్డాను .నేను గమ్యం చేరేసరికి నాకోసం ఎదురుచూస్తూ అక్కడ చూసిన అందమయిన అబ్బాయి .నన్ను తనతో తీసికెళ్ళాడు ...ఓహో రేపటినుండి ఇతని తో వుంటాను కాబోలు అనుకునేలోపు ఒక ఇంటికి చేర్చాడు ..ఇంతకి నన్ను చేర్చింది చిన్ని అనే వాళ్ళింటికి ..స్నేహితులంతా కలసి మమ్మల్ని తెచ్చుకున్నారట ,చిన్ని రాలేదని చిన్ని తరుపున ఈ అబ్బాయి నన్ను ఎంపిక చేసాడు ...చిన్ని కి నేను చాల నచ్చానని అతని చెప్తుంటే విన్నాను

హమ్మయ్య ! ఇక్కడ రణగొణ ధ్వనులు లేవు ,ప్రశాంతం గా వుంది .అసలు వాకిట్లో అడుగుపెట్టగానే ఆశ్చర్యం ..ఆ వీధంతా నా వాళ్ళే ,పచ్చగా కళకళ లాడుతూ ..నగరాల్లో ఇలాటి వీధి నేను చూడలేదింత వరకు ..మా అడవిలోకి వచ్చానా అని క్షణం భ్రమపడ్డాను .ఆ చెట్ల మీద ఆడుకుంటున్న గోరింకలను చుస్తే మనస్సోక క్షణం కలుక్కుమంది.వరండాలో పరిసరాలు చూస్తూ నిట్టురుస్తూ నుంచున్న నన్ను నెమ్మదిగా ఎవరో వచ్చి ఇంట్లోకి చేర్చారు నిశబ్దం గా వున్నా ఆ ఇంట్లో మనుష్యులు వున్నారన్నట్లు తెలిసేది చిన్ని కాలి మువ్వల చప్పుళ్ళే.చిన్ని నన్ను అపురూపంగా చూస్తుంది .నా కోసం చిన్ని వాళ్ళ పాప గది ఇచ్చింది ,నేనోస్తానని నా ముందు వున్నవారిని వాళ్ళమ్మ వాళ్ళింట్లో బోల్డన్ని గదులున్నాయని అక్కడికి పంపేసింది .పెద్ద పెద్ద కితికిలకి వున్నా తెరలు తీస్తే మావాళ్ళంతనా కళ్ళ ముందు కనబడతారు .నా మీద మెత్తటి పరుపు వేసి తెల్ల పూల దుప్పటి వేసింది ...నిజం చెప్పోద్చు ..నన్ను చూస్తె నాకే ముద్దోచ్చాను ...చిన్ని ఇంట్లో వున్నప్పుడు నాతోనే ముచ్చట్లు ....ఈ రోజు ఆదమరచి నా మీదే వాలి నిద్రపోయింది ..చిన్ని ని చూస్తె నా గూటిలోని గువ్వపిల్లలు గుర్తొచ్చారు .....నా ఒడిలో నిశ్చింతగా ఆదమరచి నిదుర పోయిన తీరు .......బ్రతికిన మరణించినమేము సమస్త ప్రకృతిలోని జంతు జీవలకి వుపయోగ పడుతూనే వుంటాం .. ..మా సహజ లక్షణం.

నేను .......? చిన్ని ముచ్చటపడి తెచ్చుకున్న అందమయిన మంచాన్ని :):)

20 కామెంట్‌లు:

భావన చెప్పారు...

బలే వుంది చిన్ని.. బలే సుఖాంతం చేసేరు కధ.. బాగుంది బాగుంది చప్పట్లు చప్పట్లు.. బలే మన చిన్ని వాళ్ళ ఇంట్లో మంచాలు కూడా కబుర్లు చెపుతాయి ఈ సారి కిటికి పరదా చెప్పే కబుర్లు సరేనా. .

జయ చెప్పారు...

