18, అక్టోబర్ 2024, శుక్రవారం

'let us stay here until they die చాలు ఈ ప్రేమ .

 మరల బ్లాగు రాయాలి అనిపిస్తుంది అన్ని బ్లాగులు చదువుతుంటే   నేను రాసిన చివరిది గత సంవత్సరం నవంబర్ మాసం లో . 

దాదాపు పుష్కరం నుండి మేము ఇద్దరమే ఉంటున్నాము చిన్ని పెళ్ళి అయ్యి usa వెళ్లినప్పటి నుండి వాళ్లేమో చుట్టపు చూపుగా యాడాదికి ఒక్కసారి వచ్చి రెండు నెలలు మురిపించి మెరిపించి వెళ్తారు .చిన్నికి ఇప్పుడు ఇద్దరు పిల్లలు . పిల్లలు సగము తెలుగు ఆ సగం ఇంగ్లీషు కలబోసి మాట్లాడతారు. 
ఈ జూన్ నెల చివరి వారంలో వచ్చిన పిల్లలు సెప్టెంబర్ లో వాళ్ళ ప్రయాణం దగ్గర పడుతుంటే వాళ్ళ అమ్మ నాన్న ని ప్రశ్నించడం  మొదలు పెట్టారు ''మనం ఇండియా వదిలి అమెరికాలో ఎందుకు ఉండాలి ,మన రిలేషన్ అంతా ఇక్కడ ఉంటే మనం అక్కడ ఎందుకు ఉండాలి ,జాబ్ ఇక్కడే చేయొచ్చుగాఅమ్మమ్మ ఇక్కడ పెద్ద జాబ్ లో ఉందిగా మీరు ఇలానే చేయొచ్చుగా '' అని .నాకు చాలా ముచ్చట అనిపించింది పసి మనస్సుల్లో ఇన్ని  ఆలోచన లు ఉన్నాయా అని ,అమెరికా వెళ్ళమని మొరాయించారు .ముఖ్యంగా హ్యాపీ కోకిలను (పెట్స్)వదిలి ఉండలేక ,అయిదు సంవత్సరాల చిన్నది ఇలా అన్నది ''let us stay here  until  they  die ,because they are becoming old కదా అని బ్రతిమాలిందిreally touched her words ..చాలు ఈ ప్రేమ .