ఫెంటాస్టిక్ చిన్ని గారు. ఎక్కడ ట్రాజెడీ అయిపోతుందో అని ఇన్నాళ్ళు బిగబట్టుకొని ఉన్నాను. చాలా మంచి ముగింపు. కాదేది కవిత కనర్హం అన్నట్లుగా ఉంది. భలే రాసేసారు.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

అయ్యబాబోయ్...కొత్త మంచం చూసిన తర్వాత ఇంత క్రియేటివిటీ పుట్టిందా? Creativity has no bounds అని నిరూపించారు...
మీరింకా దీన్ని సస్పెన్స్ లో పెడితే అ.భా.స.భ.స కి ఫిర్యాదు చేద్దామనుకుంటున్నాను. ఇంతలోనే మంచి ముగింపు ఇచ్చేశారు. :)

Padmarpita చెప్పారు...

హమ్మయ్య!! హాయిగా బొజ్జోండి:)

Hima bindu చెప్పారు...

@భావన
హు..నన్ను టీజ్ చేస్తున్నారు .
@జయ
థన్క్యు:):)
@భా.రా.రె
ఏమిటా నవ్వు ,వ్యంగ్యమా ...చుక్కలు పెట్టొద్దని చెప్పిన వినదేమా అనా :(
@శేఖర్
అవునండీ మీరు కొనండి ఒకటి అదేమీ చెబుతుందో వినండి ,మనకి పనికిమాలిన ఆలోచనలు బుర్రనేప్పుడు తొలుస్తూనే వుంటాయి అది చెప్పిన ఊసులే, తాపీగా రాద్దామనుకుని మీలటివాళ్ళకి జడిసి ముగించేసాను :)...అందుకే కొంత అసంతృప్తి :)
@పద్మర్పిత
-:)బజ్జుంటాను .

Unknown చెప్పారు...

this was spellbound chinnigaru..........mimmalni ....mee varnananu pogadataaniki i have no words......keep on this great work...

సృజన చెప్పారు...

అమ్మో! ఎన్ని కబుర్లు చెప్పింది మీ మంచం.:)

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

చిన్నీ, ఎప్పుడూ బాగుంది అని వ్రాస్తే ఏంబాగుంటుందని చెప్పి, వెరైటీ గా ఒక నిర్మలమైన నవ్వు నవ్వానన్నమాట

ఉమాశంకర్ చెప్పారు...

అద్భుతం .. చాల బాగుందండీ..

తృష్ణ చెప్పారు...

సినిమా అయినా, కధైనా, వార్తా ప్రతికలో ఆర్టికలైనా ముగింపు లో సుఖాంతం లేకపోతే నేను ఆ వారమంతా బాధపడుతూనే ఉంటాను...మళ్ళీ గుర్తొచ్చినప్పుడల్లా కూడా....
హమ్మయ్య..! కధ సుఖాంతం చేసారు...బాగుంది..

చాలా రోజుల క్రితం ఒక పుస్తకంలో "బోన్సాయ్" మొక్క గురించి ఇలాగే ఒక కధ పడింది. "బోన్సాయ్" మోజులో పెంచుదామని తెచ్చిన ఒక చిన్ని మొక్కని నేను ఆ కధ చదివాకా మట్టిలో పాతేసాను. మళ్ళీ ఇంతవరకూ ఆ ప్రయత్నమే చెయ్యలేదు...!

మురళి చెప్పారు...

"ఈ మానవుడు యెంతవిచిత్రమైన వాడు !స్వతః సిద్దంగా పూసిన పూలను కాయలను కర్కశంగా చిదిమి మరల పునః సృష్టిగావిస్తున్నాడు." ..నిజమే
"ఒక మద్యాహ్నం ఆదమరచి నిద్రలో వుండగా నా చెక్కిలిమీద వెచ్చని కన్నీటి బొట్లు నన్ను మలచిన ఆ శిల్పి కనులనుండి.." టచింగ్..
"పచ్చగా కళకళ లాడుతూ ..నగరాల్లో ఇలాటి వీధి నేను చూడలేదింత వరకు .." అసలు నగరమే చూడలేదు కదండీ.. (కోడిగుడ్డుకి ఈకలు అనొద్దు.. ఇక్కడ 'మంచం' బదులు మేరొచ్చెశారు)
"చిన్ని ని చూస్తె నా గూటిలోని గువ్వపిల్లలు గుర్తొచ్చారు.." గుడ్..
"బ్రతికిన మరణించినమేము సమస్త ప్రకృతిలోని జంతు జీవలకి వుపయోగ పడుతూనే వుంటాం .. ..మా సహజ లక్షణం." ..గ్రేట్..
మొత్తంగా చాలా బాగుందండీ...