21, నవంబర్ 2023, మంగళవారం

చిలకలు వాలే చెట్టు పులుగుల పాఠాలు

శీతాకాలం  మొదలు అయిన దగ్గరనుండి ప్రొద్దున్నే వాకింగ్ కి వెళ్ళడానికి  చాలా బద్దకంగా అనిపిస్తుంది అయినా వెళ్ళాలి తప్పదు ..చీమ చిటుక్కుమంటే  లేచి గోల చేసే కోకిల హ్యాపీలుmy pets వెచ్చగా నా బెడ్ ప్రక్కనే తీవాచీలmeeda నిద్రపోతూ  నేను చేసే చప్పుళ్లకు విసుగ్గు నా వంక  చూసి మరింత ముడుచుకుని  నిద్రలోకి జారుకుంటున్నాయి   నాకు అనిపించింది జంతువులకి మనం  నేర్పిస్తేనే డిసిప్లైన్ వస్తుందా అని ...ఏకాంతంలో మనలోకి మనం తొంగి చూస్తున్నప్పుడు ఎన్నో ఆలోచనలు తరంగాల్లా స్తబ్దుగా ఉన్నాము అని అనుకుంటాం కానీ పైకి  వినిపించని  తరంగాలు ఎన్నో .... ఇంటి ప్రక్క  వీధి లో అందమైన పార్కు ఉంది  ఉదయాన్నే  వెళ్ళినపుడు   మనం తీసే గేటు చప్పుడు మాత్రమే  వినబడుతుంది  మెత్తటి  పచ్చికలో అడుగులు వేసి వ్వాకింగ్ ట్రాక్ లోఅడుగులు వేసినపుడు గులకరాళ్లు అవి బేబీ చిప్స్ లెండి)చప్పుడు కరకర మంటూ మనతో ఏవో ఊసులు చెబుతున్నట్లు అనిపిస్తుంది పార్కులో చెట్లు అన్ని తపస్సు చేస్తున్న మౌన మునుల్లా  గోచరిస్తాయి ..నిశ్శబ్దన్ని ఒక్కసారే ఛేదిస్తూ  ఆ ప్రాంతం అంటా చిలకల చిలిపి రాగాలతో ...గారాలతో హోరెత్తిపోతుంది ..సరిగ్గా అప్పుడు మనం కనుక గడియారం చూసుకుంటే ఆరుగంటల ఇరవయ్యి నిముషాలు అయ్యుంటాది ,,ఎవరు చెప్పారు వీటికి సమయ పాలన మరొక పది నిమిషాలకి నాలుగు గుంపులుగా చేరి పార్కు చుట్టూ తిరిగి అనేక నలుదిక్కుల ఆహారాన్వేషణ కి కాబోలు గుంపులుగా విడిపోతాయిప్రతి దినం ఆ దృశ్యాన్ని చూడకుండా ఉండలేను ...విచిత్రంగా ఆకాశంలో ఎగిరే విహంగాన్ని చూడకుండా ఉండటం నా తరం కాదు ,,చిన్నప్పటి నుండి శబ్దం వినగానే ఇంట్లోనుండి పరిగెత్తికొచ్చికనుమరుగు అయ్యేదాకా ఆ విమానాన్ని చూసేదాన్ని పార్కు నుండి బయటికి రావాలి అంటే ఏడున్నర అవ్వాల్సిందే గన్నవరం లో ల్యాండ్ అయ్యి విమానం సరిగ్గా మా ఇళ్లమీదుగా  వెళ్లాల్సిందే అదేంటో ఇది కూడా కచ్చితంగా పక్షిలా సమయ పాటిస్తుంది బ్లూ రంగులో ఉంటుంది బహుశా ఇండిగో కాబోలు ,,,,ఇక చెప్పొచిది ఏమిటి అంటే మనం పక్షుల్ని చూసి నేర్చుకోవలసింది ఎంతో వుంది  వాటికి కష్టపడే తత్త్వం ఎవరో పెడతారని ఎదురు చూడవు  వాటి ఇళ్లు  అవే కట్టుకుంటాయి పిల్లలకి  కొంత కాలం నేర్పుతాయి గర్వంగా పౌరుషంగా దర్జాగా బ్రతుకుతాయి కడవరకు ,,,మనం ఆలా ఎందుకు ఉండటం లేదో  

19, నవంబర్ 2023, ఆదివారం

ఒక లాలన ఒక దీవెన  సడి చేయవా ఎద   మాటున ... ..

చాలా. ......రోజుల తరువాత బ్లాగు రాయాలి అనే  ఆశ వెంటాడుతుంది . నా కోసం సమయం కేటాయించడం అనేది మరల మరుగున పడిపోతుంది ... వయస్సు పెరిగేకొద్దీ నాకు ఎదో కొత్తకొత్త విషయాలు తెలుస్తూ వున్నాయి ...నిన్న మొన్న ప్రేమలు దూది పింజాలు విడిపోతున్నట్లు  పోతున్నాయి ...మార్పు ఎటునుండి వస్తుంది ..మనం చూడటం లో లోపమా  గతంలో ఇలానే ఉన్నారేమో  బహుశా నాకు అర్ధం  కాదేమో ...ముఖ్యంగా ఒక రక్తం పంచుకుని పుట్టి ఒకరి కంచంలో ది నిరభ్యంతరంగా తినగలిగిన ఒక మంచంలో అందరం ముడుచుకుని ఒదిగి ఒదిగి పడుకుని కబుర్లు చెప్పుకున్న వైనం అంతా ఏమై పోయిందో  మన పిల్లలు ఎదిగే కొద్దీ పోల్చుకోవడం మొదలు అవుతుంది కాబోలు  .. సంవత్సరాలు గడిచే కొద్దీ మరింత దూరం పెరిగిపోతుంది తప్ప దగ్గర కావడం మృగ్యం అవుతుంది .... ఒక లాలన ఒక దీవెన  సడి చేయవా ఎద   మాటున ... అమ్మ నాన్న పూలదండలో దారం లాంటి వారు ఆ దారం ఎప్పుడు తెగిపోయిందో అప్పులే పూలన్నీ చెల్లా చెదురు అయిపోయాయి ..మీరు ఆరుగురు ఎప్పుడు కలిసి మెలసి ఉండాలి అనే అమ్మ నాన్న కోరిక  వాళ్ళతోనే తీసుకు వెళ్లిపోయారు 

12, మే 2022, గురువారం

బ్లాగ్ లోకి .

బ్లాగులు  క్రమం తప్పక రాయాలి అనే నా కోరిక అస్సలు సాధ్యపడటం లేదు అడపాదడపా  వచ్చి చూసిపోతున్నా కానీ కలం కదలడం లేదు.  నా పాత రాతలు చదువుకుంటే  రాయాలి అనే తీవ్రమైన కాంక్ష మొదలు అయ్యింది ఎన్నో మదిని దాటినా జ్ఞాపకాలు  ఒక్కొక్కటిగా చదువుకుంటుంటే  సంతోషం భాధ కలగలిపి భావన . బ్లాగులు రాయడం దాదాపు ఆపేసాను .   ఆ  మధ్య తీరుబాటు కాక మనస్సు బాగోక రకరకాల  కారణాలు .  ప్రస్తుతం కొంత తీరుబాటు అయినా కొలువులోని వున్నా ఉద్యోగం లో పైపైకి వెళ్లేకొద్దీ ఓల్డ్ ఏజ్  దగ్గర పడే కొద్దీ అంటే సామాన్లు సర్దేసుకునే  పని దగ్గరకి వచ్చే కొద్దీ అన్నమాట ..పని తక్కువ అవ్వుద్ది ..ఆఫీసుకి వెళ్లినా ఎదో ఒకటి అరా ఫైళ్లు చూడటం మినహా  మిగిలిన సమయం లో న్యూస్ పేపర్ మొదటి నుండి చివరి వరకి చదివేసుకొవడం  వీలయితే నాలుగు టీలు మగవాళ్లయితే నాలుగు దమ్ములు తీయడం కాసేపు వాట్సాప్  ఫేస్బుక్ ఇంస్టా  అరచేతిలోనే చూసేయడం మనలా తోచి తోచని వాళ్ళతో ఫోన్లో బాతాఖానీ .అందుకే . కాస్త సమయాన్ని సద్వినియోగం చేద్దాము అనే దురాలోచన నాలో మొదలు అయ్యింది ... my blog is semi dairy of mine  

30, ఏప్రిల్ 2021, శుక్రవారం

కరోనా కాకి కాదు గ్రద్ద .

 కరోనా కాకి అని గత టపాలో పేర్కొన్నాను .....కరోనా కాకి  కాదు గ్రద్ద ....ముమ్మాటికీ ఇది మహమ్మారి ఇట్లా వచ్చి అట్లా తన్నుకు పోతుంది .దీనికి వయస్సు నిమిత్తం లేదు ....తెలుగు బ్లాగు మిత్రులు అందర్నీ దుఃఖం లో ముంచి వేసింది ....పాట తో నేను ...వీధి అరుగు ..నాతొ నేను నా గురించి ...మూగవి అయ్యాయి .కరోనా తీసికెళ్ళి పోయింది ...మీరు లేరని తెలిసి నా తోబుట్టువు పోయినంత దుఃఖం లో మునిగిపోయాను ...మిస్ యు .

13, మార్చి 2021, శనివారం

మరల కలుస్తాము?