Ruth చెప్పారు...

చిన్ని గారు, బ్రావో! చాలా చాలా బాగుంది! మొన్న మా అప్పారావు ఒక గడ్డి పరుపు కొనుక్కొచ్చారు. అది చూస్తే మీరు ఒక ఖండ కావ్యం రాసేస్తారేమో.

Hima bindu చెప్పారు...

@నెమలికన్ను
బాబు నేను అడవి వదిలి చాల దూరం ప్రయాణం చేసి కట్టెల అడితిఅక్కడినుండి వడ్రంగి ఖార్కన అక్కడినుండి ఫర్నిచర్ షో రూం ..ఆ తరువాత చాల దూరం ప్రయాణం చేసి ట్రాన్స్పోర్ట్ ఆఫీసు ఆ తరువాత లాగుడు బండి లో చిన్ని వాకిట చేరాను .,ఈ ప్రయాణం నేను నగరాన్నే చూడలేదా -:)హమ్మో హమ్మో ఈకలు నిజంగానే పీకుతున్నారు ...అలా చూస్తే బోల్డన్ని పీకొచ్చు ...యేదో వదిలేయమ్మా

Hima bindu చెప్పారు...

@పప్పీ
థన్క్యు
@సృజన
-:):)
@బా.రా.రే
ఒహ్హొ!థన్క్యు
@ఉమా
నిజమా!
@తృష్ణ
మనమంతా ఒక కోవకి చెందినోల్లమే ;:)
@మురళి
థన్క్యు
@రుత్
వావ్ !గడ్డిపరుపే ....బ్రహ్మాండంగా రాయొచ్చు ....ఎలా అంటారా"హిమబిందువులనే కిరీటముగా దాల్చిన నీకు ఇంత దుస్థితా...అకటా!..హమ్మ్..ఎలావుంది ?

anagha చెప్పారు...

నగరానికి తీసుకువచ్చి అద్భుతాన్ని చుపించేసేరు .............వాటికీ ప్రాణం ఉంటుందిగా ,రంపంతో కోస్తుంటే నిజంగానే బాధగా ఉంటుందేమో !

cartheek చెప్పారు...

చిన్ని గారు చాలా చాలా బవుంది

మరువం ఉష చెప్పారు...

:) చాలా కాలం క్రితం నేను చదివిన కథ మరొకటి. ఒక వాయిద్యాలు తయారు చేసే + వాయించే అతని గురించి. అతని వయోలిన్ విరిగిపోతే చాలా నిస్పృహలో పడిపోతాడు. ఇంతలో అతనుండే ఇంటి వెనుక వాగు ప్రక్కనుండే చెట్టు కొమ్మ చిరుగాలికే తనంత తను రాగాలు మీటుతుంది. అందులోనే అతను తన్మయత్వం చెందుతాడు. మళ్ళీ చదివి వీలైతే వివరంగా చెప్తాను.

Hima bindu చెప్పారు...

@అనఘ
నిజమే
@కార్తిక్
థన్క్యు
@ఉష
రాసేయండి మేడంగారు ...ఎదురు చూస్తాం .

పరిమళం చెప్పారు...

భలే !ఎంతందంగా రాశారు!

భావన చెప్పారు...

టీజింగ్ కాదు చిన్ని. నేను బ్లాగ్ లు చదవటం మొదలు పెట్టిన కొత్తలో మీ బ్లాగ్ లోనే చదివేను మీ వంటిటి కిటికి గురించి, బాగా గుర్తు వుంది ఒక క్షణం చూసే గవాక్షపు చూపు కధ రాయించింది కదా మరి ఎప్పుడు దానికే వుండే పరదా ఎన్ని కబుర్లు చెప్పగలదు అని.