 బ్లాగ్ రాసి చాలా కాలం అయ్యింది ....రాయాలి అంటే చాలా వుంది ....పంచుకునే విషయాలు ఆహ్లాదకరంగా ఉంటే ఏమైనా రాయొచ్చు ...ఇటీవల కాలం లో ముఖ్యంగా 2017 నుండి వరుసగా ఆత్మీయులు నన్ను కన్నవారు  మూడు నెలల క్రితం ఆత్మీయ తోబుట్టువు వెళ్లిపోవడం జీర్ణించుకోలేక పోతున్నాను ...మరుపు మనిషికి ఇచ్చిన వరం అంటున్నారు కానీ ఆ వరం నా విషయం లో మృగ్యం తెచ్చ్హి పెట్టుకున్న ఆనందాలు  అవి మాత్రం ఎంతసేను ...మత్తు మందులకు ఎందుకు బానిస అవుతారో అర్ధం అయ్యింది .... సున్నిత మనస్కులు మాత్రమే  అనుకుంటాను ... రెండోసారి ఒక యోగి ఆత్మా కథ చదివాను   కానీ నా ప్రశ్నలకి సమాధానం దొరకలేదు.. . ఒకటే ఆలోచన వీళ్ళు ఎక్కడికి వెళ్లి వుంటారు?నిజంగా మనకి తెలియని లోకాలు ఉంటాయా? మరల కలుస్తాము?

14, జనవరి 2021, గురువారం

my garden products

 
















15, ఏప్రిల్ 2020, బుధవారం

'కరోనా' కాకి

నాకిప్పుడు అర్ధం అయ్యింది ... 23 ఏళ్ళ తరువాత . హిస్టరీ పుస్తకాలు తీసినప్పుడల్లా ఇండస్ వాలి సివిలైసేషన్ అర్ధాంతరంగా అదృశ్యం అవ్వడానికి చరిత్రకారులు చెప్పే కారణాలు ఒకదాని తరువాత ఒకటి కళ్లముందు కదలాడుతుంటాయి ... శత్రువుల దండయాత్ర అని నదీముంపు  ఫ్లడ్స్ ..ప్రకృతి వైపరీత్యాలు ,,,,రకరకాలా కారణాలు ... ఒక్కోచోట శవాల గుట్టలు ...మొహంజొదారో అంటేనే చావులదిబ్బ  విశ్లేషణ !!!
ఇటీవల ఇటలీ కరోనా తో అల్లాడుతున్న దృశ్యాలు ,,నగరమంతా నిర్మానుష్యముగా {వ్వాట్సాప్ పిక్స్ }...అవి నిజమో కాదో ...మృతులను సామూహికముగా తీసుకుపోయి ఖననం చేస్తున్న తీరు ...అందమైన ఇల్లు వదిలి వెంటిలేటర్ మీదో స్మశానం లోనో ...దీర్ఘ నిద్రలో....
సీన్ కట్ చేస్తే  కొన్ని వేల సంవత్సరాల తరువాత భావితరము బుర్రబద్దలు కొట్టుకుంటుందేమో .... ఇల్లు కట్టుకునేప్పుడు  తవ్వకాలు చేసేప్పుడో  బయటపడే సామూహిక అస్థిపంజరాలు చూసి .... వాళ్లకి మాత్రం తెలియదు  'కరోనా' కాకి వీళ్లందరినీ ఎత్తుకెళ్లిందని ... 
ఇంతకీ నే చెప్పొచ్చేదేమంటే  అప్పట్లోకూడా ఇలాంటి మహమ్మారి ప్రబలి సింధు నాగరికతను అంతం చేసి ఉండొచ్చని !

29, మార్చి 2020, ఆదివారం

తిరిగి వచ్చిన వైభవము

నేను బ్లాగు రాయడము 2009 ఫిబ్రవరి లో మొదలుపెట్టాను ,,,బ్లాగులు అస్సలు తెలియదు ఇలాంటివి వుంటాయని అప్పట్లో నాకు తెలియదు  ... మిత్రుడు మురళి గారు (నెమలికన్ను )బ్లాగుకి నామకరణము చేసి నా మాటల్లో మొదటి పోస్ట్ రాశారు తెలుగులో ఎలా టైపు చెయ్యాలో కూడానా నేర్పారు . అది మొదలు ఎడాపెడా రోజుకి ఒక బ్లాగ్ రాసేదాన్ని ...కాదేది కవితకు అనర్హం అన్నట్లు బ్లాగటానికి అనిపించినా కనిపించిన వన్నీ నా బ్లాగులో ఒదిగిపోయాయి ...రాను రాను రాయడము తగ్గిపోయింది ..వర్క్ ప్రేస్సర్ ఒక కారణం అయితే కొత్తగా వచ్చిన బాధ్యతలు .... కాలం లో కలిసిపోయిన ఆప్తులు నన్ను బాగా కృంగదీసి ఒక రకంగా డిప్రెషన్ లోకి పోయి చాలా విషయాలకి దూరంగా వున్నాను ..బ్లాగాలని యెంత ప్రయత్నం చేసినా నిలకడగా అమలు చేయలేక పోయాను . ఎప్పుడైనా బ్లాగ్స్ చదవాలని తీసిన చాలా వెలితిగా ఉండేవి బ్లాగ్స్ .. ఒకప్పుడు యెంత ఉత్సాహంగా రాసిన వాళ్ళు కనబడటం మానేశారు .. బహుశ ఫెస్బుక్ ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ లో బిజీ గా వుండి బ్లాగింగ్ తగ్గించేశారు అనుకుంటా ! ఆశ్చర్యంగా ఈ మధ్య తెలుగు బ్లాగ్స్ కళకళ లాడుతున్నాయి సంవత్సరకాలం ఆపేసిన వారు కూడా బ్లాగు వాకిళ్లు తెరిచారు ...పూర్వ వైభవము వచ్చినట్లే ... ఊహించని సెలవలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి ... నా గార్డెనింగ్ కి బోల్డంత సమయము దొరికింది ... తీరికగా ఇన్నాళ్లు మిస్ అయినా బ్లాగ్ పోస్ట్లు చదుకోవాలి ... 

11, ఫిబ్రవరి 2020, మంగళవారం

ఇంటిపంట

కూరగాయలు ఆకు కూరలు కొనడము చాలా తగ్గించేసాను .... కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్న చందాన కొంచెము సమయము దొరికితే మొక్కలతో ఉంటున్నాను .. ఈ రెండురోజులు వాటికి నీళ్లు లేవు పని ఒత్తిడితో అస్సలు కుదరలేదు ఊరు నుండి రాగానే చూస్తే ముఖాలు వాడ్చుకుని దిగులుగా కనబడ్డాయి ... నా గార్డెన్ ని నాతొ పాటు లుక్ వేయండి . 






23, జనవరి 2020, గురువారం

నెల తరువాత

నెల క్రితము నేను పెట్టిన మిద్దె తోట  చూపించాను ...దాదాపు నెల నుంచి ఇంట్లో పెంచిన ఆకు కూరలు కూరగాయలు వాడుతున్నాను ...వీని చూస్తుంటే యెంత సంతోషముగా వుందో ... ఇప్పుడు మొక్కలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాము







నాకు యెంతో ఇష్టము అయినా సింహాచల సంపెంగ ఇప్పటికి తొమ్మిది పూలు పూసింది బంతి చేమంతి వందల్లో పూసి మా ఇంట్లో   గుమ్మాలకి ఫ్లవర్ వాజుల్లో ముద్దుగా కూర్చున్నాయి  ఎర్ర గులాబీలు చూడటానికి రెండు కళ్ళు చాల్లేదు  మూడో నెలలో ముద్దు ముద్దు అడుగులు వేసింది కూరగాయల పళ్ళ పూల తోట . 

28, డిసెంబర్ 2019, శనివారం

అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళొచ్చాను

ఇవి ఆరేళ్ళ క్రిందటివి అమ్మ తాతయ్య పిన్నిలు మామయ్యా  నా కజిన్స్ 

అమ్మమ్మ  వాళ్ళ ఊరు వెళ్ళొచ్చాను ...పెద్ద మామయ్యా రమ్మని పిలిస్తే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళొచ్చాను ..అక్కడ అమ్మమ్మ లేదు ..నన్ను కన్నా అమ్మ లేదు ...కానీ వారి మధుర జ్ఞాపకాలు మనస్సు నిండా వున్నాయి ...నాకు ఇష్టం అయినా జ్ఞాపకం ఏవిటంటే నా తీపి బాల్యం ... నా అక్షరాలూ అక్కడే దిద్దాను ...వెన్నెల్లో అక్కడే ఆడుకున్నాను ముత్తాత వెచ్చని పక్కలో ముడుచుకుని ఆయన చెప్పే వింత వింత కథలు అక్కడే విన్నాను ...అద్భుతమైన బాల్యం అక్కడే అనుభవించాను https://himabinduvulu.blogspot.com/2009/02/blog-post_5638.html... ఇంతదాని అయ్యిన నేను ఆ ఊరి ఋణము ఎలా తీర్చుకోగలను ..... ఆ ఊరి ప్రజల అభిమతము మేరకు ఆ ఊరి చర్చికి మొత్తము గ్రానైట్ పరిచాను మూడేళ్ళ క్రిందట ... అమ్మ యెంత గొప్పగా ఫీల్ అయ్యిందో మరిచిపోలేను .... పోయిన ఏడాది నేను ఆ ఆ లు దిద్దిన బడికి ఖరీదైన ప్లాంక్ చైర్స్ వేయించాను ... నేను చేసినది చంద్రునికి ఒక నూలు పోగు లాంటిదే అదొక తృప్తి ..ఇంకా ఏంటో చేయాలని కాంక్ష ... రోజంతా మామయ్యా పిన్నులు అత్తామ్మ్మ కజిన్స్ అందరితో సంతోషంగా గడిపి తిరుగు ప్రయాణం అయ్యాము

25, డిసెంబర్ 2019, బుధవారం

24, డిసెంబర్ 2019, మంగళవారం

నా మిద్దె తోట కొంత భాగము

నా మిద్దె తోట  కొంత భాగము  చూడండీ ... ఈ రోజు పూసిన కోసిన పూలు

30, నవంబర్ 2019, శనివారం

ముసుగు కావాలి

అయిదు సంవత్సరాల క్రిందట జులై 2014 లో నేనొక సందేహం వ్యక్తపరిచాను ...అమ్మాయిలూ ఎక్కడ చూసినా ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని కనబడుతున్నారు ఎందుకనో  అని ...హ్మ్మ్ సమాధానం కూడా నేనే చెప్పేసుకున్నా !     అమాయకంగా కనబడుతూ మేక వన్నె పులుల్లా సమయం వస్తే చటుక్కున్న నోటా కరుచుకుని కబళించాలని చూసే మానవ మృగాలనుండి రక్షించుకోవడానికి అని అర్ధం అయ్యింది .....పసిపిల్లనుండి పండు ముదుసలి వరకు  యెంత ఎదిగినా యెంత ఒదిగినా.ఆడదానికి రక్షణ కరువయ్యింది .ముసుగు కావాలి మృగాళ్ళనుండి రక్షించుకోవడం కొరకు . https://himabinduvulu.blogspot.com/2014/07/blog-post_20.html నా ఓల్డ్ పోస్ట్ "ముసుగెందుకు "

28, నవంబర్ 2019, గురువారం

THIS MOMENT IS MY LIFE

ఇది నాకెంతో ఇష్టం అయినా కొటేషన్ .... నిస్పృహ ఆవహించినపుడు  స్ఫూర్తిదాయకంగా వుంటుంది మనస్సునకు 

25, నవంబర్ 2019, సోమవారం

మా వంటింటి మహారాణిని

నాకు ఇష్టం అయిన పనుల్లో వంట చేయడము కూడా చేర్చవచ్చు  అస్సలు కష్టం అనిపించదు . మా వంటింటి మహా రాణిని నేనే ... ఈ వంట ప్రస్థానం పెళ్లి అయ్యాకే మొదలు అయ్యింది అంతక్రితం అవసరం రాలేదు ..అమ్మ అన్నీ అలవోకగా  చేసిపెడుతుంటే చెయ్యాల్సిన అవసరం రాదుగా ...కానీ చిన్నప్పటి నుండి అమ్మ వంట చేసేప్పుడు ఎప్పుడైనా స్కూల్  కానీ కాలేజీ నుండి కానీ వచ్చి అమ్మ పక్కన చేరి కబుర్లు చెప్పేప్పుడు  అమ్మ వంట చేసే విధానము  గమనిస్తూ ఉండేదాన్ని...అలా అబ్సర్వేషన్ ద్వారా నేర్చుకుని మక్కికి మక్కి అచ్చు అమ్మ చేసినట్లే వండుతాను .పాత వంటలు కొత్త వంటలు చిటికెలో చేసేస్తాను ... మా ఇళ్లల్లో చాలా రుచిగా చేస్తాను అని పేరు ... తింటూ అమ్మని గుర్తు చేసుకోక మానరు ..నా వరకు నేను  ఏదైనా పని  మొదలు పెడితే ఇష్టంగా చేస్తాను  .... నా కూతురు కూడా మంచి కుక్ అని చెప్పవచ్చు ఒక్కసారే పాతిక  యాభయ్యి మందికి వండేయగలదు .. మా అమ్మ లానే చేస్తుంది  ఇంతకీ నేను చెప్పేది ఏమిటంటే ఈ రోజు మా చిన్న తమ్ముడు హైద్రాబాదు నుండి వచ్చాడు వాడికోసం వాళ్ళ అబ్బాయి కోవిద్  కొరకు  కేక్ చేసాను చాలా టేస్టీ గా వున్నది ....ఇవిగో ఇక్కడ ...రుచి చూడండీ

23, నవంబర్ 2019, శనివారం

మనము చాలా బిజీ





మనము చాలా బిజీ గా వున్నాము  అందుకే ఇంట్లో మొక్కలు పూలు ఏమి చేస్తున్నాయో అస్సలు తెలీదు ...బహుశా నా కోసము ఎదురు చూస్తూ వుండి వుంటాయి ....కనబడే  మేఘాల్లో మీకు ఏమి కనఁబడుతున్నాయో నాకయితే తెలీదు కానీ  నాకు మాత్రము మా అమ్మా నాన్న బుజ్జులు అక్కడి నుండి నన్ను చూస్తూ వున్నారనిపిస్తుంది ...ఈ రహదారి యెంత బాగుందో కొండలు చెట్లు నీరెండలో వెండిలా మెరిసే మేఘాలు ...చిత్తూరు నుండి తిరుపతి వెళ్లే దారి ..కొంత సేపు అలా దిగి బాదాము మిల్క్ తాగి రహదారి లో కనబడే అందాలు చూస్తూవు గమ్యము చేరాను . 

19, నవంబర్ 2019, మంగళవారం

బుజ్జులు

బుజ్జులు నన్ను శాశ్వతంగా ఈ లోకాన్నే వదిలి సంవత్సరము రెండు నెలలు . 2010 ఏప్రిల్ 22 న .నెలరోజుల పిల్లగా నా ఇంట్లో అడుగు పెట్టి 2018సెప్టెంబర్ 22 లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది ..నేను కనబడక పొతే క్షణం వుండలేకపోయేది మరి ఇప్పుడు ఈ అమ్మ ని వదిలి ఒంటరిగా వెళ్ళిపోయింది .... ఇందులో బుజ్జులు తప్పు అస్సలు లేదు ఈ డాక్టర్లు వున్నారు వాళ్లకి యెంత నిర్లక్ష్యమే ..డాక్టర్ తప్పిదము వలన బుజ్జులు చనిపోయింది .... ఇది రాస్తుంటే నా కళ్ళు కనబడటం లేదు జ్ఞాపకాలన్నీ మనస్సు పొరల్లో కప్పేస్తున్నా అయినా అవి నిలబడటం లేదు ....యెలా మరచిపోగలను?https://himabinduvulu.blogspot.com/2010/05/blog-post.htmlhttps://himabinduvulu.blogspot.com/2010/05/blog-post_12.htmlhttps://himabinduvulu.blogspot.com/2010/09/blog-post_19.html